02/06/2026
🚨 రాష్ట్రంలో ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. విదర్భ నుండి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో బుధవారం (03-06-2026) రాష్ట్రంలో క్రింది విధంగా వాతావరణం ఉండనుంది.
⛈️ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే జిల్లాలు:
తేలికపాటి-మోస్తరు వర్షాలు: గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి.
తేలికపాటి వర్షాలు:శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్ కడప.
☀️ఎండ తీవ్రత - ఉష్ణోగ్రతల వివరాలు:
42°C - 44°C: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు.
40°C - 42°C : అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు.
⚠️ మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడకండి.