11/08/2023
*గ్రామ పంచాయతీల పనితీరును మెరుగుపరచాలి*
*ప్రభుత్వ తీరు మారకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం* ✊✊
*ఈ సందర్భంగా VishuVardhan reedy గారు మాట్లాడుతూ: మన దేశ పాలనలో గ్రామ పంచాయతీలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఏ దేశం స్వయం సమృద్ధిని సాధించాలన్న ముందుగా గ్రామాలు పరిపుష్టంగా ఉండాలి, అసలు మన దేశం గ్రామ పంచాయతీలు స్వయం సమృద్ధి కలిగినవి, పాడి పంటలతో సిరిసంపదలతో ఉంటాయి అందుకు కారణం మన గ్రామాల సౌహార్ద్ర సంస్కృతి సహకారం సమన్వయం ఇచ్చిపుచ్చుకునే ధోరణి విరాజిల్లుతూ వచ్చింది. మన దేశం ప్రాథమికంగా వ్యవసాయ దేశం చెరువులు దిగుడు బావులు నీటి ద్వారా సేద్యం సాగేది, కానీ బహుళార్థక సాధక ప్రాజెక్టులు వచ్చాక గ్రామాలకు గ్రామాలనే కబళించడం జరిగింది. అయినా జీవనం సాగింది మన గ్రామాలు గ్రామపంచాయతీలు స్వయం సంపూర్తిగా నడిచేవి, గ్రామ సభ ఏ క్రింది స్థాయి అత్యున్నత పార్లమెంట్ లాంటిది దానికి పూర్తి అధికారాలు కట్టబెట్టడం జరిగింది. గ్రామపంచాయతీ పాలనను బలోపేతం చేసింది అంటే గ్రామంలోని సమస్యలైన త్రాగునీరు, విద్యా, వైద్యం, పారిశుద్ధ్యం సౌకర్యాలను కల్పించడానికి ఆ గ్రామ ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని అమలు చేయడానికి 73వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఇప్పటికే అప్పులు మయంగా రాష్ట్రాన్ని మార్చేసిన ప్రభుత్వం ఇప్పుడు నిధులు మళ్లింపు మీద కన్నేసిందని వారు విమర్శించారు. పంచాయతీల నుంచి రెండున్నర ఏళ్ల పాలనలో రూ 1309 కోట్ల పైగా నిధులు మళ్ళించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి నిర్వీర్యమైపోతున్నాయి, నిధులు లేని కారణంగా పంచాయతీల్లో సర్పంచులు ఉత్సవ విగ్రహాల మారిపోతున్నారని అన్నారు. దారి మళ్లించిన నిధులను తిరిగి ఇచ్చేయాలని వారి డిమాండ్ చేశారు….
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.*🙏