22/01/2026
శ్రీకాకుళం, 22 జనవరి 2026:
స్వదేశీ జాగరణ్ మంచ్, ఆంధ్రప్రదేశ్ – ఉత్తర ఆంధ్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “రన్ ఫర్ స్వదేశీ – 3 కి.మీ పరుగు” కార్యక్రమం గురువారం శ్రీకాకుళం పట్టణంలో ఉత్సాహభరితంగా, విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కాలేజ్), శ్రీకాకుళం విద్యార్థులు, HPN డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, మాజీ సైనికులు (Ex-Servicemen), స్వదేశీ అభిమానులు, మహిళలు మరియు సాధారణ ప్రజలు కలిపి సుమారు 500 మంది పాల్గొన్నారు. పరుగు కార్యక్రమం ఆర్ట్స్ కాలేజ్ నుండి ప్రారంభమై RTC కాంప్లెక్స్ మీదుగా బాలగ జంక్షన్ వరకు కొనసాగింది.
పరుగు కార్యక్రమం అనంతరం ఆర్ట్స్ కాలేజ్ సెమినార్ హాల్‌లో “స్వదేశీ వస్తువుల వినియోగం ద్వారా ఆర్థిక అభివృద్ధి” అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించబడింది. ఈ ఉపన్యాస కార్యక్రమానికి స్వదేశీ జాగరణ్ మంచ్ – ఉత్తర ఆంధ్ర విభాగ కన్వీనర్ డా. హెచ్. శేషగిరి గారు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. వై. పోలినాయుడు, ఇంగ్లీష్ లెక్చరర్ డా. శేషి భూషణ్, ఆర్ఎస్ఎస్ నుండి వసంత్ రావు ముఖ్య అతిథులు మరియు వక్తలుగా పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడుతూ, స్వదేశీ ఉత్పత్తుల వినియోగం ద్వారా దేశ ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని, ప్రతి పౌరుడు తన దైనందిన జీవితంలో స్వదేశీని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టి. ప్రవీణ్, వి. ప్రవీణ్, పి. బాలకృష్ణ (మాజీ సైనికుడు), P. రాజశేఖర్, Ex-Service Sangh ప్రతినిధి ఎస్. రామారావు, Ex-Service మహిళా ప్రతినిధి పద్మావతి, ఇంగ్లీష్ లెక్చరర్ చంద్రభూషణ్ గారు తదితరులు చురుకుగా పాల్గొన్నారు. మాజీ సైనికులు మరియు మహిళల చురుకైన పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వక్తలు మాట్లాడుతూ, యువత స్వదేశీ భావనను స్వీకరించి ఆచరణలో పెట్టినప్పుడే ఆత్మనిర్భర భారత్ లక్ష్యం సాకారమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమం శాంతియుతంగా, క్రమబద్ధంగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు.
ధన్యవాదములతో,
స్వదేశీ జాగరణ్ మంచ్
ఆంధ్రప్రదేశ్
ఉత్తర ఆంధ్ర విభాగం