09/07/2026
SIR గురించి. ట్రయినింగ్ నోడల్ అధికారి శ్రీ చెన్నయ్య గారికి మనవి.
సర్ నేటి (10-7-26)మీ పేపర్ స్టేట్మెంట్ చూసాను. ముందుగా మీకు కృతజ్ఞతలు.
ఓట్లు పోతున్నాయానే భయానికి ప్రధాన కారణం ఓటర్లకు నోటీసుల దశకు రాకుండా చేయాల్సిన ఉంటుంది. వచ్చిందంటే ఆ వివరాలు తెల్వక, పేదవారికి ఆ అవగాహన తెల్వక, అంత తీరికా లాంటివి లేక వారు వదులుకుంటుంటారు అని అనుకుంటున్నాను.
నోటీసుల దశ రాకుండానే మీరు చూడగలిగితే చావరకు ఓటు పోతది అనే భయాన్ని తెలగించిన వారవుతారు.
ముఖ్యం గా 2002 లో లేని మహిళల ఓట్లు పోయే ప్రమాదం ఉందని నేననుకుంటున్నాను.
వారికి ఇపుడు పెళ్లిళ్లు అయినుంటాయి. అలాంటి వారు రెండవ కాలంలో తమ భర్తల పేర్లను ప్రధానంగా రాస్తున్నారు. భర్తల పేర్లకు బదులు వాళ్ళ నాన్న లేక అమ్మ లేక తాతయ్య, తాతమ్మ ల వివరాలను రాసుకుంటే తదుపరి సమస్యలు అనగా నోటీసు ల వరకు వెళ్లకుండా ఆపినవారావుతారు.
ముస్లిం లాగురించి.
2002 లోగానీ, అప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఓటరుల లిస్టుల్లో ముస్లింల పేర్లు తప్పుగా ఉండెను. ఇక ముందుకూడా ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణం ఓటరు లిస్టులు తెలుగులో తయారు కావటం. లిస్టుల తయారీ వేళ DTP చేసేవారు ఇంగ్లీష్ లో టైప్ చేస్తారు, ఆ పేరు తెలుగులో తప్పుగా టైప్ అవుతుంది. దానిని సరిదిద్దే టైం అలాగే ఓపిక్కా అలాగే అధికారుల నిర్దేశాలు ఉండవు.
ఉదాహరణకు ఒక ముస్లిం, పేరును (Shiguftaa)ను ఇంగ్లీష్ లో టైప్ చేస్తున్నాను. అది తెలుగులో ఎలా టైప్ అవుతుందో దయచేసి పరిశీలించండి. "శిగ్ఫ్టా", "శిగుఫటా",.
అదే ఒక telugu పేరును పరిశీలిద్దాం. Atluri Rajendar, అట్లూరి రాజేందర్ ను తీసుకుందాం. ఇందులో తప్పులు పడవు. ముస్లింల పేర్లు నూటికి 90% తప్పుగానే పడుతున్నాయి.
అయ్యా ఇదీ పరిస్థితి.
దీనిని నివారించాలంటే Election Commission వారు రెండు మార్గాలలో ఏదో ఒకదానిని అవాలంభించావాచ్చును.
1) ఓటరు లిస్టును ఇంగ్లీష్ లో తయారు చేయాలి.
2) DTP చేసేవారికి సారి అయిన పేరు వచ్చేలా టైప్ చేయమని ఆదేశించాలి.
Telangana Election కమీషనర్ గారికి, శ్రీ చెన్నయ్య గారికి వారి సిబ్బందికి ఒక ఓటరుగా కృతఙ్ఞతలు తెలుకుంటున్నాను. 🌹🙏