Eshwar Kaushik

Eshwar Kaushik Leaders help themselves and others to do the right things. They set direction, build an inspiring vision, and create something new.

విజయనగరం... రానున్న వినాయక చతుర్థి పండుగను దృష్టిలో ఉంచుకొని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారి సూచనల మేర...
22/08/2025

విజయనగరం... రానున్న వినాయక చతుర్థి పండుగను దృష్టిలో ఉంచుకొని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారి సూచనల మేరకు సాయి ఫౌండేషన్ ఆధ్వర్యం లో విద్యార్ధి యువజన విభాగం ఇన్చార్జ్ ఈశ్వర్ కౌశిక్ గారు చేతుల మీదుగా RTC కాంప్లెక్స్ వద్ద సుమారు 500 వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27 తారీఖున రానున్న వినాయక చతుర్థి రోజున ప్రజలందరూ మట్టి విగ్రహాలను వాడాలని, పర్యావరణాన్ని కలుషితం చేసే రంగు (ప్లాస్టో ప్యారిస్)విగ్రహాలను వాడవద్దని, పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రజలందరిపై ఉందని అన్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని, ఈ వినాయక చతుర్థి ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకోవాలని ఆ వినాయకుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి ఉండాలని కోరారు.ఈ రోజు కార్యక్రమంలో యువజన విభాగ నాయకులు భార్గవ్, లంక సురేష్, పవన్, గౌతమ్, తోమురోతు ఉమా, అశోక్.నల్లి తేజ, రాము ,వర్ధన్ , తులసి , ధనరాజ్, నవీన్. స్మార్ట్ సాయి,4s సాయి,విజయ్, రఘు, వంశీ పాల్గొన్నారు.

తేది:20/08/2025, నగరపాలక సంస్థ, విజయనగరం ,  యువజన విభాగ ఇన్చార్జ్ ఈశ్వర్ కౌశిక్ గారు ఈ రోజు  బెల్లాన చంద్ర శేఖర్ గారి అన...
21/08/2025

తేది:20/08/2025,
నగరపాలక సంస్థ, విజయనగరం ,

యువజన విభాగ ఇన్చార్జ్ ఈశ్వర్ కౌశిక్ గారు ఈ రోజు బెల్లాన చంద్ర శేఖర్ గారి అన్నయ్య గారి కుమారుడి వివాహానికి వెళ్లడం జరిగింది.

..

తేది:18/08/2025, నగరపాలక సంస్థ, విజయనగరంవిజయనగరం... యువజన విద్యార్థి సంఘాల ప్రవేశం పై జారీ చేసిన ఉత్తర్వుల్ని ఉపసంహరించు...
18/08/2025

తేది:18/08/2025, నగరపాలక సంస్థ, విజయనగరంవిజయనగరం... యువజన విద్యార్థి సంఘాల ప్రవేశం పై జారీ చేసిన ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోవాలని 18న రాష్ట్ర వ్యాపితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాలు అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా విజయనగరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు వైయస్సార్ సీపీ యువజన విద్యార్థి విభాగం అధ్యక్షతన నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోకి యువజన విద్యార్థి సంఘాలు ప్రవేశించొద్దని కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన పదిహేను నెలల్లోనే విద్యారంగాన్ని పూర్తిగా నీరుగార్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు బహిర్గతం అవుతాయనే భయంతోనే విద్యార్థి సంఘాలని ప్రభుత్వ విద్యాసంస్థల్లోకి రాకుండా చీకటి ఉత్తర్వులిచ్చిందని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలతో సమావేశాలు నిర్వహించిన లోకేష్ నేడు ఇలాంటి ఉత్తర్వులివ్వడం ఏంటని ప్రశ్నించారు. పాఠశాలల్లో విద్యార్థులకిచ్చిన బ్యాగులు నెల రోజుల్లోనే చిరిగిపోతున్నాయని, మధ్యాహ్న భోజనం అత్యంత నాసిరకంగా ఉండడం గమనించమని, ఆంగ్ల బోధన అటకెక్కించారని, నాడు - నేడు రద్దు చేసి పాఠశాలల్ని నీర్వీర్యం చేశారని, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కనీస వసతుల్ని కల్పించలేకపోతున్నారని ప్రత్యక్షంగా పర్యవేక్షించి జిల్లా కలెక్టర్ దృష్టికి వినతిపత్రం ద్వారా తెలియపరిచామని అన్నారు. ఇలాంటి సమస్యలన్నీ విద్యార్థి సంఘాల దృష్టికి వస్తాయనే లోకేష్ ఉత్తర్వులిచ్చారని విమర్శించారు. విద్యార్థుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసేది విద్యార్థి సంఘాలే అని తెలిపారు.రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కలుషితాహారం వల్ల విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నా కుడా లోకేష్ స్పందించడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ కార్యక్రమాల గురించి విద్యార్థి నేతలు విద్యార్థులతో మాట్లాడే స్వేచ్ఛ ఉండేదని గుర్తుచేసారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి అప్రజాస్వామికమైన ఉత్తర్వులు ఐదేళ్లలో సీఎం గా జగన్ మోహన్ రెడ్డి ఇవ్వలేదని, డా. బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రజాస్వామిక హక్కుల్ని లోకేష్ కాలరాస్తున్నారని తెలిపారు. విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాలు రాకూడదంటూ పాఠశాల విద్యా శాఖ, ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగ ఇన్చార్జ్ ఈశ్వర్ కౌశిక్ గారు ,విద్యార్థి విభాగ అధ్యక్షలు కరుముజు సాయి గారు , పట్టణ యువజన విభాగ ఇన్చార్జ్ బోడసింగి ఈశ్వర రావు గారు యువజన విభాగ నాయకులు భార్గవ్, వర్ధన్, లంక సురేష్, ఉమా , లంక నరేష్, బాలి ప్రతాప్, గౌతమ్, ధనరాజ్ మరియు పట్టణ విద్యార్థి విభాగ నాయకులు పొన్నాడ మణికంఠ, వివేక్, హర్ష, మణి భగవాన్, బన్నీ, జస్వంత్ లతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన మరియు విద్యార్థి విభాగ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ..

18/08/2025

నగరపాలక సంస్థ, విజయనగరం , *బాబు షూరిటీ మోసం గ్యారంటీ* వార్డు పర్యటన కార్యక్రమాన్ని యువజన విద్యార్థి విభాగ ఇన్చార్జ్ ఈశ్వర్ కౌశిక్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలసి వార్డులలో, గ్రామాలలో ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మోసాలను వివరించే కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు చేసిన మోసాలను ఇంటింటికీ వెళ్లి వివరించారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పారన్నారు. మరియు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదన్న నిజాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. కూటమి ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉందని, సంక్షేమ పథకాలు అమలు తీరు ఎలా ఉందని, గత ప్రభుత్వ పాలనతో పోల్చుకోమన్నారు. హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలిన కూటమి ప్రభుత్వం పాలనను నిలదీయటానికి వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.ఈ రోజు జరిగిన సమావేశంలో కృష్ణ రెడ్డి గారు, దమయంతి గారు ,గుణ గారు ,ఫన్నీ గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ..

తేది:15/08/2025, నగరపాలక సంస్థ, విజయనగరం , విజయనగరం.... స్వాతంత్ర సమరయోధుల ఆశయ సిద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆంధ్రప...
15/08/2025

తేది:15/08/2025,
నగరపాలక సంస్థ, విజయనగరం ,

విజయనగరం.... స్వాతంత్ర సమరయోధుల ఆశయ సిద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి, విజయనగరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజకవర్గం ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో శుక్రవారం నాడు ఘనంగా జరిగాయి. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. జై భారత్, వందేమాతరం నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. దేశభక్తి వెల్లివిరిసింది. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం ఈ స్వాతంత్రం అని అన్నారు. ప్రజల ప్రయోజనాలను గుర్తించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లారు అని అదేవిధంగా తన తనయుడు వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీనవర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేశారని రైతులు, మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టా రనీ గుర్తు చేశారు. వచ్చే ఎన్నికలలో వైకాపా పార్టీని అధిక మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత మన అందరిపై ఉందని సూచించారు.
అనంతరం స్వీట్స్ పంచిపెడుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక మేయర్ వెంపటాపు విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి గారు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సంఘం రెడ్డి బంగారు నాయుడు గారు, నగర పార్టీ అధ్యక్షులు ఆసపు వేణు గారు, నగర మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎస్ వి రాజేష్ గారు , యువజన విద్యా విభాగం ఇంచార్జ్ ఈశ్వర్ కౌశిక్ గారు, మండల పార్టీ అధ్యక్షులు కెల్లా త్రినాధ్ గారు, వైసిపి జోనల్ ఇన్చార్జిలు,ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రస్తుత మరియు మాజీ పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పార్టీ అనుబంధ విభాగ నాయకులు, మహిళలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

..

10/08/2025

యువజన విద్యార్థి విభాగ ఇన్చార్జ్ ఈశ్వర్ కౌశిక్ గారు . గవర్నమెంట్ హాస్టల్స్ లో వున్నా స్టూడెంట్స్ సమస్యలు పరిష్కరించాలని , కూటమి ప్రభుత్వం విద్యార్థులుని కి ఉన్న సమ్యస్యలు గురుంచి నిర్లక్ష్యం చేయకుండా పట్టించుకోవాలి లేకుంటే పెద్ద ఎత్తున రాలి చేసి స్టూడెంట్స్ కి ఉన్న సమ్యసలు అందరికి తెలిసేలా నిరసన తెలిసిజేస్తం అని ఈ ఇంటర్వ్యూ లో మాట్లాడడం జరిగింది. . ..

06/08/2025

యువజన విద్యార్థి విభాగ ఇన్చార్జ్ ఈశ్వర్ కౌశిక్ గారు . ఈ రోజు గవర్నమెంట్ హాస్టల్స్ లో వున్నా స్టూడెంట్స్ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ గారికి వినతి పత్రిక అందజేయడం జరిగింది .విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కరుముజ్జి సాయి గారు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అల్లు అవినాష్ గారు యువజన విభాగ నాయకులు భార్గవ్, లంక సురేష్, పవన్, గౌతమ్, ఉమా, తేజ, ధనరాజ్, విద్యార్థి విభాగం నాయకులు పొన్నాడ మణికంఠ, దీరు పాల్గోవడం జరిగింది . ..

యువజన విద్యార్థి విభాగ ఇన్చార్జ్ ఈశ్వర్ కౌశిక్ గారు . ఈ రోజు గవర్నమెంట్  హాస్టల్స్ లో వున్నా స్టూడెంట్స్ సమస్యలు పరిష్కర...
05/08/2025

యువజన విద్యార్థి విభాగ ఇన్చార్జ్ ఈశ్వర్ కౌశిక్ గారు . ఈ రోజు గవర్నమెంట్ హాస్టల్స్ లో వున్నా స్టూడెంట్స్ సమస్యలు పరిష్కరించాలని
కలెక్టర్ గారికి వినతి పత్రిక అందజేయడం జరిగింది.

విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కరుముజ్జి సాయి గారు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అల్లు అవినాష్ గారు యువజన విభాగ నాయకులు భార్గవ్, లంక సురేష్, పవన్, గౌతమ్, ఉమా, తేజ, ధనరాజ్, విద్యార్థి విభాగం నాయకులు పొన్నాడ మణికంఠ, దీరు పాల్గోవడం జరిగింది

. ..

02/08/2025

యువజన విద్యార్థి విభాగ ఇన్చార్జ్ ఈశ్వర్ కౌశిక్ గారు .ఈ రోజు RK nagar లో ఇంటి ఇంటి కి వెళ్లి బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమం లో పాల్గోవడం జరిగింది. ..

Address

Mandapam Veedhi
Vizianagram City
535002

Telephone

+919703177777

Website

Alerts

Be the first to know and let us send you an email when Eshwar Kaushik posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Eshwar Kaushik:

Share