Kesineni Janaki

Kesineni Janaki Kesineni Janaki Lakshmi page to connect with citizens of Vijayawada Parliament

ఈరోజు కుటుంబ సమేతంగా కలిసి ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఆ దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరి...
09/08/2026

ఈరోజు కుటుంబ సమేతంగా కలిసి ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.

ఆ దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. 🙏✨

30/07/2026

నిన్న విజయవాడ బెంజ్ సర్కిల్ ‘ఏ కన్వెన్షన్ సెంటర్’ లో ‘ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్‌పో’ను ప్రారంభించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.

మన దేశ సంస్కృతికి ప్రతీకలైన 14 రాష్ట్రాల చేనేత కళాకారుల అద్భుతమైన సృజనాత్మకత ఒకే చోట చూడటం ఒక గొప్ప అనుభూతి. ఆగస్టు 3 వరకు జరిగే ఈ ప్రదర్శనను మన విజయవాడ వస్త్ర ప్రియులందరూ తప్పక సందర్శించి, సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ✨

ఈరోజు లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్‌లో వసుంధర డైమండ్ రూఫ్ ప్రైవేట్ లిమిటెడ్‌ వారు ఏర్పాటు చేసిన సంప్రదాయ వధూవరుల బంగారు నగల...
10/02/2026

ఈరోజు లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్‌లో వసుంధర డైమండ్ రూఫ్ ప్రైవేట్ లిమిటెడ్‌ వారు ఏర్పాటు చేసిన సంప్రదాయ వధూవరుల బంగారు నగలు, డైమండ్ ఆభరణాల కలెక్షన్ ఎగ్జిబిషన్ ను మాజీ మంత్రి పీతల సుజాత గారు, బోండా సుజాత గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది...

29 సంవత్సరాల ప్రసిద్ధి చెందిన వసుంధర డైమండ్ జ్యువెలరీ (హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బ్రాంచెస్) అద్భుతమైన డైమండ్ కలెక్షన్‌తో రెండు రోజులు ఎగ్జిబిషన్ నగర ప్రజలకు అందుబాటులో ఉండనుంది... డైమండ్ జ్యువలరీ కలెక్షన్ చాలా బాగుంది... కస్టమర్ల టేస్ట్ కు అనుగుణంగా కష్టమైస్ చేసి ఇవ్వడం వీరి ప్రత్యేకత... ట్రెడిషనల్ జ్యువెలరీని నేను చాలా ఇష్టపడతాను. కేశినేని చిన్ని గారు నాకు ఫస్ట్ రింగ్ గిఫ్ట్ చేశారు!వధూవరులకు ఇద్దరికీ పర్ఫెక్ట్ ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి. విజయవాడ వాసులు తప్పక సందర్శించండి!

01/01/2026

ప్ర‌గ‌తి-సంక్షేమాల‌తో న‌వ‌వ‌సంతం ప్ర‌జ‌ల‌కు ఆయురారోగ్య, ఆనందాలు పంచాల‌ని ఆకాంక్షిస్తున్నాను. అంద‌రికీ నూత‌న సంవ‌త్స‌రం శుభాకాంక్ష‌లు...

I got over 600 reactions on one of my posts last week! Thanks everyone for your support! 🎉
29/12/2025

I got over 600 reactions on one of my posts last week! Thanks everyone for your support! 🎉

విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి నేతృత్వంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో ఎన్టీఆర్ జిల్లాకు చెం...
19/12/2025

విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి నేతృత్వంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎస్.హెచ్.జి మహిళల 3వ బ్యాచ్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ విజయవంతంగా పూర్తి కావడం జరిగింది... డిసెంబర్ 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వర్మికంపోస్టింగ్, ప్రకృతి వ్యవసాయం, తేనె తయారీపై శిక్షణ తీసుకున్న మహిళలు...

శిక్షణ పూర్తి చేసుకున్న 45 మంది మహిళలకు సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది... మహిళల ఆర్థిక స్వాతంత్రతే కుటుంబం, సమాజం, రాష్ట్ర అభివృద్ధికి పునాది... మహిళల ఆర్థిక స్వాలంబన, సాధికారత కోసం విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు కేశినేని ఫౌండేషన్ ద్వారా నిరంతరం కృషి చేస్తున్నారు... శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తాము...

ఈ కార్యక్రమంలో ఎన్.ఐ.ఆర్.డి సీనియర్ కన్సల్టెంట్ మహ్మద్ ఖాన్ గారు, ప్రొఫెసర్ డాక్టర్ కతిరేషన్ గారు, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూరల్ కోఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ గారు మరియు తదితరులు పాల్గొన్నారు..

కేంద్ర చేనేత, జౌళి శాఖ సహకారంతో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్ పో ఆధ్వర్యంలో ఏ కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహిస్తున్న సిల్క...
12/12/2025

కేంద్ర చేనేత, జౌళి శాఖ సహకారంతో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్ పో ఆధ్వర్యంలో ఏ కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహిస్తున్న సిల్క్ ఎక్స్ పో కు ముఖ్యఅతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పట్టు వస్త్రాల స్టాళ్లను తిలకించాను. ఈ ఎక్స్ పో లో స్టాల్స్ ఏర్పాటు చేసిన చేనేత క‌ళాకారుల‌తో స్వ‌యంగా మాట్లాడి చీర‌ల వివ‌రాల తెలుసుక‌న్నాను..

వస్త్రాభిమానులను అలరించేలా ఏర్పాటు చేసిన ఎక్స్ పోలో బెనారసి, పశ్చిమబెంగాల్ బొటిక్ ఐటెమ్స్, టస్సార్ కాంత, చందేరి, కోటా, రాజ్ కోట్ పటోలా, గద్వాల్, కళంకారి, కాంచీపురం, వెంకటగిరి, ఉప్పాడ జాంధానీ.. ఇలా వివిధ కళాత్మక వస్త్రాలను ఒకే వేదికపై వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం. దేశ వ్యాప్తంగా 14 వీవింగ్ క్లస్టర్ల పరిధిలోని కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న అత్యద్భుతమైన డిజైన్లకు ఈ ప్రదర్శన చిరునామాగా నిలుస్తోంది.

క్రిస్మ‌స్‌, నూత‌న సంవ‌త్స‌రం, సంక్రాంతి వంటి పండ‌గ‌ల నేప‌థ్యంలో ఈ ప్ర‌ద‌ర్శ‌న న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా వుంటుంది. అన్ని ప్రాంతాల కళాకారుల చేతిలో తయారైన వస్త్రాలు ఒకేచోట అందుబాటులో ఉంచడం ద్వారా ఆయా ప్రాంతాల చేనేత కళాకారులను ప్రోత్సహించడంతో పాటు వస్త్ర ప్రియులకు తక్కువ ధరల్లో మంచి వస్త్రాలను అందించేందుకు దోహద పడుతుంది. ఇలాంటి వస్త్రాలకు మద్దతివ్వడం ద్వారా మన ఘన చేనేత వైభవాన్ని భావి తరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు వీలవుతుంది. ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ను నగర వస్త్ర ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను...

ఈ కార్యక్రమంలో మహిళా పారిశ్రామిక వేత్త సజ్జా మంజుల గారితో పాటు, వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చిన చేనేత క్ల‌స్ట‌ర్ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

మహిళల ఆర్థిక స్వతంత్రతే కుటుంబం, సమాజం, రాష్ట్ర అభివృద్ధికి పునాది.. ఎస్. హెచ్.జి మహిళలు స్వయం సమృద్ధి వైపు ధైర్యంగా అడు...
10/12/2025

మహిళల ఆర్థిక స్వతంత్రతే కుటుంబం, సమాజం, రాష్ట్ర అభివృద్ధికి పునాది.. ఎస్. హెచ్.జి మహిళలు స్వయం సమృద్ధి వైపు ధైర్యంగా అడుగులు వేయాలి..

విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్.ఐ.ఆర్.డి సహకారంతో అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణను మహిళలు వినియోగించుకొని జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలి... హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో ఐదు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో శిక్షణ తీసుకుంటున్న ఎన్టీఆర్ జిల్లాలోని ఎస్.హెచ్.జి కి చెందిన 61 మంది మహిళలను ఈరోజు కలిశాను.. గత మూడు రోజులుగా ఎస్.హెచ్.జి మహిళలు పొందుతున్న శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నాను.. ఎస్.హెచ్.జి అంటే కేవలం సేవింగ్స్ మాత్రమే కాదు, స్వయం సమృద్ధి వైపు నడవటం.. కేశినేని ఫౌండేషన్ ఎప్పటికప్పుడు మహిళల నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూ నిలబెట్టే సంస్థగా కొనసాగటంతోపాటు, ఎల్లప్పుడూ అండగా తోడుగా ఉంటుందని తెలియజేశాను... ఇక్కడ శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను గ్రామాలలోని ఇతర మహిళలకు నేర్పించి అందరూ కలిసి ఒక ప్రోడక్ట్ యూనిట్ నెలకొల్పాలి.. యూనిట్ లో తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ సహకారం అందిస్తానని భరోసా కల్పించాను... ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయమైన కుటుంబానికి ఒక పారిశ్రామిక ఉండాలన్న నినాదం స్ఫూర్తితో ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు కేశినేని ఫౌండేషన్ తో కృషి చేస్తున్నారు అని తెలియజేశాను... అందుకే ఎంపీ కేశినేని చిన్ని గారు తన సొంత నిధులతో గ్రామాల పరిపూర్ణ వికాసం కోసం, మహిళల సాధికారత, స్వాలంబన సాధించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి, ఆ దిశగా ఎన్.ఐ.ఆర్.డి, ఎన్టీఆర్ జిల్లా అధికారుల సహకారంతో కృషి చేస్తున్నారని తెలిపాను...

ఈ కార్య‌క్ర‌మంలో ఎన్.ఐ.ఆర్.డి సీనియర్ కన్సల్టెంట్ మహ్మాద్ ఖాన్ గారు, ప్రోఫెసర్స్ డాక్టర్ కతిరేషన్ గారు, ఎన్టీఆర్ జిల్లా రూర‌ల్ ఎన్.ఐ.ఆర్.డి కో- ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ‌ గారు, ఎన్టీఆర్ జిల్లా రూర‌ల్ మ‌హిళ స‌మైక్య అధ్యక్షురాలు కందుల క‌ల్ప‌న‌ గారు, జ‌గ్గ‌య్య‌పేట రూర‌ల్ మండ‌ల మ‌హిళ స‌మైక్య అధ్య‌క్షురాలు ర‌జ‌నీ గారు మరియు త‌దిత‌రులు పాల్గొన్నారు.

రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ, అర్బన్ గ్రీనరీ, ఉద్యానవన శాఖ సహకారంతో పిన్నమనేని పాలిక్ల...
07/12/2025

రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ, అర్బన్ గ్రీనరీ, ఉద్యానవన శాఖ సహకారంతో పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ లోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు...

అలాగే ఈ ప్రదర్శనలశాలలో నిర్వహించిన గ్రాండ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఫ్యాషన్ షోన్ ను ఆసక్తిగా తిలకించాను... న్యాచురల్ ఫార్మింగ్ లో పండించిన పూలు, పండ్లు, కూరగాయల స్టాల్స్ ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నాను... ఈ ప్రదర్శనశాలలో అందుబాటులో ఉన్న దేశీయ, అంతర్జాతీయ పూల మొక్కలు, పలు రకాల పండ్లు మొక్కలు, గార్డెన్ అలంకరణ వస్తువులు, ఆర్గానిక్ ఎరువులు, ఆర్గానిక్ ఆహార పదార్థాలు గురించి రోజ్ సొసైటీ టీం ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సభ్యులు వివరించారు...

సమాజంలో మొక్కలు పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది... కాలుష్య నియంత్రణ ఒక చెట్ల పెంపకంతోనే సాధ్యం.. విద్యార్థులకి చిన్నతనం నుంచే న్యాచురల్ ఫార్మింగ్ పై అవగాహన కల్పించాలి.. రోజ్ సొసైటీ కి నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేశాను..

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి గారు, రోజ్ సోసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఎస్.ఉషారాణి గారు, సెక్రటరీ జి.లక్ష్మీ గారు, ఇన్చార్జ్ పద్మప్రియ గారు, మీడియా కో-ఆర్డినేటర్ అబ్బూరి రత్న లక్ష్మీ గారు, రోజ్ కమిటీ సభ్యులు అట్లూరి సుమ గారు, లక్ష్మీ తులసీ గారు, సీతామహాలక్ష్మీ గారు, ఉమా గారు, ఛాయ గారు, శుభ‌ గారు మరియు తదితరులు పాల్గొన్నారు...

కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ శారద సనత్చంద్ర పురోహిత కార్యాలయం నిర్వాహకులు దేవరకొండ సనత్ కుమార్ శర్మ గార...
16/11/2025

కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ శారద సనత్చంద్ర పురోహిత కార్యాలయం నిర్వాహకులు దేవరకొండ సనత్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో కృష్ణలంక కుర్తాళం పీఠం సమీపాన కృష్ణా పుష్కర్ ఘాట్ నందు ఈరోజు జరిగిన కార్తీక దశ సహస్ర దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవ్వడం జరిగింది..

అనంతరం మహిళలతో కలిసి సామూహిక పూజలో పాల్గొన్నాను.. గత 11 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు అభినందనలు... పురాణ కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలను చిన్నారులకు తల్లిదండ్రులు నేర్పించాలి... వేలాది దీపాల కాంతులతో పుష్కర్ ఘాట్ ప్రాంతం అంతట ఆధ్యాత్మికత వెల్లివిరిసింది... ఈ కార్యక్రమంలో మహిళలు యువతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

Address

Road No Road No 8, Sikh Gurdwara Road, Guru Nanak Colony
Vijayawada
520008

Alerts

Be the first to know and let us send you an email when Kesineni Janaki posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category