Tirupati4u

Tirupati4u tirupati4u

22/12/2022

తిరుపతిలోని మొదటి సారిగా పెట్టిన టన్నెల్ ఫిష్ అక్వేరియం -
తిరుపతి ఎగ్జిబిషన్ 2022

First Tunnel Fish Aquarium in Tirupati -
Tirupati Exhibition 2022


తిరుపతి జిల్లా పై మాండోసు తుఫాను విరుచుకుపడింది. తిరుపతి నగరంతో పాటుగా తిరుపతి జిల్లాలోని వివిధ భాగాల్లో భారీ నుంచి అతిభ...
10/12/2022

తిరుపతి జిల్లా పై మాండోసు తుఫాను విరుచుకుపడింది. తిరుపతి నగరంతో పాటుగా తిరుపతి జిల్లాలోని వివిధ భాగాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడ్డాయి. తమిళనాడు అలాగే చెన్నైతో పోలిస్తే గత పోష్ట్లల్లో చెప్పిన విధంగానే ఆంధ్రాలో ఎక్కువగా వర్షాలు పడ్డాయి. నాయుడూపేట, తిరుపతి జిల్లాలో అత్యథికంగా 281 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇది ఇలా ఉండగా విశాఖ నగరం, విజయవాడలో కూడ వర్షాలు నమోదవుతోంది.

ఈ క్రింది చిత్రంలో 70 మిల్లిమీటర్ల వరకే చూపించాను. పేజీ సరిపోదు కాబట్టి మీ ఊరి పేరు రాకపోతే బాధపడకండి.

FOLLOW Us on Instagram at - www.instagram.com/andhrapradeshweatherman

తిరుపతి జిల్లాలోని పలు భాగాల్లో విపరీతమైన వర్షాలు వర్షాలు కురుస్తున్నాయి. గాలులు 70 కిమీ। గంటకు వీస్తోంది. అలాగే నెల్లూర...
09/12/2022

తిరుపతి జిల్లాలోని పలు భాగాల్లో విపరీతమైన వర్షాలు వర్షాలు కురుస్తున్నాయి. గాలులు 70 కిమీ। గంటకు వీస్తోంది. అలాగే నెల్లూరు, పక్కనే ఉన్న అన్నమయ్య జిల్లాల్లో వర్షాలుంటాయి. చిత్తూరు జిల్లాలో కూడా వర్షాలు జోరందుకోనుంది.

తిరుపతి జిల్లా నాయుడూపేటలో 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

FOLLOW Us on Instagram at - www.instagram.com/andhrapradeshweatherman

మాండోస్ తుఫాను 2020 లో వచ్చిన నివర్, అలాగే 2018లో వచ్చిన గజ తుఫాను కంటే బలమైనది. అందు వలన గాలులు ఒక పక్కన భారీగా ఉంటే, మ...
09/12/2022

మాండోస్ తుఫాను 2020 లో వచ్చిన నివర్, అలాగే 2018లో వచ్చిన గజ తుఫాను కంటే బలమైనది. అందు వలన గాలులు ఒక పక్కన భారీగా ఉంటే, మరో పక్కన వర్షాలు కూడ ఎక్కువగా ఉండనుంది. ఒక సారి వివరాల్లోకి వెళ్తాం. గత కొన్ని పోష్టుల్లో చెబుతూ వచ్చినట్టుగానే తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, తూర్పు చిత్తూరు జిల్లా (చిత్తూరు టౌన్) వైపు ఎక్కువగా వర్షాలు, ఈదురుగాలులు ఉండనుంది. అలాగే మనం అన్నమయ్య జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లాలోని పలు భాగాల్లో కూడ భారీ నుంచి అతిభారీ వర్షాలను చూడగలము.

ఈ రోజు రాత్రి నుంచి రేపు మధ్యాహ్నం వరకు కీలకం. పైన చెప్పిన అన్ని జిల్లాల్లో వర్షాలుంటాయి. తిరుపతి జిల్లాలోనే అత్యధిక వర్షాలను మనం చూడగలము. అనకాపల్లి, విశాఖ​, కాకినాడ​, ఏలూరు, ఎన్.టీ.ఆర్. (విజయవాడ కూడ​), తూర్పు, పశ్చిమ గోదావరి, పల్నాడు, గుంటూరు, అల్లూరిసీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, గాలులు. అలాగే కొనసీమ​, పశ్చిమ గోదావరి కోస్తా భాగాలు, బాపట్ల​, కృష్ణా, ప్రకాశం కోస్తా భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలను మనం ఈ తుఫాను వలన చూడగలము. గాలులు కూడ ఎక్కువగానే ఉంటుంది.

FOLLOW Us on Instagram at - https://www.instagram.com/andhrapradeshweatherman/

మాండోస్ తుఫాను మొదటి ప్రభావం  ప్రస్తుతం తిరుపతి జిల్లా మీదుగా పడుతోంది. తిరుపతి జిల్లాలోని తిరుపతి, నాయుడూపేట​, శ్రీకాళహ...
09/12/2022

మాండోస్ తుఫాను మొదటి ప్రభావం ప్రస్తుతం తిరుపతి జిల్లా మీదుగా పడుతోంది. తిరుపతి జిల్లాలోని తిరుపతి, నాయుడూపేట​, శ్రీకాళహస్తి, సత్యవేడు వైపుగా భారీ వర్షాలు, గాలులు మరో నాలుగు గంటల వరకు అడపదడపాగ కొనసాగనుంది. రోజులో సమయం కాను కాను వర్షాల జోరు భాగా పెరగనుంది. దయజేసి జాగ్రత్తలు తీసుకోగలరు.

ఇంకాసేపట్లో ఈ రోజు, రేపు గాలులు, వర్షాలు ఎలా ఉండనుందో, ఏ ప్రాంతం వారు అప్రమత్తంగా ఉండాలో ఇస్తాను.

andhrapradeshweatherman

వైభవంగా పౌర్ణమి గరుడ సేవతిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలం...
08/12/2022

వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

తిరుపతి జిల్లా...నలుగురు బాలలు మిస్సింగ్ కేసు సుఖాంతం.తల్లి దండ్రులు బాగా చదువుకోమని చెప్తున్నారని నిన్నటి నుంచి కనిపించ...
08/12/2022

తిరుపతి జిల్లా...

నలుగురు బాలలు మిస్సింగ్ కేసు సుఖాంతం.

తల్లి దండ్రులు బాగా చదువుకోమని చెప్తున్నారని నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన తిరుపతికి చెందిన నలుగురు బాలలను క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించత.

జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,వారి సూచనలతో చురుకుగా కదిలిన పోలీసులు.

వివరాలు...

తిరుపతి మంగళం బి టి ఆర్ కాలనీకి చెందిన నలుగురు విద్యార్థులు నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు. స్కూలు కని బయలుదేరిన వారు పాఠశాలకు వెళ్లకుండా కపిల తీర్థం కు వెళ్లి అక్కడి నుంచి లీల మహల్ సర్కిల్ కి వచ్చారు. అయితే ఆ తర్వాత వారి ఆచూకీ కనిపించలేదు వారి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఆలిపిరి పోలీసులు.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారి సూచనల ప్రకారం పిల్లల ఫోటోలు, ఇతర సమాచారాన్ని ప్రచార మాధ్యమాలైన అనేక వాట్స్అప్ గ్రూపులకు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ చిన్నారుల ఆచూకీ తెలిసినవారు అలిపిరి పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తిని ప్రజలకు చేరవేశారు.

దర్యాప్తులో పిల్లలు తిరుపతి తిరుమల ప్రాంతాల్లోనే ఉన్నట్టు గుర్తించి గాలింపు మరింత వేగవంతం చేశారు.

ఇదే సమయంలో సోషల్ మీడియా లో పిల్లల ఫోటోలు చూసినవారు కొంతమంది ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆలస్యం చేయకుండా విద్యార్థులను మరింత తొందరగా కనుక్కొనే ప్రయత్నం చేసి క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి సకాలంలో పిల్లల ఆచూకీ కనుగొని క్షేమంగా అప్పగించిన పోలీసులకు పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేక అభినందనలు తెలుపుకున్నారు.

కేసు దర్యాప్తు విషయంలో ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించకుండా బాధ్యతగా వ్యవహరించి కొద్ది గంటలు వ్యవధిలోనే పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించడంలో విశేష ప్రతిభ చూపిన అలిపిరి పోలీసులకు జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,గారు అభినందనలు తెలిపారు...

04/12/2022

స్వామిని చూసిన ఆ క్షణం...
Most precious seconds 💕🙏

C: Teluguswaggers

తిరుమలముగిసిన టీటీడీ పాలక మండలి సమావేశంత్వరలో శ్రీవారి ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేపడతాంశ్రీవారి బాలాలయం ఏర్పాటు...
01/12/2022

తిరుమల

ముగిసిన టీటీడీ పాలక మండలి సమావేశం

త్వరలో శ్రీవారి ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేపడతాం

శ్రీవారి బాలాలయం ఏర్పాటు చేసి ఆరు నెలల్లో తాపడం పనులు పూర్తి చేస్తాం

ఫిబ్రవరి 23 2023లో బాలాలయం ఏర్పాటు చేస్తాం

1957-58 లో శ్రీవారి ఆనంద నిలయానికి బంగారు తాపడం వేశారు

అప్పట్లో బంగారు తాపడం పనులను చేసిన పద్ధతిలోనే ఇప్పుడు కూడా నిర్వహిస్తాం

జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగిస్తాం

వైకుంఠ ద్వార దర్శనాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇస్తాం

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మించదలచిన ఆలయాలు పెండింగ్ లో ఉన్నాయి

త్వరితగతిన ఆలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం

రేపటి నుండి ప్రయోగాత్మకంగా వీఐపీ బ్రేక్ దర్శన సమయాలు మార్పు

ఉదయం 7.30 నుండి 8 గంటల మధ్య వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభమవుతాయి

రెండో ఘాట్ రోడ్డులో రక్షణ గోడ నిర్మాణానికి రూ.9 కోట్లు కేటాయింపు

తిరుమల బాలాజీ నగర్ లో అభివృద్ధి పనులకు రూ.3.70 కోట్లు కేటాయింపు

ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సాహించేందుకు

జమ్మూలో శ్రీవారి ఆలయం నిర్మాణం రెండు నెలల్లో పూర్తవుతుంది

జమ్మూలో శ్రీవారి ఆలయం వద్ద సౌకర్యాల కల్పనకు రూ.7 కోట్లు కేటాయింపు

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.3.75 కోట్లు కేటాయింపు

టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలకు తగిన విధంగా జీతాలు పెంచాలని నిర్ణయం

జీతాలు పెంపు పై త్వరలోనే కమిటీ

- టీటీడీ చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి

ఇక తిరుపతిలోనే శ్రీవాణి దర్శనం టికెట్లు– మాధవం అతిథిగృహంలో కౌంటర్లు ప్రారంభించిన జేఈవో శ్రీ వీరబ్రహ్మంతిరుపతి 30 నవంబరు ...
30/11/2022

ఇక తిరుపతిలోనే శ్రీవాణి దర్శనం టికెట్లు
– మాధవం అతిథిగృహంలో కౌంటర్లు ప్రారంభించిన జేఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి 30 నవంబరు 2022: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు బుధవారం నుంచి తిరుపతి లోనే మంజూరు చేస్తున్నారు. మాధవం అతిథిగృహంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లను జేఈవో శ్రీ వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు. గుంటూరుకు చెందిన శ్రీ ఎన్ లక్ష్మి హరీష్, శ్రీమతి జి.రూప సింధు కు జేఈవో తొలి టికెట్ అందించారు.

అనంతరం శ్రీ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ, శ్రీవాణి ట్రిస్టు కు రూ 10 వేలు విరాళం ఇచ్చి రూ 500 చెల్లించే భక్తులకు ఇప్పటి దాకా తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేస్తున్నారని చెప్పారు.

దాతలు ముందురోజు తిరుమలకు వెళ్ళి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రక్రియలో దాతలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గుర్తించి టీటీడీ యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి ఇక్కడే వారికి వసతి గదులు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీనివల్ల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ కు సమీపంలో ఉన్న మాధవం గెస్ట్ హౌస్ నుంచి ఉదయాన్నే బయలు దేరి తిరుమలకు వెళ్ళవచ్చు నన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో పురాతన ఆలయాల అభివృద్ధి, జీర్ణోద్ధరణ, కొత్తగా ఆలయాలు, భజన మందిరాలు నిర్మిస్తున్నామని శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. ఈ ట్రస్టు ద్వారా తొలివిడత లో తెలుగు రాష్ట్రాల్లో 502 ఆలయాలు నిర్మించామన్నారు. రెండో విడతలో సుమారు 1500 ఆలయాల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. శ్రీవాణి ట్రస్టు కు విరాళం ఇచ్చే భక్తులు తిరుపతిలోని మాధవం అతిథిగృహం లో ఏర్పాటు చేసిన కౌంటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఈ కౌంటర్ల నిర్వహణకు ముందుకొచ్చిన యూనియన్ బ్యాంకు యాజమాన్యానికి జేఈవో కృతజ్ఞతలు తెలిపారు.

టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, యూనియన్ బ్యాంకు రీజనల్ హెడ్ శ్రీ రాం ప్రసాద్, చీఫ్ మేనేజర్లు శ్రీ బ్రహ్మయ్య , శ్రీ నగేష్ కుమార్ , విజివో శ్రీ మనోహర్, డిప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఈఈ శ్రీ కృష్ణారెడ్డి, ఏఈవో శ్రీ ధనుంజయులు పాల్గొన్నారు.

వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం
28/11/2022

వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

శ్రీ పద్మావతి అమ్మవారి చక్రస్నానం Before & After Aerial ViewCredits - N Mukesh Reddy
28/11/2022

శ్రీ పద్మావతి అమ్మవారి చక్రస్నానం
Before & After Aerial View
Credits - N Mukesh Reddy

Address

Tirupati

Website

Alerts

Be the first to know and let us send you an email when Tirupati4u posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category