21/08/2023
*అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం కోటేగంటి నబి రసూల్ కు జాతీయ సేవా పురస్కారం*
*ఉభయ రాష్ట్రాల యం.బి.సి. గౌరవ అధ్యక్షులు,మరియు శ్రీ దాసరినారాయణరావు కల్చరల్ అకాడమీ విశాఖరత్న కళా పరిషత్ (రి)సంయక్త చైర్మన్ చేతులు మీదగా డా. బి.అర్.అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారం అందుకున్న తాడిపత్రి నూర్ భాషా (దూదేకుల) సేవా సంఘం గౌరవ అధ్యక్షులు కోటేగంటి నబి రసూల్*
21.08.2023 ఈరోజు సోమవారం విశాఖపట్నం జీ.వి.కే.కాలేజీ ఎదురుగా జిల్లా పౌర గ్రంధాలయం ఏ.సి.ఆడిటోరియంలో శ్రీ దాసరినారాయణరావు కల్చరల్ అకాడమీ విశాఖరత్న కళా పరిషత్ (రి)సంయక్త చైర్మన్ ఫౌండేర్ పి.ఎ.భాస్కర్ నిర్వాహణలో వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులకు డా. బి.అర్.అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారాలు,మరియు డా.దాసరినారాయణరావు సేవా పురస్కారాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాల యం.బి.సి. గౌరవ అధ్యక్షులు మరియు వై.యస్.ఆర్.సి.పి నాయకులు డా. ఆకుమళ్ళ నాని మరి కొందరు ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని అన్ని రంగాల్లో స్వచ్ఛంద సేవా చేసిన వారిని కొంత మందిని మాత్రమే సెలక్ట్ చేసి ఈ పురష్కారం ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం కేవలం అతి కొద్దిమంది కీ ప్రాముఖ్యత్య కల్పించి వారికి ఈ పురస్కారాలు ప్రముఖులు చేతుల మీదుగా అందించడం జరిగింది, అందులో ముందుగా , కోటేగంటి నబి రసూల్ గౌరవ అధ్యక్షులు నూర్ భాషా (దూదేకుల) సేవా సంఘం గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న అనేక సేవల్ని గుర్తించి ఈ రోజు విశాఖ జిల్లాలో డా. బి.అర్.అంబేద్కర్ జాతీయ సేవాపురస్కారం ముఖ్య అతిథి గా వరల్డ్ రికార్డ్స్ హోల్డర్,ఆంధ్ర సోనూ సూద్,ఉభయ రాష్ట్రాల యం.బి.సి.గౌరవ అధ్యక్షులు మరికొంత మంది ప్రముఖులు పాల్గొని అవార్డు అందచేశారు
🗣️ *కోటేగంటి నబి రసూల్ మాట్లాడుతూ*
ముందుగా
డా. బి.అర్.అంబేద్కర్ జాతీయ సేవాపురస్కారం, నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు ఇంతటి మహత్తర గుర్తింపు కల్పించిన 1999 నుంచి ఇప్పటివరకు సహకారం అందించిన రాజకీయనాయకులకు,పెద్దలకు, కుల సంఘ పెద్దలకు, నా కుటుంబ సభ్యులకు, నాతోటి మిత్రులకు, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, నేనున్నా కదా, మంచి చేసే దాంట్లో, ఎందాకైనా నీకు తోడుగా నీకు నీడగా ఉంటా అనే వ్యక్తి మా బాణా నాగేశ్వర్ రెడ్డి అన్నకి జన్మతః రుణ పడి ఉంటాను అది కూడా
డా. బి.అర్.అంబేద్కర్ దేశ బడుగు వర్గాల ఆరాధ్య దైవం, రాజ్యాంగ నిర్మాత ప్రతీ పేద వాడు చట్ట సభల్లో ప్రాముఖ్యత కల్పించడం వలనే ఇవ్వాల చట్ట సభల్లో అడుగు పెట్టారంటే అది కేవలం డా. బి.అర్.అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగ వలనే అటువంటి మహోన్నత వ్యక్తి కీ ముందుగా నా హృదపూర్వక ధన్యవాదములు సమస్త దేశ ప్రజలందరూ గుండెల్లో చిరస్తాయి నిలిచిపోయి చెరగని ముద్ర వేసుకొన్న ఒకే ఒక్కరు మహోన్నత మైన వ్యక్తి డా.బి.అర్.అంబేద్కర్ గారు మాత్రమే,అటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి పేరు మీద నేను డా. బి.అర్.అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారం ఏంతో మంది ప్రముఖుల మరియు ఉభయ రాష్ట్రాల యం.బి.సి. గౌరవ అధ్యక్షులు,మరియు శ్రీ దాసరినారాయణరావు కల్చరల్ అకాడమీ విశాఖరత్న కళా పరిషత్ (రి)సంయక్త చైర్మన్ చేతుల మీదుగా అందుకోవడం నా జన్మ సుకృతం అయింది ఈరోజు ఏంతో గర్వంగాను ఎనలేని సంతోషంగా ఉంది, ఈ జాతీయ పుష్కర అవార్డును జన్మనిచ్చిన తల్లి తండ్రికి నూర్ భాషా (దూదేకుల) సేవా సంఘానికి అంకితం చేస్తున్నాను విశాఖ రత్న పి.ఏ.భాస్కర్,నాని కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ జెస్తూన్నాను ఈ కార్యక్రమంలో,మాజీ కార్పొరేటర్ సాంబశివరావు,జాతీయ అధ్యక్షులు చింతాడ.సూర్యం ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.