Devineni Avinash

Devineni Avinash Vijayawada East Constituency Incharge,YSRCP || YSRCP President NTR Dist.

కూటమి ప్రభుత్వానికి "వెన్నుపోటుకు రెండేళ్లు"కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ప్రజలకు ఇచ్చ...
03/06/2026

కూటమి ప్రభుత్వానికి "వెన్నుపోటుకు రెండేళ్లు"

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయకపోవడం, సూపర్ సిక్స్ హామీలను విస్మరించడాన్ని నిరసిస్తూ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా క్రింది కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.

జూన్ 4వ తేదీ

మండల కేంద్రాలలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీలు, బాండ్ల ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన కార్యక్రమాలు.

ఇట్లు,
వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం-ఎన్టీఆర్ జిల్లా

కూటమి ప్రభుత్వానికి "వెన్నుపోటుకు రెండేళ్లు"కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ప్రజలకు ఇచ్చ...
03/06/2026

కూటమి ప్రభుత్వానికి "వెన్నుపోటుకు రెండేళ్లు"

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయకపోవడం, సూపర్ సిక్స్ హామీలను విస్మరించడాన్ని నిరసిస్తూ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా క్రింది కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.

📌 జూన్ 4వ తేదీ

మండల కేంద్రాలలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీలు, బాండ్ల ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన కార్యక్రమాలు.

📌 జూన్ 8 లేదా 9వ తేదీ

కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా ఇండోర్ మీటింగ్ నిర్వహణ.

మీటింగ్ ప్రారంభానికి ముందు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన వ్యక్తీకరణ.

📌 జూన్ 12వ తేదీ

నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు.

ఈ కార్యక్రమాలను
పార్టీ శ్రేణులు అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుతున్నాము.

ఇట్లు,
వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం-ఎన్టీఆర్ జిల్లా

*ప్రెస్ నోట్-03-06-2026**విజయవాడ**వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం – ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ...
03/06/2026

*ప్రెస్ నోట్-03-06-2026*
*విజయవాడ*

*వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం – ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు*

ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ గారు పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టనున్న "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, టీడీపీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అనంతరం "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను దేవినేని అవినాష్ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, జూన్ 8 లేదా 9న ఇండోర్ సమావేశాలు, జూన్ 12న భారీ ర్యాలీలను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమాల ద్వారా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సమస్యలపై పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు,మాజీ ఫ్లోర్ లిడర్, రాష్ట్ర కార్యదర్శిలు,జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు,మాజీ కార్పొరేటర్లు,డివిజన్ ప్రెసిడెంట్లు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు, మహిళ నాయకులు పాల్గొన్నారు.

02/06/2026

🛑విజయవాడలో ఉద్రిక్తత..

నీటి తరలింపుపై వైఎస్ఆర్ సీపీ నేత దేవినేని అవినాష్ ఆందోళన 🔥

గుణదల పడవలరేవు సెంటర్ వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యే తాగునీటిని పక్కదారికి తరలిస్తున్నాని ఆరోపిస్తూ వైసీపీ నేత తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్య లో స్థానికులు ఆందోళన చేపట్టారు. నీటి తరలింపు కోసం ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్ పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పైప్ లైన్ కోసం తవ్విన గోతిలోకి దిగి నిరసన తెలియజేసిన వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి అవినాష్ గారు 💥

*ప్రెస్ నోట్-02-06-2026**విజయవాడ*.*చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా వైసీ...
02/06/2026

*ప్రెస్ నోట్-02-06-2026*
*విజయవాడ*.

*చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాసు,నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ,రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు మరియు రాష్ట్ర,జిల్లా నియోజకవర్గ స్థాయి పదవుల్లో ఉన్న నాయకులు,మాజీ కార్పొరేటర్లు,డివిజన్ ప్రెసిడెంట్లు,ముఖ్య నేతలు*..

*జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ కామెంట్స్*

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు చేసిందేమీ లేదు

జగన్ కన్నా మంచి పాలన ఇస్తామని ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచరూ

ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు కార్యక్రమాలు చేపడతాం

మానిఫెస్టో దహన కార్యక్రమలు మండల,పట్టణ,జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తాం

కూటమి హాయంలో ఏ నష్టాలు జరిగాయో ప్రజలకు వివరిస్తాం

టిడిపి,జనసేన,బీజేపీ కి బుద్ధి వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం

కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ సొంతం

చంద్రబాబు పేరు ఎత్తితే గుర్తొచ్చేది వెన్నుపోటు

అప్పుడు NTR కి పొడిచారు,,ఇప్పుడు ప్రజలకు పొడిచారు

కులాలు,మతాలు,,టీటీడీ లడ్డు పేరుతో ఇంతకాలం రాజకీయం చేశారు

ప్రజలు అన్ని గమిస్తున్నారు,రేపు వైసీపీ అధికారంలోకి వచ్చే విధంగా ముందుకు వెళ్తాం

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు అందరూ పాల్గొనాలి

*ప్రెస్ నోట్-02-06-2026**విజయవాడ**కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం: గుణదల కొండ ప్రాంత ప్ర...
02/06/2026

*ప్రెస్ నోట్-02-06-2026*
*విజయవాడ*

*కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం: గుణదల కొండ ప్రాంత ప్రజల తాగునీటి హక్కుల రక్షణకై నీళ్ల గోతిలో దిగి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ధర్నా*

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలోని గుణదల కొండ ప్రాంత ప్రజల పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సెంట్రల్ నియోజకవర్గంలోని గద్దెవారి పొలాల పరిధిలో ఉన్న అపార్ట్‌మెంట్లు, భారీ కమర్షియల్ భవనాల ప్రయోజనాల కోసం గుణదల కొండ ప్రాంతానికి చెందాల్సిన తాగునీటిని దొంగిలించి తరలించేందుకు కూటమి ప్రభుత్వం నాయకులు, స్థానిక ఎమ్మెల్యే యత్నించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండ ప్రాంత ప్రజలతో కలిసి భారీ పోరాటానికి దిగారు.

*మంచి నీటిని దొంగిలిస్తున్న కూటమి ప్రభుత్వం*

గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో గుణదల కొండ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామని అవినాష్ పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా అనేక చర్యలు చేపట్టామని తెలిపారు.

అయితే నేడు కూటమి ప్రభుత్వం ప్రజలకు అందుతున్న నీటిని సైతం దొంగిలించి, అక్రమంగా గద్దెవారి పొలాలకు తరలిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యేకు కేవలం షో రాజకీయాలు, అబద్ధపు ప్రచారాలు, కుల రాజకీయాలు చేయడంపైనే ఆసక్తి ఉందని, ప్రజల సమస్యల పరిష్కారంపై శ్రద్ధ లేదని మండిపడ్డారు.

*పోలీసుల కాపలాతో ‘రెడ్ బుక్ రాజ్యాంగం’*

గత రెండు రోజులుగా గుణదల కొండ ప్రాంత ప్రజలు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, అధికారులను ప్రశ్నించి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా విస్మరించారని అవినాష్ విమర్శించారు. కేవలం షో మాస్టర్ల మాదిరిగా తిరగడం తప్ప ప్రజల బాధలను పట్టించుకునే నాథుడే లేడని అన్నారు.

తమ హక్కుల కోసం, తాగునీటి కోసం ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాంతియుతంగా పోరాటం చేస్తుంటే, కూటమి ప్రభుత్వం పోలీసులను కాపలా పెట్టి ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలు చేస్తూ బెదిరింపులకు దిగడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తామని, అరెస్టులు చేస్తామని భయపెట్టే ప్రయత్నాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగివచ్చిన అధికారులు – రాతపూర్వక హామీ*

గంగిరెద్దుల దిబ్బ, విజయనగర్ కాలనీ, క్రీస్తురాజపురం నుంచి చుట్టుగుంట సెంటర్ వరకు ఉన్న గుణదల కొండ ప్రాంతమంతా నీటి సమస్యతో అల్లాడిపోతున్న నేపథ్యంలో దేవినేని అవినాష్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనుకడుగు వేయకుండా నీళ్ల గోతిలో దిగి సుదీర్ఘ నిరసన చేపట్టారు.

దీంతో అధికారులు స్పందించి గుణదల కొండ ప్రాంత ప్రజలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, నీటి తరలింపును అడ్డుకుంటామని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) ఎస్‌ఈ ద్వారా రాతపూర్వక హామీ పత్రాన్ని అందజేశారు.

*అధికారులకు తుది హెచ్చరిక*

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, అధికారులు రాతపూర్వకంగా ఇచ్చిన హామీ ప్రకారం కొండ ప్రాంత ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకూడదని స్పష్టం చేశారు.

“మా ప్రాంత ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, తాగునీటి సమస్య తలెత్తినా గతంలో కంటే తీవ్రస్థాయిలో, నేరుగా మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడతాం” అని హెచ్చరించారు.

ఈ విజయం పూర్తిగా గుణదల కొండ ప్రాంత ప్రజలదేనని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పోరాట పటిమకు దక్కిన విజయమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా తూర్పు నియోజకవర్గ ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి.ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలాకుమారి మరియు డివిజన్ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

01/06/2026

Devineni Avinash fire on Fake DSC scam..

మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని ఎన్టీఆర్ జిల్లా యువజన వ...
01/06/2026

మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో రామా క్లాత్ షో రూమ్ నుండి కలెక్టర్ట్ వరుకు భారీ ర్యాలీ..

జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య గారి నాయకత్వంలో భారీగా పాల్గొన్న యువత,పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,మహిళా నాయకులు..

నిరసన ర్యాలీలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షలు దేవినేని అవినాష్ గారు,మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు,మొండితోక జగన్మోహన్ రావు గారు,తిరువూరు ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాసు గారు,జగ్గయ్యపేట ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వర రావు గారు మరియు వైస్సార్సీపీ శ్రేణులు..

డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించాలని జిల్లా కలెక్టర్‌ గారికి వినతిపత్రం అందజేసిన వైస్సార్సీపీ నేతలు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ,మండల,డివిజన్ స్థాయి పార్టీ హోదాల్లో ఉన్న నాయకులు,మాజీ కార్పొరేటర్లు,డివిజన్ అధ్యక్షులు,యువజన విభాగం నాయకులు,సోషల్ మీడియా నాయకులు,కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

The man for the big stage, the big occasion… the bigger the game, the greater the impact!” A season to remember, a dream...
31/05/2026

The man for the big stage, the big occasion… the bigger the game, the greater the impact!”

A season to remember, a dream finally realized! Congratulations to RCB on a historic IPL triumph.

To every fan who waited, believed, and stood by the team through the highs and lows — this victory is yours.


31/05/2026

*తూర్పు నియోజకవర్గ ప్రగతికి చిరునామా దేవినేని అవినాష్*

*విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గతంలో ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి కార్యక్రమాలు Y. S. Jagan Mohan Reddy గారి నాయకత్వంలో, Devineni Avinash గారి ఆధ్వర్యంలో అమలయ్యాయి. ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలు, చేపట్టిన అభివృద్ధి పనులే దీనికి నిదర్శనం. ఇది రాజకీయ ప్రచారం కాదు... జగమెరిగిన సత్యం*





Address

48/4/16, Ashok Garden, Gunadala
Vijayawada
520004

Website

Alerts

Be the first to know and let us send you an email when Devineni Avinash posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Devineni Avinash:

Share