15/05/2021
జోహార్ దాక్టర్ ప్రవీణ్‌కుమార్ జోహార్
నీ సేవలు వెలకట్టలేనివి
మంచికి, మానవత్వానికి నిలువెత్తు రూపం
ఏలూరు : మంచితనానికి నిలువెత్తు రూపం అతను.. మొహంపై నిత్యం చిరునవ్వుతో అందరినీ ప్రేమగా పలకరించే వ్యక్తి అకస్మాత్తుగా
కోవిడ్ బారిన పడటంతో తన జీవన ప్రయాణాన్ని మధ్యలోనే ముగించాడు. ఎంబిబియస్ లాంటి ఉన్నత చదువులు చదువుకుని 5అంకెల
జీతం అందుకునే అవకాశం ఉన్నప్పటికీ పేదప్రజలకు తనవంతు సేవచేయాలనే ఉద్దేశ్యంతో పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం
పిహెచ్‌సిలో వైద్యుడిగా తన 'సేవలందించాడు. కోవిడ్‌తో ఒక ్రైవేట్ హాస్పిటల్‌లో తాను వైద్యం తీసుకుంటూనే నలుగురు కోవిడ్
బాధితులకు ఫోన్‌లోనే మెడిసిన్ చెబుతూ వాళ్ళు నెగిటివ్ వచ్చేందుకు కృషిచేసిన మహోన్నత వ్యక్తి. వృత్తిమీద తనకున్న నిబద్దతను
తెలియజేసేందుకు ఈ సంఘటన చిన్న ఉదాహరణ మాత్రమే. నేను బాగుండాలి..నా చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి అని అనుకునేవారు
కరువైన ప్రస్తుత సమాజంలో ఎం.బి.బి.యస్ చదివి పేదలకు అందుబాటులో ఉంటూ పల్లెటూళ్ళలో వైద్యం చేయాలనే సత్సంకల్పంతో
ఎంతో ఉన్నతవంతమైన జీతాలు, మెరుగైన సౌకర్యాలు కలిగిన జీవితాన్ని వదులుకుని నిరుపేదల ఆరోగ్యం కోసం ఆలోచించి ఒక
పిహెచ్‌సిలో వైద్యాన్ని అందిస్తూ ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచిన డాక్టర్ ప్రవీణ్‌కుమార్ కోవిడ్ బారిన పడి తనువు చాలించడంతో
తను పనిచేసిన గ్రామంలోని ప్రజలు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. గతేడాది కరోనా కరాళనృత్యం చేసిన తరుణంలో
కూడా తన అన్నయ్య పెద్దిరెడ్డి ప్రదీప్‌తో కలిసి అనేక 'సేవకార్యక్రమాలు 70రోజులుగా పైగా చేసాడు. పేదలకు కూరగాయలు పంపిణీ,
నిత్యం 3800 మందికి ఉచిత భోజనాలు అందించిన సేవాగుణం కలిగిన వ్యక్తి దాక్టర్ ప్రవీణ్‌కుమార్. దైవభక్తి మెండుగా ఉన్న ప్రవీణ్
కష్టం అనుకుంటూ వచ్చిన ఎవరికైనా తనవంతు సహాయ, సహకారాలు అందించేవాడు. తనచుట్టూ ఉన్నవాళ్ళందరూ ఎప్పుడూ ఆనందంగా
ఉండాలనేదే ఆయన ఆశయం.
మంచి ర్యాంకు వరించినా...పిహెచ్‌సి వైద్యుడిగా...
ఏలూరుకు చెందిన పెద్దిరెడ్డి ప్రవీణ్ కర్టాటకలోని రాజీవ్‌గాంధీ యూనివర్శిటీలో 2015 అక్టోబర్‌లో ఎంబిబియస్ పూర్తిచేశాడు. ఆ
తరువాత ఎవరైనా అయితే ఉన్నత చదువులకు వెళ్లి ఎంఎస్ చేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టాలనుకుంటారు. కానీ ప్రవీణ్‌మాత్రం చిన్ననాటి
నుంచి పేదలకు సేవచేయాలని తలంపుతో ఉన్నాడు. ఈ మేరకు తల్లిదండ్రులు పెద్దిరెడ్డి వెంకటరమణ, నాగవెంకటలక్ష్మీల అనుమతితో
ప్రభుత్వ ఆరోగ్యకేంద్రం ద్వారా 'సేవచేసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. మంచి ర్యాంకు ఉండటంతో వెంకట్రామన్నగూడెం ప్రాథమిక
ఆరోగ్యకేంద్రం వైద్యుడిగా పిలుపువచ్చింది. దీంతో వెంటనే ఏమీ ఆలోచించకుండా వైద్యుడిగా చేరి సేవలందించారు. విఆర్ గూడెం
ఆసుపత్రిలో రోజుకు 50మంది కూడా పేషంట్లు రాని పరిస్థితి. అయితే ప్రవీణ్ వచ్చిన తరువాత ఓపిని పెంచడానికి తన శాయశక్తులా
ప్రయత్నించాడు. రెండునెలల్లోనే ఆ సంఖ్యను 180కి పెంచాడు. డెలివరీలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు పెంచాడు. దీంతో
జనాభాదినోత్సవం సందర్భంగా ఉత్తమ పిహెచ్‌సిగా వెంకట్రామన్నగూడెం నిలిచింది. అంతేకాకుండా ఉత్తమ వైద్యాధికారిగా కూడా
అవార్డు అందుకున్నాడు.
డాక్టర్ ప్రవీణ్‌కుమార్ మాటల్లోనే :
నా చిన్ననాటి నుంచి బయట ప్రపంచం తెలియకుండానే పెరిగాను, కళాశాల వయసులో శిబిరాలకు వెళ్లినప్పుడు పేద ప్రజలు పడే
అవస్థలు చూసి చలించిపోయా. అప్పుడు నా పాకెట్ మనీ పెట్టి కొంతసాయం చేయడం ప్రారంభించా. వైద్యవృత్తి ఎంచుకున్నప్పుడు పేద
ప్రజలకు సేవచేయాలని భావించా. అందుకే ఎంబిబియస్ పూర్తికాగానే వేరే ఆలోచన లేకుండా ప్రభుత్వ వైద్యుడిగా దరఖాస్తు చేసుకున్నా.
ఇప్పుడు నేను చేస్తున్న సేవ నాకు ఎంతో ఆత్మ సంతృప్తి ఇస్తోంది. ఇది కొన్ని కోట్లుపోసినా రాని ఆనందం అని అనేవారు.
Miss u tamudu
Drkeshava S S Praveen