25/08/2026
🎼 కళాకారులను నిర్లక్ష్యం చేస్తే సహించం.
🥁రాష్ట్రవ్యాప్తంగా కళాకారుల సమస్యలపై ఉద్యమం ఉధృతం చేస్తాం!
🎻 కళారంగాన్ని కాపాడాలి.. కళాకారులకు న్యాయం చేయాలి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి Eswaraiah Gujjula
ఒంగోలు కలెక్టరేట్ వద్ద కళాకారుల ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
సాంస్కృతిక రంగానికి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా జానపద, గ్రామీణ, పౌరాణిక, పద్య, నాటక రంగాలకు చెందిన కళారూపాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య గారు అన్నారు.
ఒంగోలు కలెక్టరేట్ వద్ద కళాకారుల సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
తరతరాలుగా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ప్రజలకు వినోదంతో పాటు విజ్ఞానం, సామాజిక చైతన్యాన్ని అందిస్తున్న కళాకారుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని అన్నారు.
గతంలో కళాకారులకు అమలులో ఉన్న పెన్షన్ విధానం కూడా లేకుండా పోయిందని, నేడు కళాకారులకు గుర్తింపు, ఉపాధి, సంక్షేమం, ఆర్థిక భద్రత లేకుండా దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కళాకారుల సమస్యలు ఒక్క జిల్లాకే పరిమితమైనవి కావని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది కళాకారుల సమస్యలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా కళాకారులను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
🔴 కళాకారుల ప్రధాన డిమాండ్లు
🔴 రాష్ట్ర సాంస్కృతిక శాఖకు ప్రతి ఏటా రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి.
🔴 50 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి పేద కళాకారుడికి నెలకు రూ.10,000 పెన్షన్ ఇవ్వాలి.
🔴 తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సారధిని ఏర్పాటు చేసి కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
🔴 ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డు మంజూరు చేయాలి.
🔴 నెలలో కనీసం 15 రోజుల పాటు వేతనంతో కూడిన కళా ప్రదర్శనలకు అవకాశాలు కల్పించాలి.
🔴 ప్రతి ఏటా నంది నాటకోత్సవాలు నిర్వహించి, గ్రామీణ, జానపద కళారూపాలను పోటీల్లో చేర్చాలి.
🔴 కళారంగ అభివృద్ధికి నిర్దిష్టమైన వార్షిక సాంస్కృతిక క్యాలెండర్ రూపొందించాలి.
🔴 ప్రతి పేద కళాకారుడికి 3 సెంట్ల ఇంటి స్థలం కేటాయించి, ప్రభుత్వ ఖర్చుతో ఇల్లు నిర్మించి ఇవ్వాలి.
🔴 కళారత్న, ఉగాది పురస్కారాల ఎంపికలో పారదర్శకత పాటించి అర్హులైన కళాకారులకే అవార్డులు ఇవ్వాలి.
🔴 ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసం ఉన్న కళాకారులను మాత్రమే ఎంపిక చేయాలి.
🔴 కళాకారులకు బస్సు, రైలు ప్రయాణాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి.
🔴 సాంస్కృతిక శాఖ, ఎఫ్‌డీసీలను నిరంతరం క్రియాశీలకంగా ఉంచి కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
✊ కళాకారుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తాం.
🔥 కళ బతికితేనే సంస్కృతి బతుకుతుంది — కళాకారుడు బతికితేనే కళ బతుకుతుంది!
— గుజ్జుల ఈశ్వరయ్య
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్
#కళాకారులసమస్యలు #కళారంగపరిరక్షణ #కళాకారులధర్నా #ఒంగోలు #గుజ్జులఈశ్వరయ్య