SCST ప్రజా సమాఖ్య AP

SCST ప్రజా సమాఖ్య AP SCST praja samkya 2018

30/08/2022
భూమిలేని నిరుపేదలకు భూ పంపిణీ చేపట్టండి.    ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దులచెరువు మల్లి డిమాండ్......
17/08/2022

భూమిలేని నిరుపేదలకు భూ పంపిణీ చేపట్టండి. ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దులచెరువు మల్లి డిమాండ్.....
అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో త్వరలో ప్రభుత్వం చేపట్టనున్న భూ పంపిణీ కార్యక్రమంలో భూమిలేని నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి మూడు ఎకరాలు సాగుకు యోగ్యమైన భూముల అందించాలని ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుల చెరువు మల్లి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అనంతపురం పట్టణంలోని ప్రధాన కార్యాలయం నందు ఆయన మాట్లాడుతూ ఎవరైతే భూమి సాగు చేసుకుంటున్నారు. వారికి మాత్రమే భూ పంపిణీ అని అధికారులు అంటున్నారు. అయితే సెంటు భూమిలేని నిరుపేదలు సాగులో ఎలా ఉంటారు .ఇది ముమ్మాటికి కొందరికి మేలు చేసేందుకు ఏర్పాటు చేసిన భూ పంపిణీ కార్యక్రమం అని ఆరోపించారు. పేదలపై నిజమైన ప్రేమ ,చిత్తశుద్ధి ఉంటే భూ పంపిణీ కార్యక్రమంలో పేదలకు భూములు పంచి వాటి అభివృద్ధికి ప్రభుత్వమే చేపట్టాలని డిమాండ్ చేశారు.లేనియెడల పేదలకు న్యాయం జరిగేంతవరకు విడతలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నంపల్లి సూర్య ప్రకాష్, శివ, బాబు తదితరులు పాల్గొన్నారు

31/05/2022
Happy Birthday to you Anna
01/06/2021

Happy Birthday to you Anna

Sc St  ప్రజా సమైక్య రాష్ట్ర కమిటీ. .................... మరియు జిల్లా కమిటీ మరియు అనుబంధ కమిటీల నియామకం ....................
29/12/2020

Sc St ప్రజా సమైక్య రాష్ట్ర కమిటీ. .................... మరియు జిల్లా కమిటీ మరియు అనుబంధ కమిటీల నియామకం ..............................అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం లోని ఆర్ అండ్ బి అతిథి గృహం నందు వ్యవస్థాపక అధ్యక్షులు మద్దెల చెరువు మళ్లీ గారి అధ్యక్షతన కమిటీల నియామకం చేయడం జరిగింది రాష్ట్ర కమిటీ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కల్లూరు ప్రసాద్ బాబు, రాష్ట్ర కార్యదర్శిగా రాచేపల్లి శ్రీనివాసులు, అనంతపురం జిల్లా లీగల్ అడ్వైజర్ గా లాయర్ రాజేష్ నాయక్, హిందూపూర్ పార్లమెంట్ అధ్యక్షులుగా kn బాబు, ప్రధాన కార్యదర్శిగా నవీన్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గా ప్రమీల, హిందూపురం పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలిగా లక్ష్మీదేవమ్మ, ను నియమించడం జరిగింది మద్దెలచెరువు మళ్లీ మాట్లాడుతూ కొత్తగా నియామకమైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల కోసం ముందుండి పనిచేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల భూములు లాక్కొని ఇళ్ల పట్టాల పేరిట తీసుకొని తిరిగే వారికి ఒక సెంటు స్థలం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ పోతుంది. ఎస్సీ ఎస్టీ ల పైన దాడులు జరుగుతున్నా నోరుమెదపని హోమ్ మినిస్టర్ గారు దళిత ఎంపీలు,ఎమ్మెల్యేలు మీరు దళిత గిరిజనుల కుటుంబాలలో పుట్టడం సిగ్గుచేటు, ఎస్సీ ఎస్టీల అన్యాయాలపై పార్లమెంట్ మరియు అసెంబ్లీలలో గళం విప్పాలని లేదంటే మీ ఇళ్లను ముట్టడిస్తామని చెప్పి ఈ విధంగా మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాలచర్ల ముత్యాలు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనాథ్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ నాయక్, మైలారి, సంజీవ్ రాయప్ప, నరసింహప్ప, హనుమంతప్ప, సంజప్ప, నల్లమ్మ, నారాయణప్ప, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

26_11-2020 న తరిమెల గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగిన సంఘటన తెలుసుకు...
27/11/2020

26_11-2020 న తరిమెల గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగిన సంఘటన తెలుసుకున్న ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మద్దెలచెరువు మల్లిగారు హుటాహుటిన తరిమెల గ్రామానికి చేరుకుని రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్న టువంటి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కమిటీ బీఎస్పీ నాయకులు రామాంజనేయులు గారికి మద్దతు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్లి గారు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని దిగంతాలకు చాటిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఇంతటి ఘోర అవమానం జరగడం చాలా బాధాకరమని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ సూత్రాలను పాటిస్తూ ఉన్న రాజకీయ నాయకులు అదేవిధంగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన సింగనమల నియోజకవర్గం లో ఇటువంటి సంఘటన జరిగితే ఏ ఒక్క నాయకుడు స్పందించక పోవడం మన దౌర్భాగ్యం అని ఆయన కల్పించిన హక్కుల వల్లనే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానానికి దళితులు పోటీ చేయడానికి బరిలో నిలిచారు అలాంటి గొప్ప అంబేద్కర్ గారికి ఇంతటి ఘోర అవమానం జరిగినా ఏ ఒక్క రాజకీయ నాయకుడు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు అదే విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని పంచాయతీ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు తీసుకెళ్ళి పంచాయతీ భవనం నందు గదిలో పెట్టి సీల్ చేయడం జరిగింది అందువల్ల విగ్రహానికి ఎటువంటి డ్యామేజ్ జరిగినా దానికి ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేయదలచిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని విగ్రహావిష్కరణ జరిగేంత వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంఘాల JAC CHARMAiN RAVIRAJ. ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు JC SEKHR గారుమరియు ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య సింగనమల నియోజకవర్గ ఇన్చార్జి హనుమంతు. విజయ్ కుమార్ చలపతి వెంకటేష్ చిరంజీవి శంకర్ మరియు రాష్ట్రంలోని దళిత సంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది

*అనంతపురం జిల్లా కమిటీ ఎన్నిక* *ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మద్దెలచెరువు మల్లి గారి ఆదేశాల మేరకు*💐ఈరో...
13/11/2020

*అనంతపురం జిల్లా కమిటీ ఎన్నిక* *ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మద్దెలచెరువు మల్లి గారి ఆదేశాల మేరకు*💐

ఈరోజు ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య అనంతపురం జిల్లా ప్రధాన కార్యాలయం ముందు నందు జిల్లా అధ్యక్షుడు పాలచర్ల ముత్యాల ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఎన్నిక ఎన్నికల్లో భాగంగా సింగనమల నియోజకవర్గం ఇంచార్జ్ గా ఎస్ హనుమంతు నియోజకవర్గ కార్యదర్శి గా ఎర్రి స్వామి గారిని అనంతపురం జిల్లా యూత్ సమాఖ్య కార్యదర్శి గా ఏ సంతోష్ లోకేష్ ఉపాధ్యక్షులుగా సునీల్ వంశీ పవన్ కళ్యాణ్ సింగనమల యూత్ అధ్యక్షులు గా ప్రతాప్ ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్ ను గార్లదిన్నె మండల అధ్యక్షునిగా వినోద్ కుమార్ యూత్ గార్లదిన్నె మండల అధ్యక్షునిగా మహీంద్రా ను ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మద్దెలచెరువు మల్లి గారి ఆదేశాల మేరకు జిల్లా కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రధాన కార్యదర్శి sake రమేష్ జిల్లా అధికార ప్రతినిధి కోటంక రామంజి జిల్లా గౌరవ అధ్యక్షులు చెన్నంపల్లి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది

ఉత్తరప్రదేశ్, హత్రాస్ జిల్లాలో  కులోన్మాదుల రక్కసికి బలైన "మనీశా వాల్మీకి " అత్యాచార ఘటనను ఖండిస్తూఈరోజు  ది.04-10-2020 ...
04/10/2020

ఉత్తరప్రదేశ్, హత్రాస్ జిల్లాలో కులోన్మాదుల రక్కసికి బలైన "మనీశా వాల్మీకి " అత్యాచార ఘటనను ఖండిస్తూఈరోజు ది.04-10-2020 న SCST ప్రజాసమాఖ్య అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ T శ్రీనాధ్ గారు మరియు జిల్లా ఉపాధ్యక్షుడు D పుల్లయ్య గారు మండల అద్యక్షుడు పెద్దిరాజు కమిటీసభ్యులు నారాయణస్వమీ ,రమేష్,రంగ ,వెంకటేష్,జానీ ఉత్తయ్య , హజీ ,సాయికుమార్, శివ ,మహేష్ త్తతీతరులు క్రొవ్వొత్తుల వెలుతురులో శాంతియుత నిరసన ర్యాలీని నిర్వహించి ఆమె మృతికి నివాళులు అర్పించి, ఈ ఘటనకు పాల్పడిన కామాంధులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌనం పాటించారు. ✊జై...భిమ్. ✊SCST ప్రజాసమాఖ్య. 💪తాడిపత్రి కమీటీ సబ్యులు

ఎస్సీ ఎస్టీ ప్రజా సమైక్య రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలోని ముక్తాపురం గ్రామంలో నరసింహులు ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్లో హత్రాస్...
02/10/2020

ఎస్సీ ఎస్టీ ప్రజా సమైక్య రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలోని ముక్తాపురం గ్రామంలో నరసింహులు ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్లో హత్రాస్ లో జరిగిన మనిషా హత్యపై క్యాండిల్ ర్యాలీతో నివాళులర్పించడం జరిగింది

Address

Vijayawada Buckinghampet
520010

Telephone

+919177717083

Website

Alerts

Be the first to know and let us send you an email when SCST ప్రజా సమాఖ్య AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share