23/01/2026
🚨 ఉలవపాడులో రియల్ ఎస్టేట్ మోసాలు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి! 🚨
❌ భూముల ధరలను బ్రోకర్లు వారిలో వారికే అగ్రిమెంట్ రాసుకుంటూ కృత్రిమంగా, అవసరానికి మించి పెంచడం,
❌ బ్రోకర్ల మధ్యవర్తిత్వం వల్ల
➡️ అసలు భూమి యజమానికి తక్కువ మొత్తం రావడం
➡️ కొనుగోలుదారు అసలు యజమాని అమ్మిన ధర కంటే చాలా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి రావడం
❌ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి మౌలిక వసతులు లేకుండానే ప్లాట్ల అమ్మకాలు
❌ అనుమతులు లేని అక్రమ లేఅవుట్లు
❌ ఉలవపాడు గ్రామ సచివాలయం ఎదురుగా ఉన్న అనధికార లేఅవుట్‌లో భూమి ధరలను కృత్రిమంగా పెంచి విక్రయాలు చేయడం
❌ రిజిస్ట్రేషన్ పేరుతో ప్రతి సెంట్‌కు ₹3,000 వరకు అక్రమ వసూళ్లు
(సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం & రాజకీయ నాయకుల పేర్లు చెప్పి)
👉కొంతమంది మోసపూరిత రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కారణంగా, సాధారణ మధ్యతరగతి పెట్టుబడిదారులు మరియు నిజాయితీగా వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు నష్టపోతున్నారు.
👉 ఈ అక్రమాల వల్ల రైతులు, సామాన్య ప్రజలు, చిన్న పెట్టుబడిదారులు తీవ్రంగా ఆర్థిక నష్టానికి గురవుతున్నారు.
👉 అమ్మేవాడు నష్టపోతున్నాడు, కొనేవాడు మోసపోతున్నాడు – లాభం మాత్రం మధ్యవర్తులకే.