Alapati Army

Alapati Army Followers of the Alapati Rajendra Prasad (RAJA)
EX- Minster,తెలుగుదేశంపార్టీ

పచ్చదనం ప్రగతికి సోపానం. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత.. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు..
05/06/2026

పచ్చదనం ప్రగతికి సోపానం. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత.. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు..

ప్రజా దర్బార్ - గ్రీవెన్స్ఈ రోజు 05-06-2026 శుక్రవారం సా.గం.5:00 లకు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  గ్...
05/06/2026

ప్రజా దర్బార్ - గ్రీవెన్స్
ఈ రోజు 05-06-2026 శుక్రవారం సా.గం.5:00 లకు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి శాసన మండలి సభ్యులు, తెనాలి టిడిపి ఇంచార్జీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు స్వయంగా మీ సమస్యలపై అర్జీలు స్వీకరించెదరు.

కావున తెనాలి నియోజకవర్గ ప్రజలు,పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొనగలరు.

తెలుగుదేశంపార్టీ, తెనాలి నియోజకవర్గం




ఈరోజు తెనాలి (3-6-2026) పట్టణంలో ఎన్విఆర్ ఫంక్షన్ హాల్ నందు ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు  #నందమూరితార...
03/06/2026

ఈరోజు తెనాలి (3-6-2026) పట్టణంలో ఎన్విఆర్ ఫంక్షన్ హాల్ నందు ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు #నందమూరితారకరామారావు గారి విగ్రహానికి పూలమాలవేసి అనంతరం తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకుSIR ( #స్పెషల్ఇంటెన్సీరివిజన్) ఓటర్ల జాబితాను
చేర్పులు, మరియు మార్పులు గురించి తెనాలి నియోజవర్గంలో పరిధిలో ఉన్న క్లస్టర్ ఇన్చార్జులకు, యూనిట్ ఇన్చార్జిలకు, బూత్ కన్వీనర్లకు అవగాహన కల్పించిన తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ Alapati Rajendra Prasad గారు...

మానవత్వమే ధ్యేయం! ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత!తెనాలి నియోజకవర్గంలోని తెనాలి పట్టణానికి చెందిన షేక్ సైదా గార...
01/06/2026

మానవత్వమే ధ్యేయం! ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత!
తెనాలి నియోజకవర్గంలోని తెనాలి పట్టణానికి చెందిన షేక్ సైదా గారి వైద్య చికిత్స కోసం రూ.1,52,810/-,తెనాలి మండలం,జగ్గడిగుంట పాలెం గ్రామానికి చెందిన గండికోట రమేష్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1,21,930/- తెనాలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ , మాజీ మంత్రివర్యులు ,ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి చొరవ మరియు ప్రత్యేక సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి Letter of Credit (LOC) నుంచి ఇద్దరికీ రూ.2,74,740/- మంజూరైంది.ఈ ఆర్థిక సహాయానికి సంబంధించి ఈ రోజు (01/06/2026) వారికి 2,74,740/- ల చెక్కులను పార్టీ నాయకులు అందజేశారు.

ఆపద సమయంలో ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,అలాగే ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్, ఐటీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్,వాకా అర్జున్,రావూరి వందనం,జాఫర్ తదితరులు పాల్గొన్నారు.





శాసన మండలి సభ్యులు, తెనాలి టిడిపి ఇంచార్జీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి సూచనలతో ఈరోజు (01-6-2026) తెనాలి పట్టణం 23వ ...
01/06/2026

శాసన మండలి సభ్యులు, తెనాలి టిడిపి ఇంచార్జీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి సూచనలతో ఈరోజు (01-6-2026) తెనాలి పట్టణం 23వ వార్డులో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి నియోజకవర్గ పరిశీలకులు అప్పసాని రాజేష్ గారు,పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖుద్దుస్ గారు మరియు వార్డు,పట్టణ నాయకులు, కార్యకర్తలు.




ఈరోజు తెనాలిలో చావాస్ గ్రాండ్  ' కళ్యాణ మండపం లో జరిగిన వాసిరెడ్డి  వారి షష్టి పూర్తి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొ న్న తె...
31/05/2026

ఈరోజు తెనాలిలో చావాస్ గ్రాండ్ ' కళ్యాణ మండపం
లో జరిగిన వాసిరెడ్డి వారి షష్టి పూర్తి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొ న్న తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఉమ్మకృష్ణ ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ
Alapati Rajendra Prasad గారు...

తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి  #వసంతంఅశోక్ గారు కొంత కాలం నుండి అనారోగ్యం గా ఉన్నారని  తెలుసుకొని ఈరో...
31/05/2026

తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి
#వసంతంఅశోక్ గారు కొంత కాలం నుండి
అనారోగ్యం గా ఉన్నారని తెలుసుకొని ఈరోజు వారి స్వగృహం నందు ఆరోగ్య యోగక్షేమం తెలుసుకున్న
తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్
గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ
శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు
Alapati Rajendra Prasad

తెలుగు చిత్ర పరిశ్రమకు వెలుగు రేఖ...నటనకు  పర్యాయ పదమైన నిలువెత్తు రూపమై నిలిచిన దీపకళ...నటన సార్వభౌముడు, తెలుగువారి అస్...
28/05/2026

తెలుగు చిత్ర పరిశ్రమకు వెలుగు రేఖ...
నటనకు పర్యాయ పదమైన నిలువెత్తు
రూపమై నిలిచిన దీపకళ...
నటన సార్వభౌముడు, తెలుగువారి అస్తత్వాన్ని చాటి చెప్పిన మహా నాయకుడు...
తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక
#సమాజమేదేవాలయం #ప్రజలేదేవుళ్ళు
అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ని స్థాపించి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి, నిజాం పాలకుల బానిసత్వం నుండి ప్రజలను విముక్తి చేసి, నిరు పేదలక అన్నం పెట్టే ఆలోచనలో
కిలో 2 రూపాయలు బియ్యాన్ని అందించారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి గా , సమాజంలో మహిళకు ఆస్తిలో హక్కు కల్పిస్తూ, చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మహోన్నత వ్యక్తి, నిరుపేద గుండెల్లో ఉన్న కొలువైన దైవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు...
#నందమూరితారకరామారావు గారి103వ జన్మదినాన్ని పురస్కరించుకుని నా హృదయపూర్వక నమస్సుమాంజలి...






#కూటమిప్రభుత్వం


బక్రీద్ పండుగ  త్యాగం, భక్తి ,విశ్వాసానికి ప్రతీక మహమ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యతను, సహోదర భావాన్ని అందరూ అనుసరించాలని ...
27/05/2026

బక్రీద్ పండుగ త్యాగం, భక్తి ,విశ్వాసానికి ప్రతీక మహమ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యతను,
సహోదర భావాన్ని అందరూ అనుసరించాలని ఆకాంక్షిస్తూ...!
నా ముస్లిం సోదర సోదరీమణులందరికీ
#బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు...





#కూటమిప్రభుత్వం


రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు ( క్లస్టర్ -6 )   #వర్చువల్_హైబ్రి...
27/05/2026

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు ( క్లస్టర్ -6 ) #వర్చువల్_హైబ్రిడ్_మహానాడు2026 లో పార్టీ శ్రేణులు ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీమతి కత్తెర హెనీ క్రిస్టీనా దంపతులు మరియు తెనాలి నియోజకవర్గ పరిశీలకులు అప్ప సాని రాజేష్, క్లస్టర్ ఇంచార్జ్ లతో కలిసి పాల్గొన్న శాసన మండల సభ్యులు తెనాలి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్
#శ్రీఆలపాటిరాజేంద్రప్రసాద్ గారు ...
#మహనాడు






Address

Tenali

Alerts

Be the first to know and let us send you an email when Alapati Army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Alapati Army:

Share