CPM party penamaluru

Directions Website

CPM party penamaluru Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CPM party penamaluru, Political Party, Tadigadapa, penamaluru(MD), Vijayawada.

"విద్యుత్తు వినియోగదారుల ఐక్యవేదిక ".......విద్యుత్తు స్మార్ట్ మీటర్ల పై మరియు ట్రూ అప్ చార్జీలు పై అవగాహన కల్పించడం కొర...
27/07/2025

"విద్యుత్తు వినియోగదారుల ఐక్యవేదిక ".......విద్యుత్తు స్మార్ట్ మీటర్ల పై మరియు ట్రూ అప్ చార్జీలు పై అవగాహన కల్పించడం కొరకు ఏర్పాటుచేసిన ప్రజా సదస్సు లో మాట్లాడుతున్న నాయకులు........

27/07/2025

విద్యుత్ వినియోగదారుల ప్రజా ఐక్యవేదిక సభలో ఎం హరిబాబు గారు మాట్లాడుతూ.....

27/07/2025

పోరంకి కార్మికుల కార్యాలయం వద్ద "విద్యుత్తు వినియోగదారుల ప్రజా ఐక్యవేదిక" సభలో వై నరసింహారావు గారు మాట్లాడుతూ....

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పెనమలూరు మండలంలోని కార్మికులంతా కలిసి పోరంకి సెంటర్ నుండి తాడిగడప సెంటర్ వరకు ప్రదర్శనగా ర్యాల...
09/07/2025

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పెనమలూరు మండలంలోని కార్మికులంతా కలిసి పోరంకి సెంటర్ నుండి తాడిగడప సెంటర్ వరకు ప్రదర్శనగా ర్యాలీ చేయడం జరిగింది. తాడిగడపలో భారీ ఎత్తున కార్మికుల మధ్యలో బహిరంగ సభ జరిగింది.

విశాఖపట్నంలో “లా”కాలేజీలో చదివే విద్యార్థినిపై మాయ మాటలు చెప్పి ఆ “లా”కాలేజీలో “లా”చదివే యువకులు నలుగురు ఆవిడపై అత్యాచార...
26/11/2024

విశాఖపట్నంలో “లా”కాలేజీలో చదివే విద్యార్థినిపై మాయ మాటలు చెప్పి ఆ “లా”కాలేజీలో “లా”చదివే యువకులు నలుగురు ఆవిడపై అత్యాచారం చేయడం దుర్మార్గమని సిఐటియు ఆధ్వర్యంలో పోరంకి సెంటర్లో నిరసన కార్యక్రమం చేయడమైనది .ఈ కార్యక్రమం ఉద్దేశించి పెనమలూరు మండల సిఐటియు కార్యదర్శి ఉప్పాడ త్రిమూర్తులు మాట్లాడుతూ “ఆ నలుగురి నిందితులను కఠినంగా శిక్షించాలని,అలాగే ప్రభుత్వం కూడా స్పందించి ఆ బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని,అలాగే చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆడపిల్లల తల్లిదండ్రులు,ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయభ్రాంతులతో ఉంటున్నారని ,గత ప్రభుత్వం ‘లా అండ్ ఆర్డర్’ సరిగ్గా నడపడం లేదని,మా ప్రభుత్వం వస్తే ఆడపిల్లలకి పూర్తిగా రక్షణ కల్పిస్తామని అనేక సందర్భాల్లో చెప్పినారు. ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు,స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐటియు కార్మికుల తరపున,ఆడపిల్లల తల్లిదండ్రుల తరపున డిమాండ్ చేస్తుందన్నారు”.

విశాఖపట్నంలో లా కాలేజీ లో చదువుతున్నతోటి విద్యార్థులు నమ్మపలికి అత్యాచారం చేయడం.’లా’విద్యార్థికి కుటుంబానికి న్యాయం చేయా...
24/11/2024

విశాఖపట్నంలో లా కాలేజీ లో చదువుతున్నతోటి విద్యార్థులు నమ్మపలికి అత్యాచారం చేయడం.’లా’విద్యార్థికి కుటుంబానికి న్యాయం చేయాలని ఆ నలుగురు విద్యార్థుల్ని కఠినంగా శిక్షించాలని పెనమలూరు మండలం ఐద్వా మహిళా సంఘం మరియు డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలోపోరంకికార్మిక నగర్ 2కట్టమీద ప్రదర్శన చేసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెనమలూరు మండలం ఐద్వా మహిళా సంఘం కార్యదర్శి పుసులూరిపాతల లక్ష్మీ మాట్లాడుతూ మహిళల మీద అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని నాలుగు రోజులక్రితం గుంటూరు జిల్లాలో కూడా చిన్న పిల్లని పెద్ద వయస్సు గల ఆయన పాడు చేయడం అలాగే మూడు రోజుల క్రితం విశాఖపట్నంలో లా చదివే విద్యార్థిని తోటి విద్యార్థులు మాయమాటలు చెప్పి నలుగురు అత్యాచారం చేయడం దుర్మార్గమని వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నా అన్నారు. అలాగే పెనమలూరు మండలం సిఐటియు కార్యదర్శి. ఉప్పాడ త్రిమూర్తులు మాట్లాడుతూ విశాఖలో లా చదివే విద్యార్థి ని తోటి విద్యార్థులే అత్యాచారం చేసిన.వంశీని. ఆనంద్.జగదీష్ .రాజేష్. కఠినంగా శిక్షించాలని.గత ప్రభుత్వంలో ఆడపిల్లలుమిస్ అయ్యారని అత్యాచారాలు పెరిగినయని గంజాయి మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని అనేక సందర్భాలలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు,ఈరోజు ఒక మహిళ రాష్ట్రానికి హోం మంత్రిగా ఉన్నప్పటికీ ఇంకా అత్యాచారాలు పెరిగి పోతున్నాయని.ఆడపిల్ల తల్లిదండ్రులు ఎప్పుడు ఏం జరుగుతుందని ఆందోళనలో ఉన్నారు .తప్పు చేసిన వారిని కట్టినంగా శిక్షలు అమలు చేస్తే మరో వ్యక్తి ఇలాంటి తప్పులు చేయకుండా భయపడతారని అన్నారు .

నవంబర్ నెల 26వ తారీఖున జరిగే రైతులు కార్మికులు ర్యాలీ సభని జయప్రదం చేయాలని. పోరంకి లో కామ్రేడ్ మానికొండ సుబ్బారావు అండ్ ...
20/11/2024

నవంబర్ నెల 26వ తారీఖున జరిగే రైతులు కార్మికులు ర్యాలీ సభని జయప్రదం చేయాలని. పోరంకి లో కామ్రేడ్ మానికొండ సుబ్బారావు అండ్ సూర్యవతి గార్ల కార్మికుల కార్యాలయంలో కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిపి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది పెనమలూరు మండలం కౌలు రైతు సంఘం కార్యదర్శి మాదు నాగేశ్వరావు అధ్యక్షతన జరిగినది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కౌలు రైతుసంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు. మరియు సిపిఐ పార్టీ కృష్ణాజిల్లా నాయకులు మున్నంగి నరసింహారావు. పెనమలూరుమండల సిఐటియు కార్యదర్శి ఉప్పాడ త్రిమూర్తులు హాజరైనారు. పంచకర్ల రంగారావు గారు మాట్లాడుతూ రైతులు కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం రైతులు చిన్నచూపు చూస్తుందని రాష్ట్ర ప్రభుత్వం స్పాట్ మీటర్లు బిగించడానికి సిద్ధపడుతుందని .కార్మికులు సంపాదించుకున్న చట్టాల్ని నీరు కారుస్తున్నారని అందుచేత ఈనెల 26 తారీకు బందరులో ర్యాలీ సభకి కార్మికుల పెద్ద ఎత్తున రావాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ పార్టీ జిల్లా నాయకులు మున్నంగి నరసింహారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం బాదుడే బాదుడని ప్రచారం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు స్పాట్ మీటర్లని ఉచిత ఇసుక ఊసే లేదు జిల్లా తారు రోడ్లు కూడా టోల్ గేట్లుపెడతామని. చెప్పడం దారుణం అన్నారు. సిఐటియు పెనమలూరు మండల కార్యదర్శి ఉప్పాడ త్రిమూర్తులు మాట్లాడుతూ మన పూర్వీకులు అనేక పోరాటాల ఫలితంగా 44 చట్టాలు కార్మిక చట్టాలు సంపాదించుకుంటే వాటిలో కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ నాలుగు కోట్లుగా మార్చి వెన్నుముక లేని చట్టాలుగా చేశారని రైతులు కౌలు రైతులు రోజు పేపర్లో ఏదో మూల అప్పుల బాధతోను పంట నష్టం తోను చెనిపోతున్నారని కార్మికులకి కష్టం వచ్చినప్పుడు రైతులు అండగా ఉండాలని రైతులకి కష్టం వచ్చినప్పుడు కార్మికులు అండగా ఉండాలని కార్మికులు రైతులు కలిస్తే సాధించలేనిది ఏదీ లేదని. రేపు జరగబోయే 26 తారీకు పిలుపుని మన కార్మిక సంఘాలు రైతు సంఘాలు అన్ని కూడా అందుకొని పెద్ద ఎత్తున కార్మికులని కదిలించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో కార్మికులు గా మనం చురుకైన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.

పెనమలూరు మండలం 6వ .సిపిఎం పార్టీ మహాసభ యలమలకుదురులో కామ్రేడ్ ఎస్కే గాలీబిగారి నగర్ లో  జరిగినది. ముందుగా సీనియర్ కామ్రేడ...
18/11/2024

పెనమలూరు మండలం 6వ .సిపిఎం పార్టీ మహాసభ యలమలకుదురులో కామ్రేడ్ ఎస్కే గాలీబిగారి నగర్ లో జరిగినది. ముందుగా సీనియర్ కామ్రేడ్ నారీ వెంకట్రావు గారి చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరణ జరిగినది తదనంతరం. కృష్ణాజిల్లా పార్టీ కార్యదర్శి వై నరసింహారావు గారు సీతారాం ఏచూరి గారి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు కామ్రేడ్ SK గాలీబి చిత్రపటానికి పెనమలూరు మండలం ఐద్వా మహిళా సంఘం కార్యదర్శి పుసులూరి పాత లక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు .పార్టీ సభ్యులు అందరూ చిత్రపటానికి పూలేసి నివాళులు అర్పించారు. తదనంతరం కృష్ణాజిల్లా పార్టీకార్యదర్శి వై నరసింహారావు పార్టీ సభ్యుల్ని ఉద్దేశించి ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడి ప్రజా సమస్యల పైన మరిన్ని ఉద్యమాలు చేయాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. తదనంతరం ఈ మూడు సంవత్సరాల కాలంలో జరిగిన ఉద్యమాలు నివేదికని మాజీ పార్టీ కార్యదర్శి ఉప్పాడ త్రిమూర్తులు పార్టీ సభ్యులు ముందల చదివి వినిపించడం జరిగినది. నివేదికని ఏకగ్రీవంగా పార్టీ సభ్యులు ఆమోదించారు

రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రజాపోరుకేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సిపిఎం ...
14/11/2024

రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రజాపోరు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల ఎనిమిది నుంచి ప్రారంభమైన ప్రజాపోరులో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లు, మండల తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు.

Address

Tadigadapa, Penamaluru(MD)
Vijayawada
521137

Alerts

Be the first to know and let us send you an email when CPM party penamaluru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share