Muppa Raja anna follower’s

Muppa Raja anna follower’s Janasena Party Penamaluru Constituency Incharge,
Airport Authority Member, Gannavaram International Airport, Vijayawada, Andhra Pradesh.

Penamaluru Janasena Party Constituency Incharge
Airport Authority Member at Gannavaram International Airport in Vijayawada, Andhra Pradesh

*🙏అందరికి  శ్రీ రామ నవమి శుభాకాంక్షలు...🚩*భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన *శ్రీరాముడు**ధర్మానికి నిలువెత్తు ని...
27/03/2026

*🙏అందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు...🚩*

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన *శ్రీరాముడు*
*ధర్మానికి నిలువెత్తు నిదర్శనం...*

✌️ఈ పవిత్రమైన శ్రీ రామ నవమి సందర్భంగా
ప్రతి ఇంటిలో ఆనందం వెల్లివిరియాలి,
ప్రతి హృదయంలో ధర్మం నిలవాలి.

▪️శ్రీరాముని ఆశీస్సులతో
మీ జీవితాల్లో విజయాలు, శాంతి, ఐశ్వర్యం నిండాలని
హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.

🙏జై శ్రీరామ్...

*✌️ముప్పా రాజా 🚩*
పెనమలూరు నియోజకవర్గం
*ఎయిర్ పోర్టు అథారిటీ మెంబర్ *

పత్రికా ప్రకటన, తేది 31.07.2025ఢిల్లీ లో కేంద్ర మంత్రి గడ్కరిని కలిసిన ఎంపి బాలశౌరి ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రి శ్రీ నిత...
31/07/2025

పత్రికా ప్రకటన, తేది 31.07.2025
ఢిల్లీ లో కేంద్ర మంత్రి గడ్కరిని కలిసిన ఎంపి బాలశౌరి
ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రి శ్రీ నితిన్ గడ్కరి గారిని మచిలీపట్నం ఎంపి బాలశౌరి కలిసి దిగువ తెలిపిన రోడ్ల మంజూరు గురించి ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది.
గుడివాడ – కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. ::
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని కృష్ణా జిల్లాలోని గుడివాడ నుండి కంకిపాడు వరకు దాదాపు 27 కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టును మంజూరు చేయవలసిన అవసరాన్నివారికీ వివరించడం జరిగింది. ఈ రోడ్డు జాతీయ రహదారి 165 (NH-165), జాతీయ రహదారి 216-H ను జాతీయ రహదారి 65 (NH-65) తో ఇలా మూడు నేషనల్ హై వే లను కలుపుతుందని, అందువలన గుడివాడ నుండి విజయవాడకు ప్రయాణం చాలా తక్కువ సమయంలో చేరుకునే అవకాశం ఉందని తెలియ చెప్పడం జరిగింది.
ప్రస్తుత రోడ్డు ప్రక్కనే ఉన్న రెండు పంట కాలవల వలన తీవ్రంగా దెబ్బతింటోంది. దీని వలన రోడ్డు దీర్ఘకాలిక ప్రజా మరియు వాణిజ్య వినియోగానికి అనుకూలంగా లేదని, అందువలన ఈ ప్రాంతంలో ప్రయాణించే ప్రజలు, రవాణాదారులు మరియు రైతులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారని, అందుకే గ్రీన్ ఫీల్డ్ రోడ్డును ప్రతిపాదించడం జరిగిందని మంత్రి దృష్టికి తేవడం జరిగింది. దీనికోసం అలైన్‌మెంట్ సర్వే ఇప్పటికే పూర్తీ కావడం జరిగిందని, ఇది సాంకేతికంగా ప్రధానమంత్రి గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద బాగా సరిపోతుందని వారికీ వివరించడం జరిగింది. ఈ ప్రతిపాదిత రోడ్డు మూడు జాతీయ రహదారులను అనుసంధానించడమే కాకుండా, రద్దీని తగ్గించడం మరియు సజావుగా సరుకు రవాణా మరియు ప్రయాణీకుల రాకపోకలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతం అంతటా మల్టీమోడల్ లాజిస్టిక్స్ మరియు మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని, ఈ విషయంలో, దీర్ఘకాలిక స్థిరత్వం, ఆర్థిక వృద్ధి మరియు ప్రజా సౌలభ్యం దృష్ట్యా, ఈ కీలకమైన ప్రాంతీయ కనెక్టివిటీ ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకుని, గుడివాడ-కంకిపాడు గ్రీన్‌ఫీల్డ్ రహదారిని ప్రధానమంత్రి గతి శక్తి పథకం కింద వీలైనంత త్వరగా మంజూరు చేయాలని మంత్రి గారిని కోరడం జరిగింది.
గుడివాడ పట్టణంలోని రహదారులు :
అలాగే గుడివాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి 216H కోసం వార్షిక ప్రణాళిక కింద ₹18.50 కోట్ల అంచనా వ్యయంతో ఒక ప్రతిపాదన సమర్పించబడిందని మంత్రికి తెలియచేయడం జరిగింది..
గుడివాడ కృష్ణా జిల్లాలో కీలకమైన పట్టణ కేంద్రం అని, ముఖ్యంగా గుడివాడ పట్టణ పరిధిలో భారీ వాహనాల రాకపోకలను ఎదుర్కొంటోందని, పట్టణంలోని NH-216H విస్తరణ ప్రస్తుత పరిస్థితి తరచుగా ట్రాఫిక్ రద్దీకి మరియు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యానికి కారణమవుతోందని, ముఖ్యంగా రద్దీ సమయాల్లో పరిస్థితి యొక్క ఆవశ్యకత మరియు అడ్డంకుల వల్ల రోజువారీ ప్రజా ఇబ్బందులు తలెత్తుతున్నందున, ఈ ప్రతిపాదనను ప్రస్తుత వార్షిక ప్రణాళికలోనే మంజూరు చేయాలని కోరడం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌ను త్వరగా అమలు చేయడం వల్ల ట్రాఫిక్ భారాన్ని తగ్గించడం, వాహనాల సజావుగా సాగేలా చూడటం మరియు రహదారి భద్రతను పెంచడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది.
కృష్ణా జిల్లా పరిధిలోని గుడివాడ పట్టణ పరిధిలోని NH 165 మరియు NH 216 H మధ్య అనుసంధానించే NH 216H యొక్క కి.మీ 28.300 నుండి 30.100 వరకు మరియు స్పర్ కి.మీ 0.000 నుండి 3.00 వరకు 28.53 కోట్ల మొత్తానికి మరొక డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను MORTH వారి సమర్పించడం జరిగింది. ప్రజల మరియు పట్టణ ట్రాఫిక్ నిర్వహణ ప్రయోజనాల దృష్ట్యా వీటిని ప్రాధాన్యతా సమస్యలుగా పరిగణించాలని మంత్రి గారిని కోరడం జరిగింది..
మచిలీపట్నం పోర్ట్ కు అనుసంధాన రహదారులు ::
ప్రాజెక్ట్ 1: మచిలీపట్నం సౌత్ పోర్ట్ నుండి NH-65 వరకు ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కు 350 కోట్లు మంజూరు
ప్రతిపాదిత 18.5 కి.మీ. ఆరు లైన్ ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు మచిలీపట్నం సౌత్ పోర్ట్ నుండి రైస్ మిల్ వరకు జాతీయ రహదారి 65 మధ్య ప్రత్యక్ష మరియు సమర్థవంతమైన కనెక్షన్‌ను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివలన పోర్టుకు మరియు పోర్టు నుండి వస్తువుల తరలింపును గణనీయంగా పెంచుతుందని, తద్వారా ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలను బలోపేతం చేస్తుంది. ఇందులో భాగంగా 7 అండర్ పాస్ లు, 3 ఫ్లై ఓవర్ ల నిర్మాణం జరుగుతుంది. బీచ్ రోడ్ లో కూడా ఒక ఫ్లై ఓవర్ ను నిర్మిస్తారు.
ప్రాజెక్ట్ 2: మంగినపూడి బీచ్ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా అప్‌గ్రేడ్ చేయడం
సుమారు 11.7 కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న మంగినపూడి బీచ్ రోడ్డు తీరప్రాంతం మరియు మచిలీపట్నం పట్టణం మధ్య కీలకమైన లింక్‌గా పనిచేస్తుంది. ఈ రోడ్డును నాలుగు లేన్ల ఆకృతిగా అప్‌గ్రేడ్ చేయడం వల్ల రవాణా మెరుగుపడుతుంది, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది మరియు స్థానిక ఆర్థికాభివృద్ధికి ఊతం ఇస్తుందని మంత్రి గారికి తెలియచేయడం జరిగింది.
ప్రతిపాదనల నివేదికలను పరిశీలించిన మంత్రి గడ్కరి గారు వెంటనే అధికారులను పిలిపించి, పైన పేర్కొన్న రహదారుల గురించి రాష్ట్ర అధికారుల నుండి నివేదికలు తెప్పించుకొని నిధుల మంజూరు కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేయవలసినదిగా ఆదేశించడం జరిగింది. అడిగిన వెంటనే స్పందించిన మంత్రి గారికి ఎంపి బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు.

పెనమలూరు నియోజకవర్గం  కంకిపాడు మండలంలో ఘనంగా వంగవీటి మోహన్ రంగా గారి జయంతి  వేడుకలు  ......👉🏻  మాదాసువారిపాలెం అయ్యప్ప మ...
04/07/2025

పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో ఘనంగా వంగవీటి మోహన్ రంగా గారి జయంతి వేడుకలు ......

👉🏻 మాదాసువారిపాలెం అయ్యప్ప మరియు హన్ను వారి ఆధ్వర్యంలో ......

👉🏻 కంకిపాడు సెంటర్ ఏనుగు జయ ఆధ్వర్యంలో . . . .

👉🏻 కంకిపాడు లోని VMR సర్కిల్ వద్ద ఫైర్ శీను ఆధ్వర్యంలో . . . .

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన మహానాయకుడు, పేద ప్రజల జీవితాంతం పోరాటం చేసిన మహనీయుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 78 జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించే మరియు కేక్ కటింగ్ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ★ శ్రీ #బోడేవెంకట్రామ్ గారు, ఎయిర్పోర్ట్ అథారిటీ మెంబర్ శ్రీ #ముప్పారాజా గారు, డా" గాజుల శ్రీమన్నారాయణ గారు, కొప్పరాజు సురేష్ గారు, బోయననా నాగరాజు గారు ,సుంకర శివ గారు, సుంకర సురేష్ గారు, పునాదిపాడు గ్రామ పార్టీ ప్రెసడెంట్ పవన్ గారు, పులికామేశ్వరావు గారు , జాని గారు ,ప్రవీణ్ గారు ,చింతకింది సునీల్ గారు మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు......

💥💥 "పల్లె పండుగ -  ప్రగతికి బాట" అనే కార్యక్రమం ద్వారా   👉🏻 ఈరోజు కంకిపాడు మండలంలోని పునాదిపాడు గ్రామం వద్ద బైపాస్ రోడ్డ...
30/06/2025

💥💥 "పల్లె పండుగ - ప్రగతికి బాట" అనే కార్యక్రమం ద్వారా

👉🏻 ఈరోజు కంకిపాడు మండలంలోని పునాదిపాడు గ్రామం వద్ద బైపాస్ రోడ్డు సమీపంలో రోడ్డు గుంతలు పడగా రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం స్థానిక ఎమ్మెల్యే ★ శ్రీ #బోడెప్రసాద్ గారు శంకుస్థాపన చేసి రోడ్డు పనులు ప్రారంభించారు ... ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ అథారిటీ మెంబర్స్ శ్రీ #ముప్పారాజా గారు, AMC చైర్మన్ శ్రీ అన్నే ధనయ్య గారు , పులికామేశ్వరరావు గారు, చింతకింద సునీల్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు . . .

టీం ;
#ముప్పా రాజా
( ఎయిర్పోర్ట్ అథారిటీ మెంబర్ )
#పెనమలూరు నియోజకవర్గం
#జనసేన పార్టీ
✌️

28/06/2025
💥💥 నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. .   👉🏻"పల్లె పండుగ -  ప్రగతికి బాట" అనే కార్యక్రమం ద్వారా కోమటిగుంట లాకులు గ్రామ...
28/06/2025

💥💥 నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. . 👉🏻"పల్లె పండుగ - ప్రగతికి బాట" అనే కార్యక్రమం ద్వారా కోమటిగుంట లాకులు గ్రామం నుండి జగన్నాధపురం గ్రామం వరకు నూతన రోడ్డు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీ #బోడెప్రసాద్ గారు R&B శాఖ ద్వారా 34 లక్షలు మంజూరు చేయించి మరియు శంకుస్థాపన చేశారు... తద్వారా గ్రామస్తులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు .... ఇట్టి కార్యక్రమానికి ఏర్పోర్ట్ అథారిటీ మెంబర్ శ్రీ #ముప్పారాజా గారు, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ అన్నే ధనయ్య గారు , టిడిపి పార్టీ మండల అధ్యక్షులు సూది మల్ల రవీంద్ర గారు, కంకిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు సుంకర శివ గారు , కంకిపాడు జనసేన పార్టీ అధ్యక్షుడు బోయిన నాగరాజు,ప్రచార కమిటీ జిల్లా కోఆర్డినేటర్ పులి కామేశ్వరరావు గారు,సుంకర సురేష్,చింతకింద సునీల్,కొననాని, కోమటిగుంట జనసేన నాయకులు బొడ్డు అంజీత్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు . .
టీం ; #ముప్పా రాజా
( ఎయిర్పోర్ట్ అథారిటీ మెంబర్ )
#పెనమలూరు నియోజకవర్గం
#జనసేన పార్టీ
✌️

https://youtu.be/gDnbzFNe4Y8?si=KX7aFFc3RKu-oDhu*కంకిపాడులో....* *ముప్పారాజ ఆధ్వర్యంలో  భారీ.... సంబరాలు...**టపాసులతో పూ...
04/06/2025

https://youtu.be/gDnbzFNe4Y8?si=KX7aFFc3RKu-oDhu

*కంకిపాడులో....*

*ముప్పారాజ ఆధ్వర్యంలో భారీ.... సంబరాలు...*

*టపాసులతో పూలతో.... భారీ సంబరాలు...**

*భారీ సంఖ్యలో జనం....*
*జనసేన పిలుపుమేరకు... సంబరాలు...*

*గత సంవత్సరం ఇదే రోజు వైసిపి ప్రభుత్వం పీడ విరగడైపోయిందని......*

*కంకిపాడులో భారీగా జన సైనికులు....

పెనమలూరు మండలం నుంచి పెద్దపులిపాక జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీమతి మేక స్వాతి గారు మరియు మేక సుబ్బారావు గారు ....

కంకిపాడు మండల ప్రధాన కార్యదర్శి శ్రీ సుంకర శివ గారు, కంకిపాడు గ్రామ అధ్యక్షులు శ్రీ బోయిన నాగరాజు గారు, బోయిన రోహిణి గారు, కిషోర్ గారు, పిచ్చుక రవి గారు , సుంకర సురేష్ గారు, పచ్చిపాల శేఖర్ గారు, రంజిత్ గారు , అంబి గారు , అయ్యప్ప గారు పవన్ గారు ,సతీష్ గారు....

ఉయ్యూరు మండలం నుంచి బూరెల రవి గారు లంబాడి పేట భాష గారు...

జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు........

కృష్ణాజిల్లా ...పెనమలూరు నియోజకవర్గం...కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా జనసైనికుల వేడుకలు. ముఖ్యఅతి.....

ఈరోజు విజయవాడ విమానాశ్రయం లో జరిగిన ఎయిర్ పోర్టు అడ్వైజరీ కమిటీ సమావేశంనకుఅధ్యక్షత వహించిన  మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుల...
22/05/2025

ఈరోజు విజయవాడ విమానాశ్రయం లో జరిగిన ఎయిర్ పోర్టు అడ్వైజరీ కమిటీ సమావేశంనకుఅధ్యక్షత వహించిన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ #వల్లభనేనిబాలశౌరి గారు. ..

సమావేశంలో పాల్గొన్న కో చైర్మన్ విజయవాడ ఎంపీ శ్రీ #కేశినేనిశివనాధ్ (చిన్ని ), ఎయిర్ పోర్టు డైరెక్టర్ శ్రీ లక్ష్మీ కాంత రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీలక్ష్మి షా, IAS,కృష్ణా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శ్రీమతి గీతాంజలి శర్మ IAS, కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ #గంగాధరరావు, జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్ ) రామాచారి, ఎయిర్పోర్ట్ అథారిటీ మెంబెర్ శ్రీ #ముప్పారాజా,శ్రీ పొట్లూరి బసవరావు, కామేపల్లి తులసి బాబు, బండి విజయ్,AAC సభ్యులు, ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రతినిధులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు..

టీం
#ముప్పారాజా
#ఎయిర్పోర్ట్అథారిటీమెంబెర్
#పెనమలూరునియోజకవర్గం
#జనసేనపార్టీ

👉🏻 "పల్లె పండుగ - ప్రగతికి బాట " అనే కార్యక్రమం ద్వారా...ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ★ శ్రీ కొణిదల పవన్ ...
18/05/2025

👉🏻 "పల్లె పండుగ - ప్రగతికి బాట " అనే కార్యక్రమం ద్వారా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ★ శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమంలో హామీలో భాగంగా కంకిపాడు - రొయ్యూరు, వయా: గొడవర్రు నూతన రోడ్డు ప్రారంభోత్సవం చేసిన స్థానిక ఎమ్మెల్యే వారు ★ శ్రీ బోడే ప్రసాద్ గారు ... ఈ కార్యక్రమానికి
ఎయిర్పోర్ట్ అథారిటీ మెంబర్
జనసేన పార్టీ పెనమలూరు నియోజకవర్గం నాయకులు శ్రీ ముప్పా రాజా గారు, తెలుగుదేశం పార్టీ తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీ అనుమోను ప్రభాకర్ గారు , తెలుగుదేశం పార్టీ కంకిపాడు మండల అధ్యక్షులు శ్రీ సూదిమల్ల రవీంద్ర గారు, గొడవర్రు తెలుగుదేశం పార్టీ నాయకులు కోనేరు రాజేష్ గారు ,కోనేరు బాను ప్రసాద్ గారు జనసేన నాయకులు రంజిత్ గారు,పులి కామేశ్వరరావు గారు, తంబళ్ళ వీర స్వామి గారు మరికొందరు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది...

టీం ;
#ముప్పా రాజా
( ఎయిర్పోర్ట్ అథారిటీ మెంబర్ )
#పెనమలూరు నియోజకవర్గం
#జనసేన పార్టీ
✌️

Address

Kankipadu
Vijayawada
521151

Website

Alerts

Be the first to know and let us send you an email when Muppa Raja anna follower’s posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category