04/06/2023
*జాయినింగ్ హాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సీటీబీస్ (నరాలులో రక్తం స్తంభించుట వ్యాధితో) బాధపడుతున్న వారికి ఆర్ధిక సహయం*.
కొత్తవలస మండలం నిమ్మలపాలెం గ్రామానికి చెందిన జాయినింగ్ హ్యాండ్ వెల్ఫేర్ సొసైటీ ఆర్థిక సహాయంతో కొత్తవలస మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన *ఎస్.సాయి బాబు* సీటీబీస్ (నరాలులో రక్తం స్తంభించుట వ్యాధితో) బాధపడుతూ వారి ఇద్దరు పిల్లలు పోషకార్ధం ఇబ్బందికరంగా ఉందని విషయం తెలుసుకుని గతంలో ట్రస్ట్ మరియు దాతల సహకారంతో రూ.10500/- లు సహాయం చేయటం జరిగింది, అలాగే వారి ఆరోగ్యం ఇప్పటికి కుదిట పడకపోవడం వలన నెల వారి మందులు ఖర్చులు ఎక్కువ అవ్వటం వలన వారి సమస్య తెలుసుకొని మరల ఈరోజు జాయింట్ హాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఒక రూ. 5,000 /- లు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు సిరిమల్ల పైడిరాజు మాట్లాడుతూ మా ఈ ట్రస్టు ద్వారా గడిచిన రెండేళ్లలో ఎన్నో పేద కుటుంబాలకు మరియు అనాధ వృద్ధులకు మరియు దాతల సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు గొంప రాంబాబు మరియు సభ్యులు సిరిమల్ల పైడి రాజు పాల్గొన్నారు.