25/10/2025
*ప్రవాసాంధ్ర భరోసా బీమా*
ప్రవాసాంధ్రుల సంక్షేమం అభివృద్ధి మరియు భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టి సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులు మరియు విద్యార్థులు లబ్ధి పొందవచ్చు. ఉద్యోగులు, వలస కార్మికులు మరియు విద్యార్థుల కొరకు ఈ పథకం ప్రవేశపెట్టబడింది. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగిన 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఆకాంక్షిస్తున్నారు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి https://apnrts.ap.gov.in/insurance వెబ్ సైట్ ను సందర్శించగలరు.
మరిన్ని వివరాలకు:
24/7 హెల్ప్లైన్ 📞 కాల్: +91 863 2340678 📱 వాట్సాప్: +91 85000 27678
ఏపీఎన్ఆర్టి సొసైటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము