iTDP Gollapudi

iTDP Gollapudi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from iTDP Gollapudi, Political Party, Vijayawada.

షడ్రుచుల సమ్మేళనమైన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది 🥭 సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 💐ఈ తెలుగు సంవత్సరాది 🌿...
19/03/2026

షడ్రుచుల సమ్మేళనమైన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది 🥭 సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 💐

ఈ తెలుగు సంవత్సరాది 🌿 మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ కొత్త ఆశలతో ముందుకు సాగుతూ.. మీరు, మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని… మీ ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

దేవినేని ఉమామహేశ్వరరావు
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

రామనామంతో మారుమోగిన బందరుకోట రామాలయంశోభాయమానంగా శిలా రాజగోపుర ప్రతిష్ఠ … అయోధ్య మహంతుల సమక్షంలో మహా కుంభాభిషేకంకృష్ణా, మ...
12/03/2026

రామనామంతో మారుమోగిన బందరుకోట రామాలయం

శోభాయమానంగా శిలా రాజగోపుర ప్రతిష్ఠ … అయోధ్య మహంతుల సమక్షంలో మహా కుంభాభిషేకం

కృష్ణా, మచిలీపట్నం: 12 మార్చి 2026

బందరుకోట రామాలయం రామనామంతో మారుమోగింది. ఆలయంలో శిలా రాజగోపుర ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

వేదపండితుల వేదఘోషల మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో శ్రీరాముని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా హోమం, సంపూర్ణ పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. సువాసినులు పవిత్ర సరయూ నది తీర్థానికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం శిఖర స్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి మహా కుంభాభిషేకాన్ని ఘనంగా జరిపారు. అయోధ్య సరయూ నది పుణ్యజలాలతో పాటు ద్వాదశ పవిత్ర నదీ జలాలను ఉపయోగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయోధ్య శ్రీరామమందిర మహంతులు ఆలయానికి సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించడం విశేషంగా నిలిచింది. అయోధ్య శ్రీరామజన్మభూమి మహంతు రాజనాథ్ పాండే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ మహత్తర కార్యక్రమంలో కాకినాడ శ్రీపీఠం స్వామీజీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి, గుడివాడ ప్రణవాశ్రమ పీఠాధిపతి స్థైర్యానంద సరస్వతి స్వామి పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందించారు. భక్తుల సందడి, వేదఘోషల మధ్య జరిగిన ఈ శిలా రాజగోపుర ప్రతిష్ఠ కార్యక్రమం బందరుకోట ప్రాంతంలో ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించింది.

దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించిన సావిత్రిబాయి పూలే వర్థంతి సందర్భంగా గొల్లపూడి కార్యాలయంలో పార్టీ న...
10/03/2026

దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించిన సావిత్రిబాయి పూలే వర్థంతి సందర్భంగా గొల్లపూడి కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి దేవినేని ఉమామహేశ్వరరావు గారు సావిత్రిబాయిపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

మహిళల అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే స్ఫూర్తి నేటి మహిళా ఉపాధ్యాయులకు ఆమె మార్గదర్శి

మహిళలను విద్యావంతులుగా చేయాలనే లక్ష్యంతో ఆనాడు సమాజ కట్టుబాట్లను ధిక్కరించి ఆమె చేసిన సాహసం నేటి ఆధునిక మహిళా శక్తికి బలమైన పునాదిగా నిలిచింది

సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం మహిళల విద్యకే పరిమితం కాకుండా, పురుషులకన్నా మిన్నగా అవకాశాలను సద్వినియోగం చేసుకునే స్థాయికి మహిళలను తీసుకొచ్చింది

ఆమె చూపిన దారిలోనే నేటి మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తున్నారు

సమాజంలో సగభాగమైన మహిళల విద్యాభివృద్ధిలో సావిత్రిబాయి పూలే కీలక పాత్ర పోషించారు. అందుకే ఆధునిక మహిళలు ఆమెకు సదా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది

మన దేశ మొట్టమొదటి మహిళా టీచర్, స్త్రీ విద్య, హక్కుల సాధన కోసం జీవితాంతం కృషిచేశారు. ఉపాధ్యాయ వృత్తిని సమాజ మార్పునకు శక్తిమంతమైన సాధనంగా భావించారు

మహిళా విద్యకు వెలుగులు నింపిన సావిత్రిబాయి పూలే సామాజిక వ్యతిరేకత, అవమానాలు ఎదురైనా బాలికల విద్య కోసం ధైర్యంగా ముందుకు సాగారు

హామీ నెరవేర్చిన కూటమి… ''మార్కాపురం జిల్లా'' కృతజ్ఞత సభకు సంసిద్ధం!25న సీఎం బహిరంగ సభను దిగ్విజయం చేద్దాం: దేవినేని ఉమావ...
23/02/2026

హామీ నెరవేర్చిన కూటమి… ''మార్కాపురం జిల్లా'' కృతజ్ఞత సభకు సంసిద్ధం!

25న సీఎం బహిరంగ సభను దిగ్విజయం చేద్దాం: దేవినేని ఉమా

వెలిగొండ జాతికి అంకితం పేరుతో జగన్ మోసం… ప్రజల తీర్పే 11 సీట్లు

మార్కాపురం : 23 ఫిబ్రవరి 2026

ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ మేరకు మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడం ద్వారా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 25న జరుగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేసి మార్కాపురం ప్రజల కృతజ్ఞతను చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సోమవారం సాయంత్రం మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సభ్యులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జిలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో దేవినేని ఉమా మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు ప్రాంత అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే ‘జాతికి అంకితం’ పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని దేవినేని ఉమా ఆరోపించారు. పనులు పూర్తికాకముందే ప్రారంభోత్సవాలు చేసి జిల్లా ప్రజల మనోభావాలతో ఆటలాడారని విమర్శించారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిన ఫలితంగానే వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి, పారదర్శక పాలనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. సీఎం సభను విజయవంతం చేయడం ద్వారా మార్కాపురం ప్రజల ఐక్యతను చాటాలని సూచించారు. ప్రతి బూత్ స్థాయిలో సమన్వయం చేసుకుని భారీగా ప్రజలను తరలించేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే కందుల ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, సీఎం సభను చారిత్రాత్మకంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యకర్తలు సమన్వయంతో పని చేసి సభ విజయానికి తోడ్పడాలని కోరారు. సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జిలు మరియు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఉన్నత విలువలకు ఎర్రన్నాయుడు ప్రతిరూపం : దేవినేని ఉమావిజయవాడ రూరల్ (గొల్లపూడి): 23 ఫిబ్రవరి 2026సుదీర్ఘ కాలం శ్రీకాకుళం ఎ...
23/02/2026

ఉన్నత విలువలకు ఎర్రన్నాయుడు ప్రతిరూపం : దేవినేని ఉమా

విజయవాడ రూరల్ (గొల్లపూడి): 23 ఫిబ్రవరి 2026

సుదీర్ఘ కాలం శ్రీకాకుళం ఎంపీగా పదవీ బాధ్యతలు చేపట్టి.. కేంద్ర మంత్రిగా వ్యవహరించి మూడు దశాబ్దాల పాటు గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాల్లో రాణించిన మహోన్నత వ్యక్తి కింజారపు ఎర్రన్నాయుడు గారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేసారు. సోమవారం గొల్లపూడి కార్యాలయంలో ఎర్రన్న జయంతిని పురస్కరించుకొని స్థానిక నేతలతో కలసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందుతూ, ప్రభుత్వ చీఫ్‌వీప్‌గా, నాలుగుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రైల్వే, అగ్రికల్చర్‌ స్టాండింగ్‌ కమిటీలకు చైర్మన్‌గా, లోక్‌సభ ప్యానెల్‌ స్పీకర్‌గా, పార్లమెంట్‌ హౌస్‌లో ఫుడ్‌ కమిటీ ప్రతినిధిగా పదవులు చేపట్టారని కొనియాడారు. అటు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, పొలిట్‌బ్యూరో సభ్యుడితో పాటు పార్టీ పార్ల మెంటరీ నేతగా అరుదైన గౌరవం దక్కించుకున్నారన్నారు. ప్రజలతో మమేకం కావడంతో ముందంజలో ఉండేవారని, చివరిగా గొల్లపూడిలో పాదయాత్ర ప్రారంభంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన ఆ మరుసటిరోజున రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడాన్ని జీర్ణించుకోలేకపోయామన్నారు. కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా, సోదరులు అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా, వాసు రాజమండ్రి శాసనసభ్యులుగా ప్రజాసేలందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎర్రన్న స్ఫూర్తిదాయకమన్నారు.

చెప్పులు, బూట్ల వేసుకొని దేవుడి ఫొటోలతో రాజకీయాలు మహాపాపం – వైసీపీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: దేవినేని ఉమా ధ్వజంఎ...
20/02/2026

చెప్పులు, బూట్ల వేసుకొని దేవుడి ఫొటోలతో రాజకీయాలు మహాపాపం – వైసీపీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: దేవినేని ఉమా ధ్వజం

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ (గొల్లపూడి), ఫిబ్రవరి 20:

దేవుడి ఫొటోలను ఉపయోగించి నిరసన ప్రదర్శనలు చేయడం అనైతికమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ పై తీవ్రంగా మండిపడ్డారు. ప్లకార్డుల్లో స్వామి చిత్రాలను పెట్టుకుని చెప్పులు వేసుకుని ర్యాలీలు చేయడం హిందూ సంప్రదాయాలపై అవమానమని పేర్కొన్నారు. స్వామివారి ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు తీసి భక్తితో స్వీకరించే సంస్కృతి మనదని, అలాంటి పవిత్రమైన విషయాన్ని రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చర్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. సభలో స్వామివారి పట్ల జరిగిన ఘటన మహాపాపమని, రాష్ట్ర ప్రజలకు వైసీపీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో ముద్దాయిగా జైలుకు వెళ్లిన వారు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా హెరిటేజ్ గురించి మాట్లాడాతరా అని ప్రశ్నించారు. 35 ఏళ్లుగా మచ్చలేకుండా నడుస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ పై రాజకీయ కక్షతో బురదజల్లుతున్నారని విమర్శించారు. వేల కోట్ల ఆస్తులను అడ్డగోలుగా అమూల్ కు దోచిపెట్టి ఇప్పుడు రైతులు, డెయిరీల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలు బయటపడతాయనే భయంతోనే అసెంబ్లీకి వెళ్లడం లేదని వైసీపీపై ఉమా తీవ్ర విమర్శలు గుప్పించారు.

వైసీపీ ప్రభుత్వం హయంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు నిరసనగా ధర్నా సందర్భంగా పెట్టిన అక్రమ కేసు మరియు జక్కంప...
13/02/2026

వైసీపీ ప్రభుత్వం హయంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు నిరసనగా ధర్నా సందర్భంగా పెట్టిన అక్రమ కేసు మరియు జక్కంపూడి కాలనీలో పెట్టిన అక్రమ కేసుల నిమిత్తం విజయవాడ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణకు దేవినేని ఉమామహేశ్వరరావు గారు మరియు మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరవ్వడం జరిగింది.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు, మాజీ ముఖ్యమంత్రి అన్న నందమూరి తా...
18/01/2026

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు, మాజీ ముఖ్యమంత్రి అన్న నందమూరి తారకరామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన తెలుగు తేజోమూర్తి సంస్మరణ కార్యక్రమంలో దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొని అన్న ఎన్టీఆర్ గారికి నివాళులర్పించడం జరిగింది.

మన వ్యవసాయక జీవన విధానంలో రైతుకు సాయం అందిస్తూ, అండగా నిలిచే పశుసంపదను, పాడి సంపదను పూజిస్తూ.. వాటి గొప్పదనాన్ని తెలిపేల...
16/01/2026

మన వ్యవసాయక జీవన విధానంలో రైతుకు సాయం అందిస్తూ, అండగా నిలిచే పశుసంపదను, పాడి సంపదను పూజిస్తూ.. వాటి గొప్పదనాన్ని తెలిపేలా ఘనంగా జరుపుకునే సంక్రాంతి ముగింపు వేడుకైన కనుమ పండుగ సందర్భంగా ప్రతి ఇల్లు పాడిపంటలతో, ధనరాశులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు.

దేవినేని ఉమామహేశ్వరరావు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు


14/01/2026
శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా కృష్ణాజిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన ...
13/01/2026

శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా
కృష్ణాజిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన అంబటి బ్రాహ్మణయ్య గారి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నా ఘన నివాళులు.

దేవినేని ఉమామహేశ్వరరావు
మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

*జగన్మోహన్ రెడ్డి కడుపులో విషం పోవాలంటే అమరావతిలో జరుగుతున్న పనులను పరిశీలించాలి: మాజీ మంత్రి దేవినేని ఉమా*_నభూతో న భవిష...
08/01/2026

*జగన్మోహన్ రెడ్డి కడుపులో విషం పోవాలంటే అమరావతిలో జరుగుతున్న పనులను పరిశీలించాలి: మాజీ మంత్రి దేవినేని ఉమా*

_నభూతో న భవిష్యత్ అన్న విధంగా ప్రజా రాజధాని అమరావతి పనులు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక పోతున్నాడు_

_అమరావతిపై ఐదేళ్లపాటు సాగించిన విష ప్రచారానికి, చేసిన విధ్వంసకాండ కు ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ రెడ్డి వైఖరిలో మార్పు రాలేదు నేడు మళ్లీ విష ప్రచారానికి తెర లేపాడు_

_జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలితో వైసిపి పార్టీ ప్రతిపక్షానికి కూడా పనికిరాదని తేలిపోయింది_

_రాష్ట్రంలో ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటై యువకులు బయటకు వెళ్లకుండా రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుంటే జగన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు_

_జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా అమరావతిలో జరిగే పనులను ఆపలేరు అవినీతి సాక్షి పత్రిక, ఛానల్ కూడా విషప్రచారానికి తెరదింపాలి_

_ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకని దుస్థితికి వైసీపీ చేరుతుంది_

_మూడు వేల కోట్ల పైగా ఖర్చుపెట్టి కుప్పం కన్నా ముందు పులివెందులకు కృష్ణా జలాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది_

_సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదు_

_ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చింతలపూడి ఎత్తిపోతల పూర్తిచేసి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తారు_

_మచ్చుమరి ఎక్కడ ఉందో జగన్మోహన్ రెడ్డికి తెలుసా? 800 అడుగుల్లో రాయలసీమకు నీళ్లు ఇవ్వచ్చని సొల్లు కబుర్లు చెబుతున్న వైసీపీ నేతలకు తెలుసా?_

_అవుకు టెండర్ కాంట్రాక్టర్ను అడిగితే జగన్ రెడ్డి బండారం బయటపడుతుంది_

_రాయలసీమ మారుమూల ప్రాంతాలకు కూడా నీటిని తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది_

_ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలన్న జగన్మోహన్ రెడ్డి కుట్రలు పనిచేయవు_

_గత టిడిపి ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగంలో 68 వేల కోట్లు ఖర్చుపెడితే నీ ఐదేళ్ల హయాంలో సగమైన ఖర్చు పెట్టావా జగన్ రెడ్డి_

_లారీలో గేట్లు తెచ్చి ట్యాంకర్లతో నీళ్లు పోసిన జగన్ రెడ్డి డ్రామాలు కుప్పం ప్రజలకు తెలుసు కుప్పంకు నీళ్లు ఇచ్చానని చెప్పటానికి జగన్ రెడ్డికి సిగ్గుండాలి_

_జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనతో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం రానున్న రెండు నెలల్లో కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది_

_కాంట్రాక్టు సంస్థపై కక్షగట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ నాలుగేళ్లు ఎలా నాశనం చేసావో నేను చెప్పాలా జగన్ రెడ్డి_

_జగన్ రెడ్డి క్రెడిట్ చోరీ డ్రామాలు చూస్తుంటే దొంగే.. దొంగ దొంగ అన్నట్లు ఉంది_

_రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి నేడు అప్పుల గురించి జగన్ రెడ్డి మాట్లాడడం విడ్డూరం_

_తిరుమలలో మీరు చేసిన పాపాలు మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశాయి. నేడు మళ్ళీ తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని అడ్డంగా దొరికిపోయారు

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Gollapudi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share