28/02/2026
✅ TDP is not a Political Party - It's a Social System
(ప్రతీ తెలుగుదేశం కార్యకర్త తప్పక చదవాలి)
చంద్రబాబు గారి కుటుంబానికి ఉన్న ఏకైక వ్యాపారం Heritage అని అందరికీ తెలిసిందే.. అందులోనూ అది ఒక Listed Company.. కాబట్టి Heritage విలువలో 41.3 శాతం మాత్రమే వీరి కుటుంబానిది కాగా.. 58.7 శాతం ఇన్వెస్టర్ల వాటాగా ఉంది.. Listed Company కావడంతో ఇందులో అవకతవకలు చేసే అవకాశం లేదు.. ప్రతీదీ చట్టపరమైన రెగ్యులేషన్స్ ప్రకారం నడవాల్సిందే..
ఇప్పుడు జగన్ రెడ్డి వ్యాపార సామ్రాజ్యం చూద్దాం - తల్లిని చెల్లిని తరిమేశారు కాబట్టి.. జగన్ రెడ్డి కుటుంబం అంటే కేవలం వారి భార్యాభర్తలు మాత్రమే... వారి వ్యాపారాలు ప్రాథమికంగా 4 రంగాల్లో విస్తరించి ఉన్నాయి..
◾A. మీడియా రంగం
1. జగతి పబ్లికేషన్స్ - సాక్షి పేపర్
2. ఇందిరా టెలివిజన్ - సాక్షి ఛానెల్
3. జనని Infra - సాక్షికి సంబంధించిన ఆఫీసులు కట్టడం మరియు maintainance కోసం
◾B. విద్యుత్ రంగం
4. సండూర్ పవర్ - కర్ణాటక - పేరు చూసి ఇది విద్యుత్తు ఉత్పత్తి చేసే కంపెనీ అని పోరబడకండి.. ఇక్కడ విద్యుత్ కోసం కేటాయించిన భూముల్లో Iron Ore mining చేస్తారు... వీళ్లకు 3000 కోట్ల రూపాయల సున్నపురాయి క్వారీలు కేటాయించినట్టు.. ఈ కంపెనీకి Mauritus దేశం నుండి 124 కోట్ల రూపాయలు నల్లడబ్బు తరలించినట్టు ED కనిపెట్టింది..
5. సరస్వతి పవర్ - అంధ్ర ప్రదేశ్ - ఇది కూడా ఇప్పటి దాకా ఒక్క యూనిట్ కరెంటు కూడా ఉత్పత్తి చేయలేదు.. పేరుకు చైనా నుండి సోలార్ ప్యానెల్స్ తెచ్చి అమ్ముతారు.. కానీ దీనికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1515.93 ఎకరాలు కేటాయించాడు రాజశేఖర్ రెడ్డి.. (అందులో 28.7 ఎకరాలు దళితుల అసైన్డ్ భూమి)..నిజానికి ఈ కంపెనీ డైరెక్టర్ గా విజయమ్మ ఉండేది.. ఈ కంపెనీ విషయంలోనే తన తల్లికి, చెల్లికి ఈ కంపెనీ ఆస్తుల్లో వాటా ఇవ్వడం కుదరదు అని జగన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు..
◾C. సిమెంట్ రంగం
6. భారతి సిమెంట్ - దీనికి కడపలో ఒక ప్లాంటు.. దానికి రెండింతల పెద్ద ప్లాంటు కర్ణాటకలో ఉన్నాయి.. 2024 ఎన్నికలలో ఘోరమైన ఓటమి తర్వాత జగన్ రెడ్డి బెంగళూరులోనే ఉండిపోయి.. ఈ సండూర్ పవర్, భారతీ సిమెంట్ కంపెనీల వ్యవహారాలు చూసుకుంటున్నాడు..
◾D. రియల్ ఎస్టేట్ రంగం
7. Classic Realty Private Ltd
8. Silicon Builders Private Ltd
9. Shalom Infrastructure
10. Capstone Infrastructure
11. Nivish Infrastructure
సరే 11 దగ్గర ఆపేద్దం..
👉👉 పైన వాటితో పాటు.. బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ లో గాలి జనార్ధన్ రెడ్డితో కలిపి జగన్ రెడ్డికి వాటాలు ఉండేవి.. కానీ 2018 లో అంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ కంపెనీకి ఇచ్చిన భూములు వెనక్కు తీసేసుకుంది.. దానితో పాటు.. చెన్నైలోని పాత సినిమా ప్రొడ్యూసర్ నాగి రెడ్డి (భారతి రెడ్డి తాత) కట్టిన విజయ హాస్పిటల్స్ లో కూడా భారతీ రెడ్డికి పుట్టింటి తరుపు నుండి వాటా ఉంది..
➡️ ఇది జగన్ రెడ్డి కుటుంబ వ్యాపార సామ్రాజ్యం.. వీటి విలువ ఎంత ఉంటుందో ఒక ఉదాహరణతో చెబుతాను.. జగన్ రెడ్డి కుటుంబంలో అగ్గి రాజేసిన సరస్వతి పవర్ కు గుంటూరు జిల్లాలో ఉన్న 1515.93 ఎకరాల భూముల మార్కెట్ విలువే.. దాదాపు 18,000 కోట్ల రూపాయలుగా ఉంది.. ఇక మిగతా కంపెనీల విలువ ఎంత ఉంటుందో.. రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర ఉన్న భూముల విలువ ఎంత ఉంటుందో.. మీరే ఊహించుకోండి.. .
మొత్తంలో గమ్మత్తు అయిన విషయం ఏంటంటే.. జగన్ రెడ్డి కుటుంబ వ్యాపారాల్లో.. ఒక్కటి కూడా Listed Company కాదు... దేశంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీలలో ఒకటైన భారతీ సిమెంట్ ను కూడా Listed Company చేయలేదు.. తన వ్యాపారాలు చట్టాల చట్రంలో ఇరుక్కోకుండా జగన్ రెడ్డి బానే ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు.. CBI కేసుల్లో జాప్యం జరగడానికి కూడా ఈ ముందు జాగ్రత్తే కారణం...
ఇన్ని లక్షల కోట్లకు అధిపతి అయినా.. జగన్ రెడ్డి.. పిల్లికి కూడా బిచ్చం పెట్టడు అనే సంగతి అందరికీ తెలిసిందే.. ప్రభుత్వ సొమ్ముని విచ్చలవిడిగా తన విలాసాలకు వాడుకోవడం, మధ్యమధ్యలో ప్రభుత్వ సొమ్ముతో చిన్న చిన్న దానాలు చేస్తూ.. తన సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప.. జగన్ రెడ్డి కనీసం కార్యకర్తల కుటుంబాల్లో ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా తన సొంత డబ్బు ఒక్క రూపాయి ఇచ్చి ఆదుకున్న సందర్భం లేదు.. తన పార్టీ కార్యక్రమాలకు, భారీ ర్యాలీలకు కూడా పార్టీ నాయకుల జేబులకు చిల్లు పెడతాడు తప్ప,, అతని జేబులో నుండి రూపాయి తియ్యడు.. అని వైసీపీ MLA టికెట్ ఆశావహులు బాధ పడటం అందరికీ తెలిసిందే...
ఇప్పుడు చంద్రబాబు గారి కుటుంబాన్ని చూద్దాం..
వీళ్లకు ఉన్న ఏకైక వ్యాపారం Heritage ద్వారా వచ్చిన ఆదాయంతో వీరు NTR Charitable Trust నడుపుతారు.. దానిద్వారా వీళ్ళు ఏమేమి చేస్తున్నారో చూద్దాం
బ్లడ్ బ్యాంకులు - హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి కేంద్రాలుగా 4 బ్లడ్ బ్యాంకులు నడుస్తాయి.. తలసేమియా వ్యాధితో బాధ పడుతున్న పిల్లల కోసం Specialized Transfusion Systems ను ఈ బ్లడ్ బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేశారు..
2️⃣ Medical Camps పెట్టి Medical Kits పంపిణీ చేయడం - సంవత్సరానికి కనీసం 300 చొప్పున ఇప్పటికీ 8000+ మెడికల్ క్యాంపుల ఏర్పాటు చేశారు..
3️⃣ NTR "విద్యా జ్యోతి" - దీని కింద ఇప్పటికీ 2113 మంది అనాథ పిల్లలకు KG నుండి PG దాకా ఉచిత చదువు అందించారు..
4️⃣ NTR "Model School" - దీని కింద 159 ప్రభుత్వ బడుల్లో మెరుగైన సౌకర్యాల కల్పన చేసారు.. ఇప్పుడు latest గా నారా లోకేష్,, నిడమర్రు ప్రభుత్వ పాఠశాలను ఇదే విధంగా దత్తత తీసుకుని, తమ సొంత డబ్బులతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేశారు..
5️⃣ NTR "విద్యా సేవ" - దీని కింద వివిధ వృత్తి విద్యా కోర్సుల కోసం స్పెషల్ కోచింగ్ క్లాసులు.. skill development కోర్సులు అందిస్తారు..
6️⃣ Excel Civils Academy - సివిల్ సర్వీసు పరీక్షల కోసం 7 సంవత్సరాల నుండి ఉచితంగా నడుపుతున్న Excel Civils Academy, దానికి అనుబంధంగా పోటీపరీక్షల కోసం ప్రత్యేక లైబ్రరీ ఫెసిలిటీ ఉపయోగించుకుని.. ఇప్పటికీ 120+ పైగా సివిల్స్ మరియు గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసులకు ఎన్నికయ్యారు..
7️⃣ కార్యకర్తల భీమా - తెలుగుదేశం కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద భీమా సౌకర్యం ఉంది.. తద్వారా కుటుంబ పెద్దను కోల్పోయిన ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులపాలు కాకుండా బయటపడగలిగాయి.. భీమాతో పాటు చనిపోయిన కార్యకర్తల బిడ్డలను దత్తత తీసుకుని వాళ్ల చదువులకు కూడా NTR ట్రస్టు బాధ్యత తీసుకుంటుంది..
బసవ తారకం కాన్సర్ హాస్పటల్ - రూపాయి లాభం కూడా సంపాదించని ఈ ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ ను బాలకృష్ణ గారు నడుపుతున్నారు.. ఈ హాస్పిటల్ ద్వారా కొన్ని వేల ప్రాణాలు క్యాన్సర్ కు బలి కాకుండా కాపాడగలిగారు..
చిట్టితల్లి పునర్వీక వ్యాక్సిన్ కోసం 6 కోట్లు ఇవ్వడం, నిడమర్రు పాఠశాలను 10 కోట్ల సొంత డబ్బుతో అభివృద్ధి చేయడం లాంటి బాధ్యతలు తీసుకుంటూ లోకేష్ గారు ఆ కుటుంబ సాంప్రదాయాన్నే కొనసాగిస్తున్నారు..
అందుకే అంటుంది.. తెలుగుదేశం అనేది ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు... ఒక బాధ్యత గల సామాజిక వ్యవస్థ.. తెలుగుదేశానికి మాత్రమే.. కరుడుగట్టిన కార్యకర్తలు ఉండడం వెనుక.. ఇంతటి వ్యవస్థీకృత కృషి ఉంది..
✍️✍️ చైతన్య కూరపాటి