CPI Suryapet District

CPI Suryapet District CPI

11/10/2025
Jerripothula gudem Cpi office lo may day
01/05/2024

Jerripothula gudem Cpi office lo may day

ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ ఉద్ఘాటన...
05/02/2023

ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ ఉద్ఘాటన

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్అన్నారు.
ఆదివారం నాడు అయన సూర్యాపేట లోని సిపిఐ జిల్లా కార్యాలయం ధర్మ బిక్షం భవన్ లో జరిగిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ..
ఎన్నో పోరాటాలు చేసి,అసమాన త్యాగాలు చేసి1400 మంది నవ యువ కిశోరాల ప్రాణత్యాలతో సాధించుకున్న తెలంగాణలో ఇంకా రోడ్డుకు ఇరువైపులా గుడిసెలు వేసుకొని బ్రతికే దుస్థితిలోనే ఉండాలా అని, తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని, నిరుపేదలు జీవించేందుకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని, ప్రతి నిరుద్యోగి నెలకు మూడు వేల రూపాయల భృతి ఇస్తామని, ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తామని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థ లేకుండా చేస్తామని, దేవాలయ భూములకు పట్టాలు ఇస్తామని, ఇలా లెక్కకు మిక్కిలి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన వారు ఆ ఎన్నికల వాగ్దానాలు చిత్తశుద్ధితో అమలు చేయాలని ఆయన కోరారు.
ముఖ్యంగా రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామన్న హామీనేడు అపహాస్యం పాలవుతుందని,కనీసం రోజుకు ఐదు నుంచి ఆరుగంటలు కూడారైతాంగానికి విద్యుత్తు సరఫరా చేయలేకపోతున్నారని, ఈ పాపము ఎవరిది అని ఆయన ప్రశ్నించారు.
బిఆర్ఎస్ తో సిపిఐ పొత్తు కేవలం ఎన్నికల వరకు మాత్రమేనని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పేద మధ్యతరగతి పక్షాన నిలబడి పోరాడుతామని, అందులో ఎలాంటి అనుమానం లేదనిఆయన స్పష్టం చేశారు.
మతోన్మాద బిజెపిని దేశంలో రాష్ట్రంలో నిలువరించేందుకు మాత్రమే బిఆర్ఎస్ తోఎన్నికల అవగాహన కుదుర్చుకుంటామే తప్ప ప్రజా ఉద్యమాలు నిర్మించడంలోప్రజలను చైతన్య ప్రచారంలో వెనుకడుగు వెయ్యబోమని ఆయన తెలిపారు.
జిల్లా కార్యవర్గ సమావేశానికి య ల్లావుల రాములు అధ్యక్షత వహించగా.... సమావేశంలో జిల్లా సిపిఐ కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లుకార్యకలాపాల నివేదికను భవిష్యత్తు ప్రణాళికను సమావేశంలో ప్రవేశపెట్టారు
కాగా సమావేశంలో ధూళిపాళ ధనుంజయ నాయుడుమండవ వెంకటేశ్వర్లు ఉస్టెల నారాయణరెడ్డికంబాల శ్రీనివాస్, పోకల వెంకటేశ్వర్లు దేవరం మల్లీశ్వరి పాల్గొన్నారు

ఎర్రజెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ వాసిరెడ్డి సోమిరెడ్డి సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పశ్య పద్మ తిరుమలగిరి,ప్రజాస్ఫూర్తి :...
05/02/2023

ఎర్రజెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ వాసిరెడ్డి సోమిరెడ్డి
సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పశ్య పద్మ
తిరుమలగిరి,ప్రజాస్ఫూర్తి :
సిపిఐ తిరుమలగిరి మండల కార్యదర్శి కామ్రేడ్ వాసిరెడ్డి సోమిరెడ్డి మూడవ తారీఖున గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆదివారం వాసిరెడ్డి సోమిరెడ్డి అంతిమయాత్రలో పాల్గొని,సంతాప సభలో సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పద్మ మాట్లాడుతూ.... కామ్రేడ్ వాసిరెడ్డి సోమిరెడ్డి గారు భూస్వామ్య కుటుంబంలో పుట్టి ఎర్రజెండాకు చిన్నతనం నుండి ఆకర్షితుడై కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి పేద ప్రజల పక్షాన,చిన్నతనము నుండి పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమల్లో, పోరాటాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా ఉండి, రైతు సంఘం కార్యక్రమములో రైతుల సమస్యలపై పోరాటం చేసి చివరి వరకు కమ్యూనిస్టు పార్టీలో ఉన్న గొప్ప నాయకుడు వాసిరెడ్డి సోమిరెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు అనంతుల మల్లీశ్వరి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్,ఎల్లంల యాదగిరి, తిరుమలగిరి మాజీ ఎంపీపీ కొత్తగట్టు మల్లయ్య, ఎండి ఇక్బాల్ పోరెల్ల వెంకన్న, ఎల్లంల కొమురెల్లి, కనుక అశోక్,శ్రీకాంత్,నాగుల గాని మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

14/05/2021

ెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావినారాయణరెడ్డి అరుదైన ప్రసంగం || RaviNarayanaReddy

Address

PSR Center Suryapet
Suryapet
508213

Telephone

+919966075492

Website

Alerts

Be the first to know and let us send you an email when CPI Suryapet District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share