19/03/2026
మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తెలుగు నూతన సంవత్సరం“పరాభవ” నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా, భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడటం హర్షణీయము.
ఈ కార్యక్రమంలో గౌరవ మహబూబ్‌నగర్ శాసనసభ్యులు శ్రీ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మేయర్ శ్రీమతి గుమ్మల మమత శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ ఎం. సురేందర్ రెడ్డి గారు, మూడా (MUDA) చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, 60 డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ వార్డుల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జర్గింది.
ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొని, కొత్త సంవత్సరంలో మహబూబ్‌నగర్ మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యసంపదలు కలగాలని ఆకాంక్షించారు. పండితులు ప్రజలకు రాశి ఫలాలను తెలియజేసి, కొత్త సంవత్సరం శుభప్రదంగా ఉండాలని ఆశీర్వదించారు.
సంప్రదాయాలను కాపాడుతూ…
సంస్కృతిని చాటిచెప్పుతూ…
అభివృద్ధిని అజెండాగా ముందుకు తీసుకెళ్తూ…
మహబూబ్‌నగర్ నగరం ఉగాది వేడుకలతో ఉత్సాహంగా మార్మోగింది.
ప్రజల ఆశయాలే మా బలం…
అభివృద్ధి, సంక్షేమమే మా లక్ష్యం…
మున్నూరు రవి