15/06/2023
Full Video Link; https://www.youtube.com/live/e-LHFpIG0Hw?feature=share
కత్తిపూడి సభలో వారాహి వాహనం మీద నుండి మొదటి ప్రసంగం చేసిన పవన్ కళ్యాణ్ గారు.....
ప్రసంగంలోని ముఖ్యాంశాలు 👇
👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ఎవరు చెప్పినా మొదట మోకరిల్లాల్సింది అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి 🙏.. వారికి నివాళులు అర్పిస్తున్నాను.....
👉 నేడు చేగువేరా జయంతి.....
ఆయనకి నా నివాళులు.....
👉 నన్ను పాలించేవాడు నాకంటే నిజాయితీ పరుడు అయ్యుండాలి....ఇక్కడ ఎవరూ నిజాయితీగా లేరు నేను తప్ప....
అందుకే నేను ఎవరికీ తలవంచను....
👉 వైసీపీని పడగొట్టేది నేనే.....
పథకాలు ఆపడానికి నువ్వెవిడివి??
వేలకోట్ల స్కాం చేసినా నువ్వా క్లాస్ వార్ గురించి మాట్లాడేది....
👉 ప్రతి ఒక్కరి వైసీపీ నాయకుల నీచ చరిత్ర నాకు తెలుసు.... నా నాలుగేళ్ల బిడ్డను కూడా తిడతారు వీళ్ళు.... నా సంస్కారం వారిని కాపాడుతుంది....
👉 నేను ఇక్కడికి రాకూడదు అని సెక్షన్ 30 పెట్టిన వ్యక్తి ఈ పిరికివాడు జగన్ రెడ్డి...
👉 అమరావతి మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని.... ఇది మా షణ్ముఖ వ్యూహం లో చెప్పాను...
👉 గోదావరి నది ఈ నేలను విడిచి ఎక్కడికీ వెళ్ళకుండా ఇక్కడే ఉంటుంది..... పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా అంతే..... ఇక్కడే ఉంటాడు....
👉 మద్యపాన నిషేధం అని చెప్పి నాలుగేళ్ళ నుండి మద్యం అమ్ముతున్నాడు.. ఆడబిడ్డలను ఇబ్బంది పెడుతున్నాడు....
సీపీఎస్ లాంటి హామీలు తప్పాడు......
👉 మెజారిటీ నామినేటెడ్ పదవులు రెడ్డి కులానికి కట్టబెట్టారు.....
👉 ఒక కులానికి సంబంధించిన రాజధాని అని ప్రతిపక్షంలో ఉండగా ఎందుకు చెప్పలేదు....5000 ఎకరాలు ఇంకా ఎక్కువ కావాలని ఎందుకు అడిగారు?? అమరావతి మాత్రమే రాజధాని అని మాట మీద నిలబడింది నేను మాత్రమే...
👉 కౌలు రైతుల చావుకి ప్రతి రైతుకి లక్ష రూపాయలు ఇచ్చిన మనిషిని నేను....ఇది సంక్షేమం అంటే...నా కష్టంతో చేసిన సేవ ఇది.....
నేను బటన్ నొక్కితే అభివృద్ధి అనుకునే మూర్ఖుడికి చెబుతున్నాను......
సంపద సృష్టిస్తేనే అభివృద్ధి..... ట్యాక్స్ పెంచి పాలన చేస్తే కాదు....
👉 అప్పులు చేసి అభివృద్ధి అంటే నేను ఒప్పుకోను....
👉 చేతులకు మీ బాబాయ్ నెత్తురు అంటించుకున్న వ్యక్తులని కాపాడే నువ్వా క్లాస్ వార్ గురించి మాట్లాడేది... నువ్వు పాపం పసివాడివా???
👉 సొంత బాబాయ్ కూతురు ఒంటరిగా పోరాడుతుంటే ఆవిడని చూసి నవ్వుతున్న వ్యక్తి జగన్ రెడ్డి....
👉 ఇంటి పన్నులు పెంచారు, రిజిస్ట్రేషన్ పన్నులు పెంచారు...... అప్పులు - పన్నులు మాత్రమే ఈ పాలన.. అంతకంటే ఏం లేదు....
👉 ఫీజ్ రీయింబర్స్మెంట్ చేయడం లేదు..యువతకు అన్యాయం జరుగుతోంది....
👉 నా కులాన్ని నేను పోగొట్టుకోను..నేను గౌరవిస్తాను.... నా రెల్లి, మాల,బీసీ,శెట్టిబలిజలు, బ్రాహ్మణులు, ప్రతి ఒక్కరి కోసం నిలబడతాను... జగన్ రెడ్డి లాగా 550 పోస్టులను రెడ్డి కులంతో నేను నింపను... దామాషా ప్రకారం వెళ్తాను..... మీకు మాట ఇస్తున్నాను ....
👉 ఎవరైనా నన్ను తిడితే వారిని ఒక పార్టీ ప్రతినిధిగా,కేవలం ఒక వ్యక్తిగా చూస్తాను... అతని కులాన్ని కాదు... సోషల్ ఇంజినీరింగ్ చేసే వ్యక్తిని నేను...
👉 జనసేన కులాల మధ్య సయోధ్య పెంచడానికి ఉంది...ఉదాహరణ శెట్టిబలిజ-కాపు కులాల కలయిక.... వైసీపీ సృష్టించిన కోనసీమ అల్లర్లు వారి కులాల మధ్య చిచ్చు పెట్టే సంస్కృతి....
👉 ఆంధ్రప్రదేశ్ ఆస్తులు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండే నాయకులు ఎవరూ అడగలేదు.... నేను ఒక్కడిని తప్ప.....
👉 సినిమా చూసినప్పుడు కలిసి ఎలా చూస్తారో , పార్టీలో , సమాజంలో అలానే కలిసి ఉండండి అందరూ.....
👉 స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే డబ్బు కావాలి..యువత కోసం నేను మాట్లాడతాను... మీరే ఈ దేశానికి నావికులు... షణ్ముఖ వ్యూహంలో నేను చెప్పిన విధానం అదే....పెట్టుబడి కోసం 10 లక్షల రూపాయలు నియోజకవర్గానికి 500 మందికి ఇస్తాం... ఉద్యోగాలు సృష్టించేది వాళ్ళే.... మన సంపద మనమే సృష్టించుకుందాం.....ఈ కార్యక్రమానికి సంవత్సరానికి 10000 కోట్ల రూపాయలు అవసరం....దోపిడీని ఆపితే ఇది సాధ్యం... నేను చేసి చూపిస్తాను..పెట్టుబడి పెట్టిస్తుంది జనసేన ప్రభుత్వం
👉 పంచాయితీలకు నిధులేవి??? ఏం చేస్తున్నారు ఆ పంచాయితీల డబ్బు??? చెత్త మీద మీద పన్ను ఎందుకు వేస్తున్నారు...... పంచాయితీలకు డబ్బు పంచాయితీలకు వచ్చేలా జనసేన ప్రభుత్వం చేస్తుంది .....
👉 క్లాస్ వార్ గురించి మాట్లాడే జగన్ రెడ్డి పేదల మీద ఈ పన్నుల బాదుడు ఏంటి??
కార్మికుల నిధుల 450 కోట్లు లాగేసిన నువ్వా క్లాస్ వార్ గురించి మాట్లాడేది??
👉 ఇసుక కార్మికులు బీసీ వారి కుల వృత్తి....
ఆ సంపద సృష్టిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది.... కానీ చిత్తూరు జిల్లా రెడ్డికి ఇసుక కాంట్రాక్ట్ కి అప్పజెప్పింది జగన్ రెడ్డి.. జనసేన ప్రభుత్వంలో ఇసుక ఉచితం..