22/04/2025
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు విశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, పార్టీలకు అతీతంగా ప్రతి కార్పొరేటర్ కు సమదృష్టితో మనస్ఫూర్తిగా నిధులు కేటాయిస్తూ విశాఖ అభివృద్ధికి కృషి చేశానని, ఈ 4 సంవత్సరాలలో ఎంతో జటిలమైన సమస్యలను పరిష్కరించామని , కరోనా వ్యాప్తి సమయంలో ప్రజలకు అండగా ఉంటూ వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపామన్నారు.ముఖ్యంగా అడివి వరం నుండి గోశాల రోడ్డు, జగదాంబ నుండి పూర్ణ మార్కెట్ పాత పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్లు, "బస్ బే" లు, జంక్షన్ల అభివృద్ధి మొదలైనవి చేపట్టడం జరిగిందని. నేడు నాకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి కార్పొరేటర్ కు తెలుసని వారికి నిధులు కేటాయింపులో ఎటువంటి వివక్షతను చూపలేదని అలాగే నాలుగు సంవత్సరాల ఒక నెలపాటు మేయర్ క్యాంప్ కార్యాలయం నా సొంత భవనాన్ని వినియోగించుకున్నందున కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని , అలాగే విశాఖ నగరం మరో ఢిల్లీ కాకూడదని ఉద్దేశంతో విశాఖ నగరం కాలుష్యానికి గురికాకుండా, ప్రజల ఆరోగ్యమే పరమావధిగా భావిస్తూ ప్రతి సోమవారం తమ సొంత వాహనాన్ని వదిలి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో జీవీఎంసీ కి రావడంతో పాటు జీవీఎంసీ ఉద్యోగులను కూడా వారి వాహనాలను వదిలి వచ్చేలా అవగాహన కల్పించామన్నారు. జీవీఎంసీ మేయర్ గా తమ క్యాంపు కార్యాలయంలో జీవీఎంసీ ఏర్పాటుచేసిన ప్రతి వస్తువును తిరిగి జీవీఎంసీకి అప్పజెప్పడం జరుగుతుందని ఆమె తెలిపారు. విశాఖ నగర అభివృద్ధికి కృషి చేస్తూ,నగర ప్రజలకు ఎన్నో సేవలను అందించిన సంతృప్తిని ఆశ్వాదించే భాగ్యానికి నోచుకోకుండా , అన్ని వార్డుల్లో కార్పొరేటర్లకు వార్డు అభివృద్ధి పనులను మేయర్ గా మంజూరు చేసిన నాకు నేడు మేయరు పై అవిశ్వాస తీర్మానం పెట్టిన తీరు ఎంతో కలచి వేసిందని, ఆవేదనకు లోనయ్యానని ఆమె విషాదాన్ని వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో యాదవ కులానికి చెందిన బీసీ మహిళనైన నేను విశాఖ నగర మేయర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి స్వచ్ఛ సర్వేక్షన్ లో ఎన్నో ర్యాంకులు సాధించామని అందుకు ఇప్పటివరకు సహకరించిన నగర ప్రజలకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ,కార్పొరేటర్లకు పార్టీ పెద్దలకు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి, వైఎస్ఆర్సిపి నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వారికి, మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ వారికి,మాజీ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ వారికి, కురసాల కన్నబాబు వారికి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు,మరీ ముఖ్యంగా నా విశాఖ నగర ప్రజలుకు ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుతూ మేయర్ గా సెలవు తీసు కుంటున్నాని నగర మేయర్ శనివారం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.