03/09/2026
ప్రెస్మీట్ ప్రకటన
*“బీఆర్ఎస్ బాకీ కార్డులతో ప్రజలను మభ్యపెట్టడం ఆపాలి – ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు”
*BRS నాయకులను బాకీ కార్డులతో వార్డల్లో తిరిగినారు.. ఇందిరమ్మ లబ్ధిదారులు శుద్ధి చేసినరు
*37వ వార్డు మాజీ కౌన్సిలర్ సాకి బాలలక్ష్మి ఆనంద్ మాట్లాడుతూ...
గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీలలో ఎన్ని అమలు చేశారో ప్రజలకు తెలుసు. కుటుంబ పాలన, మాటల హామీలు, ప్రజలకు పూర్తిగా అందని పథకాలతో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి, ప్రజల కోసం పనిచేసే ప్రజాపాలన – ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతోంది.
కె.సి.ఆర్. ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన కుటుంబానికి లాభం...
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, పేదలకు లాభం.
ఇదే కుటుంబ పాలనకు, ప్రజాపాలనకు ఉన్న తేడా.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.
పేదలకు సన్నబియ్యం, అర్హులకు రేషన్ కార్డులు, పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్స