AP CPI

Call Directions Contact the organization

AP CPI social media
(1)

సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఎందుకు మౌనం?ప్రొబేషన్ పూర్తి చేయాలి2 ఏళ్ల ఇంక్రిమెంట్లు ఇవ్వాలిడిపార్ట్‌మెంటల్ టెస్ట...
26/09/2026

సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఎందుకు మౌనం?

ప్రొబేషన్ పూర్తి చేయాలి
2 ఏళ్ల ఇంక్రిమెంట్లు ఇవ్వాలి
డిపార్ట్‌మెంటల్ టెస్టులపై నిర్ణయం తీసుకోవాలి
SGSW ఉద్యోగులకు ప్రొబేషన్ ప్రకటించాలి
పదోన్నతులకు స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలి
స్వస్థల పోస్టింగులు కల్పించాలి

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి!

Eswaraiah Gujjula
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఉద్యోగుల సమస్యలు ఇకనైనా పరిష్కరించండి!🔴 ప్రొబేషన్ సమస్య పరిష్కారం🔴 పెండింగ్ ఇంక్రిమెంట్లు మంజూరు🔴 SGSW ఉద్యోగులకు ప్రొబే...
26/09/2026

ఉద్యోగుల సమస్యలు ఇకనైనా పరిష్కరించండి!

🔴 ప్రొబేషన్ సమస్య పరిష్కారం
🔴 పెండింగ్ ఇంక్రిమెంట్లు మంజూరు
🔴 SGSW ఉద్యోగులకు ప్రొబేషన్
🔴 పదోన్నతులపై స్పష్టత
🔴 స్వస్థల పోస్టింగులకు అవకాశం

చర్చలు జరిపి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి!

సచివాలయ ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలి!ప్రొబేషన్ • ఇంక్రిమెంట్లు • ప్రమోషన్లు • పోస్టింగులుపెండింగ్ సమస్యలకు ...
26/09/2026

సచివాలయ ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలి!

ప్రొబేషన్ • ఇంక్రిమెంట్లు • ప్రమోషన్లు • పోస్టింగులు

పెండింగ్ సమస్యలకు తక్షణ పరిష్కారం కావాలి!

సెప్టెంబర్ 27 | ధర్నా చౌక్ | విజయవాడ

26/09/2026

కడపలో ఈ నెల 27 నుంచి సీపీఐ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు హాజరుకానున్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా

ప్లీనరీలో రాష్ట్ర దేశ సమస్యలపై సమగ్రంగా చర్చ రాష్ట్ర కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి. రైతులకు నష్టపరిహారం తక్షణం చెల్లించాలి. ఎన్నికల చీఫ్ కమీషనర్ను తొలగించాలి. ప్లీనరీలో సమగ్రంగా చర్చించడం జరుగుతుంది.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి Eswaraiah Gujjula వెల్లడి

విశాలాంధ్ర-కడప బ్యూరో : వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారత కమ్యునిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలను ఈ నెల 27

నుండి 30వ తేదీ వరకు కడపలో నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య వెల్లడించారు. ఈ ప్లీనరీ సమావేశాలకు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరవుతారని ప్లీనరీ విజయవంతానికి కామ్రేడ్స్ అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 28న కడప నగరంలో ప్రజా ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని ఆయన వివరించారు. శుక్రవారం పార్టీ కార్యాలయమైన హోచిమిన్ భవన్లో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధ్వర్యంలో క్లీనరీ సమావేశాల పోస్టర్ల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 28న జరిగే కార్యక్రమాల్లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి.రాజా, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె. రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే సీపీఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పల్లా వెంకట్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి.ఈశ్వరయ్య పాల్గొంటారని, అధ్యక్షులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ పి.హరినాథరెడ్డి హాజరవుతారన్నారు. కరువు కాటకాలకు నిలయమైన రాయలసీమలో ప్లేనరీ జరగడం ఒక ప్రత్యేకత సంతరించుకుందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం కరువు రక్కసి తాండవిస్తోందని దీనిపై సరైన అవగాహన లేక కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ప్రచార ఉద్యమంలో ఉండడం తగదన్నారు. వర్షాభావ పరిస్థితుల వలన ఖరీఫ్ సీజన్లో రైతులకు సరైన సమయంలో సాగునీరందక విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్, సెప్టెంబర్ మధ్యన 514 మి.మీ. వర్షపాతం ఉండాలని కానీ 218 మి.మీ. మాత్రమే నమోదైందని మైనస్ 54 మి.మీ. వర్షపాతం తక్కువగా ఉందన్నారు. నీటి సమస్యను ముందుగానే అంచనా వేసి ప్రతిపక్షాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న కరువును జాతీయ విపత్తుగా గుర్తించి తక్షణం కేంద్రం అదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 5.36 కోట్ల నష్టం వాటిల్లిందని 80లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 60లక్షల్లో సాగవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది కానీ 50లక్షల ఎకరాల కంటే మించి పంటలు సాగు కావడం లేదన్నారు. సకాలంలో నీరందక సాగుకోసం ఎదురుచూస్తున్న రైతులు కరువులో చిక్కుకొని విలవిలలాడుతున్నారని దీనికంతా ప్రభుత్వం ఎల్నినోను చూపిస్తూ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు. తక్షణం రైతులకు పంట సాగుతో నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.50వేలు చెల్లించాలని అదేవిధంగా బీడుగా వదిలేసిన రైతులకు రూ.15వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు, కూలీలకు ఉపాధి హామీ పథకం కింద వలస పోకుండా ఉపాధి చూపించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం డ్యాంలో నిల్వ ఉన్న నీటిని విద్యుత్ కోసం ఉపయోగించడం దారుణమన్నారు. విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే విండ్, సోలార్ లాంటివి ఉన్నాయని వాటి ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయాలన్నారు. తక్షణం కేసీ కాలువకు నీరు వదిలి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44 క్యూసెక్కుల నీటిని పంపిణీ చేయాలన్నారు. జాతీయ ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలను తోటి కమీషనర్లు తప్పుపట్టినా వాటిని పరిగణలోకి తీసుకోకుండా జ్ఞానేష్ కుమార్ ముందుకెళ్లడం దారుణమన్నారు. ఎన్నికల కమీషనర్ నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని బీజేపీకి తొత్తుగా పనిచేయకూడదని పేర్కొన్నారు. దేశంలో 20కోట్ల మందిని ఎన్నికల జాబితా నుంచి తొలగించే పనిని చేపట్టారని ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలను నిర్మూలించడానికి సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు అన్ని పార్టీలతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రచార పిచ్చి ఎక్కువైందని దీంట్లో భాగంగా సోషల్ ఇన్ఫ్లుయెన్స్తో ప్రచారం చేయించుకునే పిచ్చిలో చంద్రబాబు నాయుడు అందెవేసిన చేయిగా ఉన్నాడని ఘాటుగా విమర్శించారు. సోషల్ మీడియాలో ప్రచారానికి వేతనం కూడా ఇస్తానని ప్రకటించడం ఆయన ప్రచార ఆర్భాటానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో జరిగే అనేక సమస్యలపైన కలసి పోరాటం చేసే లక్ష్యంతోనే వైఎస్ జగన్ను కలిశాం తప్ప వేరే ఉద్దేశ్యం ఏమీ లేదని ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ నాయకులు ఎల్. నాగసుబ్బారెడ్డి, గుంటి వేణుగోపాల్, ఎన్. వెంకటశివ, కేసీ బాదుల్లా, జయలక్ష్మి, ఓబులేసు, ఉద్దె మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

కరవును 'జాతీయ విపత్తు'గా ప్రకటించి.. రైతులను ఆదుకోండి!_సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
25/09/2026

కరవును 'జాతీయ విపత్తు'గా ప్రకటించి.. రైతులను ఆదుకోండి!

_సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

25/09/2026
గోరుకల్లు బాధితులకు న్యాయం చేయండినంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్ గేట్లు అక్రమంగా ఎత్తడం వల్ల గ్రామం నీటమునిగి 2,000 ...
25/09/2026

గోరుకల్లు బాధితులకు న్యాయం చేయండి

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్ గేట్లు అక్రమంగా ఎత్తడం వల్ల గ్రామం నీటమునిగి 2,000 మంది వీధిన పడ్డారు.

డిమాండ్లు:

బాధితులకు తక్షణ పునరావాసం, పరిహారం అందించాలి.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇరిగేషన్ EE, పక్షపాతంతో వ్యవహరించిన పాణ్యం CIపై చర్యలు తీసుకోవాలి.

రిజర్వాయర్ మరమ్మత్తులకు నిధులు కేటాయించాలి.

Eswaraiah Gujjula సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించండి ఈసీఐలో ఏకపక్ష నిర్ణయాల వల్ల తీవ్ర అవకతవకలు జరిగాయి.,  పారదర్శకత లోపించింది......
25/09/2026

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించండి

ఈసీఐలో ఏకపక్ష నిర్ణయాల వల్ల తీవ్ర అవకతవకలు జరిగాయి., పారదర్శకత లోపించింది...

SIR ప్రక్రియను నిలిపివేసి, తొలగించిన ఓట్లను పునరుద్ధరిం చండి

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా
సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు వామపక్షాల దేశవ్యాప్త నిరసనలు జయప్రదం చేయండి

_సీపీఐ రాష్ట్ర కార్యదర్శి Eswaraiah Gujjula

ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్ ని తొలగించాలిసెప్టెంబర్ 26 నుండి అక్...
25/09/2026

ఎస్ఐఆర్ ప్రక్రియను
తక్షణమే నిలిపివేయాలి

భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్ ని తొలగించాలి

సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు వామపక్షాల నిరసనలు

_సిపిఐ రాష్ట్ర కార్యదర్శి Eswaraiah Gujjula

Address

CHANDRA RAJESWARARAO Road
Vijayawada
520004

Telephone

+917995009600

Website

Alerts

Be the first to know and let us send you an email when AP CPI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AP CPI:

Shortcuts

Share