NRI Connect

NRI Connect Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NRI Connect, Public Service, Tadepalli.

అందరికీ నమస్కారం, NRI Connect వివిధ దేశాల్లోని తెలుగు వారి కొరకు ఒక ఉమ్మడి వేదిక!! ఈ వేదిక ద్వారా విదేశాల్లోని తెలుగువారికి అవసరమగు సమాచారాన్ని పంచుకోవడం జరుగుతుంది. దయచేసి యూట్యూబ్, ట్విట్టర్, మరియు ఫేస్బుక్ లో ఫాలో అవగలరు. ధన్యవాదములు.

పత్రికా ప్రకటన తిరుమల, 2025 డిసెంబర్ 04:డిసెంబర్ నుండి జనవరి నెల వరకు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు వివరాలు20...
04/12/2025

పత్రికా ప్రకటన
తిరుమల, 2025 డిసెంబర్ 04:

డిసెంబర్ నుండి జనవరి నెల వరకు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు వివరాలు

2025 డిసెంబర్ నెల నుండి 2026 జనవరి నెల వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించు పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేయడం జరిగింది.

డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ 29వ తేదీ, డిసెంబర్ 30వ తేది నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, జనవరి 25న రథ సప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం జరిగింది.

పైన పేర్కొన్న రోజులకు ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేయడమైనది.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.
--------------------
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాయోజిత పథకం — ప్రవాసాంధ్ర భరోసా బీమా ప్రవాసాంధ్రుల భద్రత, సంక్షేమం కోసం APNRT Society ద్వారా అం...
26/11/2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాయోజిత పథకం — ప్రవాసాంధ్ర భరోసా బీమా ప్రవాసాంధ్రుల భద్రత, సంక్షేమం కోసం APNRT Society ద్వారా అందిస్తున్న ఈ బీమా పథకం ఇప్పుడు మరింత అందుబాటులో

కువైట్‌కు భారత నూతన రాయబారిగా పరంబితా త్రిపాఠి బాధ్యతల స్వీకరణ!!కువైట్ సిటీ, నవంబర్ 11:కువైట్‌లోని భారత రాయబారిగా శ్రీమత...
11/11/2025

కువైట్‌కు భారత నూతన రాయబారిగా పరంబితా త్రిపాఠి బాధ్యతల స్వీకరణ!!

కువైట్ సిటీ, నవంబర్ 11:కువైట్‌లోని భారత రాయబారిగా శ్రీమతి పరంబితా త్రిపాఠి సోమవారం (నవంబర్ 10, 2025) అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది.

కువైట్‌లో తన మొదటి రోజున, రాయబారి త్రిపాఠి ముందుగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. శాంతి, సత్యం, సేవ అనే గాంధీజీ ఆదర్శాలు నేటికీ ఎంతో విలువైనవిగా ఆమె పేర్కొన్నారు. అనంతరం, "ఏక్ పేడ్ మా కే నామ్" (తల్లి పేరు మీద ఒక మొక్క) కార్యక్రమంలో భాగంగా ఆమె వేప మొక్కను నాటారు. పర్యావరణ సుస్థిరత, పచ్చని భవిష్యత్తు పట్ల భారతదేశ నిబద్ధతను ఇది తెలియజేస్తుంది. అంతేకాక, దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులకు ప్రతీకగా ఉన్న 'శీలాఫలకం' వద్ద అంబాసిడర్ త్రిపాఠి నివాళులర్పించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం, అంబాసిడర్ త్రిపాఠి కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రోటోకాల్ వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి శ్రీ అబ్దుల్‌మొహసేన్ జాబర్ అల్-జైద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన నియామక పత్రాల (Credentials) కాపీని ఆయనకు సమర్పించారు.

📌 ఎన్నారైల సంక్షేమం, భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా అందిస్తున్న ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకం...
25/10/2025

📌 ఎన్నారైల సంక్షేమం, భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా అందిస్తున్న ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకంని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దుబాయ్‌లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులు,విద్యార్థులు, కార్మికులు లబ్ధి పొందవచ్చు. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సీఎం సూచించారు.‌ ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి https://apnrts.ap.gov.in/insurance వెబ్ సైట్‌ను సందర్శించగలరు.

మరిన్ని వివరాలకు:
24/7 హెల్ప్ లైన్:
📞 కాల్: +91 863 2340678
📱 వాట్సాప్: +91 85000 27678



APNRTS - ప్రవాసాంధ్ర భరోసా బీమా స్కీం...launched by Hon'ble Chief Minister..
25/10/2025

APNRTS - ప్రవాసాంధ్ర భరోసా బీమా స్కీం...launched by Hon'ble Chief Minister..

APNRTS - Pravasandra Bharosa Bima Insurance Scheme launched by Hon'ble Chief Minister..
25/10/2025

APNRTS - Pravasandra Bharosa Bima Insurance Scheme launched by Hon'ble Chief Minister..

“ప్రవాసాంధ్ర భరోసా బీమా 2.0” గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ లో

*మత్స్యకారుల్ని బంగ్లాదేశ్ నుంచి క్షేమంగా తిరిగి తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గా...
23/10/2025

*మత్స్యకారుల్ని బంగ్లాదేశ్ నుంచి క్షేమంగా తిరిగి తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు

*APNRTS ద్వారా బంగ్లాదేశ్ లోని భారత హై కమిషనర్ కి ఈ మెయిల్.

- బంగ్లాదేశ్ లో బందీలుగా మారిన విజయనగరం జిల్లాకు చెందిన 8మంది మత్స్యకారులు.

- పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి వెళ్లడంతో బందీలుగా మారిన జాలర్లు

- అధికారులను అలర్ట్ చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు
- సీఎం Nara Chandrababu Naidu గారు, మంత్రి Nara Lokesh గారు, కేంద్ర మంత్రి Ram Mohan Naidu Kinjarapu గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు
- APNRTS ద్వారా బంగ్లాదేశ్ లోని భారత హై కమిషనర్ కి ఈ మెయిల్
- బందీలుగా ఉన్న జాలర్లను వెంటనే విడుదల చేయించేలా చర్యలు చేపట్టాలని వినతి.

నవంబర్ లో నిర్వహించే విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ  ప్రభుత్వం.  పారిశ్రామిక వేత్త...
21/10/2025

నవంబర్ లో నిర్వహించే విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునేందుకు ఇప్పటికే మంత్రి లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా... ఇప్పటికే సింగపూర్ లో పర్యటించిన వచ్చిన చంద్రబాబు గారు, ఇప్పుడు యూఏఈ పర్యటనకు వెళ్తున్నారు.



21/10/2025

విదేశాల్లో నివశిస్తున్న ఉద్యోగులు, కార్మికులు & విద్యార్థులకు ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారి ...

విదేశాల్లో నివశిస్తున్న ఉద్యోగులు, కార్మికులు & విద్యార్థులకు ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారి భాగస్వామ్య...
21/10/2025

విదేశాల్లో నివశిస్తున్న ఉద్యోగులు, కార్మికులు & విద్యార్థులకు ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారి భాగస్వామ్యంతో... ప్రవాసాంధ్ర భరోసా బీమా 2.0

విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు!! 💐💐
20/10/2025

విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు!! 💐💐

📌 జనవరి నెల దర్శన కోటా విడుదల వివరాలుతిరుమల, 2025, అక్టోబర్ 17: 2026 జనవరి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శ...
18/10/2025

📌 జనవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు

తిరుమల, 2025, అక్టోబర్ 17: 2026 జనవరి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు, అంగ ప్రదక్షిణ టోకెన్లకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

23న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.

వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

24న శ్రీవాణి దర్శన కోటా విడుదల

శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

Address

Tadepalli
522501

Telephone

+918500027678

Website

Alerts

Be the first to know and let us send you an email when NRI Connect posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to NRI Connect:

Share

Category

Andhra Pradesh Non-Resident Telugu Society (APNRT Society)

Andhra Pradesh Non-Resident Telugu Society (APNRT Society), a fully-owned entity of the State Government of Andhra Pradesh, India caters the welfare, safety and development of the migrants from Andhra Pradesh spread across various countries.

APNRTS 24/7 Helpline is the face of APNRTS. Helpline is available 24/7 365 days. APNRTS Helpline serves the NRT’s across the globe by solving their grievances, advising and giving suggestions as in when required. APNRTS 24/7 Helpline is the single point of contact for any initiative or activity launched by APNRTS.

APNRTS 24/7 Helpline will try to address the issue or grievance of the NRT with the relevant department or the wing and get it resolved at the earliest. Updates about the grievance/s will be shared with the concerned NRT’s in a timely manner.

NRTs call APNRTS Helpline to know any information about the services offered by APNRTS like: