MS Baig

MS Baig State Official Spokesperson, Telugu Desam Party | Chairman, Krishna District Grandhalaya Parishad

SIRపై పెనమలూరు శాసనసభ్యులు కార్యాలయంలో  కృష్ణ జిల్లా మండల పార్టీ అధ్యక్షులు,కార్యదర్శిలతో తో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ప...
03/06/2026

SIRపై పెనమలూరు శాసనసభ్యులు కార్యాలయంలో కృష్ణ జిల్లా మండల పార్టీ అధ్యక్షులు,కార్యదర్శిలతో తో నిర్వహించిన వర్క్‌షాప్‌లో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు, మంత్రి వర్యులు శ్రీ కొల్లురవీంద్ర గారు, కృష్ణ జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, కృష్ణ జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు శ్రీ వీరంకి గురు మూర్తి గారి తో మరియు కృష్ణ జిల్లా నియోజకవర్గం పరిశీలకులతో పాల్గొన్నా జిల్లా గ్రంధాలయం ఛైర్మెన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికారప్రతినిధి, గుడివాడ నియోజకవర్గం పరిశీలకులు
MS బేగ్ గారు

ఈ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన SIR (Special Intensive Revision) పై ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా...
02/06/2026

ఈ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన SIR (Special Intensive Revision) పై ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన కీలక వర్క్‌షాప్‌లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల జాబితాల పరిశీలన, ఓటర్ల నమోదు ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య పరిరక్షణలో పార్టీ శ్రేణుల బాధ్యతలపై ముఖ్యమంత్రి గారు సమగ్ర దిశానిర్దేశం చేశారు.

ఈ వర్క్‌షాప్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పరిశీలకులు మరియు పార్టీ నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.ఎస్. బేగ్ గారు పాల్గొన్నారు.

ఈ వర్క్‌షాప్ లో కీలకమైన అంశాల పై చర్చిస్తూ
* ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలి
* బోగస్, డూప్లికేట్ మరియు అనర్హ ఓట్లను గుర్తించి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలి
* ఓటరు జాబితాలపై క్షేత్రస్థాయిలో నిరంతర పరిశీలన జరపాలి
* ప్రజాస్వామ్య బలోపేతానికి ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలన్నారు

ఈ నెల 25 నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు చేయబోయే కార్యక్రమాలలో
* ఇంటింటా ఓటరు జాబితాల పరిశీలన
- కొత్త ఓటర్ల నమోదు మరియు అర్హులైన వారి పేర్ల చేర్పు
* తప్పులు, డూప్లికేట్ ఎంట్రీలు, అనర్హ నమోదులపై ఫిర్యాదులు సమర్పించడం
* పార్టీ శ్రేణులకు SIR ప్రక్రియపై అవగాహన కల్పించడం
* ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి బూత్ స్థాయిలో సమన్వయంతో పనిచేయలని అన్నారు.

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక మైలురాయి. ఇది రాష...
01/06/2026

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక మైలురాయి. ఇది రాష్ట్రంలో రవాణా, ఉపాధి, పారిశ్రామికాభివృద్ధికి కొత్త అవకాశాలు తెరవనుంది. ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

వేసవి శిక్షణ తరగతుల ప్రగతిని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు, ఉమ్మడి కృష్ణ...
31/05/2026

వేసవి శిక్షణ తరగతుల ప్రగతిని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్.బేగ్ గారు

ఈ రోజు విజయవాడ స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో విశేష స్పందనతో అత్యుత్సాహంగా జరుగుతున్న వేసవి శిక్షణా తరగతులను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు శిక్షణ తరగతులను సందర్శించడం జరిగినది. ఆయన చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ....
* శిక్షణ తరగతులు రాష్ట్రమంతా విజయవంతంగా కొనసాగుతున్నాయని చిన్నారుల్లో ప్రతిభ సృజనాత్మకత మరియు క్రమశిక్షణ పెంపొందించడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు
* ఈ తరగతుల ద్వారా విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, కళలు, సాంస్కృతిక అంశాలు మరియు వివిధ నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు అని కొనియాడారు. శిక్షణ ఇస్తున్న రిసోర్స్ పర్సన్స్ ను, విజయవంతంగా కార్యక్రమం నిర్వహిస్తున్న గ్రంథాలయ అధికారి కె.రమాదేవిని మరియు సిబ్బందిని అభినందించారు.

మరొక ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఎం. ఎస్. బేగ్ గారు మాట్లాడుతూ...
* వేసవి శిక్షణ తరగతుల్లో ముఖ్యంగా పిల్లలు మొబైల్ ఫోన్ వాడకం తగ్గించి తమ సమయాన్ని పుస్తక పఠనం, ఆటలు మరియు స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించుకోవటం, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవటం వంటి అనేక మంచి గుణాలు ఈ సమ్మర్ క్యాంపు ద్వారా అభివృద్ధి చెందుతాయని, అందువలన సమ్మర్ క్యాంపులు విద్యార్థులు సమగ్ర వికాసానికి ఎంతో దోహదపడతాయని అని తెలియజేశారు.

అనంతరం గిన్నిస్ అవార్డు తీసుకున్న కుసుమ గారు ఊలుతో చేసిన జాతీయ జెండా అతిధులకు చూపించి బహుకరించారు. చిన్నారులకు ఊలుతో ఫ్లవర్ అల్లిక నేర్పించారు. ఆమె ప్రతిభను ముఖ్య అతిథులు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి కే రమాదేవి, సిబ్బంది వై ధనలక్ష్మి, రిసోర్స్ పర్సన్స్ వి.సుమతి గారు, కుమారీ చైత్రిక, ఝాన్సీ గారు, రాజీవ్ గారు, వివిధ స్కూల్స్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

వేసవి శిక్షణ తరగతుల ప్రగతిని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు, ఉమ్మడి కృష్ణ...
30/05/2026

2029 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మహిళలకు 33% సీట్లుపార్లమెంట్ బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు రిజర్వేషన్మహానాడు వేదికపై...
28/05/2026

2029 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మహిళలకు 33% సీట్లు

పార్లమెంట్ బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు రిజర్వేషన్
మహానాడు వేదికపై యువనేత శ్రీ నారా లోకేష్ గారి సంచలన ప్రకటన

హర్షాతిరేకాలతో దద్దరిల్లిన మహానాడు

28/05/2026

యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారికి 103వ జయంతి నివాళితెలుగు జాతి గుండెల్లో ఎప్పటిక...
28/05/2026

యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారికి 103వ జయంతి నివాళి

తెలుగు జాతి గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన యుగపురుషుడు, మా ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి హృదయపూర్వక శతకోటి ప్రణామాలు!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ‘ఆత్మగౌరవాన్ని’ పరిచయం చేసిన ధీరుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు

వెండితెరపై దేవుడిగా మెరిసినా, ప్రజాసేవలో నాయకుడిగా నిలిచినా.. ఆయన జీవించిన విధానం, చూపిన బాట ఎప్పటికీ ఆదర్శనీయం. ఆ రూపం, ఆ గంభీర స్వరం మా గుండెల్లో ఎప్పటికీ సజీవం.

"సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు"
అనే సిద్ధాంతాన్ని నమ్మి, చివరి శ్వాస వరకు సామాన్యుడి సంక్షేమం కోసమే తపించిన మహోన్నత వ్యక్తి ఆయన.

ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో, అభిమానుల ప్రతి గుండె చప్పుళ్లలో ఎప్పటికీ అమరుడే!

ఆయన చూపిన సేవా మార్గంలో నడుస్తూ, సమాజానికి ఉపయోగపడేలా జీవించడమే ఒక అభిమానిగా మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.
🙏 జోహార్ ఎన్టీఆర్! 🙏

ముస్లిం సోదరిసోదరులు అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఈ పవిత్రమైన బక్రీద్ పర్వదినం మీ జీవితాలలో సంతోషం, శాంతి, సౌభాగ్యాలు, ఐ...
28/05/2026

ముస్లిం సోదరిసోదరులు అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఈ పవిత్రమైన బక్రీద్ పర్వదినం మీ జీవితాలలో సంతోషం, శాంతి, సౌభాగ్యాలు, ఐశ్వర్నాన్ని తీసుకురావాలని ఆ దేవుని చరణాలో మనసారా ప్రార్థిస్తున్నాను .....

Address

8-14-131 Koppulavari Street
Vijayawada
520001

Website

Alerts

Be the first to know and let us send you an email when MS Baig posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share