District Collector Vizianagaram

District Collector Vizianagaram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from District Collector Vizianagaram, Government Organization, VIZIANAGARAM, Vizianagaram.

విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 08 ఃప‌ల్లె పండుగ‌లో భాగంగా గుంత‌లు లేని ర‌హదారులే ల‌క్ష్యంగా జిల్లాలో చేప‌ట్టిన రోడ్ల‌ మ‌ర‌మ్మ‌తు...
08/01/2025

విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 08 ఃప‌ల్లె పండుగ‌లో భాగంగా గుంత‌లు లేని ర‌హదారులే ల‌క్ష్యంగా జిల్లాలో చేప‌ట్టిన రోడ్ల‌ మ‌ర‌మ్మ‌తు ప‌నులు 296 కిలోమీట‌ర్ల మేర పూర్తి అయ్యాయ‌ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ తెలిపారు. రోడ్ల‌ మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌పై ర‌హ‌దారులు భ‌వ‌నాల శాఖ అధికారుల‌తో క‌లెక్ట‌ర్ అంబేద్క‌ర్ త‌మ ఛాంబ‌ర్‌లో బుధ‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, జిల్లాలో 884 కిలోమీట‌ర్ల మేర ర‌హ‌దారుల‌ మ‌ర‌మ్మ‌తుల‌కు 176 ప‌నుల‌ను ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. వీటిలో మొద‌టి విడ‌త 296 కిలోమీట‌ర్ల మేర‌ సుమారు రూ.10.54 కోట్ల ఖ‌ర్చుతో చేప‌ట్టిన 68 ప‌నులు గురువారం నాటికి పూర్తి అవుతాయిని చెప్పారు. ఇవ‌న్నీ అనుకున్న ల‌క్ష్యం మేర‌కు సంక్రాంతి పండుగ నాటికి సిద్ద‌మ‌య్యాయ‌ని తెలిపారు. రెండో విడ‌త క్రింద రూ.13కోట్ల‌తో 588 కిలోమీట‌ర్ల మ‌ర‌మ్మ‌తు కోసం 108 ప‌నులు ప్రారంభించ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 106 కిలోమీట‌ర్ల మేర పూర్తి అయ్యాయ‌ని తెలిపారు. మిగిలిన ప‌నుల‌ను వీలైనంత‌ త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 07 ః  విద్యుత్ బిల్లుల‌నుంచి విముక్తి పొంద‌డానికి చ‌క్క‌ని ప‌రిష్క‌రాం ప్ర‌ధాన‌మంత్రి సూర్య‌ఘ‌ర్ ...
08/01/2025

విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 07 ః విద్యుత్ బిల్లుల‌నుంచి విముక్తి పొంద‌డానికి చ‌క్క‌ని ప‌రిష్క‌రాం ప్ర‌ధాన‌మంత్రి సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం. పైగా ఈ ప‌థ‌కం ద్వారా అద‌న‌పు ఆదాయం కూడా పొందే అవ‌కాశం ల‌భిస్తుంది. మీ ఇల్లే ఒక విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రంగా మారుతుంది. కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న స‌బ్సిడీతో ఇప్ప‌డు సోలార్‌ రూఫ్‌టాప్ పథ‌కం సామాన్యుల‌కు సైతం అందుబాటులోకి వ‌చ్చింది.



మీఇళ్లే విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రం

రోజుకూ పెరిగిపోతున్న విద్యుత్తు బిల్లుల సమస్యకు పరిష్కారం చుపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకుని ఉచిత కరెంటు పొందవచ్చు. సుదీర్ఘకాలం ఉచిత విద్యుత్తు పొందడమే కాదు మిగులు విద్యుత్తును విక్రయించి ఆదాయమూ పొందవచ్చు. అదే ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన. దేశ వ్యాప్తంగా కోటి కుటుంబాలకు సోలార్ విద్యుత్తు ఏర్పాటుకు సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఇంటిపై గరిష్ఠంగా 3 కిలోవాట్ల వరకు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల చొప్పున సబ్సిడీని అందిస్తోంది.



*స‌బ్సిడీ ఇలా *

పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా ఒక్కో కిలోవాట్‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం రూ.30 వేలు స్స‌బిడీ ఇస్తుంది. రెండు కిలో వాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు అయితే మ‌రో రూ.18 వేలు సబ్సిడీ అందిస్తుంది. అంటే ఇంటిపై 3 కిలోవాట్ల సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకుంటే రూ.1.45 లక్షలు ఖర్చవుతుంది. దీనిపై కేంద్రం రూ.78 వేలు రాయితీ అందిస్తుంది. మిగితా సొమ్మును ఎలాంటి గ్యారంటీ లేకుండానే బ్యాంకు ద్వారా రుణం తీసుకోవచ్చు.



విద్యుత్ బిల్లుకు ఆదా

నెలకు 0-150 యూనిట్ల వరకు కరెంట్ వాడుకునే వారికి కేవ‌లం 100 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలోనే, 1-2 కిలోవాట్ల సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. 150-300 యూనిట్ల వరకు అయితే 2-3 కిలోవాట్ల ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆపైన సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే సబ్సిడీ మాత్రం గ‌రిష్టంగా రూ.78 వేలు మాత్రమే వస్తుంది. ఈ స్కీమ్ ద్వారా వచ్చే విద్యుత్తును మీ అవ‌స‌రం మేర‌కు వాడుకుని, మిగిలిన కరెంటును నెట్ మీటరింగ్ ద్వారా ఇతరులకు విక్రయించుకోవచ్చు. డిస్కం కు విక్ర‌యించే విద్యుత్ ప్ర‌తీ యూనిట్‌కు రూ.2.83 పైస‌లు చెల్లిస్తుంది.



ఏడాదికి రూ.30వేలు ఆదా

సూర్య ఘర్ అధికారిక వెబ్‌సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం 1 కిలోవాట్‌కు 120 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుత రేట్ల ప్రకారం నెలకు రూ.1000 బిల్లు వస్తుంది. సోలార్ ప్యానళ్ల ఖర్చు రూ.338 మాత్రమే. అంటే ఏడాదికి రూ. 8 వేలు ఆదాయ అవుతుంది. 240 యూనిట్లు వినియోగిం వారికి నెలకు రూ.2 వేలు బిల్లు వస్తుంది. సోలార్ వ్యవస్థ ద్వారా రూ.333 ఖర్చవుతుంది. 360 యూనిట్లు వినియోగించే వారికి అయితే ఏడాదికి రూ.32 వేలు ఆదా అవుతాయి.



దరఖాస్తు విధానం ఇలా

పీఎం సూర్య ఘర్ పోర్టల్ pmsuryaghar.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలి. మీ రాష్ట్రం, విద్యుత్తు సరఫరా కంపెనీ ఎంపిక చేసుకోవాలి. విద్యుత్ కనెక్షన్ నంబర్, ఫోన్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ ఇవ్వాలి.

ఆ తర్వాత మీ విద్యుత్తు కన్జ్యూమర్ నంబర్, ఫోన్ నంబర్‌తో లాగిన్ కావాలి. రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లయ్ చేయాలి. ఫారం ఫిల్ చేసి డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చే వరకు వేచి ఉండాలి. అనుమతులు వచ్చిన తర్వాత డిస్కమ్ గుర్తింపు పొందిన విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత వివరాలను పోర్టల్‌లో సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేయాలి.

నెట్ మీటర్‌ ఇన్‌స్టాల్ చేశాక డిస్కమ్ అధికారులు తనిఖీ చేస్తారు. ఆ తర్వాత కమిషనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు. ఈ రిపోర్ట్ వచ్చాక మీ బ్యాంకు ఖాతా వివరాలతో క్యాన్సిల్ చేసిన చెక్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలి. 30 రోజుల్లో సబ్సిడీ వస్తుంది.



ప్ర‌తీఒక్క‌రూ వినియోగించుకోవాలి

డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్‌, జిల్లా క‌లెక్ట‌ర్‌

ప్ర‌ధాన‌మంత్రి సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం సామాన్యుల‌కు ఒక వ‌రం. ఇళ్ల‌పై సౌర ఫ‌లకాల‌ను ఏర్పాటు చేసుకొని విద్యుత్ ఉత్ప‌త్తి చేయోచ్చు. మీ ఇంటికి అవ‌స‌ర‌మైన విద్యుత్‌ను ఇంటిపైనే ఉచితంగా ఉత్ప‌త్తి చేయోచ్చు. సుదీర్ఘ‌కాలం సూర్య‌ఫ‌ల‌కాలు ప‌నిచేస్తాయి. మీరు పెట్టిన పెట్టుబ‌డి ఐదేళ్ల‌కే తిరిగి వ‌స్తుంది. జిల్లాలోని సుమారు 50వేల ఎస్సి, ఎస్‌టి ఇళ్ల‌కు ఈ యూనిట్ల‌ను ఏర్పాటు చేయడానికి ప్ర‌ణాళిక రూపొందించారు. మిగిలిన వారు కూడా ఈ అవ‌కాశాన్ని అందిపుచ్చుకొని త‌మ ఇళ్ల‌పైన లేదా ఖాళీ స్థ‌లాల్లో సోలార్ రూఫ్ టాప్ యూనిట్ల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని కోరుతున్నాం.

విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 04 : జిల్లాకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ ప‌థ‌కంలో కేటాయించిన వేత‌నాల బ‌డ్జెట్ వంద‌శాతం ఖ‌ర్చు చేయాల్...
08/01/2025

విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 04 : జిల్లాకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ ప‌థ‌కంలో కేటాయించిన వేత‌నాల బ‌డ్జెట్ వంద‌శాతం ఖ‌ర్చు చేయాల్సిందేన‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్ ఉపాధిహామీ ఏపిఓల‌ను ఆదేశించారు. వేత‌నాల రూపంలో ఖ‌ర్చుచేయాల్సిన బ‌డ్జెట్ పూర్తిగా ఖ‌ర్చుచేయ‌ని ప‌క్షంలో జిల్లా న‌ష్ట‌పోతుంద‌ని, జిల్లాకు మెటీరియ‌ల్స్ కాంపొనెంట్ కింద రావ‌ల‌సిన నిధులు త‌గ్గిపోతాయ‌న్నారు. లేబ‌ర్ బడ్జెట్‌ను గ‌డువులోగా ఖ‌ర్చుచేసే బాధ్య‌త ఏపిఓల‌దేనని స్ప‌ష్టంచేశారు. రోజుకు క‌నీసం మూడువేల మంది వేత‌న‌దారుల‌ను ప‌నుల్లోకి వ‌చ్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టి కేటాయించిన బ‌డ్జెట్‌ను ఖ‌ర్చు చేయాల‌న్నారు. ఉపాధిహామీ ప‌నులు, ప‌ల్లెపండుగ ప‌నుల ప్ర‌గ‌తిపై క‌లెక్ట‌ర్ శ‌నివారం క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆడిటోరియంలో పంచాయ‌తీరాజ్‌, ఉపాధిహామీ అధికారుల‌తో స‌మీక్షించారు. వంద‌రోజుల ప‌ని పూర్తిచేసిన కుటుంబాల సంఖ్య కూడా పెర‌గాల్సి వుంద‌న్నారు.

ప‌ల్లెపండుగ ప‌నుల‌కు సంబంధించి బిల్లులు జాప్యం లేకుండా వెనువెంట‌నే అప్‌లోడ్ చేసి చేసిన ప‌నుల‌కు ఖ‌ర్చు చూపించాల‌న్నారు. ప‌నులు పూర్త‌వుతున్న‌ప్ప‌టికీ అందుకు త‌గిన విధంగా బిల్లులు అప్‌లోడ్ కావ‌డం లేద‌ని, ఈ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. అదేవిధంగా పూర్త‌యిన ద‌శ‌లో వున్న ప‌నుల‌ను రెండు మూడు రోజుల్లో పూర్తిచేయాల‌ని చెప్పారు. ప‌శువుల షెడ్ల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. పునాది, పైక‌ప్పు స్థాయిలో నిర్మాణంలో వున్న 498 షెడ్ల‌ను త‌క్ష‌ణం పూర్తిచేయాల‌న్నారు.

స‌మావేశంలో పంచాయ‌తీరాజ్ ఎస్‌.ఇ. శ్రీ‌నివాస‌రావు, డ్వామా పి.డి. శార‌దాదేవి, పంచాయ‌తీరాజ్ డి.ఇ., ఏ.ఇ.లు, ఉపాధిహామీ ఏపిఓలు పాల్గొన్నారు.

విజయనగరం, జనవరి 4 :      బ్రెయిలీ లిపిని కనుగొనడం ద్వారా అంధుల‌ జీవితాల్లో లూయిస్ బ్రెయిలీ వెలుగులు నింపారని జిల్లా కలెక...
08/01/2025

విజయనగరం, జనవరి 4 : బ్రెయిలీ లిపిని కనుగొనడం ద్వారా అంధుల‌ జీవితాల్లో లూయిస్ బ్రెయిలీ వెలుగులు నింపారని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్అం.బేద్కర్ కొనియాడారు. జిల్లా విభిన్న ప్రతిభావంతులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిఆర్డిఏ సమావేశ మందిరంలో శనివారం జరిగిన లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఆ సంద‌ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లిపిని కొనుక్కొని అంధుల‌కు బ్రెయిలీ మహోపకారం చేశారని అన్నారు. అంధులు కూడా చదువుకొని ఉన్నత స్థానాలను సాధించేందుకు ఈ లిపి ఎంత‌గానో దోహదపడిందని పేర్కొన్నారు. ఈ లిపి ద్వారానే చాలామంది ఉన్నత ఉద్యోగులుగా, అధ్యాపకులుగా, సివిల్ సర్వీసెస్ ఉద్యోగులుగా కూడా ఎంపికయ్యారని చెప్పారు. చదువు ద్వారానే ఎదుగుదల సాధ్యమవుతుందని ఉన్నత స్థానానికి చేరుకోవచ్చననీ ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో అందులకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తామని, వారి అవసరాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. అంధుల‌కు ఉపయోగపడే విధంగా, వారి అవ‌స‌రాన్ని బ‌ట్టి ప్రత్యేక కంప్యూటర్ శిక్షణా కార్య‌క్ర‌మానికి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రెయిలీ క్యాలెండర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆ శాఖ ఇన్చార్జి ఏడి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పి. బాలాజీ, డిఆర్డిఏ పిడి ఏ. కళ్యాణ చక్రవర్తి, ఎస్‌సి కార్పొరేషన్ ఈడీ సుధారాణి, సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ జి.జ‌నార్ధ‌న‌నాయుడు, ప్ర‌భుత్వ అంధుల‌ పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర రెడ్డి, బదిరుల పాఠశాల ప్రిన్సిపాల్ రాంబాబు, అంధ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు ఉమాశంకర్, ఇతర నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. అంధ బాలబాలికలు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. వేమన పద్యాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి మెప్పించారు. ముందుగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 03 ః   ఈ నెల 6వ తేదీ నుంచి మెడిక‌ల్ పెన్ష‌న్ల రీ-వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తున్న‌ట్లు జ...
08/01/2025

విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 03 ః ఈ నెల 6వ తేదీ నుంచి మెడిక‌ల్ పెన్ష‌న్ల రీ-వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ తెలిపారు. ఈ ప్ర‌క్రియ‌పై జిల్లా అధికారులు, ఎంపిడిఓలు, వైద్యాధికారుల‌తో శుక్ర‌వారం సాయంత్రం జిల్లా క‌లెక్ట‌ర్‌ త‌మ ఛాంబ‌ర్ నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.



జిల్లాలోని వైద్య పింఛ‌న్ల‌లో పూర్తిగా మంచానికే ప‌రిమిత‌మై పింఛ‌న్ పొందుతున్నవారు 342 మంది ఉన్నార‌ని, తొలివిడ‌త‌లో వీరి పింఛ‌న్ల‌ను రీ వెరిఫికేష‌న్ చేయ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. త‌రువాత ద‌శ‌లో మిగిలిన వైద్య పింఛ‌న్ల‌ను ప‌రిశీలిస్తార‌ని చెప్పారు. రీ వెరిఫికేష‌న్‌కు ఇత‌ర జిల్లాల‌నుంచి 6 బృందాలు వ‌స్తాయ‌ని చెప్పారు. ఒక్కో బృందంలో ఒక ఆర్ధోపెడిక్ డాక్ట‌ర్‌, ఒక జ‌న‌ర‌ల్ మెడిస‌న్ స్పెష‌లిస్ట్‌, వైద్యాధికారితోపాటు ఒక డిజిట‌ల్ అసిస్టెంట్ ఉంటార‌ని తెలిపారు. వీరంతా ఆయా రోగుల‌ను, వారి మెడిక‌ల్ స‌ర్టిఫికేట్‌, స‌ద‌రం, ఆధార్ త‌దిత‌ర దృవ‌ప‌త్రాల‌ను ప‌రిశీల‌న చేసి, వారి వివ‌రాల‌ను యాప్‌లో న‌మోదు చేస్తార‌ని చెప్పారు. వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఈ బృందాలు ప‌ర్య‌టిస్తాయ‌ని, మూడు రోజుల విరామం తీసుకుంటాయ‌ని చెప్పారు. వీరి త‌నిఖీల‌కు వీలుగా షెడ్యూల్‌ను రూపొందించాల‌ని ఆదేశించారు. సంక్రాంతి పండుగ‌కు ముందే వీలైనంత ఎక్కువ‌మందిని త‌నిఖీ చేసేట‌ట్లుగా చూడాల‌ని సూచించారు. పింఛ‌న్‌దారుల అర్హ‌త‌ల‌ను, దృవ‌ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌డానికి మాత్ర‌మే ప్ర‌భుత్వం ఈ ప్ర‌క్రియ‌ను చేప‌డుతోంద‌ని, అర్హుల పింఛ‌న్లు తొల‌గించే ఉద్దేశ్యం ఎంత‌మాత్రం ప్ర‌భుత్వానికి లేద‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు.

విజయనగరం, జనవరి 03:    విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని దానిని సాధించడానికి కష్టపడి చదవాలని సంయుక్త కలెక్టర్ సే...
08/01/2025

విజయనగరం, జనవరి 03: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని దానిని సాధించడానికి కష్టపడి చదవాలని సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. ఎన్ని అవరోధాలు ఏర్పడినా లక్ష్యాన్ని మరవకూడదని తెలిపారు. శుక్రవారం కిలతంపాలెం జవహర్ నవోదయా పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా జేసీ పాల్గొన్నారు. ప్రతిరోజు నిర్వహించే అసెంబ్లీ లో జేసీ విద్యార్థుల తో కలసి పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసారు. స్కూల్ ప్రిన్సిపాల్ వాడ్రేవు దుర్గా ప్రసాద్ స్కూల్ అకాడమిక్స్ , అడ్మినిస్ట్రేషన్, ఆర్ధిక పరమైన అంశాలను, సాధించిన విజయాలను , 10, 12 తరగతులలో సాధించిన ఫలితాలు తదితర అంశాల పై జేసీ కి వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎ. రఘు, ఎం.ఈ.ఓ, డిప్యూటీ డీఈ.ఓ, మెడికల్ ఆఫీసర్, పేరెంట్స్ టీచర్స్ కమిట్టీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

08/01/2025
విజ‌య‌న‌గ‌రం(తాటిపూడి), జ‌న‌వ‌రి 03 :జిల్లా ప‌ర్యాట‌క అభివృద్ధిలో తొలి అడుగు ప‌డింద‌ని రాష్ట్ర సెర్ప్‌, చిన్న‌ప‌రిశ్ర‌మ‌...
08/01/2025

విజ‌య‌న‌గ‌రం(తాటిపూడి), జ‌న‌వ‌రి 03 :జిల్లా ప‌ర్యాట‌క అభివృద్ధిలో తొలి అడుగు ప‌డింద‌ని రాష్ట్ర సెర్ప్‌, చిన్న‌ప‌రిశ్ర‌మ‌లు, ఎన్‌.ఆర్‌.ఐ. వ్య‌వ‌హారాల మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. గంట్యాడ మండ‌లంలోని తాటిపూడి రిజ‌ర్వాయ‌రులో ప‌ర్యాట‌క అభివృద్ధిలో భాగంగా సాహ‌స జ‌ల‌క్రీడ‌ల‌ను(Adventure Water Sports) మంత్రి శుక్ర‌వారం ప్రారంభించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌బ్లిక్ ప్రైవేట్ భాగ‌స్వామ్య‌(పిపిపి) విధానంలో ప‌ర్యాట‌క అభివృద్ధిని ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించింద‌ని, దీనిలో భాగంగా ఎన్‌.ఆర్‌.ఐ. సంస్థ వాట‌ర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ఆధ్వ‌ర్యంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించామ‌న్నారు. అడ్వెంచ‌ర్ వాట‌ర్ స్పోర్ట్స్ లో భాగంగా రిజ‌ర్వాయరులో తొలి ద‌శ‌లో వాట‌ర్ ట్యాక్సీలు, స్పీడ్ బోట్లు ఏర్పాటు చేశార‌ని, రెండో ద‌శ‌లో జ‌ల‌క్రీడ‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నార‌ని, మూడో ద‌శ‌లో హౌస్‌బోట్లు, ఫ్లోటింగ్ కాటేజ్ లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. సుమారు రూ.5 కోట్ల వ్య‌యంతో యీ సంస్థ ఇక్క‌డ బోటింగ్ ఏర్పాట్లు చేస్తోంద‌న్నారు. ఈ ప్రాంతానికి చెందిన యువ‌త‌కే త‌గిన శిక్ష‌ణ ఇచ్చి బోట్ల ద్వారా ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. అమెరికాలో వుండే స్థాయిలో పూర్తిస్థాయి భ‌ద్ర‌త ప్ర‌మాణాల‌ను పాటించి బోటింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ప‌ర్యాట‌కుల కోసం రాత్రి వేళ‌ల్లో లైటింగ్ ఏర్పాట్లు, మ‌రుగుదొడ్లు వంటి వ‌స‌తుల‌ను క‌ల్పించ‌నున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు. విశాఖ మీదుగా అర‌కు ప్ర‌యాణించే పర్యాట‌కుల‌కు బోటు రైడింగ్ ఒక ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌న్నారు.

రిజ‌ర్వాయ‌రు అవ‌త‌ల వున్న దిగువ కొండ‌ప‌ర్త గ్రామ గిరిజ‌నుల కోసం అట‌వీశాఖ ఆధ్వ‌ర్యంలో బోటు సౌక‌ర్యాన్ని కూడా త్వ‌ర‌లోనే పున‌రుద్ద‌రించేందుకు చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని మంత్రి వెల్ల‌డించారు.

ప్రాజెక్టుకు గొర్రిపాటి బుచ్చి అప్పారావు పేరుతో ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ ఇచ్చిన రోజే ప‌ర్యాట‌క అభివృద్ధికి నాంది ప‌ల‌క‌డం ఎంతో ఆనంద‌దాయ‌క‌మ‌ని మంత్రి చెప్పారు. తాటిపూడి ప్రాజెక్టు యీ ప్రాంతానికి రావ‌డంలో స్వ‌ర్గీయ బుచ్చి అప్పారావు కృషి ఎంతో వుంద‌న్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ప్ర‌భుత్వానికి గ్యాప్ ఫండింగ్ వ‌చ్చిన‌పుడు సామాజికంగా నిధుల స‌మీక‌ర‌ణ చేప‌ట్ట‌డం ద్వారా ఆ లోటును పూడ్చి ప్రాజెక్టును సుసాధ్యం చేయ‌డంలో తోడ్పాటు అందించార‌ని చెప్పారు.

విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే అదితి గ‌జ‌ప‌తి మాట్లాడుతూ ప‌ర్యాట‌క అభివృద్ధిని ప్రోత్స‌హించ‌డంతోపాటు స్థానికుల‌కు ఉద్యోగ‌వ‌కాశాలు క‌ల్పించేలా ప్రాజెక్టును రూపొందించ‌డం యీ ప్రాంతానికి ఎంతో ప్ర‌యోజ‌న‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు.

తూర్పుకాపు కార్పొరేష‌న్ చైర్ ప‌ర్స‌న్ పాల‌వ‌ల‌స య‌శ‌స్విని మాట్లాడుతూ భ‌ద్రాచ‌లం ప్రాంతాన్ని మ‌రిపించే రీతిలో ఇక్క‌డ రిజ‌ర్వాయ‌రులో ప‌ర్యాట‌కుల‌కు వ‌స‌తులు క‌ల్పించ‌డంపై హ‌ర్షం వ్య‌క్తంచేశారు. జిల్లాలో ఇటువంటి రిజ‌ర్వాయ‌రు వున్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్టు చెప్పారు.

అడ్వెంచ‌ర్ వాట‌ర్ స్పోర్ట్స్‌లో భాగంగా ప‌ర్యాట‌కుల భ‌ద్ర‌త‌కు అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని నిర్వాహ‌క సంస్థ వాట‌ర్ స్పోర్ట్స్ సింపుల్ కార్య‌నిర్వహ‌ణ అధికారి జి.పాపారావు చెప్పారు. అమెరికాలో వాట‌ర్ స్పోర్ట్స్ నిర్వ‌హ‌ణలో వున్న అనుభ‌వంతో తెలంగాణ‌, ఒడిశా, ఏపిలో త‌మ సంస్థ ఈ రంగంలో ప‌లు ప్రాజెక్టులు నిర్వ‌హిస్తోంద‌న్నారు. ప‌ర్యాట‌కుల భ‌ద్ర‌త కోసం లైఫ్ బ్యాగ్స్‌, లైఫ్ జాకెట్స్ త‌దిత‌ర భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌న్నీ చేప‌డుతున్న‌ట్టు చెప్పారు. నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాట‌ర్ స్పోర్ట్స్ పేర్కొన్న ప్ర‌మాణాల మేర‌కు ఆ సంస్థ నుంచి లైసెన్స్ పొందిన వారినే నియ‌మించామ‌న్నారు. రెండు సీట్లు గ‌ల బోట్లు రెండు, నాలుగు సీట్లు గ‌ల పెడ‌ల్‌ బోటు ఒక‌టి, ఐదు సీట్ల బోటు ఒక‌టి, 10 సీట్లు గ‌ల బోటు ఒక‌టి, 16 సీట్ల వాట‌ర్ ట్యాక్సీ ఒక‌టి ఇక్క‌డ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

ప‌ర్యాట‌కుల కోసం ప్ర‌తి రోజు ఉద‌యం 9 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు బోట్ల‌లో ప‌ర్య‌టించే అవ‌కాశం వుంటుంద‌ని చెప్పారు. బోటును బ‌ట్టి రూ.100, రూ.150, రూ.200గా టికెట్ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించామ‌న్నారు.

విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 03 ః    రాష్ట్రంలో ర‌హ‌దారులు, త్రాగునీరు, విద్యుత్ మొద‌ల‌గు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వ...
08/01/2025

విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 03 ః రాష్ట్రంలో ర‌హ‌దారులు, త్రాగునీరు, విద్యుత్ మొద‌ల‌గు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేస్తోంద‌ని, ఎంఎస్ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్య‌వ‌హారాల శాఖామంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. మౌలిక స‌దుపాయాల విష‌యంలో ఈ ఆరునెల‌ల పాల‌న‌లో అద్భుత ఫ‌లితాల‌ను సాధించామ‌ని చెప్పారు. అభివృద్దితోపాటు సంక్షేమానికి కూడా ప్రాధాన్య‌త‌నిస్తూ ముందుకు వెళ్తున్నామ‌ని అన్నారు. స్థానిక సోనియాన‌గ‌ర్‌లో సుమారు రూ.5.19 కోట్ల ఖ‌ర్చుతో నిర్మించిన 33/11 కెవి విద్యుత్ స‌బ్‌స్టేష‌న్‌ను శుక్ర‌వారం మంత్రి కొండ‌ప‌ల్లి ప్రారంభించారు.



ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీ‌నివాస్ మాట్లాడుతూ, అభివృద్దికి విద్యుత్ అత్యంత కీల‌క‌మ‌ని పేర్కొన్నారు. గ‌త టిడిపి ప్ర‌భుత్వ హ‌యాంలో సుమారు 7000 మెగావాట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ముఖ్య‌మంత్రి చంద్రాబాబు ఒప్పందం చేసుకుంటే, ఆ త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన వైకాపా ప్ర‌భుత్వం ఆ ఒప్పందాన్ని ర‌ద్దుచేసి, రాష్ట్రాన్ని విద్యుత్ లోటులోకి నెట్టింద‌ని చెప్పారు. దీనివల్లే గ‌త రెండేళ్లూ విప‌రీతంగా విద్యుత్ కోత‌లు పెరిగిపోయాయ‌న్నారు. ఆర్ఈసి నుంచి రుణం తీసుకొని విద్యుత్ రంగాన్ని బ‌లోపేతం చేసే అవ‌కాశం ఉన్నా, అప్ప‌టి ప్ర‌భుత్వం దృష్టిపెట్ట‌కుండా పూర్తిగా నిర్వీర్యం చేసింద‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వ నిర్వాకాల‌వ‌ల్ల వినియోగ‌దారుల‌పై భారాలు ప‌డ్డాయ‌ని, విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయ‌ని అన్నారు. ప‌రిశ్ర‌మ‌ల‌పైనా విద్యుత్ భారం విప‌రీతంగా పెరిగింద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే విద్యుత్ రంగంలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు కృషి చేస్తోంద‌ని చెప్పారు. ఈ ఆరునెల‌ల్లోనే కొత్త‌గా ఎంఓయు చేసుకోవ‌డ‌మే కాకుండా గ్రీన్ ప‌వ‌ర్‌, సోలార్ ప‌వ‌ర్‌పై దృష్టి సారించిన‌ట్లు తెలిపారు. అంతేకాకుండా విద్యుత్ స‌బ్‌స్టేష‌న్ల నిర్మాణాన్ని చేప‌ట్టామ‌న్నారు. కేవ‌లం విద్యుత్‌ రంగంలోనే కాకుండా ర‌హ‌దారులు నిర్మిస్తున్నామ‌ని, త్రాగునీటి స‌దుపాయం క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. పోల‌వ‌రం శ‌ర‌వేగంగా నిర్మాణం జ‌రుగుతోంద‌ని, సుమారు రూ.80వేల కోట్ల ఖ‌ర్చుతో పెన్నా నీటిని రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించేందుకు ప్ర‌తిపాద‌న‌లు చేస్తున్నార‌ని మంత్రి తెలిపారు.



విజ‌య‌న‌గ‌రం ఎంఎల్ఏ పూస‌పాటి అదితీ విజ‌య‌ల‌క్ష్మి గ‌జ‌ప‌తిరాజు మాట్లాడుతూ, సోనియాన‌గ‌ర్‌లో నిర్మించిన ఈ స‌బ్‌స్టేష‌న్ వ‌ల్ల టిడ్కో కాల‌నీతోపాటు, వైఎస్ఆర్‌న‌గ‌ర్‌, గాజుల‌రేగ త‌దిత‌ర ప్రాంతాల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని చెప్పారు. గ‌త టిడిపి ప్ర‌భుత్వ హాయంలో వేణుగోపాల‌పురం వ‌ద్ద 220 కెవి స‌బ్‌స్టేష‌న్ మంజూర‌య్యింద‌ని, ఆ త‌రువాత వ‌చ్చిన వైకాపా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోకుండా ప్ర‌క్క‌న ప‌డేసింద‌ని చెప్పారు. సుమారు రూ.200 కోట్లు ఖ‌ర్చు అయ్యే ఈ స‌బ్‌స్టేష‌న్‌కు ఇటీవ‌లే త‌మ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింద‌ని చెప్పారు. ఇది పూర్త‌యితే విజ‌య‌న‌గ‌రం, గ‌జ‌ప‌తిన‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప్ర‌యోజనం చేకూరుతుంద‌ని, భోగాపురం విమానాశ్ర‌యానికి బ్యాక‌ప్‌గా ప‌నిచేయ‌డ‌మే కాకుండా జిల్లాలో పారిశ్రామికాభివృద్దికి ప్ర‌యోజం చేకూరుతుంద‌ని చెప్పారు.
రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ పాల‌వ‌ల‌స య‌శ‌స్వి, ఎపిఈపిడిసిఎల్ సూప‌రింటిండెంట్ ఇంజ‌నీర్ ఎం.ల‌క్ష్మ‌ణ‌రావు మాట్లాడారు. కార్య‌క్ర‌మంలో ఈఈలు పి.త్రినాధ‌రావు, పి.హ‌రి, ఎడిఈలు, డిఈలు, ప‌లువురు కూట‌మి నాయ‌కులు పాల్గొన్నారు.

విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 02 ః       ఎపి టిడ్కో కాల‌నీల్లో వీలైనంత త్వ‌ర‌గా అన్ని ర‌కాల మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తామ‌ని జ...
08/01/2025

విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 02 ః ఎపి టిడ్కో కాల‌నీల్లో వీలైనంత త్వ‌ర‌గా అన్ని ర‌కాల మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ చెప్పారు. విజ‌య‌న‌గ‌రం ఎంఎల్ఏ పూస‌పాటి అదితి విజ‌య‌ల‌క్ష్మి గ‌జ‌ప‌తిరాజుతో క‌లిసి ఆయ‌న గురువారం టిడ్కో కాల‌నీల‌ను ప‌రిశీలించారు.

ముందుగా సోనియా న‌గ‌ర్ టిడ్కో కాల‌నీని క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. విద్యుత్ స‌దుపాయం, రోడ్లు, త్రాగునీటి వ‌స‌తుల గురించి టిడ్కో, మున్సిప‌ల్ అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇక్క‌డ దాదాపు 90 శాతం మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న ప‌నులు పూర్త‌య్యాయ‌ని అధికారులు చెప్పారు. సుమారు 411 ఇళ్ల‌కు విద్యుత్ సదుపాయం క‌ల్పించామ‌న్నారు. ల‌బ్దిదారుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. త‌క్ష‌ణ‌మే వీధిలైట్లు వేయాల‌ని, ఇళ్ల‌చుట్టూ ప్ర‌హ‌రీగోడ నిర్మించి, ఆర్చ్‌ను నిర్మించాల‌ని ఆదేశించారు. కాల‌నీలో దొంగ‌త‌నాల నివార‌ణ‌కు పోలీసు అవుట్‌పోస్టును ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించేందుకు మొక్క‌ల‌ను నాటాల‌న్నారు. ప్ర‌తీ ఇంటికీ కుళాయి క‌న‌క్ష‌న్ వేయాల‌ని, నెలాఖ‌రులోగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఈ నెలాఖ‌రుకు ల‌బ్దిదారుల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించాల‌ని, ఫిబ్ర‌వ‌రి మొదటిక‌ల్లా ల‌బ్దిదారులంతా ఇళ్ల‌లో నివాసం ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

సారిప‌ల్లి టిడ్కో కాల‌నీలోని ఇళ్ల‌ను క‌లెక్ట‌ర్‌, ఎంఎల్ఏ ప‌రిశీలించారు. ఇక్క‌డ 2880 ఇళ్ల‌ను నిర్మించారు. ల‌బ్దిదారుల‌తో మాట్లాడి అక్క‌డి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. ఈ కాల‌నీలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు సుమారు రూ.19కోట్ల‌ను ప్ర‌భుత్వం మంజూరు చేసింద‌ని, దానిలో ఇప్ప‌టివ‌ర‌కు రూ.11 కోట్లు వ‌ర‌కు ఖ‌ర్చు చేసి ప‌నుల‌ను పూర్తి చేశామ‌ని తెలిపారు. అప్రోచ్ రోడ్డు, సిసి రోడ్డు, రిటైనింగ్ వాల్ నిర్మాణం కొంత‌ పెండింగ్‌లో ఉంద‌ని అధికారులు క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు. గ‌త ఆరునెల‌లుగా ప‌నులు ఆపివేసినందుకు క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంట‌నే ప‌నుల‌ను ప్రారంభించాల‌ని, నెల రోజుల్లో అప్రోచ్ రోడ్డును, సుమారు 1.8 కిలోమీట‌ర్ల మేర పెండింగ్‌లో ఉన్న‌ త్రాగునీటి పైప్‌లైన్‌ను పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. త‌క్ష‌ణ‌మే వీధిదీపాల‌ను ఏర్పాటు చేయాల‌ని, రేప‌టినుంచే పారిశుధ్య ప‌నుల‌ను నిర్వ‌హించాల‌ని నెల్లిమ‌ర్ల మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ను ఆదేశించారు. ల‌బ్దిదారుల‌తో స‌మావేశం నిర్వ‌హించి పిఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం క్రింద ఇళ్ల‌కు సోలార్ విద్యుత్ క‌న‌క్ష‌న్ పెట్టుకొనేవిధంగా చైత‌న్య ప‌ర‌చాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

ఈ సంద‌ర్భంగా ఎంఎల్ఏ అదితి గ‌జ‌ప‌తిరాజు మీడియాతో మాట్లాడుతూ, టిడ్కో కాల‌నీల్లో వీలైనంత త‌ర్వ‌గా క‌నీస స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ల‌బ్దిదారులు నివాసం ఉండేవిధంగా మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తామ‌న్నారు. విద్యుత్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు స‌మీపంలో నిర్మించిన స‌బ్ స్టేష‌న్‌ను శుక్ర‌వార‌మే ప్రారంభిస్తామ‌ని చెప్పారు. మౌలిక స‌దుపాయాలు లేక‌పోవ‌డంతో ల‌బ్దిదారులు ఇళ్ల‌లోకి రాకుండా వేచి చూస్తున్నార‌ని, స‌దుపాయాల‌ను క‌ల్పించిన వెంట‌నే వారంద‌రినీ ఇళ్ల‌లోకి ర‌ప్పిస్తామ‌ని చెప్పారు. గ‌తంలో టిడిపి ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింద‌ని, ఆ త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన వైకాపా ప్ర‌భుత్వం దీనిని ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. గత ప్ర‌భుత్వ హ‌యాంలో ల‌బ్దిదారుల జాబితాల‌ను కూడా మార్చేశార‌ని, జాబితాల‌ను త‌నిఖీ చేసి, వారికి న్యాయం జ‌రిపేందుకు కృషి చేస్తామ‌ని చెప్పారు. పేర్ల‌ను తొలగించిన ల‌బ్దిదారులు అప్ప‌ట్లో త‌మ‌కు ప్రభుత్వం అంద‌జేసిన‌ మంజూరు ప‌త్రాల‌ను తీసుకొని త‌మ‌ను సంప్ర‌దించాల‌ని అదితి కోరారు.

విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 02 :కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన పి.ఎం.సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం ద్వారా జిల్లాలోని గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్...
08/01/2025

విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 02 :కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన పి.ఎం.సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం ద్వారా జిల్లాలోని గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంత‌ గృహాల్లో రాయితీపై సౌర‌విద్యుత్ యూనిట్ల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్స‌హించ‌నున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్ వెల్ల‌డించారు. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలోగా జిల్లాలోని 51వేల ఎస్‌.సి., ఎస్‌.టి. గృహాల్లో సౌర‌విద్యుత్ క‌నెక్ష‌న్లు ఏర్పాటుచేసే దిశగా డి.ఆర్‌.డి.ఏ., మెప్మా, మునిసిప‌ల్‌, విద్యుత్ పంపిణీ సంస్థ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని ఆదేశించారు. ఆయా వ‌ర్గాలకు చెందిన కుటుంబాల్లో సౌర‌విద్యుత్ వినియోగంవ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు, వారికి ఆదా అయ్యే విద్యుత్ ఛార్జీల మొత్తం తెలియ‌జేసి యూనిట్ల ఏర్పాటును ప్రోత్స‌హించాల‌న్నారు. జిల్లాస్థాయి పి.ఎం.సూర్య‌ఘ‌ర్ క‌మిటీ స‌మావేశం జిల్లా క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్ అధ్య‌క్ష‌త‌న గురువారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జ‌రిగింది.

రెండు కిలోవాట్ల సామ‌ర్ధ్యం గ‌ల సౌర‌విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసుకోవ‌డం ద్వారా ఒక్కో కుటుంబం ఏడాదికి రూ.20,000 విద్యుత్ ఛార్జీల బిల్లును ఆదా చేసుకోవ‌చ్చ‌న్నారు. రెండు కిలోవాట్ల సామ‌ర్ధ్యం గ‌ల యూనిట్ ఏర్పాటుపై పి.ఎం.సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం ద్వారా రూ.60 వేల రాయితీ ల‌భిస్తుంద‌న్నారు. ఎస్‌.సి, ఎస్‌.టి. ల‌బ్దిదారుల‌కు మండ‌ల‌, ప‌ట్ట‌ణ స‌మాఖ్య‌ల ద్వారా అవ‌స‌ర‌మైన మేర‌కు రుణాలు మంజూరు చేయాల‌ని మెప్మా, డి.ఆర్‌.డి.ఏ, మునిసిప‌ల్ అధికారుల‌ను ఆదేశించారు. ఇళ్ల పైక‌ప్పుపై స్థ‌లం వున్న వారిని గుర్తించి వారి ఇళ్ల‌లో ముందుగా ఈ యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారించాల‌న్నారు.

ఆద‌ర్శ సౌర‌విద్యుత్ గ్రామాలుగా జిల్లాలో ఆరు గ్రామాల‌ను ఎంపిక చేయ‌డం జ‌రిగింద‌ని, ఈ గ్రామాల్లో శ‌త‌శాతం గృహాల‌కు సౌర‌విద్యుత్ క‌నెక్ష‌న్లు ఏర్పాటు చేసేలా ప్రోత్స‌హిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. శ‌త‌శాతం గృహాలతో అత్య‌ధిక సౌర‌విద్యుత్ క‌నెక్ల‌న్లు గ‌ల గ్రామాలుగా ఎంపికైన గ్రామానికి రూ.1 కోటి రూపాయ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రోత్సాహ‌కంగా మంజూరు చేస్తుంద‌న్నారు. విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ ప‌రిధిలో జొన్న‌వ‌ల‌స‌, పూస‌పాటిరేగ ప‌రిధిలో రెల్లివ‌ల‌స‌, కొత్త‌వ‌ల‌స ప‌రిధిలో దేశ‌పాత్రునిపాలెం, రాజాం మండ‌లంలో బొద్దాం, గ‌జ‌ప‌తిన‌గ‌రంలో పురిటిపెంట‌, బొబ్బిలిలో పిరిడి గ్రామాల‌ను ఆద‌ర్శ గ్రామాలుగా ఎంపిక చేశామ‌ని వీటిలో శ‌త‌శాతం గృహాల సౌర విద్యుద్దీక‌ర‌ణ చేసిన గ్రామాన్ని ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఆద‌ర్శ గ్రామాల మ‌ధ్య పోటీ ఏర్ప‌డి పెద్ద ఎత్తున గృహాల్లో యూనిట్ల ఏర్పాటు జ‌ర‌గాల‌న్నారు.

ప‌ట్ట‌ణాల్లో అపార్ట్‌మెంట్ల‌లో పెద్ద ఎత్తున రూఫ్ టాప్ సౌర‌విద్యుత్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్స‌హించాల‌ని మునిసిప‌ల్‌, విద్యుత్ సంస్థ‌ల అధికారులు సంయుక్తంగా అపార్టుమెంట్ ల సంఘాల‌తో స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. యీ ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులోగా జిల్లాలోని ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో యూనిట్ల ఏర్పాటుకు యాప్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేయించాల‌ని ఆదేశించారు.

విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్‌.ఇ. ల‌క్ష్మ‌ణ‌రావు, బొబ్బిలి, రాజాం మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ లు, డి.ఆర్‌.డి.ఏ., మెప్మా అధికారులు పాల్గొన్నారు

విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 01  ః               జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్‌కు ప‌లువురు ఉన్న‌తాధికారులు, సిబ్...
08/01/2025

విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 01 ః
జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్‌కు ప‌లువురు ఉన్న‌తాధికారులు, సిబ్బంది నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. జిల్లా ఎస్పి వ‌కుల్ జిందాల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేతు మాధ‌వ‌న్‌, డిఆర్ఓ ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి, ఇత‌ర అధికారులు పెద్ద సంఖ్య‌లో బుధ‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు ఆఫీసుకు చేరుకొని శుభాకాంక్ష‌లు చెప్పారు. ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్, నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రచురించిన డైరీలు, కెలండర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

జెసి సేతుమాధ‌వ‌న్‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు
జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్.సేతు మాధ‌వ‌న్‌కు క‌లెక్ట‌రేట్‌లోని ఆయ‌న చాంబ‌ర్‌లో ప‌లువురు జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, సివిల్ స‌ప్ల‌యిస్ అధికారులు, తాసిల్దార్లు, క‌లెక్ట‌రేట్ కార్యాల‌య సిబ్బంది శుభాకాంక్ష‌లు చెప్పారు.

Address

VIZIANAGARAM
Vizianagaram
535003

Alerts

Be the first to know and let us send you an email when District Collector Vizianagaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to District Collector Vizianagaram:

Share