19/09/2023
*శ్రీ శక్తి స్వరూపిణి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి*
తిరుపతి, సెప్టెంబర్ 18 : తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి పట్టణంలోని శ్రీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి అమ్మవారిని ప్రాచీన సంప్రదాయాన్ని పాటిస్తూ గౌ. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమలకు బయలుదేరే ముందు దర్శించుకున్నారు.
శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆలయ మర్యాదలతో టిటిడి ఛైర్మన్ కరుణాకర రెడ్డి, ఎండోమెంట్ కమీషనర్ సత్యనారాయణ, ఆలయ చైర్మన్ గోపి యాదవ్, ఈ ఓ మునికృష్ణయ్య, పూజారులు తదితరులు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర భూగర్భ గనులు, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి కే నారాయణ స్వామి, రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యువజనుల శాఖ మంత్రి ఆర్కే రోజా, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆది మూలపు సురేష్, టీటీడి బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి, ఎంపీ గురుమూర్తి, ఎంఎల్సీలు కళ్యాణ చక్రవర్తి, భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం, ఎం ఎల్ ఏ లు సత్యవేడు, శ్రీకాళహస్తి, రైల్వే కోడూరు, కె.ఆదిమూలం , బియ్యపు మధుసూధన్ రెడ్డి, కోరముట్ల శ్రీనివాసులు, తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణారెడ్డి, తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ డి కే బాలాజీ, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, డిప్యూటీ మేయర్ లు భూమన అభినయ రెడ్డి, సెట్విన్ సీఈఓ మురళీకృష్ణ, ఆలయ సిబ్బంది తదితరులు వున్నారు.