Kesineni Foundation

Kesineni Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kesineni Foundation, Kesineni Foundation, Koneru Bullayya, Chowdary street, Patamata, Benz Circle, Vijayawada.

Kesineni Foundation is a Voluntary Organisation committed to empowering individuals and families to lead happier lives with healthier relationships, and to bring positive change in the community.

12/03/2026

విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారి ద్వారా కేశినేని ఫౌండేషన్ లో మహిళలకు ఉపాధి దిశగా శిక్షణ..

హోమ్ లిక్విడ్స్ తయారీపై కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న చింతా అరుణకుమారి గారు తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ శిక్షణలో భాగంగా డిటర్జెంట్ పౌడర్ (సర్ఫ్) తయారీ విధానం మరియు దానికి అవసరమైన ముడి పదార్థాల గురించి సమగ్రంగా నేర్చుకున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లోని National Institute of Rural Development and Panchayati Raj (NIRD) లో మానస గారి మార్గదర్శకత్వంలో ఈ శిక్షణ పొందినట్లు చెప్పారు. సర్ఫ్ తయారీకి అవసరమైన 13 రకాల ముడి పదార్థాల గురించి వివరంగా అవగాహన కలిగిందని తెలిపారు.

మహిళలకు నైపుణ్యాభివృద్ధి కల్పించి, స్వయం ఉపాధి అవకాశాలు పెంచడం కేశినేని ఫౌండేషన్ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తిరువూరు తెలుగుదేశం పార్టీ మరియు కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరువూరులో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని యువనేత...
08/03/2026

తిరువూరు తెలుగుదేశం పార్టీ మరియు కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరువూరులో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని యువనేత కేశినేని వెంకట్ బాబు గారు ప్రారంభించారు.

ఆంధ్ర ఆసుపత్రి వైద్య బృందం సహకారంతో నిర్వహించిన ఈ మెడికల్ క్యాంపులో సాధారణ వ్యాధులతో పాటు క్యాన్సర్, కంటి, కిడ్నీ, దంత, వినికిడి తదితర ఆరోగ్య సమస్యలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకున్నారు.

ఈ సందర్భంగా కేశినేని వెంకట్ బాబు గారు మాట్లాడుతూ… కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తూ, ప్రతి పది రోజులకు ఒక ప్రాంతంలో మెడికల్ క్యాంపులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారి ఆదేశాల మేరకు ఫౌండేషన్ ద్వారా వైద్య శిబిరాలతో పాటు మహిళలు, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఫౌండేషన్ ద్వారా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు ఇకపై మరింత విస్తృతంగా కొనసాగుతాయని తెలిపారు.

ఈ మెడికల్ క్యాంపు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వైద్య బృందం, స్థానిక నాయకులు మరియు స్వచ్ఛంద సేవకులకు కేశినేని ఫౌండేషన్ ధన్యవాదాలు తెలిపింది.











ఎన్.ఐ.ఆర్.డి లో ఎస్.హెచ్.జి మహిళలకు ముగిసిన ఐదు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమంమష్రూమ్స్ పెంపకం, హోమ్ బేస్డ్ ప...
05/03/2026

ఎన్.ఐ.ఆర్.డి లో ఎస్.హెచ్.జి మహిళలకు ముగిసిన ఐదు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం

మష్రూమ్స్ పెంపకం, హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారీ, బిజినెస్ మోడల్, ప్యాకేజింగ్ & మార్కెటింగ్ పై శిక్షణ

విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) గారి సారథ్యంలో కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్.ఐ.ఆర్.డి లో నిర్వహించిన 12వ బ్యాచ్ ఐదు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎస్.హెచ్.జి మహిళలలో 45 మంది మహిళలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. మష్రూమ్స్ పెంపకం, హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారీ విధానాలపై వారికి ప్రాక్టికల్ మరియు థియరీ శిక్షణ అందించారు.

శిక్షణ ముగింపు కార్యక్రమంలో శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు ఎన్.ఐ.ఆర్.డి సీనియర్ కన్సల్టెంట్ మహ్మద్ ఖాన్ గారు, ప్రొఫెసర్ డాక్టర్ కతిరేషన్ గారు, మష్రూమ్ ట్రైనర్ ఎస్.పీ. రెడ్డి గారు, హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ ట్రైనర్ మానస గారు సర్టిఫికేట్లు అందజేశారు.

అలాగే బిజినెస్ మోడల్, ఉత్పత్తుల ప్యాకేజింగ్, లేబెలింగ్, మార్కెటింగ్, ఆర్డర్ మేనేజ్‌మెంట్, కాస్ట్ అనాలిసిస్ వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఉన్న అవకాశాలు మరియు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి కూడా వివరించారు.

ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమ జీవనోపాధి పెంచుకునేందుకు ఇలాంటి శిక్షణా అవకాశాన్ని కల్పించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారికి, కేశినేని ఫౌండేషన్, ఎన్.ఐ.ఆర్.డి సంస్థలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అర్బన్ ఎన్.ఐ.ఆర్.డి కోఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ గారు తదితరులు పాల్గొన్నారు.










మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాలు..ఎంపీ శ్రీ  కేశినేని శివనాథ్ (చిన్ని) గారి సారథ్యంలో, కేశినేని ఫౌండ...
03/03/2026

మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాలు..

ఎంపీ శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారి సారథ్యంలో, కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్‌.ఐ.ఆర్‌.డి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న ఐదు రోజుల 12వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది.

ఎన్‌టీఆర్ జిల్లాకు చెందిన 45 మంది ఎస్‌.హెచ్‌.జి మహిళలు మష్రూమ్స్ పెంపకం మరియు హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారీపై ప్రాక్టికల్ మరియు థియరీ శిక్షణ పొందుతున్నారు. ఆదాయం పెంపు మార్గాలు, పర్యావరణ పరిరక్షణ, నాణ్యత ప్రమాణాలు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించబడింది.

రెండో రోజు ట్రైనర్ డాక్టర్ ప్రసూన గారు స్పాన్ హ్యాండ్లింగ్, నాణ్యత పరిశీలన, సురక్షిత నిల్వ, సబ్‌స్ట్రేట్ ఎంపిక, తరిగే విధానం, పాస్చరైజేషన్/స్టెరిలైజేషన్, చల్లబరచడం, తేమ సర్దుబాటు, సబ్‌స్ట్రేట్ టెస్టింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రాక్టికల్ శిక్షణ అందించారు.

ఉత్తమ్ ఇండస్ట్రీస్‌కు చెందిన ట్రైనర్ మానస గారు ఫీనైల్ తయారీ, హ్యాండ్‌వాష్ ఫార్ములేషన్, రసాయన లక్షణాలు, భద్రత ప్రమాణాలు, కొలతలు, మిక్సింగ్, ఫిల్ట్రేషన్, ప్యాకేజింగ్ డెమో వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు.

ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి సారథ్యంలో కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12వ ...
02/03/2026

ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి సారథ్యంలో కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 45 మంది ఎస్‌.హెచ్‌.జి మహిళలు మార్చి 2 నుంచి మార్చి 6వ తేదీ వరకు ఐదు రోజుల పాటు మష్రూమ్స్ పెంపకం మరియు హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారీపై ప్రత్యేక శిక్షణ పొందనున్నారు.

శిక్షణ ప్రారంభ సమావేశం ఎన్‌.ఐ‌.ఆర్‌.డి.పి.ఆర్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ (సి.ఐ.ఎ.టి.ఎస్.జె - హెడ్) డాక్టర్ సి. కత్తిరేషన్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. రమేష్ శక్తివేల్ గారు, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మహ్మద్ ఖాన్ గారు, హోమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ట్రైనర్ మానస గారు, మష్రూమ్స్ పెంపకం ట్రైనర్ ప్రసన్న గారు పాల్గొని శిక్షణ వివరాలు తెలియజేశారు.

హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ (వాషింగ్ పౌడర్, లిక్విడ్ సోప్స్, షాంపులు, పినాయిల్) తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, తయారీ విధానం, వినియోగాలు గురించి సమగ్రంగా అవగాహన కల్పించారు. అలాగే మష్రూమ్స్ పెంపకం పై ప్రాయోగిక మరియు సిద్దాంతాత్మక శిక్షణ అందించారు.

స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని మహిళలు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారికి, కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్‌.ఐ‌.ఆర్‌.డి సంస్థలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్‌.ఐ‌.ఆర్‌.డి అర్బన్ కో-ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ గారు తదితరులు పాల్గొన్నారు.

ఈరోజు కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్.ఐ.ఆర్ .డి సంయుక్త ఆధ్వర్యంలో, ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి 45 మంది స్వయం సహాయక సంఘా...
01/03/2026

ఈరోజు కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్.ఐ.ఆర్ .డి సంయుక్త ఆధ్వర్యంలో, ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి 45 మంది స్వయం సహాయక సంఘాల మహిళలను హైదరాబాద్‌లోని ఎన్.ఐ.ఆర్ .డి ప్రధాన కార్యాలయానికి 5 రోజుల ప్రత్యేక శిక్షణ కోసం పంపించడం జరిగింది.

మార్చి 2 నుండి మార్చి 6 వరకు నిర్వహించనున్న ఈ శిక్షణా కార్యక్రమంలో పుట్టగొడుగుల తయారీ, గృహ ఆధారిత ఉత్పత్తుల తయారీ విధానాలపై ప్రాయోగిక శిక్షణ అందించబడుతుంది.

ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్త తయారు కావాలన్న లక్ష్యంతో, గత ఏడాది కాలంగా సుమారు 500 మంది మహిళలకు కేశినేని ఫౌండేషన్ ద్వారా కేశినేని శివనాథ్ (చిన్ని) గారు స్వంత నిధులతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య గారు, కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు గారు, ఎన్టీఆర్ జిల్లా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ గ్రామీణ సమన్వయకర్త సొంగా సంజయ్ వర్మ గారు, సహకార సంఘ సహకార బ్యాంక్ అధ్యక్షులు కోయ నెహ్రూ గారు, కౌన్సిలర్ పులిదాసు గారు, మైలవరం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రకాశ్ గారు, ఎస్టీ నాయకులు మేడా శ్రీను గారు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు మాబు సుభాని గారు పాల్గొన్నారు.

22/02/2026

గంపలగూడెం మండలం ఊటుకూరులో మెగా ఉచిత మెడికల్, రక్తదాన శిబిరం

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు గారి సతీమణి చెరుకూరి రాణి గారి 9వ వర్ధంతి పురస్కరించుకొని గంపలగూడెం మండలం ఊటుకూరులో మెగా ఉచిత మెడికల్ మరియు రక్తదాన శిబిరం నిర్వహించబడింది.

ఈ శిబిరాన్ని తిరువూరు ఏఎంసీ చైర్పర్సన్ రేగళ్ల లక్ష్మీ–అనిత గారు, రేగళ్ల వీరారెడ్డి గారు, చెరుకూరి రాజేశ్వరరావు గారు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం చెరుకూరి రాణి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వివిధ గ్రామాల నుండి విచ్చేసిన రోగులకు వైద్యులు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరంలో మండల టిడిపి పార్టీ అధ్యక్షులు మానుకొండ రామకృష్ణ (ఎంఆర్కే) గారు సహా టిడిపి నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేసి సేవా స్పూర్తిని చాటారు.

రక్తదానం చేసిన దాతలకు పండ్ల రసాలు అందజేసి ప్రశంసా పత్రాలు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది.

ఈ కార్యక్రమంలో చెరుకూరు చందు గారు, మాజీ జెడ్పిటిసి సభ్యులు దిరిశాల వెంకట కృష్ణారావు గారు, నీటి సంఘం అధ్యక్షులు జంగా చెంచు రెడ్డి గారు, మాజీ సర్పంచ్ కొత్తా రజనీకాంత్ గారు, మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విజయవాడ: స్వ‌యం ఉపాధి కోసం కేశినేని శివనాథ్(చిన్ని) గారి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డిలో నైపుణ్యాభివృద్ద...
18/02/2026

విజయవాడ: స్వ‌యం ఉపాధి కోసం కేశినేని శివనాథ్(చిన్ని) గారి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డిలో నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ పొందిన మహిళలు స్వయం ఉపాధితో పారిశ్రామిక వేత్త‌లుగా మారి ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో కామన్ ఫెసిలిటీ సెంటర్లు (CFCs) ఏర్పాటు చేయనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు తెలిపారు. అలాగే మార్కెటింగ్ ప‌రంగా కూడా పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు.

గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో బుధ‌వారం ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు మిల్లెట్స్, గార్మెంట్స్ అండ్ లెద‌ర్, నాచుర‌ల్ ఫార్మింగ్ , తేనె త‌యారీ, జ్యూట్ అండ్ కాటన్ బ్యాగ్స్ హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ పై శిక్ష‌ణ పొందిన ఏడు గ్రూపుల మ‌హిళ‌ల‌తో గ్రూపుల వారీ గా విడివిడిగా స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో ఎన్టీఆర్ జిల్లా పిడి డి.ఆర్.డి.ఎ నాంచార‌య్య కూడా పాల్గొన్నారు. మ‌హిళ‌లు తాము త‌యారు చేసిన వ‌స్తువుల‌ను ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారికి చూపించారు. ఆ వస్తువుల నాణ్య‌త‌, భ‌ద్ర‌త ల కోసం తీసుకున్న జాగ్ర‌త్త‌ల గురించి ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్బంగా శిక్ష‌ణ పొందిన మ‌హిళ‌లు త‌మ‌కి రా మెటీరియ‌ల్ కొనుగోలు విష‌యంలో, మార్కెటింగ్ ప‌రంగా, అధిక సంఖ్య‌లో వ‌స్తువుల ఉత్ప‌త్తికి త‌యారీ కోసం మెషిన‌రీ ప‌రంగా స‌హ‌కారం అందించాల‌ని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారిని కోరారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు మాట్లాడుతూ శిక్ష‌ణ పొంది వ‌స్తువులు త‌యారు చేస్తున్న మ‌హిళ‌ల‌కు మ‌రింత‌గా ప్రోత్స‌హ‌కం అందించే విధంగా తాము చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. . ఒకే ర‌క‌మైన వ‌స్తువులు త‌యారు చేసే వారంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే విధంగా కామ‌న్ పెసిలిటీ సెంట‌ర్స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ కామ‌న్ ఫెసిలిటీ సెంట‌ర్స్ ను ఏర్పాటు చేయ‌టానికి వేగవంతంగా చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు వివరించారు. అలాగే త‌యారు చేసిన వ‌స్తువుల‌కు మార్కెటింగ్ క‌ల్పించే విధంగా..వారు ఆర్థికంగా మ‌రింత ఉన్న‌త స్థానంలో వుండే విధంగా కావాల్సిన స‌హాయ స‌హ‌కారాలు అందించ‌టానికైనా ముందు వుంటామ‌ని తెలిపారు.
ఇంటి ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ వుండాల‌న్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశయాన్ని స్పూర్తిగా తీసుకుని మ‌హిళ‌ల‌ను ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దేందుకు కేశినేని శివనాథ్(చిన్ని) గారి ఫౌండేష‌న్ ద్వారా ఎన్.ఐ.ఆర్.డి లో ప‌లు విభాగాల్లో శిక్ష‌ణ ఇప్పించ‌టం జ‌రిగింద‌న్నారు.

అనంత‌రం ఎన్టీఆర్ జిల్లా పిడి డి.ఆర్.డి.ఎ నాంచార‌య్య మాట్లాడుతూ మిల్లెట్స్, గార్మెంట్స్ అండ్ లెద‌ర్, నాచుర‌ల్ ఫార్మింగ్ , తేనె త‌యారీ, జ్యూట్ అండ్ కాటన్ బ్యాగ్స్ హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ గ్రూపుల‌కు నాణ్య‌మైన‌ రా మెటీరియ‌ల్ ఎక్క‌డ దొరుకుతుంద‌నే అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. . అలాగే వ‌స్తువుల త‌యారీ చేసే క్ర‌మంలో, వాటిని మార్కెటింగ్ చేసే స‌మ‌యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌న్నారు. ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు అందించే స‌హాయంతో పారిశ్రామిక వేత్తలుగా రాణించాల‌ని ఆకాంక్షించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూర‌ల్ కో ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ, న్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బ‌న్ కో ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌రసింహాచౌద‌రి, ఎన్టీఆర్ జిల్లా స‌మైక్య
అధ్య‌క్షురాలు కందుల క‌ల్ప‌న‌, విజ‌య‌వాడ రూర‌ల్ స‌మైక్య అధ్య‌క్షురాలు సుహాసిని ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు

విజ‌య‌వాడ : కేశినేని శివనాథ్(చిన్ని) గారి ఫౌండేష‌న్ ద్వారా హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో స్వ‌యం ఉపాధికి సంబంధించి నైపుణ్యాభ...
17/02/2026

విజ‌య‌వాడ : కేశినేని శివనాథ్(చిన్ని) గారి ఫౌండేష‌న్ ద్వారా హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో స్వ‌యం ఉపాధికి సంబంధించి నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ పొందిన మ‌హిళ‌లు ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా రాణించేందుకు కామ‌న్ ఫెసిలిటీ సెంట‌ర్స్ ఏర్పాటు చేయ‌టంతోపాటు మార్కెటింగ్ ప‌రంగా కూడా పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు తెలిపారు.

గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో మంగ‌ళ‌వారం ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్, హోమ్ బేస్ట్ ప్రొడ‌క్ట్స్ , బ్రిక్స్ త‌యారీ పై శిక్ష‌ణ పొందిన మూడు గ్రూపుల మ‌హిళ‌ల‌తో గ్రూపుల వారీ గా విడివిడిగా స‌మావేశం అయ్యారు. మ‌హిళ‌లు తాము త‌యారు చేసిన వ‌స్తువుల‌ను ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారికి చూపించారు. ఆ వస్తువుల నాణ్య‌త‌, భ‌ద్ర‌త ల కోసం తీసుకున్న జాగ్ర‌త్త‌ల గురించి ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా శిక్ష‌ణ పొందిన మ‌హిళ‌లు త‌మ‌కి రా మెటీరియ‌ల్ కొనుగోలు విష‌యంలో, మార్కెటింగ్ ప‌రంగా, మెషిన‌రీ కి సంబంధించి స‌హ‌కారం అందించాల‌ని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారిని కోరారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు మాట్లాడుతూ శిక్ష‌ణ పొంది వ‌స్తువులు త‌యారు చేస్తున్న మ‌హిళ‌ల‌కు మ‌రింత‌గా ప్రోత్స‌హ‌కం అందించే విధంగా తాము చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. . ఒకే ర‌క‌మైన వ‌స్తువులు త‌యారు చేసే వారంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే విధంగా కామ‌న్ పెసిలిటీ సెంట‌ర్స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ కామ‌న్ ఫెసిలిటీ సెంట‌ర్స్ ను ఏర్పాటు చేయ‌టానికి వేగవంతంగా చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు వివరించారు. అలాగే త‌యారు చేసిన వ‌స్తువుల‌కు మార్కెటింగ్ క‌ల్పించే విధంగా..వారు ఆర్థికంగా మ‌రింత ఉన్న‌త స్థానంలో వుండే విధంగా కావాల్సిన సదుపాయాలు క‌ల్పించటంతో పాటు , ఎటువంటి స‌హాయ స‌హ‌కారాలు అందించ‌టానికైనా ముందు వుంటామ‌ని తెలిపారు. ఇంటి ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ వుండాల‌న్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశయాన్ని స్పూర్తిగా తీసుకుని మ‌హిళ‌ల‌ను ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దేందుకు కేశినేని శివనాథ్(చిన్ని) గారు ఫౌండేష‌న్ ద్వారా ఎన్.ఐ.ఆర్.డి లో ప‌లు విభాగాల్లో శిక్ష‌ణ ఇప్పించ‌టం జ‌రిగింద‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎన్.ఐ.ఆర్.డి అధికారి ముర‌ళీకృష్ణ‌, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూర‌ల్ కో ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ, న్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బ‌న్ కో ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌రసింహాచౌద‌రి, ఎన్టీఆర్ జిల్లా స‌మైక్య
అధ్య‌క్షురాలు కందుల క‌ల్ప‌న‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌ల‌క్ష్మీ, విజ‌య‌వాడ రూర‌ల్ స‌మైక్య అధ్య‌క్షురాలు సుహాసిని, సెక్ర‌ట‌రీ విజ‌య‌ల‌క్ష్మీ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

విజ‌య‌వాడ :  గ‌త ఏడాది కాలం నుంచి కేశినేని ఫౌండేష‌న్  ద్వారా హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌ధాన కార్యాల‌యంలో స్వ‌యం ఉపాధి కి...
13/02/2026

విజ‌య‌వాడ : గ‌త ఏడాది కాలం నుంచి కేశినేని ఫౌండేష‌న్ ద్వారా హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌ధాన కార్యాల‌యంలో స్వ‌యం ఉపాధి కి సంబంధించి నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ పొందిన ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల గ్రూపుల‌తో ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారు ఈ నెల 20 నుంచి స్వ‌యంగా క‌లిసి మాట్లాడ‌తార‌ని కేశినేని ఫౌండేష‌న్ చైర్మ‌న్, ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారి స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ గారు తెలిపారు. శిక్షణ అనంతరం ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా రాణించేందుకు ఎదురయ్యే సమస్యలను ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారు తెలుసుకుని వాటిని ప‌రిష్క‌రిస్తార‌ని తెలిపారు.

హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ నుంచి మొద‌లైన హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ పై శిక్ష‌ణ ముగింపు కార్య‌క్ర‌మం శుక్ర‌వారం జ‌రిగింది. ఈ ఐదు రోజుల‌ శిక్షణా కార్య‌క్ర‌మంలో విజ‌యవంతంగా నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ ను పూర్తి చేసిన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 40 మంది ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు స‌ర్టిఫికేట్స్ అందించారు. అంత‌కుముందు హ్యాండ్ మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ త‌యారీ పై శిక్షణ పొందిన మహిళలందరితో మాట్లాడి శిక్షణలో భాగంగా ఏమి నేర్చుకున్నారో అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా కేశినేని జాన‌కీ ల‌క్ష్మీ గారు మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధ‌నలో భాగంగా ప్రతి ఇంటిలో కనీసం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలన్న‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశ‌యాల‌కు అనుగుణంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు ముందడుగు వేశారని తెలిపారు. మ‌హిళ‌లు ఆర్థిక స్వావలంబన సాధించాల‌నే లక్ష్యంతో ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారు త‌న స్వంత నిధులను వెచ్చించి ఎన్.ఐ.ఆర్.డి లో శిక్ష‌ణ ఇప్పిస్తూ ఎస్.హెచ్.జి మహిళలకు చేయూత అందిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ శిక్షణ లో నేర్చుకున్నది ఆచరణలో పెట్టాల‌ని సూచించారు. ముఖ్యంగా మహిళలు పుట్టుకతోనే బహుముఖ ప్రతిభ కలవారని, భార్యగా, తల్లిగా, చెల్లిగా అనేక బాధ్యతలు నిర్వర్తించే సామర్థ్యం ఉన్న మహిళలకు ఎంట‌ర్ ప్రెన్యూర్ గా రాణించ‌టం అంత క‌ష్టం కాద‌ని అభిప్రాయపడ్డారు. సరైన మార్గదర్శనం, అవకాశాలు లభిస్తే మహిళలు కూడా విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగగలరని మీరంతా నిరూపించాల‌ని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎన్.ఐ.ఆర్.డి సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ మ‌హ్మాద్ ఖాన్, ప్రొఫ‌స‌ర్ డాక్ట‌ర్ క‌తిరేష‌న్, గాంధీ హ్యాండ్ మేడ్ పేప‌ర్ యూనిట్ అధికారి జె.ర‌వీంద్ర‌రావు, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూర‌ల్ కో-ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

విజ‌య‌వాడ : గ్రామీణ మహిళలు తమ జీవనోపాధి అవకాశాలను విస్తరించుకుని ఆర్థికంగా స్వాలంబ‌న సాధించే దిశ‌గా న‌డిపించేందుకు ఎంపీ ...
12/02/2026

విజ‌య‌వాడ : గ్రామీణ మహిళలు తమ జీవనోపాధి అవకాశాలను విస్తరించుకుని ఆర్థికంగా స్వాలంబ‌న సాధించే దిశ‌గా న‌డిపించేందుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారి సార‌ధ్యంలో కేశినేని ఫౌండేష‌న్, ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌ధాన కార్యాల‌యంలో హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్ త‌యారీపై అందిస్తున్న నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణను ఎన్టీఆర్ జిల్లా కు చెందిన ఎస్.హెచ్.జి మ‌హిళ‌లు అందిపుచ్చుకుంటున్నారు.

ఫిబ్ర‌వ‌రి 9 వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో నాల‌వ రోజు గురువారం ఎన్.ఐ.ఆర్.డిలో ఎస్.హెచ్.జి మహిళలు పొందిన శిక్షణ వివరాలను తెలియజేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి, కేశినేని ఫౌండేషన్ కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది

ఎన్.ఐ.ఆర్.డి లో హ్యాండ్ మేడ్ పేపర్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి గాంధీ హ్యాండ్ మేడ్ పేపర్ యూనిట్ అధికారి జె.రవీంద్రరావు నేతృత్వంలో పల్ప్ తయారీ, షీట్ నిర్మాణం, స్క్రీన్ ప్రింటింగ్, ఎన్వలప్ కవర్స్, పెన్స్ స్టాండ్ తయారీ పై అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం వీటిని ఎలా తయారు చేయాలో శిక్షణ ఇచ్చారు.. అలాగే స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్ ను సంద‌ర్శించారు.

విజ‌య‌వాడ : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) గారి సారధ్యంలో కేశినేని ఫౌండేషన్ , ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో  హైదరాబాద్...
11/02/2026

విజ‌య‌వాడ : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) గారి సారధ్యంలో కేశినేని ఫౌండేషన్ , ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. కార్యాలయంలో అందిస్తున్న హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ పై శిక్షణను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎస్.హెచ్.జి మహిళలు సమర్థంగా వినియోగించుకుంటున్నారు. తమ జీవనోపాధి అవకాశాలను విస్తరించుకునేందుకు వారిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం కొత్త ఉత్సాహం, స్పూర్తిని నింపుతోంది.

ఫిబ్ర‌వ‌రి 9 వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో మూడవ రోజు బుధ‌వారం ఎన్.ఐ.ఆర్.డిలో ఎస్.హెచ్.జి మహిళలు పొందిన శిక్షణ వివరాలను తెలియజేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి, కేశినేని ఫౌండేషన్ కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది

హ్యాండ్ మేడ్ పేపర్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి గాంధీ హ్యాండ్ మేడ్ పేపర్ యూనిట్ అధికారి జె.రవీంద్రరావు నేతృత్వంలో ముందుగా గిఫ్ట్ బాక్స్ నిర్మాణం, కొలతలు ఏ విధంగా తీసుకోవాలి, ఉపయోగించే పదార్థాలు, ఫినిషింగ్ ఎలా వుండాల‌నే విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గిఫ్ట్ బాక్స్‌లో ఉపయోగించే కాగితం, కార్డ్‌బోర్డు, డెకరేటివ్ షీట్లు, గ్లూ వంటి పదార్థాల వినియోగం, మడతలు వేయడం, అతికించడం, అంచుల ఫినిషింగ్ వంటి అంశాలపై వివరంగా శిక్షణ ఇచ్చారు. ఇక ప్రాక్టికల్ సెషన్‌లో విద్యార్థులతో స్వ‌యంగా హ్యాండ్‌మేడ్ గిఫ్ట్ బాక్స్ తయారీ చేయించారు. గిఫ్ట్ బాక్స్ కి సంబంధించిన కట్టింగ్, ఫోల్డింగ్, అసెంబ్లింగ్, ఫినిషింగ్, అలంకరణ వంటి దశలను శిక్ష‌ణ పొందుతున్న మ‌హిళ‌ల‌తో చేయించారు. అలాగే కొలతల ప్ర‌కారం క‌ట్ చేయ‌డం, అంచులు స‌రైన అమరికతో స‌మానంగా వుండేలా నాణ్యత మెరుగుదల పద్ధతులు కూడా నేర్పించారు. శిక్ష‌ణ పొందుతున్న మ‌హిళ‌లు పేప‌ర్ బ్యాగ్స్ తో పాటు గిప్ట్ బాక్స్ లు త‌యారు చేశారు.

Address

Kesineni Foundation, Koneru Bullayya, Chowdary Street, Patamata, Benz Circle
Vijayawada
520010

Alerts

Be the first to know and let us send you an email when Kesineni Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kesineni Foundation:

Share