29/05/2026
వినుకొండలో దళిత క్రైస్తవుల హక్కుల సాధన రాష్ట్రస్థాయి సదస్సు – ముఖ్య అతిథిగా బోయపాటి రామాంజనేయులు
ఈరోజు వినుకొండలోని గంగినేని కళ్యాణ మండపంలో నిర్వహించిన దళిత క్రైస్తవుల హక్కుల సాధన రాష్ట్రస్థాయి సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడడం జరిగింది.
దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, ఎస్సీ హోదా, సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాలు కల్పించాలనే డిమాండ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారి సమస్యలు, హక్కుల పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళిత క్రైస్తవుల పట్ల అనుసరిస్తున్న వివక్షపూరిత విధానాలను ఖండించాను. దళిత క్రైస్తవులకు న్యాయం జరగాలంటే, వారి రాజ్యాంగ హక్కులు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి స్వతంత్ర రాజకీయ అస్తిత్వం లేదని, “ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అంటే బాబు – జగన్ – పవన్‌ల రాజకీయ కలయికే” అని విమర్శించారు.
దళిత క్రైస్తవుల న్యాయమైన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది. వారి స్వరం ప్రభుత్వాలకు వినిపించే వరకు, వారికి పూర్తి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది.