Nama Nageswara Rao

Nama Nageswara Rao Former Parliamentary Party Leader (TDP) 15th Lok Sabha, Former Floor Leader (BRS) 17th Lok Sabha

మాజీ మంత్రివర్యులు, సిద్ధిపేట శాసనసభ్యులు Harish Rao Thanneeru గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు
03/06/2026

మాజీ మంత్రివర్యులు, సిద్ధిపేట శాసనసభ్యులు Harish Rao Thanneeru గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు – మాజీ ఎంపీ నామఅమరుల త్యాగాలు, కేసీఆర్ నాయకత్వ ఫలితమే తెలంగాణ రాష...
02/06/2026

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు – మాజీ ఎంపీ నామ

అమరుల త్యాగాలు, కేసీఆర్ నాయకత్వ ఫలితమే తెలంగాణ రాష్ట్రం – మాజీ ఎంపీ నామ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులు, ఉద్యమకారులు, విద్యార్థులు, ఉద్యోగుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయవంతంగా నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని నామ పేర్కొన్నారు. గాంధీజీ చూపిన అహింసా మార్గంలో సాగిన ఉద్యమాన్ని కేసీఆర్ ప్రజా ఉద్యమంగా మలిచి తెలంగాణ కలను సాకారం చేశారని అన్నారు. తాను 15వ లోక్‌సభలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుకు అనుకూలంగా తొలి ఓటు వేసిన విషయాన్ని నామ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిన ఆ చారిత్రక ఘట్టంలో భాగస్వామి కావడం తన అదృష్టమని పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పడిన అనంతరం కేసీఆర్ నాయకత్వంలో రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, గురుకుల విద్యా వ్యవస్థ విస్తరణ, కేసీఆర్ కిట్, కంటి వెలుగు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం సాగిందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల స్మారక చిహ్నం, అమరవీరుల స్థూపం వంటి నిర్మాణాల ద్వారా ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు కేసీఆర్ కృషి చేశారని నామ పేర్కొన్నారు. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో పాటు రైతు భరోసా, మహిళలకు ఆర్థిక సహాయం, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలులో విఫలమైందని నామ విమర్శించారు. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కరెంట్ కోతలు, యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపాధి అవకాశాల కల్పన, బీసీ సంక్షేమం వంటి అంశాల్లో ప్రజల్లో అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ పాలనతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వానికి స్పష్టమైన దిశా నిర్దేశం కనిపించడం లేదన్నారు. తెలంగాణ సాధించిన విజయాలను కాపాడుకుంటూ, అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కేవలం ఉత్సవంగా కాకుండా అమరుల త్యాగాలను స్మరించుకునే సందర్భంగా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరింత బలోపేతం చేసే పర్వదినంగా జరుపుకోవాలన్నారు.


ఉచిత ఆన్లైన్ విద్యను సద్వినియోగం చేసుకోండి - మాజీ ఎంపీ నామలక్ష్యంతో చదివి రాణించండి యువతకు మాజీ ఎంపీ నామ పిలుపుఖమ్మం కార...
28/05/2026

ఉచిత ఆన్లైన్ విద్యను సద్వినియోగం చేసుకోండి - మాజీ ఎంపీ నామ

లక్ష్యంతో చదివి రాణించండి యువతకు మాజీ ఎంపీ నామ పిలుపు

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో “RAKESH REDDY E-CLASSES APP”ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ అందించాలనే లక్ష్యంతో చక్రవర్తి రూపొందించిన ఈ యాప్‌కు ఎనుగుల రాకేష్ రెడ్డి ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమన్నారు. నిపుణుల బోధనతో ఇంటి నుంచే మొబైల్ ద్వారా క్లాసులు వినే అవకాశం ఉందన్నారు. తక్కువ ఖర్చుతో పోటీ పరీక్షలకు సిద్ధమవ్వొచ్చని, యువత క్రమశిక్షణతో చదివి లక్ష్యాలు సాధించాలని సూచించారు. బిట్స్ పిలానీ యూనివర్సిటీ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసిన రాకేష్ రెడ్డి మంచి ఉద్యోగావకాశాలను వదులుకొని స్వగ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు. ప్రతి ఒక్కరి వద్ద ఉన్న మొబైల్‌ను సద్వినియోగం చేసుకొని ఈ యాప్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ విద్యను పొందాలని, పోటీ పరీక్షల్లో రాణించాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, బొల్లం మల్లయ్య యాదవ్, ఆర్జెసి కృష్ణ, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయకుమార్, నాయకులు పగడాల నాగరాజు, నాగండ్ల కోటేశ్వరరావు, లకావత్ గిరిబాబు, మోరంపొడి ప్రసాదరావు, మరికంటి రేణుబాబు, వాకదాని కోటేశ్వరరావు, మాటేటి కిరణ్, రేగళ్ల కృష్ణ ప్రసాద్, షారుఖ్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జననమే ఒక చరిత్ర : మాజీ ఎంపీ నామసినీ, రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ : మాజీ ఎంపీ నామఎన...
28/05/2026

ఎన్టీఆర్ జననమే ఒక చరిత్ర : మాజీ ఎంపీ నామ

సినీ, రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ : మాజీ ఎంపీ నామ

ఎన్టీఆర్ కు కేంద్రం భారతరత్న ప్రకటించాలి: మాజీ ఎంపీ నామ

ఖమ్మం, మే28

ఎన్టీఆర్ జననమే ఒక చరిత్ర అని బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గురువారం నాడు ఖమ్మం నగరం లోని లకారం ట్యాంక్ బండ్ నందు ఉన్న 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలసి మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు నివాళ్లు అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి డా. నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకుంటున్నట్లు బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వం, సినీ మరియు రాజకీయ రంగాల్లో ఆయన సాధించిన ఘనతలు భావితరాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నాయని నామ తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలు, రాష్ట్ర ప్రజల కోసం చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజకీయ నాయకుడిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. ఎన్టీఆర్ తన హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, రూ.2 కిలో బియ్యం, జనతా వస్త్రాల పంపిణీ, పేదలకు గృహ నిర్మాణాలు వంటి కార్యక్రమాలు సామాజిక న్యాయానికి నిదర్శనంగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ పథకాలు పేదలకు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో భరోసా కల్పించాయన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించడం తెలుగు ప్రజల చిరకాల కోరిక అని నామ పేర్కొన్నారు. ఆయన దేశానికి, తెలుగు జాతికి చేసిన సేవలను గుర్తించి భారతరత్న పురస్కారం ప్రకటించాలని తాను 17వ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కోసం ఆనాడు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండి 15వ లోక్‌సభలో తాను చేసిన పోరాటం అలాగే ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సహకారం, అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో పాటు నాటి లోక్‌సభ స్పీకర్‌తో ప్రత్యేకంగా మాట్లాడి పార్లమెంట్ ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు జరిగిందన్నారు. ఎన్టీఆర్ మరణించిన 17 సంవత్సరాల తర్వాత 2013 తాను తాను ఎంపీ గా ఉన్న సమయంలో ఆ విగ్రహం ఏర్పాటులో భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా ఖమ్మంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, తెలుగు జాతి గర్వించదగ్గ మహానేతకు ఇది నిజమైన నివాళిగా నిలిచిందని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు కార్యక్రమాల్లో కూడా తాను భాగస్వామ్యం అయినట్లు తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ స్ఫూర్తిని భావితరాలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల్లో విగ్రహాల ఏర్పాటుకు కృషి చేసినట్లు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేసీఆర్ కూడా తన హయాంలో ఎన్టీఆర్ లా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, బొల్లం మల్లయ్య యాదవ్, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్ కుమార్, ఆర్జేసీ కృష్ణ తో పాటు పలు మండలాల నుండి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

ముస్లిం సోదర, సోదరీమణులందరికీబక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు!
28/05/2026

ముస్లిం సోదర, సోదరీమణులందరికీ
బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు!

తెలుగు ప్రజల చిరకాల కోరిక ఎన్టీఆర్ కు భారత రత్న  – మాజీ ఎంపీ నామతెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్ – మాజీ ఎంపీ ...
28/05/2026

తెలుగు ప్రజల చిరకాల కోరిక ఎన్టీఆర్ కు భారత రత్న – మాజీ ఎంపీ నామ

తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్ – మాజీ ఎంపీ నామ

పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కోసం పోరాడా – మాజీ ఎంపీ నామ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి డా. నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకుంటున్నట్లు బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

ఎన్టీఆర్ వ్యక్తిత్వం, సినీ మరియు రాజకీయ రంగాల్లో ఆయన సాధించిన ఘనతలు భావితరాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నాయని నామ తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలు, రాష్ట్ర ప్రజల కోసం చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజకీయ నాయకుడిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు.

ఎన్టీఆర్ తన హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, రూ.2 కిలో బియ్యం, జనతా వస్త్రాల పంపిణీ, పేదలకు గృహ నిర్మాణాలు వంటి కార్యక్రమాలు సామాజిక న్యాయానికి నిదర్శనంగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ పథకాలు పేదలకు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో భరోసా కల్పించాయన్నారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించడం తెలుగు ప్రజల చిరకాల కోరిక అని నామ పేర్కొన్నారు. ఆయన దేశానికి, తెలుగు జాతికి చేసిన సేవలను గుర్తించి భారతరత్న పురస్కారం ప్రకటించాలని తాను 17వ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కోసం ఆనాడు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండి 15వ లోక్‌సభలో తాను చేసిన పోరాటం అలాగే ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సహకారం, అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో పాటు నాటి లోక్‌సభ స్పీకర్‌తో ప్రత్యేకంగా మాట్లాడి పార్లమెంట్ ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు జరిగిందన్నారు. ఎన్టీఆర్ మరణించిన 17 సంవత్సరాల తర్వాత 2013 తాను తాను ఎంపీ గా ఉన్న సమయంలో ఆ విగ్రహం ఏర్పాటులో భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

అంతేకాకుండా ఖమ్మంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, తెలుగు జాతి గర్వించదగ్గ మహానేతకు ఇది నిజమైన నివాళిగా నిలిచిందని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు కార్యక్రమాల్లో కూడా తాను భాగస్వామ్యం అయినట్లు తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ స్ఫూర్తిని భావితరాలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల్లో విగ్రహాల ఏర్పాటుకు కృషి చేసినట్లు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

చరిత్ర తిరగరాయాలి కేసిఆర్‌ను సీఎం చేయాలి  - మాజీ ఎంపీ నామపార్టీ సభ్యత్వ నమోదులో ఉత్సాహంగా పని చేయాలి - మాజీ ఎంపీ నామయావత...
20/05/2026

చరిత్ర తిరగరాయాలి కేసిఆర్‌ను సీఎం చేయాలి - మాజీ ఎంపీ నామ

పార్టీ సభ్యత్వ నమోదులో ఉత్సాహంగా పని చేయాలి - మాజీ ఎంపీ నామ

యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ రావాలి…కాంగ్రెస్ పోవాలి అంటున్నారు - మాజీ ఎంపీ నామ

కేసీఆర్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి బలం అని కార్యకర్తలు, నాయకులే బలగమని అని బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం నాడు ఖమ్మంలోని తెలంగాణ భవన్‌ నందు ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు అధ్యక్షతన ఖమ్మం, మధిర, వైరా, ఇల్లందు నియోజకవర్గాల సభ్యత్వ నమోదు మండల ఇంచార్జ్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రలతో కలిసి మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి కేసిఆర్ చేసిన కృషిని కొనియాడారు. మరల చరిత్ర తిరగరాసి కేసిఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. లక్షలాది మంది కార్యకర్తల బలం ఒక్క బీఆర్ఎస్ పార్టీకే సొంతమన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో తాను తొలి ఓటు వేశానని, ఆ సందర్భానికి కేసిఆర్ సాక్షిగా ఉన్నారని గుర్తుచేశారు. గత రెండు దశాబ్దాలుగా ఉద్యమకారులు, కార్యకర్తలు, నాయకులు పార్టీకి అందించిన సేవలు అమూల్యమని పేర్కొన్నారు. జిల్లాలో 10కు 10 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం అవసరమని, అందుకు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతను చైతన్యవంతం చేయాలని, మండల ఇంచార్జ్‌లకు భవిష్యత్‌లో పార్టీ ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎలాంటి కష్టాల్లో ఉన్నా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పదవులు లేకపోయినా సేవలందిస్తున్న వారికి పార్టీ తగిన గుర్తింపు, అవకాశాలు కలిపిస్తుందని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు లో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పని చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హరి ప్రియ, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, పగడాల నాగరాజు, ఆర్జేసి కృష్ణ, దిండిగల రాజేందర్, ఖమర్, మంజుల, గిరిబాబు, మండల, పట్టణ ఇంచార్జిలు పాల్గొన్నారు.

బోనకల్ మండల బీఆర్ఎస్ నాయకులు తన్నీరు రవి కుమార్ సోదరుడు, ఖమ్మం నగరం లోటస్ హిల్స్ నందు నివాసం ఉంటున్న తన్నీరు రాధాకృష్ణమూ...
09/05/2026

బోనకల్ మండల బీఆర్ఎస్ నాయకులు తన్నీరు రవి కుమార్ సోదరుడు, ఖమ్మం నగరం లోటస్ హిల్స్ నందు నివాసం ఉంటున్న తన్నీరు రాధాకృష్ణమూర్తి-శైలజ దంపతుల కుమారుడు యశ్వంత్ వివాహం ఏలూరు జిల్లా కామవరపుకోట వాస్తవ్యులు కాండ్రు రామ్మోహన్‌రావు-సత్యావతి దంపతుల కుమార్తె శ్రావణితో జరుగగా శనివారం నాడు వరుడి స్వగృహానికి వెళ్లి నూతన వధూవరులను మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎంఎల్సీ తాతా మధుసూదన్ ఆశీర్వదించారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీ.ఆర్.యస్ నేతలుమధిర బీఆర్ఎస్ రూరల్ మండల నాయకులు రావూరి శ్రీనివాసరావు-అరుణ ల కుమార్తె యశ్వంత...
09/05/2026

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీ.ఆర్.యస్ నేతలు

మధిర బీఆర్ఎస్ రూరల్ మండల నాయకులు రావూరి శ్రీనివాసరావు-అరుణ ల కుమార్తె యశ్వంతి వివాహం గడ్డం నారాయణ రావు-వసంత లక్ష్మీ ల కుమారుడు శ్రీరామ్ తో మధిర మండలం, దెందుకూరు గ్రామం లోని యస్.ఆర్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఖమ్మం మాజీ ఎంపీ, బీ.ఆర్.యస్ లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎంఎల్సీ తాతా మధుసూదన్, ఖమ్మం మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమం లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు

మాజీ మంత్రి వనమాతో నామ భేటీపాల్వంచ పట్టణంలో మాజీ ఎంపీ నామ పర్యటనపాల్వంచ, మే9 : బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజ...
09/05/2026

మాజీ మంత్రి వనమాతో నామ భేటీ

పాల్వంచ పట్టణంలో మాజీ ఎంపీ నామ పర్యటన

పాల్వంచ, మే9 : బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు శనివారం పాల్వంచ పట్టణంలో పర్యటించారు. ముందుగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు స్వగృహానికి వెళ్లి వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. అంతకు ముందు వనమా ఇంటి వద్ద మాజీ ఎంపీ నామ కు పాల్వంచ రూరల్, పట్టణ బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లుకు మాజీ ఎంపీ నామ పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం మాజీ ఎంపీ నామ మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ సూచనలకు అనుగుణంగా పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రజలకు చేరువగా ఉండి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు ఆ తర్వాత పాల్వంచ పట్టణ వాస్తవ్యులు దొప్పలపూడి సురేష్ బాబు-సత్యవాణి దంపతుల కుమార్తె వివాహ వేడుక శనివారం రాత్రి జరగనున్న నేపథ్యంలో ముందుగానే మధ్యాహ్నం వారి స్వగృహానికి వెళ్లి నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ నుండి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పాల్వంచ పట్టణ వాస్తవ్యులు రమణమూర్తి నాయుడు నివాసానికి వెళ్లి ఇటీవల ఆయనకు సర్జరీ జరగగా వివరాలు అడిగి తెలుసుకొని వారిని పరామర్శించారు. వైద్యుల సూచనలు పాటించాలని సూచించి తిరిగి త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. నాయుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర నాయకులు వనమా రాఘవ, మోరంపూడి ప్రసాద్ రావు, పాల్వంచ మండల మాజీ అధ్యక్షులు, పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్ మూర్తి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు గోవాడ గుణచరిత్, సింధు తపస్వి, గుగులోత్ రాంబాబు, కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, మాజీ ఎంపీపీ సరస్వతి, ఉర్దుగా మాజీ చైర్మన్ అన్వర్ భాష, చిన్నంశెట్టి రంగయ్య, రెడ్డి నాయక్, నాయకులు ముత్యాల ప్రవీణ్, దాసరి నాగేశ్వరరావు, వాకదాని కోటేశ్వరరావు, భూక్య వీరన్న, శంకర్, జూపెళ్లి దుర్గాప్రసాద్, హర్షవర్ధన్, ప్రభాకర్ రెడ్డి, పత్తిపాటి శ్రీను, దాసరి సురేష్, బిఎల్ నాయుడు, వంశీ, బొదుగుల శ్రీధర్, కంచర్ల రామారావు, అఖిల్, సేమియా, కాలం రాజమ్మ, ఏనుగుల శీను, ఆర్ఎంపి శీను, హైమద్, బత్తుల శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు

Address

Khammam

Alerts

Be the first to know and let us send you an email when Nama Nageswara Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share