27/06/2021
🙏అందరికినమస్కారం..
జగనన్న JOB LESS క్యాలెండర్ను రద్దుచేసి రాష్ట్రంలో ఉన్న అన్ని పోస్టులు నూతన నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యల మీద విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన *BJYM రాయలసీమ జోనల్ ఇంచార్జ్ N. ఆదిశేషు గారు* మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జగనన్న job క్యాలెండర్ కాదు jobless క్యాలెండర్ ని విమర్శించడం జరిగింది, గత ఎన్నికల ముందు జగన్ రెడ్డి గారు నిరుద్యోగులకు రాష్ట్రంలో అప్పటికే ఖాళీగా ఉన్న 2.3 లక్షల పోస్టులు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పోస్టులు నిలుపుతామని మాట తప్పం, మడమ తిప్పం అని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత 10 వేల పోస్టులు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం నిరుద్యోగులకు నోట్లో మట్టి, కొట్టినట్టు అయిందని క్యాలెండర్ చూసిన తర్వాత లక్షలాది మంది నిరుద్యోగులు జీవితం ప్రశ్నార్థకంగా మారింది. వాలంటీర్స్ తమ జీతం పెంచాలని ఉద్యమాలు చేసినప్పుడు మీరు చేస్తున్నది ఉద్యోగం కాదు స్వచ్ఛంద సేవ మాత్రమే అని ప్రకటించిన జగన్ రెడ్డిగారు ఈనాడు మాట మార్చి వాలంటీర్స్ ను ఉద్యోగాలు చూపించడం జరిగింది మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి రెండు నాలుకల ధోరణి కి అద్దం పడుతుందని వారు తెలియజేయడం జరిగింది ,ఉద్యోగాలు మీరు ఇచ్చే బిక్ష కాదనే అవి నిరుద్యోగుల హక్కు కాబట్టి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న
* DSC ద్వారా 25,000/- ఉపాధ్యాయ పోస్టులు.
* 6000/- పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు.
* 1000 సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్లు.
* 2000/- గ్రూప్ 2 పోస్ట్లు.
* 300/- గ్రూప్ వన్ పోస్ట్లు.
* 1000/- జూనియర్ లెక్చరర్ పోస్ట్లు.
* 2000/- గ్రంథాలయ ఉద్యోగుల పోస్ట్లు.
ఇవి కాకుండా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది లేకపోతే ఉద్యమాన్ని దశలవారీగా ముందుకు తీసుకు పోదామని ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరి మంత్రుల ఇంటిముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు..
ఈ కార్యక్రమంలో పూర్వ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు PV ప్రతాప్ రెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గారు,యువమోర్చ జిల్లా కార్యదర్శి రవితేజ ,యువమోర్చ పట్టణ అధ్యక్షులు పవన్ కుమార్ గారు, బీజేపీ జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు, పూర్వ యువ మోర్చ జిల్లా కార్యదర్శి గంగాధర్ యాదవ్,ST మోర్ఛ పట్టన అధ్యక్షులు సురేష్ కుమార్,పాల్గొన్నారు..