03/10/2023
చంద్రబాబు అరెస్టు కు
రజక వృత్తికి సంబంధమేంటి
ఆయన ప్రజల సొమ్మును తిన్నపాపానికి జైల్ కు వెళ్తే రజకులకు వైసిపి వారి గుడ్డలను ఉతకవద్దని చెప్తావా అసలు మీరు కులానికి పట్టిన చీడ పురుగులు
వైసిపి వారి గుడ్డలను ఉతకవద్దని చెప్పడమే కాదు వారిని బహిష్కరించమని ఆదేశాలు ఇస్తారా ఎంత దుర్మార్గం ఇది
మీ బాబు ఇదేనా మీకు నేర్పిన సంస్కారం విజ్ఞత...?
మీ బాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన గుడ్డలను లోపల ఉన్న రజకులతో ఉతికించుకోలేదంట ఫస్ట్ అధి చూడండి తర్వాత మీ పౌరుషాన్ని చూపుదురు
రజకులు సమాజం లో అందరితో పాటు రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగం గౌరవం పరంగా సమానం గా ఉన్నతంగా జీవించకూడదా ఎంతసేపూ రజకులు గుడ్డలు ఉతుక్కుంటూ వారి వీరి ఇళ్ళ దగ్గర చేయి చాచుకుంటూ హీనంగా జీవించాలనే మీకు మీ చంద్రబాబు నారా లోకేష్ లో అభిమతమా
రజకులందరు మీ టీడీపీ లోనే ఉన్నారు అనేది భ్రమే
చాలా వరుకు మీ టీడీపీ వారి నిజస్వరూపాన్ని తెలిసాక సమయం కోసం ఎదురు చూస్తున్నారు
ఎమ్మెల్సీ అంటారా బాబు ఎమ్మెల్సీ ఇచ్చారని తెగ గుంజుకుంటున్న టీడీపీ వారికి ఒకటే చెబుతున్నా
మన రజకులకు 2004 లోనే దివంగత ముఖ్యమంత్రి మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారు ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చి గెలిపించుకొని మంత్రి పదవి ఇచ్చి తన క్యాబినెట్ లో పెట్టుకున్నా విషయం తెలియదా తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి
టీటీడీ మెంబర్ గా ఏనాడైనా మీ బాబు మన రజకులకు స్థానమిచ్చి నియమించారా లేదే అదే మా దివంగత ముఖ్యమంత్రి మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారు అంజయ్య గారిని టీటీడీ మెంబర్ గా నియమించిన విషయం కూడా తెలుసుకోండి
సబ్సిడీ లోన్లు అంటారా మీ టీడీపీ హయాంలో ఎంతమందికి లోన్లు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు కాస్త చెబుతారా
సబ్సిడీ లోన్లు చాలా వరకు మీ టీడీపీ లో ఉన్న వారికి రాజకీయ కాస్తోకూస్తో తెలిసిన వారికి ఇచ్చారు అంతేకాని అందరికీ ఇవ్వలేదే మీ టీడీపీ.. పోనీ ఐదేళ్ల పాటు ఇచ్చిందా లేదే ఎన్నికలు ఆరు నెలల ముందు ఇచ్చి ఓట్ల రాజకీయం చేసిన నీచ చరిత్ర వారిది
అదే మా వైఎస్ జగన్ గారి ప్రవర్తన అలా కాదు ప్రతి కులం కూడా సమాజం లో అన్ని రకాలుగా బాగుండాలి సమాజంలో మంచిగా ఉండాలనే తాపత్రయం మా జగన్ గారిది
జగనన్న చేదోడువాదోడు పథకం కింద ఏటా లక్షా పదివేలకు పైగా రజకులకు పదివేల రూపాయలు అందిస్తూ అభివృద్ధి లో చేయి అందిస్తున్నారు ఏడాదికి 80 కోట్ల రూపాయలకు పైగా అందిస్తున్నారు సిఎం వైఎస్ జగన్ గారు
బాబు అరెస్టు కు సంఘీభావం గా పక్కరాష్ట్రం బెంగళూరు లో ఐటీ ఉద్యోగులు ధర్నా చేస్తున్న సమయంలో ఓ ఉద్యోగిని చాకలొళ్ళు యదవలు అని పోల్చి తిడితే దాని నోరు విప్పని టీడీపీ రజకులు టిడిపి సోషల్ మీడియా యాక్టివిటీస్ వ్యక్తి ఏలూరు కు చెందిన అనూష గారు కూడా మన కులాన్ని దూషించిన సందర్బం లో కూడా నోరు విప్పని టీడీపీ రజకులు
ఏనాడూ కూడా మన కులాన్ని దూషించిన సందర్బం కానీ హేళన చేసిన సందర్భం కానీ చేయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారి బట్టలు ఉతకొద్దండి చెప్పడం ఎంతవరకు సమంజసం చెప్పండి
బాబు అరెస్టు కు రజక వృత్తి కి సంబంధమేంటి
వైసిపి వారిని బహిష్కరించమని ఆదేశాలు ఇస్తారా ఇది ఎంత తీవ్రమైన నేరమో తెలుసా
పోనీ మీ మాటలు విని వారు ఉతకడం మాని వారి కుటుంబాలు బజారున పడితే వారికి దిక్కెవరు మీకే దిక్కులేదు వారికేలా సహాయం చేస్తారు
మీ రాజకీయ అభివృద్ధి కొరకు కులాల మద్య విబేధాలు సృష్టిస్తారా... రాజకీయంగా ఎదగాలంటే సవాలక్ష దారులు ఉన్నాయి మంచి దారిన పోయి రాజకీయంగా ఎదగండి అంతేకాని ఇలా రజకులకు రజకులకే కొట్లాటలు పెట్టే రాజకీయం చేయకండి... కులాన్ని ఇంకా హీనస్థితికి దిగజార్చే కుటిల రాజకీయాలు చేయకండి
అంటు టీడీపీ రజక సాదికారత రాష్ట్ర అధ్యక్షుడు Rama Krishna Gurrapusala గారి మీద మండిపడటం జరిగింది