The sun rising in the east is Devineni Avinash

The sun rising in the east is Devineni Avinash A WINNING GOAL (2024)
TEAM
DEVINENI AVINASH
ANAND PUNNAM
@ BEZAWADA EAST

07/04/2024

తల్లి లాంటి పార్టీ ఆఫీసులో కూర్చుని రాష్ట్ర ముఖ్యమంత్రి,మా నాయకుడు జగన్ గారి తల్లిని దూషించవచ్చా ?.... తూర్పు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ #దేవినేనిఅవినాష్ గారు 🔥👌

14/03/2024

𝙰𝙽𝙰𝙽𝙳 𝙿𝚄𝙽𝙽𝙰𝙼
💐💐శతమానం భవతి....
మనసున్న మహారాజు ........
తూర్పున రారాజు ........
అందరి శ్రేయోభిలాషి.........
కృష్ణమ్మ తల్లీ ముద్దు బిడ్డ........
నిగర్వి దేవినేని అవినాష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు....💐💐
నేడే నేడే అవినాష్ జన్మదినం. విజయాలకు పొంగక.అపజయాలకు కుంగక. ఆరడుగుల ఆత్మ విశ్వాసంతో. అలుపెరుగని పోరాటంతో .తెలుగు జాతి సౌరాభాన్ని. విజయవాడ పౌరుషాన్ని వైసీపీ కార్యకర్తల గుండె లోతుల్లో నాటుతున్న తేట తెలుగు రైతు బిడ్డ జన్మదినం.....
గుండె ధైర్యమున్న వాడిని ఏ విధి ఓడించదని కష్టాలేదురువుతున్న కూడా మడమ తిప్పకూడదని నీ సాహసమే ఆయుధమని మాటలతో కాక చేతలతో చూపించి. మమ్మలిని ముందుకి నడిపిస్తున్న మా అవినాష్ జన్మదినోత్సవం..మీరు రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీ తో MLA గా గెలుపొందాలని .....
మీ భవిష్యత్తు బంగారు మయం కావాలని మీరు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి అనేక విజయాలు సాధించాలని .మనసా. వాచ .
కర్మణా కోరుకుంటూ..
మీ క్షేమాన్ని కాంక్షించే
మీ
𝙰𝙽𝙰𝙽𝙳 𝙿𝚄𝙽𝙽𝙰𝙼
𝚄𝚜𝚘
𝙴𝚡 𝚙𝚛𝚎𝚜𝚒𝚍𝚎𝚗𝚝
𝚂𝚎𝚗𝚒𝚘𝚛 𝚓𝚘𝚞𝚛𝚗𝚊𝚕𝚒𝚜𝚝
𝚈𝚌𝚙 𝚜𝚎𝚗𝚒𝚘𝚛 𝚕𝚎𝚊𝚍𝚎𝚛
𝙱𝚌 𝚌𝚎𝚕𝚕 𝚋𝚎𝚣𝚊𝚠𝚊𝚍𝚊

27/02/2024

𝙰𝙻𝙻 𝚃𝙷𝙴 𝚅𝙴𝚁𝚈 𝙱𝙴𝚂𝚃
𝚈𝚂 𝙹𝙰𝙶𝙰𝙽 𝚂𝙸𝚁
𝙰𝙽𝙳
𝙳𝙴𝚅𝙸𝙽𝙴𝙽𝙸 𝙰𝚅𝙸𝙽𝙰𝚂𝙷 𝙶𝙰𝚁𝚄. ..💐💐
𝙰𝙽𝙰𝙽𝙳 𝙿𝚄𝙽𝙽𝙰𝙼
𝙼𝙰𝙲𝙷𝙰𝚅𝙰𝚁𝙰𝙼 𝚅𝙸𝙹𝙰𝚈𝙰𝚆𝙰𝙳𝙰 𝙴𝙰𝚂𝚃
ఇక నా చేతుల్లో ఏమీ లేదు - ఇక అంతా మీరే చూసుకోవాలి !

ఇప్పటి వరకూ నేను పని చేశా - ఇక పూర్తిగా మీరే పని చేయాలి !

మీకు ఓ పెద్ద ఆయుధం ఇచ్చా - మరే నాయకుడూ అలాంటి ఆయుధం ఇవ్వలేదు !

25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే.

వైసీపీకి ఓటు వేయకపోతే జన్మభూమి కమిటీలు కావాలని సంతకం పెట్టినట్లే.

ఇప్పుడు ప్రకటించిన పేర్లే దాదాపు ఫైనల్‌ లిస్ట్.

45 రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి.

దాదాపుగా టికెట్లు కన్‌ఫామ్‌ అయినట్లే.

పేదవాడు బాగుపడాలంటే వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ రావాలి. - సీఎం జగన్‌.

*వైఎస్సార్ సీపీ పొలిటికల్ అప్డేట్**రాష్ట్ర వ్యాప్తంగా "మేము సిద్ధం మా బూత్ సిద్ధం"**47 వేల బూత్ కమిటీల నియామకం పూర్తి**2...
21/02/2024

*వైఎస్సార్ సీపీ పొలిటికల్ అప్డేట్*

*రాష్ట్ర వ్యాప్తంగా "మేము సిద్ధం మా బూత్ సిద్ధం"*

*47 వేల బూత్ కమిటీల నియామకం పూర్తి*

*2024 ఎన్నికల్లో 175/175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ*

ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. 2024 ఎన్నికల్లో 175/175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ సీపీ కార్యాచరణ పూర్తి చేసింది. ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా సిద్ధం పేరుతో భారీ క్యాడర్ మీట్ లు నిర్వహించిన సీఎం జగన్ ఎన్నికలే టార్గెట్ గా మరో కీలక ఘట్టం పూర్తి చేశారు. సాధారణంగా ఎన్నికలకు ముందు చేపట్టాల్సిన ఈ కార్యక్రమం 50 రోజుల ముందే పూర్తి చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా నిలుస్తోంది. దీంతో సీఎం జగన్ వైఎస్సార్ సీపీని ఎన్నికల ప్రచారంలో ఇతర పార్టీల ముందు నిలిపారు. ఇప్పటికే అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ కసరత్తు తుది దశకు చేరడంతో సీఎం జగన్ కార్యకర్తల సన్నాహంపై దృష్టి సారించారు. కార్యకర్తలతో సమావేశాల్లో ఇటీవల నిర్వహించిన రాప్తాడు వేదికగా సిద్దం సభకు భారీ స్థాయిలో హాజరైన క్యాడరే నిర్వచనం. అదే సమయంలో వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్ మరో ముఖ్య నిర్ణయం తీసుకున్నారు.

*రాష్ట్ర రాజకీయాల్లో సీఎం జగన్ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా..*

రాష్ర్ట రాజకీయాల్లో ఇంత వరకు ఏ పార్టీ చేయని సాహసం చేసి సీఎం జగన్ కొత్త తరం రాజకీయాలకు దిక్సూచిగా నిలిచారు. అదే వైఎస్సార్ సీపీ పాలనలో ఏపీలో అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్. గ్రామ స్థాయిలో వార్డు సభ్యుల నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యుల నుంచి మండల అధ్యక్షుల వరకు, జెడ్పీటీసీ సభ్యుల నుంచి జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, క్యాబినెట్ మంత్రుల వరకు 80 శాతం ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి చరిత్ర సృష్టించారు. దీంతో అత్యున్నత పదవులైన ఉప ముఖ్యమంత్రులుగా వెనుకబడిన మరియు అణగారిన వర్గాల నేతలను నిలిపి సామాజిక సమీకరణలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. వెనుకబడిన వర్గాలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిన పార్టీలకు చెంపచెట్టులా.. సీఎం జగన్ అధికారాన్ని అన్ని వర్గాలకు పంచారు. దీంతో పాటు ప్రత్యక్ష నదగు బదిలీ (DBT) పథకాలలో 80 శాతం ప్రయోజనాలు బడుగు, బలహీన వర్గాలకే అందించారు.
ఇప్పటి వరకు వైఎస్సార్ సీపీ 68 మంది అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, 16 మంది (25 మందిలో) పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల జాబితాను విడుదల చేయగా అందులో బలహీన వర్గాలకు పెద్దపీఠ వేసింది.

*పోలింగ్ బూత్ స్థాయిలో సీఎం జగన్ వ్యూహం*

సీఎం జగన్ ప్రతీ నియోజకవర్గంలో పార్టీ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్దుల ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ (సామాజిక సమీకరణలు) అనుగుణంగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు. ఓ వైపు అభ్యర్థులను ఫైనల్ చేస్తున్న వైఎస్సార్ సీపీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ పైన ఫోకస్ చేస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఎన్నికల పరిశీలకులతో పాటుగా ప్రతీ వార్డులోనూ ప్రత్యేకంగా పార్టీ కన్వీనర్లను నియమించారు. దీంతో పాటు ప్రతీ పోలింగ్ బూత్ స్థాయిలో 15 మందితో కమిటీలను ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తగా ఉన్న దాదాపు 47 వేలకు పైగా పోలింగ్ బూత్ కమిటీలు ఏర్పాటు చేసింది.

*ప్రతీ సీటు - ప్రతీ ఓటే లక్ష్యం*

ఈ కమిటీల్లో స్థానికంగా పోలింగ్ బూత్ పరిధిలో పార్టీ కోసం పని చేస్తున్న వారికి సామాజిక వర్గాల వారీగా, మహిళలకు అవకాశం కల్పిస్తూ ఏర్పాటు చేసారు. ప్రతీ కుటుంబాన్ని బూత్ కమిటీ సంప్రదించి వారికి ప్రభుత్వంలో అందిన లబ్ధి వివరించేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో పథకాలు, సామాజిక న్యాయం అమలు చేస్తున్నా.. ఎన్నికల సమయంలో కీలకంగా నిలిచే పోల్ మేనేజ్మెంట్ పై సీఎం జగను దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థులను ఎక్కువగా రంగంలోకి దింపనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు ఉండరాదనే లక్ష్యంతో బూత్ కమిటీలను పక్కాగా నియమించారు. ఈ క్రమంలోనూ ప్రతీ ఇంటితోనూ పార్టీ కేడర్ మమేకం అయ్యేలా 15 మందితో స్థానికంగా ఎంపిక చేసి వారితో బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు.

*కమిటీలు - ఎన్నికల వార్ రూమ్ సిద్దం*

ఎన్నికల ప్రచారంతో పాటుగా.. పోలింగ్ రోజున పార్టీ శ్రేణులు కీలకంగా వ్యవహరించాల్సిన ఉంది. ఈ క్రమంలో చురుకుగా ఉండే బూత్ కమిటీలపై వైఎస్సార్ సీపీ ప్రత్యేక శ్రద్ధ సారించింది. బూత్ కమిటీలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి సీఎం జగన్ రోడ్ మ్యాప్ ఖరారు చేసారు. జిల్లా కేంద్రాల నుంచి ప్రతీ పోలింగ్ బూత్ స్థాయి వరకు ఎన్నికల పరిస్థితులు, పోలింగ్ రోజున జరిగే పరిణామాలు, రాష్ట్ర, నియోజకవర్గ స్థాయి పరిస్థితులపై ఎప్పటికిప్పుడు సమాచారం సేకరిస్తూ.. అవసరమైన మార్గనిర్దేశం చేసేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో పార్టీ సీనియర్లతో వార్ రూమ్ నిర్వహణకు నిర్ణయించారు. దీని ద్వారా ప్రతీ సీటు.. ప్రతీ ఓటు కీలకమనే ప్రణాళికపై సీఎం జగన్ పార్టీ సీనియర్ నేతలకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు.

*నేడు రాజ్యసభలో.. రేపు అసెంబ్లీలో టీడీపీ ఖాళీ ఖాయం*

సిద్ధం క్యాడర్ సమావేశాలతో వైఎస్సార్ సీపీ దూసుకెళుతోంది. సిద్ధం సభలతో జనమంతా జగన్‌తోనే అన్న నినాదం మారుమోగుతోంది. ఓ వైపు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ప్రకటన, మరో వైపు పోల్ మేనేజ్ మెంట్, బూత్ లెవెల్ క్యాంపెయిన్ల కోసం 47 వేల బూత్ కమిటీల నియమించి 2024 ఎన్నికలే టార్గెట్ గా వైఎస్సార్ సీపీ ముందుకెళ్తోంది.

అధికార పార్టీలో పరిస్థితి ఇలా ఉంటే ప్రతిపక్ష పార్టీల పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పొత్తులతో ఎన్నికలకు వస్తాం అని ప్రకటించిన టీడీపీ కనీసం జనసేనతో పొత్తులపై క్లారిటీ ఇవ్వలేదు. ఎవరికి వారే రెండు పార్టీల అభ్యర్థులను ప్రకటించకుంటున్నారు. దీంతో ఏ నాయకుడు ఎక్కడ పోటీ చేస్తారో తెలీని తికమక నడుస్తోంది. దీనికి తోడు ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఖాళీ అవడంతో ఆ పార్టీ పార్టీ క్యాడర్ ను మరింత కుంగదీసింది. 41 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి సారి టీడీపీ రాజ్యసభలో సభ్యత్వం కోల్పోయింది.

వైఎస్సార్ సీపీ మాత్రం ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసిన మూడు స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికైంది. దీంతో ప్రస్తుతం రాజ్యసభలో ఖాళీ అయిన టీడీపీ త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ర్ట అసెంబ్లీలో కూడా ఖాళీ అవనుందని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొంటున్నారు. ఒక్కొక్క సభలో టీడీపీని ఖాళీ చేస్తున్నామని.. త్వరలో లోక్‌సభ, శాసనసభలో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు పేర్కొంటున్నారు.

సోషల్‌ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది.ట్విట్టర్‌ (X)లో దేశంలోనే తొలి స్థానంలో ‘సిద్ధం’ హ్యాష్‌ట్యా...
18/02/2024

సోషల్‌ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది.

ట్విట్టర్‌ (X)లో దేశంలోనే తొలి స్థానంలో ‘సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.

సిద్ధం అప్‌డేట్స్‌ను వైసీపీ అభిమానులు భారీగా షేర్‌ చేస్తున్నారు.

‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ నిండిపోయింది.

ఈ క్రమంలోనే నేడు అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం సభకు సీఎం జగన్‌ సిద్దమయ్యారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలురాప్తాడులో వైసీపీ సిద్ధం సభ జనసముద్రంలా కనిపిస్తోందిపెత్తందారులత...
18/02/2024

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు

రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ జనసముద్రంలా కనిపిస్తోంది
పెత్తందారులతో మన యుద్ధం జరగబోతుంది
2024లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది
పెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా?
విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోంది
పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా?
చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా?
ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా?
చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా?
చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికైనా సామాజిక న్యాయం గుర్తుకొస్తుందా?
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 10 శాతమైనా అమలు చేశారా?
1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలో 10 శాతమైనా అమలు చేశారా?
మళ్లీ అబద్దాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారు
రంగురంగుల మేనిఫెస్టోలతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడు
చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే
అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకు అనేది చంద్రబాబు సిద్ధాంతం
14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశారా?
చంద్రబాబు అబద్ధాలను నమ్మొద్దని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి
గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారు
గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతపెట్టి చంద్రబాబు కుర్చీని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారు
చంద్రబాబును మళ్లీ ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా?
కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా ఉందా?
57 నెలల పాలనలో చిత్తశుద్ధితో పాలన అందించాం
57 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
57 నెలల పాలనలో జరిగిన మంచిని ప్రజలందరికీ వివరించండి
ప్రతీ ఇంట్లో జరిగిన మంచిని ప్రతీ ఒక్కరికీ వివరించండి
చేసినవి చెప్పాలి, వాటి కొనసాగింపు ఎంత అవసరమో చెప్పాలి
ప్రతి అవ్వా, తాత ముఖంలో చిరునవ్వులు చూశాం
ప్రతి అక్క, చెల్లెమ్మకు ఎంతో మేలు చేశాం
రైతులకు రైతు భరోసా తీసుకొచ్చి ఇచ్చాం
రైతన్నకు పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చాం
మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెని చంద్రబాబు లాక్కుంటారు
వైఎస్ఆర్ సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఎన్నో పథకాలు గుర్తొస్తాయి
31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మనది
ప్రతీ అక్కచెల్లెమ్మ ఫోన్ లో దిశ యాప్ తీసుకొచ్చాం
చంద్రబాబు మోసాలను ప్రతీ రైతన్నకు వివరించాలి
సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలి
ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి
గతంలో ఎన్నడూ చూడని విధంగా నాడు-నేడుతో మార్పులు తెచ్చాం
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం
పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చాం
కేవలం కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు రాకూడదంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలి
వాళ్లంతా మనకు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలి
సైకిల్ గుర్తుకు ఓటు వేయడమంటే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడమే
YSRCP మార్క్ ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తోంది
ప్రజలు ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇవన్నీ చేశాం
ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే మరిన్ని మంచి పనులు చేస్తాం
లంచాలకు తావులేకుండా పేదల ఖాతాల్లోకి నగదు బదిలీ జరుగుతోంది
57 నెలల్లోనే 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాం
ఇందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం
చంద్రబాబుకు ఓటు వేయడమంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయడమే
మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేశాం
3 సార్లు సీఎం అయిన చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదు
అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి?
సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు?

ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానంఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు అవకాశంవిద్యాహక్కు చట్టం కింద 2024-25 విద్...
17/02/2024

ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు అవకాశం

విద్యాహక్కు చట్టం కింద 2024-25 విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు ఉచిత అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న అనాథలు, హెచ్ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు.

రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో వీరికి 25 శాతం సీట్లు కేటాయించామని అన్నారు.

ఒకటో తరగతి నుంచి ప్రవేశానికి ఈ నెల 23 నుంచి మార్చి 14వ తేదీ వరకు అర్హత గల విద్యార్థుల ఆధార్ వివరాలతో http:-cse.ap.gov.in సైట్ లో అప్లై చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సమీప మండల విద్యాశాఖాధికారి లేదా జిల్లా విద్యాశా ఖాధికారిని గానీ, 18004258599 టోల్ ఫ్రీ నం బరులో గానీ సంప్రదించాలని సూచించారు.

15/02/2024

ANAND PUNNAM
DEVINENI AVINASH YOUTH
VIJAYAWADA EAST

ఫిబ్రవరి 15 - గుంటూరు ( వాలంటర్ వందనం కార్యక్రమం)

ఫిబ్రవరి 18 - అనంతపురం (సిద్ధం ముగింపు సమావేశం మరియు మేనిఫెస్టో విడుదల)

ఫిబ్రవరి 21 - కుప్పం (వైఎస్ఆర్ చేయూత)

ఫిబ్రవరి 24 - అన్నమయ్య జిల్లా ( రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ)

ఫిబ్రవరి 27 - కర్నూలు (YSR EBC నేస్తం 3వ దశ విడుదల)

మార్చి 05 - ఒంగోలు (విద్యా దీవెన 4వ త్రైమాసికం విడుదల)

మార్చి 11 - శ్రీ సత్యసాయి జిల్లా (వసతి దీవెన 2వ దశ విడుదల)

మార్చి 06- చివరి క్యాబినెట్ సమావేశం (ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడతాయి)

మార్చి 12 - ఎన్నికల నోటిఫికేషన్

మార్చి 14 నుండి ఏప్రిల్ 14 వరకు - 30 రోజులు - 120 నియోజకవర్గాలు, 21 పార్లమెంటరీ సెగ్మెంట్లు మరియు రోజుకు 2 సమావేశాలు @ ఎన్నికల ప్రచారం
ఏప్రిల్ 19 - పోలింగ్ రోజు
మే 22 - కౌంటింగ్ డే

11/02/2024

*సిద్ధం ముగింపు సభ మరియు 2024 ఎన్నికల మేనిఫెస్ట్...*
*ఈ క్రమంలో మరో అడుగు ముందుకేయనున్నారు వైఎస్ జగన్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు వచ్చిన చివరి నెల ఇదే కావడంతో జగన్ జోరు పెంచారు. ఈ నెలలో ముఖ్యమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్ కూడా సిద్ధమైంది.*

👉 *ఈ నెల 13వ తేదీన విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లనున్నారు. బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. 16వ తేదీన కుప్పంలో పర్యటిస్తారు జగన్. చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గంలో వైఎస్సార్ చేయూత నిధులను విడుదల చేయనున్నారు.*

👉 *18వ తేదీన సిద్ధం బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇది ముగింపు సభ. అనంతపురం జిల్లా రాప్పాడులో జరిగే ఈ సభలోనే కొత్త ఎన్నికల మేనిఫెస్టో‌ను విడుదల చేయనున్నారు వైఎస్ జగన్. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన నవరత్నాలకు మించిన స్థాయిలో హామీలు ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.*

👉 *21వ తేదీన అన్నమయ్య రాయచోటి జిల్లాలో పర్యటిస్తారు. రైతుల ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేస్తారు. 24వ తేదీన కర్నూలులో ఈబీసీ నేస్తం మూడో విడత నిధులను విడుదల చేస్తారాయన. 27వ తేదీన గుంటూరులో విద్యా దీవెన నాలుగో త్రైమాసికం నిధులను జగన్ విడుదల చేస్తారు.*

👉 *మార్చి 5వ తేదీన శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా నుంచి జగనన్న వసతి దీవెన రెండో విడత నిధులను విడుదల చేస్తారు. అదే నెల 6వ తేదీన చివరి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది.*

03/02/2024

*✍️మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా*

*✍️రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు*

*✍️ఇంతమంది తోడేళ్ల మధ్యన వైయ‌స్‌ జగన్‌ ఒంటరిగానే కనిపిస్తాడు*

*✍️కానీ నిజం ఏంటంటే..కోట్ల మంది హృదయాల్లో వైయ‌స్ జగన్‌ ఉన్నాడు*

*✍️జగన్‌ ఒంటరివాడు కాదన్నది ఇక్కడ కనిపిస్తున్న జనమే నిజం*

*✍️కోట్లాది మంది గుండెల్లో జగన్‌ ఉండటమే నిజం*

*✍️నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే*

*✍️వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో మీరంతా కృష్ణుడైతే నేను అర్జునుడిని*

*✍️దుష్టచతుష్టయం దాడి అంతా అభివృద్ది, సంక్షేమం మీదనే*

*✍️రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తోంది*

*✍️మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మనది*

*✍️పేదవాడి భవిష్యత్తు, సంక్షేమం మీద వారంతా దాడి చేస్తున్నారు*

*✍️గ్రామగ్రామాల్లో మనం తెచ్చిన మార్పు స్పష్టం కనిపిస్తోంది.*

*✍️అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం*

*✍️అందించిన సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యం*

*✍️175కు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యం*

*✍️నా మాటలన్నీ ప్రతీ ఇంటికి వెళ్లి పెంచుకోవాలని కోరుతున్నా*

*✍️చంద్రబాబు పాలనకు, జగన్‌ పాలనకు తేడాను గమనించండి*

*✍️సచివాలయ వ్యవస్థతో గ్రామాల్లో వచ్చిన మార్పులు గమనించండి*

*✍️మహానేత వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తూ పాలన అందిస్తున్నాం*

*✍️అబద్దాల పునాదులపై ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి*

*✍️వచ్చే ఎన్నికలు.. పేదల భవిష్యత్‌ను నిర్ణయించేవి*

*✍️ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ జగనే*

*✍️3వేల పెన్షన్‌ అందాలన్నా.. భవిష్యత్‌లో పెరగాలన్నా.. మీ జగనే రావాలి*

*✍️ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికీ చెప్పాలి*

*✍️చెప్పిన ప్రతీది చేసిన ప్రభుత్వం మనది*

*✍️ప్రజలు నా స్టార్‌ క్యాంపెయినర్లు*

*✍️జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యమని చెప్పాలి*

*✍️పేదలకు అండగా నిలిచేందుకు 57 నెలల్లో 124 సార్లు బటన్‌ నొక్కాం..*

*✍️రూ.2 లక్షల 55వేల కోట్లు పేదల ఖాతాల్లో నేరుగా జమ చేశాం*

*✍️మీరు నా కోసం ఒక్కసారి బటన్‌ నొక్కండి*

*✍️ఒకటి అసెంబ్లీ,ఒకటి పార్లమెంట్‌కు ఫ్యాన్ గుర్తు మీద నొక్కితే చంద్రముఖి బెడద మీకు శాశ్వతంగా ఉండదు*

*✍️ప్యాకేజీ కోసం రా.. కదలిరా అంటూ బాబు.. దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు*

*✍️ప్రజల రక్షణ కోసం పుట్టిన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ*

*✍️చంద్రబాబు అండ్‌కోపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా*

మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, సీఎం జగనన్న అన్నారు. ఇంటింటి చరితను.. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు.. మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మరోసారి మీరంతా సిద్ధమేనా? అని సీఎం జగనన్న కేడర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. పేదల భవిష్యత్తులను, పేదల్ని కాటేసే యెల్లో వైరస్‌ మీద.. కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్టచతుష్టయంపై సంగ్రామానికి ప్రతీ ఒక్కరూ సిద్ధమేనా? అని సీఎం జగనన్న పిలుపునిచ్చారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, యెల్లో మీడియా వీళ్లంతా ఏకం అయ్యి నా మీద యుద్ధానికి దిగారు. రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు చంద్రబాబు అండ్‌ కో రూపంలో ఉన్నారు. వాళ్లు.. ఆ తోడేళ్ల మంద వైపు నుంచి చూస్తే ఈ సీన్‌ చూస్తుంటే వైయ‌స్ జగన్‌ ఒంటరి వాళ్లలా కనిపిస్తాడు. కానీ, నిజం ఏంటంటే.. ఇక్కడ వైయ‌స్ జగన్‌ ఏనాడూ ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులు అయితే.. వారి యెల్లో పత్రికలైతే.. వారి యెల్లో టీవీలు అయితే.. నాకున్న తోడు, నా ధైర్యం, నా బలం.. పైనున్న దేవుడు.. ఈ ప్రజలు అని సీఎం జగనన్న భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరులో వైయ‌స్ఆర్‌సీపీ నిర్వహించిన సిద్ధం ఎన్నికల శంఖారావం సభలో ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన పార్టీ కేడర్‌ను ఉద్దేశించి సీఎం జగనన్న ప్రసంగించారు.

*✍️సీఎం జగనన్న ఏమ‌న్నారంటే..*
సిద్ధమా..
సిద్ధమా..
మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా?
ఇంటింటి చరిత్రను పేదింటి భవిష్యత్‌ను మరింత గొప్పగామార్చి పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా సిద్ధమేనా?
పేదల భవిష్యత్‌ను, పేదలను కాటేసే ఎల్లో వైరస్‌ మీద కనిపిస్తున్న కరోనా లాంటి దుష్ట చతుష్టయంపై యుద్ధానికి, ఓ మహోసంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన నా ప్రతి అక్కాచెల్లెమ్మ, నా సోదరుడు, స్నేహితుడు, అవ్వాతాతలు..మీరంతా కూడా సిద్ధమేనా?
రామాయణం, మహాభారతం..మన ఖర్మ ఏంటంటే ఈ రెండింటిలో ఉన్న విలన్లు అంతా కూడా ఓ చంద్రబాబు రూపేనా..ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు కోవర్టులు..ఇంత మంది తోడేళ్లంతా ఏకమై మీ జగన్‌ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు.
కానీ ఈ సీన్‌ వారి వైపు నుంచి చూస్తే..జగన్‌ ఒంటరి వాడిలా కనిపిస్తాడు. ఇంత మంది తోడేళ్ల మధ్య జగన్‌ ఒంటరిగానే కనిపిస్తాడు..నిజమేంటంటే..ఇక్కడ కనిపిస్తున్నది నిజం. ఇది అసలు సీన్‌. ఇన్ని లక్షల హృదయాల్లో మీ జగన్‌ మీ గుండెల్లో మీరు స్థానం ఇచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్‌ మీ గుండెల్లో ఉండటం ఇదీ నిజం.
జగన్‌ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులు అయితే..వారి ఎల్లో పత్రికలు అయితే, వారి ఎల్లో టీవీలైతే..నాకున్న తోడు ఏంటో తెలుసా? నా తోడు ..నా «ధైర్యం..నా బలం..పైనున్న దేవుడు, మీ గుండెల్లో పెట్టుకున్న మీరంతా నా బలం. ఇది నాయకుడిపై ఉన్న నమ్మకం నుంచి పుట్టిన సైన్యం. ఇక్కడ కనిపిస్తున్న నా అక్కచెల్లెమ్మలు, నా అన్నదమ్ములు సైన్య కనిపిస్తుంది.
జరుగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణుడి పాత్ర పోష్తి..అర్జునుడి నేను..మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలు. మనమంతా కూడా కౌరవ సైన్యంపై యుద్ధం చేస్తాం.
మన సంక్షేమంపై, మనం చేస్తున్న మంచిపై, అభివృద్ధిపై వారు యుద్ధం చేస్తున్నారు. మన ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి మంచి చేస్తున్నాం..పేదవాడి భవిష్యత్‌ మీద, పేదవాడి సంక్షేమం మీద, గ్రామ గ్రామ అభివృద్ధిపై వారు దాడి చేస్తున్నారు.
ఈ రోజు మన పెత్తందార్లంతా కూడా ఎవరిపై దాడి చేస్తున్నారో ఆలోచన చేయండి. మన ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానంపైన, పోర్టులు, మెడికల్ కాలేజీలు, పారిశ్రామిక మౌలిక అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తోంది. ఆలోచన చేయండి.
చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రలు, కుతంత్రాలను చీల్చి చెండాడటానికి మన సైన్యం, మన కేడర్, నా కుటుంబ సభ్యులంతా కూడా సిద్ధమేనా?
మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించేందుకు ఈ రోజు గోదారి సీమలో నిలబడ్డాను.
ఇంటింటా మనం చేసిన అభివృద్ధి, గ్రామ గ్రామాన మనం తెచ్చిన వ్యవస్థ..చరిత్రలో ఎప్పుడూ జరగని సామాజిక న్యాయం..వీటన్నింటికి మనందరి ప్రభుత్వమే కేరాఫ్‌ అడ్రస్‌..ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగిరేసి చెప్పుకునేలా తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175 కు 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు గెలిచేందుకు వివరించేందుకు ఇక్కడికి మీ వాడిగా వచ్చాను.

*✍️చంద్రబాబు ఏం చేశాడో ప్రతి ఇంట్లో అడగండి..*
ప్రతి ఇంటికి వెళ్లి మనం చేసిన మంచిని పంచుకోండి. ప్రతి ఇంటికి వెళ్లి అడగండి..1995లో చంద్రబాబు సీఎం అయ్యాడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. మీ ఇంటికిగానీ, మీ ఊరికి గానీ, మీ సామాజిక వర్గానికి గానీ, మీ కుటుంబ భవిష్యత్‌కు ఏమీ చేశాడని ప్రతి ఇంట్లో అడగండి.
అదే పేద కుటుంబాన్ని అడగండి గత పదేళ్లుగా వారి బ్యాంకు ఖాతా వివరాలు వారినే చూడమని అడగండి. చంద్రబాబు ఐదేళ్లు, మీ బిడ్డ జగన్‌ పాలనలో ఐదేళ్లు..మొత్తం పదేళ్ల బ్యాంకు ఖాతాల వివరాలను గమనించమని కోరండి.
చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆ పేద కుటుంబానికి ఇచ్చింది ఎంత అని అడగండి. వారిని నిలబెట్టేలా అందించిన పథకాలు చంద్రబాబు హయాంలో ఏమున్నాయో అడగండి. చంద్రబాబు ఒక్క రూపాయి కూడా నా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో వేశాడా అని వారినే అడగండి.
చంద్రబాబు మూడుసార్లు సీఎం అయ్యాడు..టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో పది శాతమైనా అమలు చేశాడా అని ప్రతి ఇంట్లో అడగండి.

*✍️మీ బిడ్డ జగన్‌ పాలనలో..*
మరోవంకా మీ బిడ్డ జగన్‌ పాలన చూడండి అని మళ్లీ అడగండి. ఈ 57 నెలల పాలనలో మీ బిడ్డ ఏం చేశాడో కొన్ని అంశాలను ప్రస్తావిస్తాను. ఈ తేడాను ప్రతి ఇంట్లో వివరించండి.
కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలోనైనా..
మరో విషయాన్ని మీరందరూ గమనించండి. ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా.. కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా ఏ గ్రామైమైన తీసుకొండి. ఏ గ్రామానికి వెళ్లినా..ఆ గ్రామానికి చంద్రబాబుగారు ఏం చేశారు అంటే చెప్పడానికి ఏమీ కనిపించదు. కారణం చెప్పడానికి ఏమీ లేదుకాబట్టి.
మరి మీ బిడ్డ, మీ జగన్‌ ఏం చేశాడంటే... ఈ 57 నెలల్లో ప్రతి గ్రామంలోనూ ఎన్నెన్నో మార్పుల కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో అడుగుపెట్టిన వెంటనే గ్రామసచివాలయం కనిపిస్తుంది. అందులో 540కు పైగా పౌరసేవలు , దాదాపు 10 మంది మన పిల్లలే శాశ్వత ఉద్యోగాలు చేస్తూ చిక్కటి చిరునవ్వుతో కనిపిస్తారు. ఈ శాశ్వత వ్యవస్ధను మన గ్రామాలకు తీసుకువచ్చింది ఈ 56 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. ఎక్కడా కరెప్షన్‌ లేకుండా, లంచాల్లేకుండా, వివక్ష లేకుండా ఇంటింటికీ ఒకటో తారీఖున ఉదయాన్నే పెన్షన్‌ అయినా పౌరసేవలైనా, లేకపోతే ఏ పథకమైనా కూడా మన గడపకే వచ్చిన చిరునవ్వుతో అందించే మనలో భాగమైన ఓ గ్రామవాలంటీర్ల వ్యవస్ధ తీసుకువచ్చింది కూడా ఈ 56 నెలల్లోనే, మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.
అదే గ్రామంలోనే రైతన్నలను చేయిపట్టుకుని నడపించే ఒక ఆర్బీకే వ్యవస్ధ ఆ గ్రామంలో కనిపించేంది, వచ్చింది కూడా మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి రైతన్న ఇంటికి వెళ్లి చెప్పండి. అదే గ్రామంలో మరో నాలుగుఅడుగులు వేస్తే ఒక విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌ ఇంటింటికీ జల్లెడ పడుతూ ప్రతి పేదవాడికీ తోడుగా ఉండేందుకు ఆరోగ్యసురక్ష కార్యక్రమం మీ బిడ్డ ప్రభుత్వంలోనే వచ్చాయని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి పేదవాడికి చెప్పండి.
నిరుపేదలు చదువుకునే మన గ్రామంలోని గవర్నమెంటు బడికి నాడు నేడుతో మళ్లీ మంచిరోజులు వచ్చి, అందులో చదువుకునే పిల్లలకు ఇంగ్లిషు మీడయంతో మొదలు, ట్యాబులు, ఐఎఫ్‌పీలు, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ వచ్చింది కూడా మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు వేస్తే సచివాలయంలో మహిళా పోలీస్‌ గ్రామంలోనే కనిపిస్తుంది.
ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో ఫోన్‌. ప్రతి ఫోన్‌ లో దిశ యాప్‌ కనిపిస్తుంది. మహిళా పోలీసు గానీ, అక్కచెల్లెమ్మల ఫోన్‌లలో దిశ యాప్‌ గానీ ఏ అక్కచెల్లెమ్మకు అయినా అపాయం సంభవిస్తే.. కేవలం ఒక బటన్‌ నొక్కిన వెంటనే, లేదా ఫోన్‌ను 5 సార్లు ఊపిన వెంటనే 10 నిమిషాల్లోనే అక్కచెల్లెమ్మ దగ్గరికి పోలీసు సోదరుడు వచ్చే వ్యవస్థ వచ్చింది కూడా ఈ 56 నెలల్లోనే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
ఇవన్నీ కూడా మన గ్రామానికి వచ్చిన బ్రాడ్‌ బ్యాండ్‌. బ్రాండ్‌ బ్యాండ్‌ సేవలుతో పాటు డిజిటల్‌ లైబ్రరీలు కట్టే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవన్నీ ప్రతి గ్రామంలో మనందరి ప్రభుత్వంలో ఈ 57 నెలల్లోనే చేసిన గొప్పమార్పులుగా ప్రతి ఒక్కరికీ కనిపిస్తాయి.
కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని అయినా తీసుకున్నా కనిపిస్తాయి. ఇలాంటి ఆలోచనలు, మార్పులు తీసుకురావాలని, కరప్షన్, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికీ చేయి పట్టుకొని నడిపించాలనే ఆలోచనలు, ప్రతి రైతన్నకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు అండగా నిలబడాలనే ఆలోచనలు... మూడుసార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పాలించిన చంద్రబాబునాయుడుకి ఏనాడూ కూడా కనీసం మనసుకు కూడా రాలేదు. మూడుసార్లు పాలించినా, 75 ఏళ్ల వయస్సువచ్చినా.. ఇంత గొప్పగా చేయొచ్చన్న ఆలోచన కూడా ఆ పెద్దమనిషికి రాలేదు.

*✍️విద్యారంగంలో చూస్తే...*
ఏ గవర్నమెంట్‌ బడిని తీసుకున్నా మొత్తంగా విద్యా రంగాన్ని తీసుకున్నా నాడునేడు, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, బైలింగ్వల్‌ పాఠ్యపుస్తకాలు,శ్రీమంతుల పిల్లలకు అందుబాటులో ఉండే బైజూస్‌ కంటెంట్‌ను మన ప్రభుత్వ బడుల పిల్లలకు అందించడం, గవర్నమెంట్‌ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు, ఏకంగా క్లాసు రూముల్లో ఐఎఫ్‌ పీలు, గోరుముద్ద, పిల్లలకు బడి తెరిచే సరికే విద్యాకానుక, పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు, వారి తల్లిదండ్రులు అప్పులుపాలయ్యే పరిస్థితులు రాకూడదని పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, విదేశాల్లోని టాప్‌ యూనివర్సిటీలతో ఆన్‌ లైన్‌ వర్టికల్స్‌ ద్వారా డిగ్రీల అనుసంధానం, జాబ్‌ ఓరియెంటెడ్‌ కరిక్యులమ్‌ లో మార్పులు, ఇంటర్న్‌ షిప్‌ కంపల్సరీతో డిగ్రీలో మార్పులు ఇలా ఏది తీసుకున్నా గుర్తుకు వ‌చ్చేది మీ జ‌గ‌నే.

*✍️రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌*
రైతు సంక్షేమాన్ని చూస్తే మనమెక్కడ, చంద్రబాబు ఎక్కడ? ఆలోచన చేయండి. రుణ మాఫీ చేస్తానని నిలువునా ముంచినది చంద్రబాబు. రూ. 87,612 కోట్లు రైతులు బ్యాంకులకు కట్టొద్దని పిలుపునిచ్చాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలని అడ్వర్టైజ్‌మెంట్‌ ఇచ్చాడు. మొట్ట మొదటి సంతకంతోనే రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం చేశాడు. మేనిఫెస్టోలో పెట్టాడు. రుణమాఫీ నిలువునా ముంచినది చంద్రబాబు అయితే, ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. ఆర్బీకే అంటే జగన్‌. విత్తనమైనా, ఎరువులైనా, ఇన్‌ పుట్‌ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీజగన్‌.
పగటిపూటే ఉచిత విద్యుత్‌ అయినా, రైతులకు ఉచిత బీమా, సున్నా వడ్డీ అయినా అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ అయినా అందుతుంది అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌.

*✍️వైద్య, ఆరోగ్యంలోనూ...*
ఇక ప్రజల వైద్యం, ఆరోగ్యం విషయానికి వస్తే.. ఒక 108 చూసినా, ఒక 104 చూసినా ఏకంగా 3257 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ విస్తరించిన తీరు చూసినా, ఆరోగ్య ఆసరా చూసినా, గ్రామస్ధాయిలోనే విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌ జల్లెడ పడుతూ నిర్వహిస్తున్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్‌ కాలేజీలు, ఏ ఆశుపత్రికి వెళ్లినా డాక్టర్లు, నర్సులు కొరత ఉండదాని ఒక్క వైద్య రంగంలోనే ఏకంగా 53 వేల కొత్త నియామకాలు.. నాడునేడుతో బాగుపడుతున్న ఆస్పత్రులు. ఇలా ఏది తీసుకున్నా కనిపించేది.. ఒక వైయస్సార్, ఒక జగన్‌. ఒక వైయస్సార్‌ సీపీ మార్క్‌ కనిపిస్తుంది.

*✍️సామాజిక న్యాయానికి పెద్దపీట*
పేద సామాజికవర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ నామినేటెడ్‌ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరీ సగం పదవులన్నీ కూడా ఈ వర్గాలకే ఇవ్వడం మొదలు.. కేబినెట్‌లో ఏకంగా 68 శాతం మంత్రిపదవులు, నలుగురు డిప్యూటీ సీఎంలు, చట్టసభ స్పీకర్‌ గా ఒక బీసీలకే అందించాం. కౌన్సిల్‌ చైర్మన్‌ గా ఎస్సీ. డిప్యూటీ చైర్‌ పర్సన్‌ గా నా అక్క ఒక మైనార్టీ. ఇక్కడ నుంచి మొదలు పెడితే స్థానిక సంస్థల పదవులన్నింటిలో చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి వారినందరినీ గుండెల్లో పెట్టుకున్న‌ది మీ బిడ్డ పాల‌న‌లోనే అని చెప్ప‌డానికి గ‌ర్వ‌ప‌డుతున్నాను.

*✍️84 శాతం ఉద్యోగాల్లో నా..నా..నావాళ్లే క‌నిపిస్తారు*
మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల కాలంలోనే అక్షరాలా 2.13 లక్షల గవర్నమెంట్‌ ఉద్యోగాలు తీసుకొచ్చాం.
స్వతంత్య్రం వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్‌ లో 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక అదనంగా మరో 2.13 లక్షల గవర్నమెంట్‌ ఉద్యోగాలిచ్చాడు. ఈ ఉద్యోగాల్లో ఏకంగా 80 శాతం నా... అని పిలుచుకొని నా తమ్ముళ్లు, చెల్లెమ్మలే అక్కడ ఉన్నారని గర్వంగా తెలియజేస్తున్నాను.

*✍️అక్క‌చెల్లెమ్మ‌ల‌ను ల‌క్షాధికారుల‌ను చేయాల‌ని..*
ఏకంగా రూ.2.53 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్లిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. ఏకంగా 75 శాతానికి పైగా నా అంటూ నేను పిలుచుకొనే నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అయింది. అక్క‌చెల్లెమ్మ‌ల‌కు 50 శాతం నామినేటెడ్ ప‌ద‌వులు, ప‌నుల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించింది మీ జ‌గ‌నే. ప్రతి అక్కచెల్లెమ్మ సంతోషంగా ఉంటే కుటుంబాలు బాగుంటాయి. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన అక్కచెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా వాళ్ల ముఖాలలో సంతోషాలను చూడాలని అక్కచెల్లెమ్మల కోసం ఎప్పుడూ జరగని విధంగా ఒక ఆసరా, ఓ అమ్మ ఒడి, సున్నా వడ్డీ, చేయూత, వారు ఉండటానికి గూడు ఉండాని, , లక్షాధికారి కావాలని 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడుతున్నవి మరో 22 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇలా ఇంటింటికీ మేలు చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఎక్కడ చూసినా కూడా కనిపించేది మీ బిడ్డ జ‌గ‌నే.

కేవలం ఈ 56 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం మాత్రమే ఈరోజు ఆ పని చేయగలిగింది. ఓ లంచాలు లేని వ్యవస్థ, గ్రామ స్థాయిలో మీరు, నేను కలిసి ఈరోజు ఇవ్వగలుగుతున్నాం. ప్రతి పేదవాడికీ న్యాయం, మంచి చేస్తున్నాం.
లంచం, వివక్ష లేని సుపరిపాలనను తీసుకొచ్చింది ఓ వైయస్ఆర్‌సీపీ పార్టీ, మీ బిడ్డ జ‌గ‌నే.
ప్రతి ఇంటికీ ఈ వాస్తవాలను తీసుకెళ్లండి..మనం అధికారంలోకి రాకముందు ఏ ప్రభుత్వం కూడా ఇది సాధ్యపడుతుందా అని అనుకున్నారు. దాన్ని మనం సాధ్యం చేశాం. గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందా అని 2019కి ముందు అన్నారు. ఈ రోజు అవన్నీ జరుగుతున్నాయి. దానికి కారణం మీ బిడ్డ జగనే.
ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా లంచాలు, వివక్షకు తావు లేకుండా..అర్హత ఒక్కటే ప్రమాణంగా నేరుగా పేదల చేతికి అందించడం సాధ్యం కాదు అని ఎవరైనా అంటే..కాదు అది సాధ్యమే..ఒక్క జగనన్న పాలనలోనే సాధ్యమైందని దేశానికే చూపించాం.
ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అంటూ పెద్ద పెద్దవి రిలీజ్‌ చేస్తారు. వాగ్ధానాలు చేసి మోసం చేస్తారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారు. మొట్టమొదటిసారిగా మీ బిడ్డ వచ్చిన తరువాతే మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకువచ్చాం. మీ బిడ్డ చెప్పింది ప్రతిదీ చేశాడు.
మొట్ట మొదటి సారిగా మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి దాన్ని చూపించి చిక్కటి చిరునవ్వుల మధ్య వారి ఆశీస్సులు తీసుకున్నది ఒక్క వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే . ఇవన్నీ కనిపిస్తున్నా కూడా కళ్లుండి చూడలేని కబోదులు ఏమంటున్నారో మీరు వింటున్నారు కదా? వారికి టీవీ చానళ్లు ఉన్నాయని మనల్ని తిడుతున్నారు.
అబద్ధాల పునాదుల మీద ఎన్నికల ప్రచారాన్ని వాళ్లు మొదలుపెట్టారు. ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ముఖ్యమో ప్రతి పేద ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ చెప్పాలి. ఈ ఎన్నికలు కేవలం ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకునేవి కావు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని చెప్పండి.. రాష్ట్రంలోని పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అని చెప్పండి. ప్రతి సామాజిక వర్గం భవిష్యత్, ప్రతి ప్రాంతం భవిష్యత్, ప్రతి ఇంట్లో జరుగుతున్న అభివృద్ధి, వారి పిల్లల చదువులతో ముడిపడిన ఎన్నికలు ఇవి అని చెప్పండి. ప్రతి ఇంట్లో చెప్పండి.
ఇప్పటికే మనం రూ.3 వేలు పింఛన్‌ 1వ తేదీ ఉదయాన్నే అందాలన్నా..భవిష్యత్‌లో ఇది పెరగాలన్నా..ఇంటికే పింఛన్‌ రావాలన్నా..మీ ఊరికే, మీ ఇంటికే వైద్యం అందాలన్నా, వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పులపాలు కాకూడదన్నా..అది మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే చేయగలదని ఇంటింటికీ వెళ్లి చెప్పండి. ఇది జరగాలంటే అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు ప్రతి ఒక్కరూ స్టార్‌ క్యాంపెయినర్లుగా బయటకు రావాలి. ప్రతి ఒక్కరూ కూడా కనీసం వందమందికైనా మంచి గురించి చెప్పాలి.
అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, ఈ బీసీ నేస్తం కొనసాగాలన్నా..సున్నా వడ్డీ రావాలన్నా, వైయస్‌ఆర్‌ ఆసరా ఇచ్చిన మీ అన్న జగనన్న ప్రభుత్వం మళ్లీ రావాలని చెప్పండి. ప్రతి అక్కచెల్లెమ్మ స్టార్‌ క్యాంపెనయిర్‌గా బయటకు వచ్చి కనీసం వందమందికైనా చెప్పాలి.
31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి నా అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని మనం ప్రారంభించిన 22 లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు వారి సొంతింటి కల నెరవేరాలన్నా కూడా మీ అన్న ప్రభుత్వమే చేయగలదు..మీ జగనన్న మాత్రమే చేయగలరు అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. మీరే స్టార్‌ క్యాంపెయినర్లుగా మంచిని చెప్పాలి.
గవర్నమెంట్‌ బడులు మారాలన్నా, ఇంగ్లీష్‌మీడియం చదువులు రావాలన్నా, డిజిటల్‌ బోర్డులతో చదువులు, మీ బిడ్డలు ట్యాబులతో చదువులు కొనసాగాలన్నా..అంతర్జాతీయ చదువులు మీ బిడ్డకు అందాలంటే మీ అన్న జగనన్న ప్రభుత్వం మళ్లీ రావాలని చెప్పండి. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రతి ఒక్కరికీ చెప్పండి.
ప్రతి రైతుకు చెప్పండి..రైతు భరోసా కొనసాగాలన్నా, మెరుగైన ఆర్‌బీకే సేవలు అందాలన్నా, ఉచితంగా ఇన్సూరెన్స్‌ రావాలన్నా, ఇన్‌పుట్‌ సబ్సిడీ దొరకాలన్నా, పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందాలన్నా కేవలం జగనన్న మాత్రమే చేయగలడని చెప్పండి. ప్రతి రైతన్న స్టార్‌ క్యాంపెయినర్‌ కావాలని చెప్పండి.
ఈ 57 నెలల్లో ఏకంగా మీ బిడ్డ 124 సార్లు ప్రజల కోసం బటన్‌ నొక్కాడు.ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లడం జరిగింది.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మనందరి ప్రభుత్వం రూ.2.55 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించాం. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి వారే అండగా, స్టార్‌ క్యాంపెయినర్లుగా నిలవాలని గడప గడపకు వెళ్లి కోరండి.
ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి, ఈ మంచిని కొనసాగింపునకు మద్దతుగా 2024లో జరిగే ఎన్నికల్లో జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి రెండు బటన్లు నొక్కలేమా అని అడగండి.
జగనన్నకు ఓటు వేయకపోవడం, ప్రతిపక్షాలకు ఓటు వేయడం అంటే దాని అర్థం ఈ స్కీమ్‌ల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్లు అవుతుందని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.
ఈ రోజు ప్రతి ఇంటి వద్దనే సేవలు అందుతున్నాయి. ప్రతిపక్షాలకు ఓటు వేయడం అంటే దాని అర్థం మళ్లీ లంచాలు, వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను బతికించినట్లే అని చెప్పండి.
మన గ్రామంలో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ మంచి జరగాలంటే జగనన్నను మరచిపోకూడదని ప్రతికి వెళ్లి చెప్పండి.
ఆ ఇంటికే పింఛన్‌ రావాలన్నా..డీబీటీ స్కీమ్‌లు రావాలన్నా జగనన్న వల్లే సాధ్యమవుతుంది. అందుకే మీ జగనే సీఎంగా ఉండాలి. మన వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమే కొనసాగాలి. ఇందుకోసం మనమందరం బయటకు రావాలని చెప్పండి.
జగనన్న పైన దేవుడిని, మనల్నే నమ్ముకున్నాడు. జగనన్న పొత్తులను నమ్ముకోలేదు. జగనన్నకు తోడేళ్ల మద్దతు లేదు. నక్క జిత్తులు వేసే అలవాటు లేదు. అబద్ధాలు చెప్పే అలవాటు లేదు అని ప్రతి ఇంట్లో చెప్పండి.
ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంట్‌కు ఫ్యాన్‌ మీద మీరు నొక్కితే..గత ఎన్నికల్లో మీరు బటన్‌ నొక్కి పెట్టేలో బందించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా ఉండదు. చంద్రగ్రహణాలు ఉండవు. లేదంటే చంద్రముఖి సైకిల్‌ ఎక్కుతుంది..టీ గ్లాస్‌ పట్టుకుని పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ ఇంటింటికి వచ్చి అబద్ధాలు, మోసాలతో డ్రాకులా మాదిరిగా వస్తుందని గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరికీ చెప్పండి.
మరో విషయం కూడా మీరు గమనించాలి..14 ఏళ్లు సీఎంగా చేసినా కూడా చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు రాజకీయమంతా కూడా పొత్తులు, ఎత్తులు, నక్కజిత్తులతో రాజకీయం చేస్తున్నారు.
ఈ మధ్య చంద్రబాబుకు ఎన్టీఆర్‌ గుర్తుకు వస్తున్నాడు. వెన్నుపోటు పొడిచేది ఆయనే..మళ్లీ ఎన్నికలప్పుడు గుర్తుకు తెచ్చుకుంటాడు. తెలుగు దేశం పిలుస్తుంది రా..కదిలిరా అంటూ దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు. వదినమ్మను పిలుస్తున్నాడు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీని, వైయస్‌ఆర్‌ మరణం తరువాత ఆయన పేరును చార్జ్‌షిట్‌లో పెట్టిన కాంగ్రెస్‌ పార్టీని కూడా రా..కదలిరా అని చంద్రబాబు పిలుస్తున్నాడు.
అసలు చంద్రబాబుకు, దత్తపుత్రుడికి, చంద్రబాబు వదినమ్మకు ఈ స్టేట్‌తో సంబంధమే లేదు. ఈ రాష్ట్రానికి వారికి ఎలాంటి సంబంధమే లేదు. ఏ ఒక్కరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. వారంతా కూడా నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రులు. వారికి ఏనాడైనా కూడా ప్రజలతో పనిపడినప్పుడు మాత్రమే గుర్తుకు వస్తారు. కాబట్టే ఆయన సైకిల్‌ తొక్కడానికి ఇద్దరిని, దాన్ని తోయడానికి మరో ఇద్దరిని పొత్తులో తెచ్చుకుని రా..కదిలిరా అని పిలుస్తున్నాడు.
చంద్రబాబుకు పొత్తు లేకపోతే కనీసం 175 స్థానాల్లో పోటి చేసేందుకు అభ్యర్థులు కూడా లేరు. ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్నే టార్గెట్‌గా ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నాయి. పేదవాడి భవిష్యత్‌ టార్గెట్‌గా, సంక్షేమమే టార్గెట్‌గా వీరంతా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నారు. వీరితో యుద్ధానికి నేను సిద్ధం..మీరు సిద్ధమా అని అడుగుతున్నాను.
ఈ యుద్ధం 15 ఏళ్లుగా నాకు అలవాటే..నాతో నడిచారు కాబట్టి మీకు అలవాటే..ఇది ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా పుట్టిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. కనిపిస్తున్న జెండాకు అర్థం..ఈ ఒక్కడి మీద దేశంలోకెళ్ల బలమైన వ్యవస్థను ప్రయోగిస్తే ప్రజలు భుజాన మోసిన ఎజెండా మన జెండా..
వంద బాణాలను, కౌరవ సైన్యాన్ని ప్రజా క్షేత్రంలో మరోసారి ఎదుర్కొనేందుకు , మరో గొప్ప విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా?
పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి అభిమానికి, ప్రతి ఒక్క వాలంటీర్‌కు ఒక్క విషయం చెబుతున్నాను. వీరితో పాటు వైయస్‌ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులందరికీ ఒక్కటే చెబుతున్నాను. ఇది మీ అందరి పార్టీ. మీ జగన్‌ , మీ బిడ్డ మీ అందరికి ఒక మంచి సేవకుడు. కార్యకర్తలను నాయకులను అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరుగకుండా కార్పోరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్‌ పదవులు ఇచ్చాం. మార్కెట్‌ యార్డు చైర్మన్లుగా చేసింది మీ అన్న ప్రభుత్వమే.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం వివక్షతో జన్మభూమి కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తే..మీ బిడ్డ ప్రభుత్వం మనలో ఒక్కరైన వలంటీర్‌తో ఇంటింటికి వెళ్లి సంక్షేమం అందిస్తున్నాం.
మన పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరికి ఇవ్వని అవకాశం మనం ఇచ్చాం. ఎవరు గెలవనన్ని పదవులు, వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మేయర్లు, కార్పొరేటర్లు, ఎంపీపీలు, మంత్రి మండలి వరకు అన్నింటిలో కూడా జగన్‌ను నమ్మిన వారికి అంచెలంచెలుగా అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పడానికి గర్వపడుతున్నాను.
మంచి పాలన అందించాం. ప్రతి ఇంటికి మంచి చేశాం. లంచాలు, వివక్ష లేకుండా గొప్ప పాలన ఇవ్వగలుగుతామని చేసి చూపించాం. ఈ రోజు గర్వంగా చెబుతున్నాను. మనంలో ఉన్న ఎవరైనా పోటీ పడితే రాష్ట్ర ప్రజలు గొప్పగా గెలిపిస్తారు. భవిష్యత్‌లో ఇంతకంటే గొప్పగా పదవులు ఇచ్చే పార్టీ మన వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పడానికి గర్వపడుతున్నాను.
ఈ రోజు వ్యక్తిగతంగా ఒక విషయం చెబుతున్నాను. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలియజేస్తున్నాను. ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ అన్న ఇచ్చే సలహా ఒక్కటే..గొప్పగా సేవ చేయండి..గొప్పగా మంచి చేయండి..లంచాలు లేని, వివక్ష లేని ఒక మంచి పరిపాలనలో మీ వంతు కృషి చేయండి. మిమ్మల్ని మరో రెండు మెట్లు ఎక్కించే బాధ్యత నాది.
వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్‌ 175కు 175 ఎమ్మెల్యేలు. మన టార్గెట్‌ 25 ఎంపీ స్థానాలు, పరిపాలనలో ఎక్కడా కూడా తగ్గలేదు కాబట్టి మనకు ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే కానీ తగ్గడానికి వీలే లేదు. ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరితో ఓటు వేయించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా?
సంక్షేమ పథకాల రద్దుకు జరిగే కుట్రలను తిప్పికొట్టేందుకు మీరంతా సిద్ధమేనా?
సమరభేరీ కంగుమంది..ఎన్నికల శంఖం మోగుతోంది. మనకున్న అస్త్రం మీ జేబులో ఉన్న మీ సెల్‌ఫోన్‌. ఈ సెల్‌ఫోన్‌తో సోషల్‌ మీడియాలో సిద్ధంగా ఉన్నారా?
మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు. మనకు దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. మనకు తోడు పైన దేవుడు, మంచి జరిగిన ప్రతి ఒక్కరూ మనకు తోడు అని ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తున్నాను.
రాబోయో 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రజా క్షేత్రంలో పోరాటం చేసేందుకు మీరంతా సిద్ధమేనా..దిక్కులు పిక్కటిల్లేలా సిద్ధం అని నినదించండి.
దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో మరో మూడు నెలల్లో మనందరి ప్రభుత్వం ఇంతకు మించిన ఉత్సాహంతో కొలువుదీరుతుందని చెబుతూ సీఎం జగనన్న తన ప్రసంగాన్ని ముగించారు

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when The sun rising in the east is Devineni Avinash posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category