Yuva satta siddipet

Yuva satta siddipet Youth wing of Loksatta party

ఈ సర్వే విశ్లేషణ నివేదిక http://bit.ly/SiddipetSurveyReport లింక్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
10/08/2020

ఈ సర్వే విశ్లేషణ నివేదిక http://bit.ly/SiddipetSurveyReport లింక్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

ISRPG కరోనా సర్వేలో - తెలంగాణా ప్రభుత్వానికి సూచనలుఇండిపెండెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పీపుల్స్ గ్రూప్ సిద్దిపేట పట్టణ ప...
09/08/2020

ISRPG కరోనా సర్వేలో - తెలంగాణా ప్రభుత్వానికి సూచనలు

ఇండిపెండెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పీపుల్స్ గ్రూప్ సిద్దిపేట పట్టణ ప్రజలతో ఆన్ లైన్ సర్వే నిర్వహించి కరోనాపై కూలంకషంగా అధ్యయనం చేసి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.

1. కోవిడ్-19 చాలా భయంకరమైనదే, కాని చాలా కేసులలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. అలాంటి వారిని ఆస్పత్రులపై భారం పెంచకుండా ఇంట్లోనే ఉంచి వారికి కావలసిన మెడిసిన్స్, ఆక్సీమీటర్ వంటి చికిత్స సామాగ్రిని ఆశా వర్కర్స్ లేదా వాలంటీర్ల ద్వారా అందించాలి. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయిన,శ్వాస సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు త్వరగా ఆస్పత్రిలో చేర్చాలి. టెలి మెడిసిన్ సేవలను విస్తృతంగా అందుబాటులో ఉంచాలి.

2. తెలంగాణ కోవిడ్-19 మొబైల్ యాప్ ని ఏర్పాటు చేసి దగ్గరలో ఉన్న కోవిడ్-19 ఆస్పత్రులు, అందులో అందుబాటులో ఉన్న బెడ్స్, వెంటిలేటర్లు సంఖ్య మరియు పరీక్ష కేంద్రాల యొక్క తాజా సమాచారాన్ని పొందుపరచాలి.

3. వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం పరీక్ష కేంద్రాలకు వస్తే మార్గ మధ్యలో వాళ్ళ ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉంది. కావున వారికి ఇంటి నుండే పరీక్షలు నిర్వహించేలా కోవిడ్-19 పరీక్ష వాహనాలను ఏర్పాటు చేయండి.

4. కోవిడ్-19 కాకుండా ఇతర వ్యాధులకి సంబంధించి ఆస్పత్రులను కోవిడ్-19 ఆస్పత్రులకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ నాన్-కోవిడ్-19 ఆస్పత్రుల సమాచారాన్ని కూడా మొబైల్ యాప్ లో అందుబాటులో ఉంచాలి.

5. రోగి పరిస్థితి విషమిస్తే ప్లాస్మా థెరపీని వైద్యులు సూచిస్తున్నారు. కావున వ్యాధి నుండి కోలుకున్న వారి యొక్క సమాచారాన్ని చాలా పకడ్బందీగా సేకరించి అవసరమున్న వారికి ప్లాస్మా అందేలా చూడాలి.

6. కోవిడ్-19 చికిత్స సామాగ్రితో చీకటి వ్యాపారం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చికిత్స సామాగ్రి ధరలను ప్రభుత్వం నియంత్రించాలి.

7. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పౌష్టిక ఆహార వస్తువులను ఇంటికే అందించాలి.

8. రాష్ట్ర సరిహద్దు వద్దనే కోవిడ్-19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రతి వ్యక్తికి పరీక్షలు చేసి ఆ వ్యక్తిని ట్రాకింగ్ చేయాలి.

9. ప్రైవేట్ ఆస్పత్రులు వసూలు చేసే ఛార్జీలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి.

10. ఇప్పటికే కోవిడ్-19 ని విపత్తుగా గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విపత్తు చట్టాన్ని ఉపయోగించి ప్రజలందరిని ఆదుకోవాలి.

11. ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్-19 వైద్యం కోసం ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.

12. ప్రభుత్వం ఈ సంవత్సర కాలం పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రాధాన్యత తగ్గించి, ఆ నిధులన్నింటిని ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలి.

13. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభంలో ఉన్న కారణంగా స్థానిక మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేట్ సంస్థలు ఇలా కొన్ని వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు తమ పార్టీ ఫండ్ నిధులను తమ నియోజకవర్గాల ప్రజా ఆరోగ్య వ్యవస్థలకు కేటాయించాలి. స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రులకి అన్ని సౌకర్యాలను అందించాలి.

14. వైద్యం పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలి. ఇది ఒక విపత్తుగా కొనసాగుతున్న కాలంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులను పని లేక, ఉన్న చోటు నుండి కదలలేక పోతున్న ఈ సమయంలో విశృంఖలంగా జరుగుతున్న వైద్యం పేరిట దోపిడిని ప్రభుత్వాలు కఠినంగా నియంత్రించాలి. తక్షణమే ప్రైవేట్ వైద్యం కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చి అందరికి సరైన కోవిడ్-19 వైద్యం అందాలి.

15. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్ లంటూ చేస్తున్న విధానాలను ఒక్క సారీ పరిశీలించాలి. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే వారిని దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పుడున్న ఆర్థిక,ఆరోగ్య సంక్షోభాలను పరిగణలోకి తీసుకోవాలి.

16. యాచకులను, ఇల్లు లేని వాళ్లను, ఏ తోడు నీడ లేని వాళ్లను, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు ఇలా అన్ని ఆశ్రమాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి.

17. ఉన్నత చదువులు చదువుకుంటున్నవారు, వివిధ రకాలుగా చిన్నపాటి ఉద్యోగాలు చేసుకోని చదువుకుంటున్నవారి పరిస్థితి మరీ అధ్వానంగా తయారు అయింది. ప్రభుత్వం ఈ సంక్షోభ కాలంలో వారిని ఆదుకోవడానికి కరోనా భత్యం లాగా ₹. 5000 నెల వారీగా అందించాలి.

18. ప్రైవేట్ సెక్టార్ లో పని చేస్తున్న సిబ్బందిని ఆయా సంస్థలే ఆదుకునే లాగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

19. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రభుత్వమే ఆదుకోవాలి.

07/08/2020

వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడమే పరిష్కారం

నిపుణుల అంచనా ప్రకారం కరోనాకి వ్యాక్సిన్ ప్రజలందరికి అందుబాటులో రావడానికి సుమారు ఒక సంవత్సరం పట్టవచ్చు. కావున ఈ సమయంలో నివారణ చర్యలతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా కీలకం అని వైద్యులు సూచిస్తున్నారు. కానీ సిద్దిపేటలో ఇండిపెండెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పీపుల్స్ గ్రూప్ నిర్వహించిన సర్వే ప్రకారం సుమారు 50% ప్రజలు మాత్రమే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి సరియైన ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుస్తుంది. అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు కాబట్టి ప్రజలకు శారీరక శ్రమ బాగా తగ్గింది, కావున శరీరంలో ఆక్సిజన్ స్థాయి బాగా తగ్గిపోతుంది. సూర్యరశ్మి కూడ సరిగ్గా తగలక పోవడం వల్ల విటమిన్-డి లోపం తలెత్తుతుంది. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రజలందరు రోజూ ఆరు బయట వ్యాయామం చేయాలి, ఆరోగ్యవంతమైన ఆహారం (పండ్లు/గుడ్లు) తీసుకోవాలి, కషాయాలు/ నిమ్మరసం తాగాలి అని సర్వే బృందం సూచిస్తుంది.

కోవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక మహమ్మారి. దీని ప్రభావం వల్ల ఎన్నో జీవితాలు అతలాకుతలమయ్యాయి. మనం రోజూ భయ భ్రాంతులతో...
29/06/2020

కోవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక మహమ్మారి. దీని ప్రభావం వల్ల ఎన్నో జీవితాలు అతలాకుతలమయ్యాయి. మనం రోజూ భయ భ్రాంతులతో బ్రతుకుతున్నాం. అందుకోసమే సిద్దిపేట పట్టణ పరిధిలో ఒక వివిధ వయస్సుల, వృత్తుల వారితో అలా ఒక 500 మందితో సర్వే చేస్తున్నాము.

సర్వేలో సేకరించే సమాచారం:
* ప్రజలకు కోవిడ్-19 పై అవగాహన
* ప్రజలకు ప్రభుత్వంపై విశ్వసనీయత
* ప్రజలపై కోవిడ్-19 ప్రభావం
* సలహాలు, సూచనలు

చివరగా సర్వే యొక్క విశ్లేషణ నివేదికను వార్త పత్రికలకు పంపిస్తాము.

కోవిడ్-19 అవగాహన సర్వేలో మీరు కూడా పాలు పంచుకోవడాల్సిందిగా కోరుతున్నాను.

Address

Siddipet
502103

Telephone

+919666676607

Website

Alerts

Be the first to know and let us send you an email when Yuva satta siddipet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Yuva satta siddipet:

Share