Bharatiya Janata Yuva Morcha, Mancherial Town.

  • Home
  • Bharatiya Janata Yuva Morcha, Mancherial Town.

Bharatiya Janata Yuva Morcha, Mancherial Town. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bharatiya Janata Yuva Morcha, Mancherial Town., Political Party, .

మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు...!!!आपके परिवार को दशहरे की शुभकामनाएं...।HAPPY DUSSEHRA TO EVERYONE...!!!   ...
05/10/2022

మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు...!!!

आपके परिवार को दशहरे की शुभकामनाएं...।

HAPPY DUSSEHRA TO EVERYONE...!!!

.

MAHATMA GANDHI JAYANTI....WE BJP KARYKARTA HAVE REACHED GANDHI PARK IN OUR CITY MANCHERIAL AND PAID OR RESPECT TO OUR FA...
02/10/2022

MAHATMA GANDHI JAYANTI....

WE BJP KARYKARTA HAVE REACHED GANDHI PARK IN OUR CITY MANCHERIAL AND PAID OR RESPECT TO OUR FATHER OF THE NATION BY OFFERING GARLANDS & FLOWERS...!!!

!!!

అందరికీ నమస్తే...నిన్న హైదరాబాదులో భాజపా కార్యకర్తల మరియు నాయకులు శాంతియుతంగా కలవకుంట్ల కవిత గారు లిక్కర్ స్కాంలో దొరికి...
23/08/2022

అందరికీ నమస్తే...

నిన్న హైదరాబాదులో భాజపా కార్యకర్తల మరియు నాయకులు శాంతియుతంగా కలవకుంట్ల కవిత గారు లిక్కర్ స్కాంలో దొరికినందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని శాంతి యుతంగా ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీని అడ్డుకొని టిఆర్ఎస్ కార్యకర్తలు మరియు పోలీసులు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో పలువురు భాజపా కార్యకర్తలకు మరియు నాయకులకి గాయాలు కావడంతో ర్యాలీలో అనిశ్చితి ఏర్పడడం జరిగింది.

ఈ సంఘటనని నిరసిస్తూ ఈరోజు 11 గంటలకు ఐబీ చౌరస్తాలో తెరాస ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో...
.....పోలీస్ అక్రమ ముందొస్తు అరెస్ట్, ఇవాల్ల జరగలిసిన తెరాస దిసిటి బొమ్మ దహనం కార్యక్రమం లోని బొమ్మ తీసుకెళ్తున్న పోలీసులు వాటి యొక్క ముక్క చిత్రాలు... 🚩🇮🇳✊

మంచిర్యాల: 'లిక్కర్ మాఫియాలో కవిత పాత్ర ఉంది'
https://www.publicvibe.com/post/1661239904703195845?utm_source=share&utm_medium=android&userid=1622987794606350792

నేను మన ప్రాంతం నుండి లోకల్ వీడియోలను ఎప్పటికప్పుడు చూడడానికి పబ్లిక్ వైబ్ యాప్ ని వాడుతున్నాను. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. https://mapp.publicvibe.com/jysv/bd86f6f5

ఇవాళ ఐబి చౌరస్తాలో తెరాస ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో, భాజపా కార్యకర్తలు నాయకులు ...
16/08/2022

ఇవాళ ఐబి చౌరస్తాలో తెరాస ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో, భాజపా కార్యకర్తలు నాయకులు మరియు పదాధికారులు తెరాస కార్యకర్తలు సంజయ్ అన్న పాదయాత్రలో ఉన్నప్పుడు రాళ్లు రువ్వడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు ఇవ్వడం జరిగింది.
.... అలానే భాజపా కార్యకర్తలు నాయకులు మాట్లాడుతూ మళ్లీ రిపీట్ అయితే కరీంనగర్, ఇందుర, గోషామాయిల్ మరియు హుజురాబాద్ లో మా భాజపా ప్రతినిధులు ఉన్నారు అక్కడ కూడా మేము ఇదే పరిస్థితి తీసుకురావాల్సి వస్తుందని హెచ్చరించడం జరిగింది.

ఇట్లు మీ
రాచకొండ సత్యనారాయణ రావు,
భాజపా యువమోర్చా మంచిర్యాల్ పట్టణ అధ్యక్షులు.

ఈరోజు భాజపా మంచిర్యాల కార్యకర్తలు, నాయకులు మరియు పదాధికారులు మాతా శిశు హాస్పిటల్ సందర్శించడం జరిగింది..పైన కనిపిస్తున్న ...
02/08/2022

ఈరోజు భాజపా మంచిర్యాల కార్యకర్తలు, నాయకులు మరియు పదాధికారులు మాతా శిశు హాస్పిటల్ సందర్శించడం జరిగింది..

పైన కనిపిస్తున్న ముఖచిత్రాలలో, నీట మునిగి మాతా శిశు రూముల్లో నీటి యొక్క పరిమాణ స్థాయి రేఖలు కనిపించడం జరుగుతుంది.

మొదటి ముఖచిత్రంలో కేసీఆర్ కిట్లు ఎందుకు పనికిరాని స్థితిలో కనబడడం జరుగుతుంది..

ఇతర ముఖచిత్రాల్లో నాణ్యతలేని ఫాల్స్ సీలింగ్ కన్స్ట్రక్షన్ చూడొచ్చు.

ఈరోజు భాజపా మంచిర్యాల్ తరఫున తెరాస ప్రభుత్వానికి రెండే రెండు డిమాండ్ చేయడం జరుగుతుంది.

ఒకటి, మాదా శిశు హాస్పిటల్ రిపైర్ వర్క్ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేయడం జరిగింది.

రెండు, మాతా శిశు హాస్పిటల్ కి ప్రత్నయంగా ఇతర ప్రభుత్వ భవనాల్లో టెంపరరీ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది..

ఇట్లు మీ
రాచకొండ సత్యనారాయణ రావు,
భాజపా యువమోర్చా మంచిర్యాల్ పట్టణ అధ్యక్షులు.

ఈరోజు మంచిర్యాల్ లో ఉన్న ఐబి చౌరస్తాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఆదిర్ చ...
28/07/2022

ఈరోజు మంచిర్యాల్ లో ఉన్న ఐబి చౌరస్తాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది.

ఆదిర్ చౌదరి మన భారతదేశ రాష్ట్రపతి పైన చేసిన అనుచిత వాక్యాలు దృశ్య కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి బమ్మ దానం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మా భాజపా నాయకులు మరియు కార్యకర్తలు మాట్లాడుతూ భారతదేశ రాష్ట్రపతి పై చేసిన వ్యాఖ్యలకి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం ముగించడం జరిగింది....

ఇట్లు మీ
రాచకొండ సత్యనారాయణ రావు,
భాజపా యువమోర్చా మంచిర్యాల్ పట్టణ అధ్యక్షులు.

ఈరోజు ఐబీ చౌరస్తా మంచిర్యాలలో భాజపా యువమోర్చా మంచిర్యాల పట్టణం నుంచి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.అయితే తెలం...
13/06/2022

ఈరోజు ఐబీ చౌరస్తా మంచిర్యాలలో భాజపా యువమోర్చా మంచిర్యాల పట్టణం నుంచి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

అయితే తెలంగాణ లో జూబ్లీహిల్స్లో మొదలైనటువంటి మహిళలపై అత్యాచారాలు కేసు నుంచి నిన్నమొన్నటిదాకా పలు పట్టణాల్లో గ్రామాల్లో లో జరిగిన మహిళలపై అత్యాచారాలు దృశ్య ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెరాస ప్రభుత్వం లో ఉన్న హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారి పనితనం ఎలా ఉంది అనేది మనకు తెలుస్తూనే ఉంది...
... వినాయక చవితి నుంచి మొదలుపెడితే దసరా వరకు ఎలా మనకి కొరొణా అని చెప్పి హిందూ పండుగలకు ఎలా అయితే పర్మిషన్ నిరాకరించారు, రంజాన్ పండుగ ఎలా పర్మిషన్లు జారీ చేశారు..... ఇవన్నీ అందరూ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మెహముద అలిగారు హోమ్ మినిస్టర్గా వైఫల్యం చెందారని ఈ అగత్యాల నిరంతరం ఉంచడంలో వైఫల్యం చెందారని ఈ కారణాల దృశ్య వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్యక్రమం ముగించడం జరిగింది....

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు..

పచ్చ స్వప్న రాణి గారు
పచ్చ వెంకటేశ్వర్లు
ఆకుల అశోకవర్ధన్
ఆకుల సంతోష్
ముద్దం మల్లేష్
భాజపా యువమోర్చా నుంచి...
అమీర్ శెట్టి రాజు
రెడ్డిమల్ల అశోక్
మూలమటం షణ్ముఖ శర్మ
పి రాజేష్
గట్ల శ్రీవాస్తవ
జగ్జీత్ సింగ్..... మరియు ఇతర భాజపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు....

ఇట్లు మీ
రాచకొండ సత్యనారాయణ రావు,
భాజపా యువమోర్చా మంచిర్యాల పట్టణ అధ్యక్షులు.

ఈరోజు మార్కెట్ ఏరియా లో మోడీ గారి ప్రధానమంత్రిగా ఎనిమిది సంవత్సరాలు పూర్తిచేసుకునందున , కరపత్రాలు ప్రతి షాప్ షాప్ కి పంచ...
09/06/2022

ఈరోజు మార్కెట్ ఏరియా లో మోడీ గారి ప్రధానమంత్రిగా ఎనిమిది సంవత్సరాలు పూర్తిచేసుకునందున , కరపత్రాలు ప్రతి షాప్ షాప్ కి పంచడం జరిగింది.

ఈ కరపత్రాలు లో గత ఎనిమిది సంవత్సరాల్లో మోడీ గారు స్కీములు గాని లేదా సేవ కార్యక్రమాలు గాని మరియు దేశానికి చేసిన ఎన్నో మైలురాయి అయినటువంటి అన్ని కార్యక్రమాలు, పనులు మరియు సేవలు ఇందులో పొందుపరిచి ఉండడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వేరేబెళ్లి రఘునాథ్ గారు, వంగపల్లి వెంకటేశ్వరరావు, జోగుల శ్రీదేవి గారు, పచ్చ స్వప్న రాణి గారు, బియ్యాల సతీష్ రావు గమ, బోయ హరికృష్ణ, ముద్దం మల్లేష్, బొడ్డున మల్లేష్, రజనీష్ జైన్, రాజేష్, భాజపా కార్యకర్తలు మరియు భాజపా నాయకులు పాల్గొన్నారు...

ఇట్లు మీ
రాచకొండ సత్యనారాయణ రావు,
భాజపా యువమోర్చా మంచిర్యాల పట్టణ అధ్యక్షులు.

ఈరోజు భాజపా యువమోర్చా మంచిర్యాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో తెరాస ప్రభుత్వం  80000 ఉద్యోగాల నోటిఫికేషన...
19/05/2022

ఈరోజు భాజపా యువమోర్చా మంచిర్యాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో తెరాస ప్రభుత్వం 80000 ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత వెలుగులోకి వచ్చిన ముఖ్యమైనది "వయోపరిమితి".*

భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు మాత్రమే ఉన్నది మిగతా ఏ రాష్ట్రంలో చూసినా 18 ఏళ్ల నుంచి 32 ఏళ్లు కానీ లేదా 18 ఏళ్ల నుంచి 40 ఏండ్ల వరకు భయపడి మతి నిర్ణయించడం జరిగింది. మరి మన రాష్ట్రంలోనే ఈ దౌర్భాగ్యమైన స్థితి ఎందుకు. ఇకనైనా కెసిఆర్ గారు అన్ని రాష్ట్రాల లో కనుక్కొని వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకైనా చేయాలని కోరుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమం తదనంతరం కలెక్టర్ గారి ఆఫీస్ లో వినతిపత్రం అందజేయడం జరిగింది....!!! 🚩🇮🇳

ఇట్లు మీ

రాచకొండ సత్యనారాయణ రావు,
భాజపా యువమోర్చా మంచిర్యాల పట్టణ అధ్యక్షులు.

ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.  గ్రూప్స్ పరీక్షల...
10/05/2022

ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. గ్రూప్స్ పరీక్షల్లో ఉర్దూ లో క్వశ్చన్ పేపర్లు రావడం వల్ల ...పేపర్లో ఎన్నో అవకతవకలు జరిగే అవకాశం ఉంది అని గ్రహించి ఇది ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని మరియు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ కార్యక్రమం కొనసాగించడం జరిగింది...🚩🇮🇳

రాష్ట్ర భాషలతో చెలగాటమా, కబడ్ధార్.... ఖబర్దార్....

ఇట్లు మీ
రాచకొండ సత్యనారాయణ రావు,
భాజపా యువమోర్చా మంచిర్యాల పట్టణ అధ్యక్షులు.

Address


Alerts

Be the first to know and let us send you an email when Bharatiya Janata Yuva Morcha, Mancherial Town. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bharatiya Janata Yuva Morcha, Mancherial Town.:

  • Want your organization to be the top-listed Government Service?

Share