CPI బస్సు యాత్ర

CPI  బస్సు యాత్ర కమ్యూనిజమే ప్రత్యామ్నాయం.. ప్రజల కొరకు ఎర్రజెండా

పేర్ల మార్పుతో మోదీ ఉన్మాద చర్యలువెర్రి తలలు వేసేలా నిర్ణయాలుఉపాధి పథకం చట్టసవరణతో నిర్వీర్యంగాంధీజీని అవమానించడమే22 న ర...
19/12/2025

పేర్ల మార్పుతో మోదీ ఉన్మాద చర్యలు
వెర్రి తలలు వేసేలా నిర్ణయాలు

ఉపాధి పథకం చట్టసవరణతో నిర్వీర్యం

గాంధీజీని అవమానించడమే

22 న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజం

అమరావతి:
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పథకాల మార్పుతో ఉన్మాదం తలపించేలా వెర్రి తలలు వేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. ఇటీవల రాజ్‌భవన్‌ పేరును లోక్‌భవన్‌గా, తాజాగా ఉపాధి హామీ పథకానికి గాంధీజీ పేరు మార్చాలని చూడటం దుర్మార్గమన్నారు. ఈ మేరకు మంగళవారం ఈశ్వరయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పథకానికి రోజ్‌ గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (రామ్‌-జీ’) పేరు పెట్టీ..గాంధీజీని అవమానించాలని చూసే కుట్రని తెలిపారు. దేశంలో ఏ సమస్యలూ లేనట్లుగా ఈ తరహాగా పేర్ల మార్పుతో మోదీ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కేంద్రంలోని ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే..వారు ఈ తరహాగా పేర్లను మార్చడం వల్ల ఖర్చు తప్ప, వచ్చే లాభమేమిటని సూటిగా ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సవరణ బిల్లును చూస్తే..అది కేవలం పేరు మార్చడానికే ఉద్దేశించినదీ కాదన్నారు. పూజ్యబాపు గ్రామీణ రోజ్‌ఘర్‌ యోజన పేరుతో చేసిన సవరణ చాలా ప్రమాదకరమైందని, ఇది ఉద్దేశపూర్వకంగా మహత్మాగాంధీ పేరు తొలగించడమేనని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులపైన, ఈ దేశ మాజీ ప్రధానుల మీద బీజేపీకి ఎందుకంత కోపమో? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ చట్ట సవరణతో ఉపాధి హామీ పథకం అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుందని, ఇప్పటివరకు గ్రామీణ పేదలు అనుభవిస్తున్న ఉపాధిహామీ చట్టం కల్పించిన హక్కు రద్దవుతుందని పేర్కొన్నారు. 100 రోజుల పనిదినాన్ని 125 రోజుల పనిదినాలుగా పెంచుతూ చేసిన నిర్ణయం హర్షనీయమేనని తెలిపారు. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో కుటుంబానికి 100 రోజులు పనిదినాలు గ్యారెంటీగా కల్పించాల్సి ఉండగా...సగటున 50 పని దినాలనూ కేంద్ర ప్రభుత్వం కల్పించలేకపోయిందన్నారు. దీంతో వేలాది కూలీలు వలసలు వెళ్లిపోయారని తెలిపారు. ఈ చట్టం ప్రకారం పనిలేని రోజుల్లో నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉండగా..ఎక్కడా అమలు చేయలేదన్నారు. భూస్వాములు, పెత్తందార్ల ఒత్తిళ్ల మోదీ ప్రభుత్వం తలొగ్గి ఈ చట్టాన్ని నీరుగార్చేందుకు వ్యూహం రచిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు హక్కుగా ఉన్న ఈ చట్టంవల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరకడం గగనంగా మారుతుందన్నారు. వ్యవసాయ కూలీలు, పేద, మధ్యతరగతి రైతులు, పట్టణ శ్రామికులకు అనువుగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని తొలగించడం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుయత్నాలను ప్రతిఘటించడమేనని తెలిపారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగాన్ని ఎదుర్కొనేందుకు వ్యవసాయ కూలీలకు కనీస ఉపాధిని గ్యారెంటీ చేయడానికి 2005లో వామపక్షాల ఉద్యమంతో తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ చట్టాన్ని ఒక సాధారణ సంక్షేమ పథకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఐక్యంగా ప్రతిఘటించాల్సిన అవసరముందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ పేర్ల మార్పిడి నిర్ణయాల్ని విరమించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపైన, ప్రజా సమస్యల పరిష్కారంపైన దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

19/12/2025
*భగత్ సింగ్,రాజ్ గురు, సుఖదేవ్ ఆశయాలను కొనసాగిస్తాము**భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ అమలు చేయాలి**భగత్...
23/03/2024

*భగత్ సింగ్,రాజ్ గురు, సుఖదేవ్ ఆశయాలను కొనసాగిస్తాము*

*భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ అమలు చేయాలి*

*భగత్ సింగ్ జయంతి వర్ధంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి*

*నీలం రాజశేఖర్ రెడ్డి భవనం నందు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు*

నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష విధానం మారుస్తామని చెప్పి మోసం చేశారుగ్రూప్ 1 కు మరో మూడు నెలలు...
23/02/2024

నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న ఏపీపీఎస్సీ

గ్రూప్ 1 పరీక్ష విధానం మారుస్తామని చెప్పి మోసం చేశారు

గ్రూప్ 1 కు మరో మూడు నెలలు గడువు ఇవ్వాలి

రాజకీయ రంగు పులుముకున్న ఏపీపీఎస్సీ

జి ఈశ్వరయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తుంటే మరోవైపు నిరుద్యోగులతో ఏపీపీఎస్సీ తెలగాటమాడుతుందని ఏపీపీఎస్సీ రాజకీయ రంగు పులుముకుందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య అన్నారు శుక్రవారం వారు ఏపీపీఎస్సీ చైర్మన్ కు లేఖ పంపారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ శాఖల లోని ఉద్యోగాల నియామక ప్రక్రియ ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారని ఏపీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ అని అయితే ఏపీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ ల వ్యవహరించకుండా అధికార పార్టీ అనుబంధ సంస్థల వ్యవహరిస్తుందని తీవ్రంగా విమర్శించారు రాష్ట్రస్థాయిలో ఉన్నత ఉద్యోగ నియామకాలు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ద్వారా భర్తీ చేస్తుందని అయితే గ్రూప్ 1 మూడు దశలలో పరీక్ష విధానం ఉంటుందని ఇంటర్వ్యూలలో పారదర్శకత కొరవడిందని గతంలో జగన్మోహన్ రెడ్డి ఆరోపించి అధికారంలోకి రాగానే ఎటువంటి పరీక్షలకు ఇంటర్వ్యూ లేకుండా చేస్తామని చెప్పారు అంతేకాకుండా గ్రూప్ 1 పరీక్ష విధానం సిలబస్ మొత్తం ఉన్నత సాంకేతిక విద్య అభ్యసించిన వారికి అనుకూలంగా ఉందని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పేద మధ్యతరగతి వారు గ్రూప్ 1 సాధించలేకపోతున్నారని గతంలో ఆరోపణ నుంచి సంగతి తెలిసిందే అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నింటిలో మార్పులు తీసుకువస్తామని ప్రకటించారు తప్ప ఏది చేయలేదన్నారు
ఈ ప్రభుత్వంలో ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ పాత పరీక్ష విధానం సిలబస్ ప్రకారం నిర్వహించారు అయితే అందులో ధనవంతుల పిల్లలు ఉన్నత శాస్త్ర సాంకేతిక విద్య జాతీయ స్థాయి విద్యాసంస్థలలో చదివిన వారే ఎక్కువ మంది ఉన్నారు గ్రామీణ ప్రాంతా పేద మధ్యతరగతివి వారు గ్రూప్ 1 ఉద్యోగాలకు దూరమవుతున్నారని ఆవేదం వ్యక్తం
ఏపీపీఎస్సీ గత సంవత్సరం సెప్టెంబర్ లో గ్రూప్ 1 సిలబస్ మరియు పరీక్ష విధానంలో మార్పులు తీసుకువస్తున్నామని అందుకు అభ్యర్థుల నుండి విద్యావంతులు నుండి మేధావుల నుండి అభిప్రాయాలు స్వీకరించి కొత్త పరీక్ష విధానం సిలబస్ కూడా ప్రకటించారు అయితే దానికి అనుగుణంగా ప్రస్తుత గ్రూప్ 1నోటిఫికేషన్ ఇవ్వకుండా పాత పద్ధతిలోనే నిర్వహిస్తామని చెప్పి అభ్యర్థులను మానసిక ఒత్తిడికి అయోమయానికి గురి చేసి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారన్నారు ఏపీపీఎస్సీ క్రమబద్ధంగా నోటిఫికేషన్ లు జారీ చేయలేదు కనీసం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా సిలబస్ తగ్గట్టు సమయం ఇవ్వకుండా కేవలం ధనవంతుల కోసమే నోటిఫికేషన్లు ఇచ్చినట్లు వ్యవహరిస్తున్నది ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ కోచింగ్ సెంటర్లకు డబ్బులు తలేని ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థులను ఉన్నత ఉద్యోగాలకు జగన్ ప్రభుత్వం దూరం చేస్తుందని తీవ్రంగా మండిపడ్డారు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకున్నట్లు నా ఎస్ఐ లు నా ఎస్టీ లు నా బీసీలు నా మైనార్టీలు అంటున్నారు తప్ప వారికి సమాన అవకాశాలు కల్పించకుండా మోసం చేస్తున్నారన్నారు ప్రస్తుత గ్రూప్ 1 కు మరో రెండు నెలలు గడువు ఇవ్వాలని కోరారు లేకపోతే అభ్యర్థుల అందరితో ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు

10/02/2024

MEGA DSC నోటిఫికేషన్ ఇవ్వాలని కోరితే అక్రమ అరెస్టులా....AIYF

https://youtu.be/a1yedKX-SVE?si=dt4dL8Iau5zNZX4q
07/02/2024

https://youtu.be/a1yedKX-SVE?si=dt4dL8Iau5zNZX4q

మెగా డీఎస్సీ వేయకుంటే ముఖ్యమంత్రి జగన్ ను ఇంటికి పంపడం ఖాయమని.... నిరుద్యోగులు హెచ్చరించారు. మెగా డీఎస్సీ ఇస్తామ...

విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించి ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ తెలుగు సేన పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా న...
22/12/2023

విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించి ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ తెలుగు సేన పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్న సందర్భంగా వారికి సంఘీభావం ప్రకటించి ధర్నాలో ప్రసంగించడం జరిగింది .

Address

Dasari BhavanHanuman Pet Vijayawada
Vijayawada
520001

Telephone

+919052515470

Alerts

Be the first to know and let us send you an email when CPI బస్సు యాత్ర posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CPI బస్సు యాత్ర:

Share