Srikakulam District Police

Srikakulam District Police Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Srikakulam District Police, Government Organization, Srikakulam.

శ్రీకాకుళం జిల్లా పోలీసుll హెల్మెట్ ప్రాణరక్షణ కవచం – ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ధరించాలి.ll ll పాతపట్నంలో అభయం హెల్మె...
02/06/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు

ll హెల్మెట్ ప్రాణరక్షణ కవచం – ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ధరించాలి.ll

ll పాతపట్నంలో అభయం హెల్మెట్ బ్యాంక్ ప్రారంభించిన టెక్కలి డీఎస్పీ డి. లక్ష్మణరావు.ll

శ్రీకాకుళం, పాతపట్నం, జూన్ 02:రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని టెక్కలి డీఎస్పీ డి. లక్ష్మణరావు సూచించారు.జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అమలు చేస్తున్న "అభయం హెల్మెట్ బ్యాంక్" కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం పాతపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద అభయం హెల్మెట్ బ్యాంకును డీఎస్పీ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రాణనష్టాలను తగ్గించేందుకు జిల్లా పోలీసు శాఖ పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. హెల్మెట్ ధరించడం కేవలం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాకుండా, వ్యక్తిగత భద్రతకు అత్యంత అవసరమని పేర్కొన్నారు.ప్రయాణ సమయంలో హెల్మెట్ వెంట లేకపోయినా, హెల్మెట్ బ్యాంక్ ద్వారా ఎటువంటి రుసుం లేకుండా తాత్కాలికంగా హెల్మెట్ తీసుకుని వినియోగించి, అనంతరం స్వంత హెల్మెట్ కొనుగోలు చేసిన తర్వాత తిరిగి అప్పగించాలని వాహనదారులను కోరారు.ఇంటి నుంచి బయలుదేరిన ప్రతిసారి హెల్మెట్ ధరించే అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని కోరారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, "సేఫ్టీ ఫస్ట్ – హెల్మెట్ మస్ట్" అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది, వైద్యులు మరియు స్థానిక ప్రజలతో కలిసి హెల్మెట్లు ధరించి రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నియమాల పాటింపు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో కొత్తూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రసాదరావు, పాతపట్నం ఎస్‌ఐ మధుసూదన్‌రావు, సర్కిల్ ఎస్‌ఐలు, డాక్టర్ సంతోష్ బాబు, పోలీసు సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Andhra Pradesh Police Dgp Andhra Pradesh Srikakulam District Police

శ్రీకాకుళం జిల్లా పోలీసుll పోలీసు శాఖకు సేవలందించిన పోలీసు డాగ్ డైసీకి ఘన నివాళి.ll ll అధికార లాంఛనాలతో పోలీసు జాగిలం డై...
02/06/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు

ll పోలీసు శాఖకు సేవలందించిన పోలీసు డాగ్ డైసీకి ఘన నివాళి.ll

ll అధికార లాంఛనాలతో పోలీసు జాగిలం డైసీ అంత్యక్రియలు.ll

ll పోలీసు జాగిలం "డైసీ" మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్.ll

శ్రీకాకుళం, జూన్ 02: శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖలో గత 10 సంవత్సరాలుగా విశిష్ట సేవలందించిన పోలీసు జాగిలం "డైసీ" మంగళవారం ఉదయం అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.డైసీ మృతి పట్ల జిల్లా ఎస్పీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయ ఆవరణలో అదనపు ఎస్పీ కె.వి. రమణ డైసీ భౌతికకాయానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ ఆవరణలోని స్మశానవాటికలో పోలీసు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

డైసీ సేవల వివరాలు:
లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన డైసీ 2015 సం.లో జన్మించి 2016 సం.లో హైదరాబాద్‌లోని మోయినాబాద్ డాగ్ ట్రైనింగ్ సెంటర్‌లో ఎక్స్‌ప్లోసివ్ డిటెక్షన్
స్నిఫర్ డాగ్‌గా ప్రత్యేక శిక్షణ పొందింది. అనంతరం 2017 సం. నుంచి జిల్లాలో విధులు నిర్వర్తించి వాసన ఆధారంగా పేలుడు పదార్థాలు, కీలక ఆధారాలను గుర్తించడంలో అసాధారణ ప్రతిభ కనబరిచి జిల్లా పోలీసు శాఖలో విశేష గుర్తింపు పొందింది.వీఐపీ, వీవీఐపీ పర్యటనలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, చెక్‌పోస్టు తనిఖీలు, భారీ బందోబస్తు విధుల్లో డైసీ కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే పోలీసు పరేడ్‌లలో పాల్గొని తన విన్యాసాలతో అందరి ప్రశంసలు అందుకుంది.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ కె.వి. రమణ మాట్లాడుతూ, పేలుడు పదార్థాల గుర్తింపు, భద్రతా తనిఖీలు మరియు పోలీసు విధుల్లో డైసీ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పోలీసు శాఖకు డైసీ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్. శేషాద్రి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శంకర్ ప్రసాద్, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు డాగ్ హ్యాండ్లర్ ఎస్. గోవిందరావు, ఏఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Dgp Andhra Pradesh Srikakulam District Police Andhra Pradesh Police

01/06/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు.

జైలు నుంచి విడుదలై మళ్లీ నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు,6 దొంగతనాల కేసుల ఛేదన – రూ.80 లక్షల విలువగల 12 తులాలు బంగారు మరియు 20 కేజీల వెండి ఆభరణాలు గల చోరీ సొత్తు స్వాధీనం. చాకచక్యంగా వ్యవహరించిన కాశీబుగ్గ పోలీసులు, వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ కె.వి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు.
Dgp Andhra Pradesh Andhra Pradesh Police Srikakulam District Police

శ్రీకాకుళం జిల్లా పోలీసుll ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు.ll ll ఎండ తీవ్రత నుంచి రక్షణకు ట్రాఫిక్...
01/06/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు

ll ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు.ll

ll ఎండ తీవ్రత నుంచి రక్షణకు ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైన సామగ్రి అందజేత.ll

శ్రీకాకుళం జూన్ 01. జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సమ్మర్ సామగ్రి (కిట్) ను అందించమని అదనపు ఎస్పీ కె.వి. రమణ గారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారు ఎండ తీవ్రత నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సంక్షేమానికి అందించిన ప్రత్యేక నిధులతో, జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కొనుగోలు చేసిన ట్రాఫిక్ పోలీసు సిబ్బంది భద్రతా మరియు సంక్షేమ సామగ్రిని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి అదనపు ఎస్పీ కెవి రమణ అందజేశారు.ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఎండలు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో రహదారులపై విధులు నిర్వహిస్తున్న జిల్లా ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన వాటర్ బాటిల్స్,క్యాప్స్, సన్ గ్లాసెస్ (కళ్లద్దాలు), మాస్కులు, అలాగే శరీరానికి చల్లదనాన్ని అందించి డీహైడ్రేషన్‌ను నివారించేందుకు ఉపయోగపడే ఓఆర్ఎస్ ద్రావణం అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ కె.వి. రమణ మాట్లాడుతూ
శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లాలోని ఇతర ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న మొత్తం 76 మంది పోలీసు సిబ్బందికి ఈ సామగ్రిని అందజేశారు.ఎండ తీవ్రతను తట్టుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ సామగ్రి ఉపయోగపడుతుందని, రహదారులపై గంటల తరబడి నిలబడి విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యం, భద్రత మరియు సంక్షేమం పట్ల జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ట్రాఫిక్ పోలీసు ఇన్స్పెక్టర్ వి రామారావు, డిటిఆర్బి విభాగం ఎస్సై సురేష్ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
Dgp Andhra Pradesh Andhra Pradesh Police Srikakulam District Police

శ్రీకాకుళం జిల్లా పోలీసుll విధి నిర్వహణలో అందించిన సేవలే ఉద్యోగికి నిజమైన గుర్తింపు.ll ll జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర...
01/06/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు

ll విధి నిర్వహణలో అందించిన సేవలే ఉద్యోగికి నిజమైన గుర్తింపు.ll

ll జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్. ll

ll ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ఘన సన్మానం.ll

శ్రీకాకుళం, జూన్ 01. ఉద్యోగ జీవితంలో విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజాసేవా దృక్పథం మరియు ప్రజలకు అందించిన సేవలే ఒక ఉద్యోగికి నిజమైన గుర్తింపును తీసుకువస్తాయని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్., అన్నారు.
ఆదివారం ఉద్యోగ విరమణ పొందిన సబ్ ఇన్‌స్పెక్టర్లు టి. రామారావు,(2 టౌన్ పీఎస్ ) ఎస్. సోమశేఖరరావు, (ట్రాఫిక్ పి.ఎస్) కె. శేఖరరావు, (నరసన్నపేట పి.ఎస్)ఏఆర్ ఎస్‌ఐ కె.వి. రమణ (ఏ.ఆర్) ,హెడ్ కానిస్టేబుల్ కె. కృష్ణారావు ( కాశీబుగ్గ పి.ఎస్), పోలీస్ కానిస్టేబుల్ ఈ. లక్ష్మీపతి(వజ్రపు కొత్తూరు)లకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారికి దుశ్శాలువాలు కప్పి, జ్ఞాపికలు మరియు ప్రశంసా పత్రాలను అందజేసి వారి సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ జీవితంలోని విలువైన కాలాన్ని అంకితం చేస్తారని అన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజలకు సేవ చేయడం పోలీసు ఉద్యోగం యొక్క విశిష్టత అని పేర్కొన్నారు.ఉద్యోగ విరమణ పొందిన అధికారులు, సిబ్బంది తమ సర్వీసు కాలంలో నిజాయితీ, క్రమశిక్షణ మరియు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు.పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
అలాగే, ఉద్యోగ విరమణ అనంతరం కూడా తమ అనుభవాలను యువ పోలీసు సిబ్బందితో పంచుకోవడం ద్వారా వారికి మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కె.వి. రమణ, పి. శ్రీనివాసరావు, డీఎస్పీ ఎల్. శేషాద్రి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఇమ్మన్యవల్ రాజు, ఏఏఓ సత్యనారాయణ,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు కృష్ణంనాయుడు,పోలీస్ అసోసియేషన్ నాయకులు భుజంగరావు,జగదాంబ తదితర కార్యవర్గ సభ్యులు, పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Andhra Pradesh Police Dgp Andhra Pradesh Srikakulam District Police

శ్రీకాకుళం జిల్లా పోలీసు.ll జిల్లా ఎస్పీ పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో 65 ఫిర్యాదులు స్వీకరణ ll.శ్రీకాకుళం, జూన్ 01: ప్రజా ఫి...
01/06/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు.

ll జిల్లా ఎస్పీ పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో 65 ఫిర్యాదులు స్వీకరణ ll.

శ్రీకాకుళం, జూన్ 01: ప్రజా ఫిర్యాదులు స్వీకరణ కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ , పరిష్కారం (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా ఎస్పీ మొత్తం 65 ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదుపై సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని చట్ట ప్రకారం విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి, ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి, తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పౌర సంబంధిత వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాలు, మోసపూరిత ఘటనలు తదితర అంశాలకు సంబంధించిన మొత్తం 65 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు.
Dgp Andhra Pradesh Andhra Pradesh Police Srikakulam District Police

శ్రీకాకుళం జిల్లా పోలీసుll రూ.80 లక్షల విలువ గల చోరీ సొత్తు స్వాధీనం.ll ll ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు – పలు కేసుల...
01/06/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు

ll రూ.80 లక్షల విలువ గల చోరీ సొత్తు స్వాధీనం.ll

ll ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు – పలు కేసుల ఛేదన ll

ll జిల్లా పోలీసుల చాకచక్యంతో వరుస దొంగతనాల కేసుల పరిష్కారం ll

ll జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్.ll

శ్రీకాకుళం, జూన్ 01. శ్రీకాకుళం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఇటీవల జరిగిన వరుస దొంగతనాల కేసులను కాశీబుగ్గ పోలీసులు సమర్థవంతంగా ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

అరెస్టు కాబడిన నిందితులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లా, ఇంగ్లీష్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన గోయస్పూర్ గ్రామ నివాసులు.
A-1 : మహమ్మద్ మీజాన్ (36 సంవత్సరాలు)
A-2 : మహమ్మద్ హసన్ (26 సంవత్సరాలు).

దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడు A-1 మహమ్మద్ మీజాన్ పగటి సమయంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి (రెక్కీ నిర్వహించి), రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. దొంగిలించిన బంగారం, నగదు మరియు ఇతర విలువైన వస్తువులను విక్రయించేవాడని విచారణలో వెల్లడైంది.
నిందితుడు A-1 మహమ్మద్ మీజాన్‌పై గతంలో శ్రీకాకుళం జిల్లాలో 7 కేసులు, విజయనగరం జిల్లాలో 7 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని కేసులలో కోర్టు శిక్ష విధించగా,జైలు శిక్ష కూడా అనుభవించాడు. అనంతరం 2025 అక్టోబర్ నెలలో జైలు నుండి విడుదలైన తర్వాత జిల్లాలో పోలీసుల నిఘా పటిష్టంగా ఉండటంతో ఒడిశా రాష్ట్రంలోని బరంపురంలో నివాసం ఉంటూ మళ్లీ నేర కార్యకలాపాలకు పాల్పడడం ప్రారంభించాడు.గత మూడు నుంచి నాలుగు నెలల కాలంలో A-1 మహమ్మద్ మీజాన్, A-2 మహమ్మద్ హసన్‌తో కలిసి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు దొంగతనాల కేసులు, టెక్కలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతన కేసుకు పాల్పడ్డారు. అదేవిధంగా మన్యం జిల్లా పార్వతీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, ఒడిశా రాష్ట్రం బరంపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసులో కూడా వీరి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించడం జరిగింది.

కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ SHO గారికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ బృందం పలాస మండలం గరుడఖండి గ్రామం జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి కాశీబుగ్గ, టెక్కలి, పార్వతీపురం మరియు బరంపురం ప్రాంతాల్లో జరిగిన కేసులకు సంబంధించిన చోరీ సొత్తును స్వాధీనం చేసుకుంది.
నిందితుల వద్ద నుండి 12 తులాల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి ఆభరణాలు, రూ.1,09,350 నగదు మరియు సుమారు రూ.1 లక్ష విలువైన మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం చోరీ సొత్తు విలువ సుమారు రూ.80 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ కేసుల ఛేదనలో కాశీబుగ్గ పోలీస్ సిబ్బంది అత్యంత చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేయడంలో విశేష ప్రతిభ కనబరిచారు.
ప్రతిభ కనబరిచిన అధికారులు మరియు సిబ్బంది.అదనపు ఎస్పీ (క్రైమ్)పి. శ్రీనివాసరావు, కాశీబుగ్గ డీఎస్పీ టి. భవాని పర్యవేక్షణలో వై. రామకృష్ణ – ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కాశీబుగ్గ PS,ఎన్. సునీల్ – సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కాశీబుగ్గ PS,టీ. భాస్కరరావు – హెడ్ కానిస్టేబుల్ 2001, కాశీబుగ్గ PS,ఎస్. ఉషాకిరణ్ – పోలీస్ కానిస్టేబుల్ 2058, కాశీబుగ్గ PS,ఎం. నీలకంఠం – పోలీస్ కానిస్టేబుల్ 2139, కాశీబుగ్గ PS,ఎస్. రాధాకృష్ణ – పోలీస్ కానిస్టేబుల్ 310, కాశీబుగ్గ PS,ఎల్. ఉమామహేశ్వరరావు – పోలీస్ కానిస్టేబుల్ 543, కాశీబుగ్గ PS,పీసీ అలీ – CCS PS

పై అధికారులు, సిబ్బంది కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించినందుకు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు వారిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు.
Srikakulam District Police Andhra Pradesh Police Dgp Andhra Pradesh

శ్రీకాకుళం జిల్లా పోలీసుll  సత్ప్రవర్తనతో నడుచుకోవాలి,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.ll ll రౌడీ షీటర్లుకు కౌన...
31/05/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు

ll సత్ప్రవర్తనతో నడుచుకోవాలి,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.ll

ll రౌడీ షీటర్లుకు కౌన్సిలింగ్.ll

శ్రీకాకుళం, మే 31.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి,నేర ప్రవృత్తికి స్వస్తి పలికి, సత్ప్రవర్తనతో నడుచుకోవాలి అని జిల్లాలో గల రౌడీ షీటర్లు లకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు.పోలీసు వారు సూచనలు, ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
ఆదివారం పలు పోలీసు స్టేషను పరిధిలో రౌడీ షీటర్లు లకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహింఛారు.ఈ క్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్ గారు ఆదేశాల మేరకు..శ్రీకాకుళం జిల్లా పట్టణ కేంద్రంగా పట్టణ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీసు స్టేషన్లు తో పాటు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, చెడు నడతగలవారిని పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి నేరాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఘర్షణలుకు దూరంగా ఉండాలన్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో, సత్ప్రవర్తనతో మెలగాలని, ఎటువంటి అసాంఘిక కార్యక్రామాలలో పాల్గోవడం చేయరాదని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు చెడు వ్యసనాలను దూరం చేసుకుని మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఎటువంటి కారణాలు లేకుండా ఘర్షణలు సృష్టించిన ప్రతి ఒక్కరిపై పోలీస్ వారి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవ్వరైనా ఎక్కడైనా గొడవలు, ఇతర నేరాలలో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.
Dgp Andhra Pradesh Srikakulam District Police Andhra Pradesh Police

శ్రీకాకుళం జిల్లా పోలీసు.ll వాహనాల తనిఖీల్లో పత్రాలు లేని వాహనాల సీజ్.ll ll శ్రీకాకుళం పట్టణంలోని పెద్ద రెల్లి వీధిలో రె...
31/05/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు.

ll వాహనాల తనిఖీల్లో పత్రాలు లేని వాహనాల సీజ్.ll

ll శ్రీకాకుళం పట్టణంలోని పెద్ద రెల్లి వీధిలో రెండవ పట్టణ పోలీసుల కార్డన్ సెర్చ్ ఆపరేషన్.ll

శ్రీకాకుళం, మే 31. శ్రీకాకుళం పట్టణ పరిధిలోని పెద్ద రెల్లి వీధిలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు గంజాయి , మద్యం, ఇతర అనధికార పేలుడు పదార్థాలు అక్రమ నిల్వలు, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచాలని ఉద్దేశ్యంతో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం శ్రీకాకుళం రెండవ పట్టణ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఈశ్వర రావు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ ఆపరేషన్‌లో శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో గల పోలీసులు పాల్గొని ఆ ప్రాంతంలోని ఇళ్లు, వీధులు, ఖాళీ స్థలాలు ,మరియు పార్కింగ్ ప్రాంతాలను తనిఖీ చేయడంతో పాటు కొత్త,అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను పరిశీలించారు. గంజాయి , మద్యం అక్రమ నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు.వాహనాల రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర పత్రాలు మరియు ఇతర అవసరమైన రికార్డులను తనిఖీ చేశారు.తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు, రికార్డులు 10 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేశారు. సంబంధిత వాహన యజమానులకు అవసరమైన పత్రాలను సమర్పించాలని సూచించడంతో పాటు మోటారు వాహనాల చట్టం ప్రకారం తదుపరి చర్యలు చేపట్టబడుతున్నాయి అని తెలిపారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఈశ్వర రావు మాట్లాడుతూ, నేరాల నివారణ, గంజాయి , మద్యం అక్రమ నిల్వలను అరికట్టి,చోరీలకు గురైన వాహనాల గుర్తింపు, అక్రమ కార్యకలాపాల అరికట్టడమే ఈ ఆపరేషన్ ఉద్దేశ్యం అని తెలిపారు. ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడురాదని,అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.పట్టణ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు, కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
Andhra Pradesh CM Andhra Pradesh Police Dgp Andhra Pradesh

శ్రీకాకుళం జిల్లా పోలీసుll పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి “డయల్ యువర్ ఎస్పీ (పోలీసు గ్రీవెన్స్).ll ll పోలీసు సిబ్బ...
29/05/2026

శ్రీకాకుళం జిల్లా పోలీసు

ll పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి “డయల్ యువర్ ఎస్పీ (పోలీసు గ్రీవెన్స్).ll

ll పోలీసు సిబ్బంది తమ సమస్యలను ఫోన్ ద్వారా నేరుగా ఎస్పీ గారికి తెలియజేయవచ్చు. ll

శ్రీకాకుళం, మే 29:జిల్లా పోలీసు సిబ్బందికి ఉద్యోగరీత్యా,వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే,నేరుగా జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారికి తెలియజేసి పరిష్కారం పొందేందుకు “డయల్ యువర్ ఎస్పీ (పోలీసు గ్రీవెన్స్)” కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నిర్వహించడం జరుగుతోంది.ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.00 గంటల నుండి 4.00 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించబడుతోంది. సిబ్బంది తమ సమస్యలను నేరుగా జిల్లా ఎస్పీ ఫోన్ నెంబర్ 6309990800 కు సంప్రదించి తెలియజేయవచ్చు.ఈ క్రమంలో శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన “డయల్ యువర్ ఎస్పీ (పోలీసు గ్రీవెన్స్)” కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు మరియు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న పలువురు పోలీసు సిబ్బంది వ్యక్తిగత సమస్యలు, లీవులు, సర్వీస్ సంబంధిత అంశాలు, విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను ఫోన్ ద్వారా నేరుగా ఎస్పీకి వివరించారు.సిబ్బంది నుంచి వచ్చిన వినతులను శ్రద్ధగా విన్న జిల్లా ఎస్పీ, ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా ఫోన్ నెంబర్ 6309990800 కు సంప్రదించి తమ సమస్యలను తెలియజేయాలని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
Andhra Pradesh Police Dgp Andhra Pradesh Srikakulam District Police

Address

Srikakulam
532001

Alerts

Be the first to know and let us send you an email when Srikakulam District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Srikakulam District Police:

Share