PDSO - Progressive Democratic Student's Organisation

PDSO - Progressive Democratic Student's Organisation ★ అందరికీ విద్య,వైద్యం, ఉపాధి హక్కుకై...
శాస్త్రీయ,స్వతంత్ర, ప్రజాతంత్ర విద్యావిధానంకై... పోరాడుదాం!

AISYO Statement: Withdraw the CJI’s Remarks Against Youth and Activists....................................................
17/05/2026

AISYO Statement: Withdraw the CJI’s Remarks Against Youth and Activists...................................................................

The controversial remarks were reportedly made by Chief Justice of India Surya Kant on May 15, 2026, during a Supreme Court hearing related to a petition on senior advocate designation: “There are already parasites of society who attack the system... There are youngsters like cockroaches, who don't get any employment and don't have any place in the profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some of them become other activists, and they start attacking everyone.”

At a time when millions of young people are struggling with unemployment, rising education costs, paper leaks and examination scams, shrinking job opportunities, and economic insecurity, such remarks are shocking and unacceptable. Students, unemployed youth, journalists, RTI activists, and democratic organisations raising questions on corruption, injustice, and attacks on education cannot be branded as “parasites” or “cockroaches” for speaking out.

The growing anger among youth did not emerge without reason. Unemployment continues to rise while education becomes increasingly expensive and inaccessible for ordinary people. Across the country, young people are facing insecurity and frustration about their future. In such a situation, insulting those who raise questions only reflects growing hostility towards criticism and dissent.

Activists, independent journalists, student organisations, and democratic groups have played an important role in exposing corruption and standing with people facing injustice. Questioning those in power cannot be treated as a crime. AISYO demands that these remarks be withdrawn immediately.
.................................

A. Suresh
Convenor, AISYO

17 May 2026 | Vijayawada

🔥 స్టూడెంట్ బులిటెన్ – మే 2026📌 ఈ సంచికలో చదవండి:▪️ కోర్సుల రీస్ట్రక్చరింగ్ కాదు... విద్యా వ్యవస్థలో రాడికల్ ట్రాన్స్‌ఫె...
16/05/2026

🔥 స్టూడెంట్ బులిటెన్ – మే 2026

📌 ఈ సంచికలో చదవండి:

▪️ కోర్సుల రీస్ట్రక్చరింగ్ కాదు... విద్యా వ్యవస్థలో రాడికల్ ట్రాన్స్‌ఫెర్మేషన్ కావాలి!
▪️ పెరుగుతున్న మార్కులు... పడిపోతున్న నైపుణ్యాలు
▪️ క్యూబాలో తయారవుతున్న వైద్యులు పేదలకు సేవ చేస్తుండగా... భారతదేశంలో తయారవుతున్న వైద్యులు విదేశాలకు పరుగులు పెడుతున్నారు!
▪️ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న నీట్
▪️ యుద్ధం చిదిమేస్తున్న బాల్యం
▪️ ఈ వేసవిలో పిల్లలకు జ్ఞాపకాలు ఇవ్వండి... గాయాలు కాదు!
▪️ స్వీడన్ మేల్కొంది... మనమెప్పుడు?

📩 PDF కోసం 👉 9701924714 కు WhatsApp చేయండి!

📢 చదవండి | చదివించండి | షేర్ చేయండి

ఆధిపత్యంలో ఉన్న వర్గాలుఎప్పుడైనా తాము అణిచివెయ్యాలని చూసే వర్గాలగొంతు నొక్కాలని చూస్తాయనే విషయంచరిత్ర పొడవునా కనిపిస్తుం...
14/05/2026

ఆధిపత్యంలో ఉన్న వర్గాలు
ఎప్పుడైనా తాము అణిచివెయ్యాలని చూసే వర్గాల
గొంతు నొక్కాలని చూస్తాయనే విషయం
చరిత్ర పొడవునా కనిపిస్తుంది.

కాబట్టి అణచివేతకు గురవుతున్నవారు
తమ ప్రజాస్వామిక హక్కుల పరిధిని వ్యాప్తి చేసుకోవడం కోసం
నిరంతరం పోరాడాల్సిందే.

అది వారి బాధ్యత.

— గూగీ వా థియాంగో





పదేపదే పునరావృతమవుతున్న నీట్ స్కామ్‌లకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యాలి!------------------------...
12/05/2026

పదేపదే పునరావృతమవుతున్న నీట్ స్కామ్‌లకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి
రాజీనామా చెయ్యాలి!
----------------------------------------------

పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో మే 3, 2026న జరిగిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్‌టిఏ ప్రకటించింది. అయితే గత సంవత్సరం కూడా ఇదే కారణంతో నీట్ పరీక్ష రద్దు అయిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ సంవత్సరం కూడా నీట్ స్కామ్ బయటపడటం ప్రభుత్వం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. పదేపదే పునరావృతమవుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, జాతీయ పరీక్షా సంస్థ నిర్లక్ష్య వైఖరిని పిడిఎస్ఓ తీవ్రంగా ఖండిస్తోంది.

2026 మే 3న జరిగిన నీట్ పరీక్ష తర్వాత; రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ‘గెస్ పేపర్’ పేరుతో సోషల్ మీడియాలో తిరిగిన ప్రశ్నాపత్రం అసలు ప్రశ్నాపత్రంతో సరిపోలినట్లు తేలింది. ఆ గెస్ పేపర్‌లోని 100కు పైగా ప్రశ్నలు అసలు పరీక్షలో వచ్చినట్లు దర్యాప్తులో బయటపడింది. అదేవిధంగా గత సంవత్సరం మాదిరిగానే లీకైన ప్రశ్నాపత్రాలను రూ.30 వేల నుంచి రూ.20 లక్షల వరకు విక్రయించినట్లు ప్రాథమిక సమాచారం వెలుగులోకి వచ్చింది. నీట్ స్కామ్‌ల వల్ల ముఖ్యంగా లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైద్య విద్యకు దూరమవుతున్నారు. మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న నీట్ స్కామ్‌లపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, పదేపదే జరుగుతున్న ఈ స్కామ్‌లను పూర్తిగా అరికట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎన్‌టిఏను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే వైద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని పిడిఎస్ఓ డిమాండ్ చేస్తోంది.

----------------------------------------------

ఎ. సురేష్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పిడిఎస్ఓ

12 మే, 2026 | విజయవాడ

AISYO Statement: Punish Those Responsible for the NEET-UG 2026 Scam--------------------------------All India Students an...
12/05/2026

AISYO Statement: Punish Those Responsible for the NEET-UG 2026 Scam
--------------------------------

All India Students and Youth Organisation (AISYO) strongly condemns the NEET-UG 2026 scandal that forced the National Testing Agency (NTA) to cancel the examination held on May 3. Lakhs of students spent years preparing for NEET under immense pressure and huge financial burden, only to see their future thrown into uncertainty because of corruption and institutional failure. Reports that “guess papers” matched more than 100 questions from the actual exam clearly expose the scale of the scam. The referral of the case to the CBI itself shows how serious the issue has become. Yet once again, students are being forced to suffer for the failure of authorities responsible for conducting the examination.

The NEET cancellation has exposed the growing corruption and negligence surrounding centralized entrance examinations. Even after repeated controversies in recent years, the authorities failed to prevent another major scandal. AISYO demands strict punishment for everyone involved in the paper leak and immediate accountability from NTA officials responsible for this failure. We also demand the resignation of the Union Education Minister for failing to protect the integrity of the examination system. Students cannot be made victims of corruption, incompetence, and the commercialization of education again and again.

--------------------------------

A. Suresh
Convenor
All India Students and Youth Organisation (AISYO)

12 May 2026 | Vijayawada

తిరుపతిలో స్టూడెంట్ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ----------------------------------ప్రజారోగ్యం, వైద్య విద్యపై పిడిఎస్ఓ ప్రచ...
12/05/2026

తిరుపతిలో స్టూడెంట్ ప్రత్యేక సంచిక
ఆవిష్కరణ సభ
----------------------------------

ప్రజారోగ్యం, వైద్య విద్యపై పిడిఎస్ఓ ప్రచురించిన స్టూడెంట్ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ తిరుపతిలోని ఎస్.వి. ఐటిఐ కళాశాలలో పిడిఎస్ఓ రాష్ట్ర కమిటీ సభ్యులు పవన్ అధ్యక్షతన నిర్వహించారు. డా. డి. గోవిందులు సంచికను ఆవిష్కరించి మాట్లాడుతూ వైద్యం, వైద్య విద్య ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగాల్సిన అవసరాన్ని ఈ సంచిక స్పష్టంగా వివరించిందని, ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందని అన్నారు. వైద్యం ప్రతి ఒక్కరి హక్కు అని పేర్కొన్నారు. పిడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకుంటూనే 107, 108 జీవోల ద్వారా వైద్య విద్యను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్రభుత్వం పిపిపి పద్ధతిలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్.వి. ఐటిఐ కళాశాల చైర్మన్ ఓమ్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వైద్యం ఖరీదైన సరుకుగా మారి పేదలపై తీవ్ర భారం మోపుతోందని అన్నారు. కరోనా కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులే ప్రజలకు అండగా నిలిచాయని, ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలపై భారీ దోపిడీకి పాల్పడ్డాయని విమర్శించారు. పిడిఎస్ఓ జిల్లా కార్యదర్శి ఆర్. ఆష మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులు అనవసర టెస్టుల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నాయని, ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. పిపిపి పద్ధతిలో వైద్య విద్య ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.



రేపటిపై ఆశలున్నవాడేనోయ్మానవుడు— చెరబండరాజు
12/05/2026

రేపటిపై ఆశలున్నవాడేనోయ్
మానవుడు

— చెరబండరాజు





సినిమాకు స్ఫూర్తి జీవితంలోంచి రావాలి.దాని మూలాలు జీవితంలో వుండాలి.కథలో వుండే అవాస్తవికతనూ,కథనంలోని నిజాయితీ లేమిని కప్పి...
10/05/2026

సినిమాకు స్ఫూర్తి జీవితంలోంచి రావాలి.
దాని మూలాలు జీవితంలో వుండాలి.

కథలో వుండే అవాస్తవికతనూ,
కథనంలోని నిజాయితీ లేమిని కప్పివేయడానికి
ఎంత సాంకేతిక పరిజ్ఞానం వున్నా చాలదు.

కాబట్టి దర్శకుడు జీవితం వైపు,
వాస్తవికత వైపు నడవాలి.

— సత్యజిత్ రే





చెమటంటే మట్టికిష్టం.అందుకే అదున్న చోట మట్టి వుంటుంది.ఈ నేలా, ఈ గాలీ, ఈ ఆకాశంచెమటోడ్చేవాడి సొత్తు.అందలమెక్కేవాడిది కాదు.—...
09/05/2026

చెమటంటే మట్టికిష్టం.
అందుకే అదున్న చోట మట్టి వుంటుంది.

ఈ నేలా, ఈ గాలీ, ఈ ఆకాశం
చెమటోడ్చేవాడి సొత్తు.

అందలమెక్కేవాడిది కాదు.

— వాసిరెడ్డి సీతాదేవి





Address

Vijaywada
Vijayawada
520002

Alerts

Be the first to know and let us send you an email when PDSO - Progressive Democratic Student's Organisation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PDSO - Progressive Democratic Student's Organisation:

Share