జయసింహ రాచమల్ల -JSR

జయసింహ  రాచమల్ల -JSR This page is created to express my views and communication with people.

https://youtu.be/tUor790I5dw?si=vS0aqKmZLTvuQq-K*నా మిత్రుడు డైరెక్టర్ కపిల్ భరద్వాజ్ తీసిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ షార్ట...
15/05/2026

https://youtu.be/tUor790I5dw?si=vS0aqKmZLTvuQq-K

*నా మిత్రుడు డైరెక్టర్ కపిల్ భరద్వాజ్ తీసిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ షార్ట్ మూవీలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించటం జరిగినది.*

*దయచేసి లైక్ చేయండి షేర్ చెయ్యండి ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించండి.*

Presenting SKETCH, the latest Telugu short film officially selected for the prestigious DPIFF Festival 2027. Directed by the talented Kapil G Bharadwaz, this...

31/05/2025

Welcome to T News Live. First Telugu News channel in Telangana, T News Live provides 24/7 coverage of breaking news, live updates, and exclusive interviews. ...

30/03/2024

RS Praveen kumar గారిని బహుజన ద్రోహి అన్న అనాలోచిత అమాయకులు ఇది చూసైనా అర్థం చేసుకోవాలి.
RS Praveen Kumar KTRBRS BRS Party RSP4Telangana Jayasimha Rachamalla

పదేండ్లు అధికారం అనుభవించి అధికారం పోగానే అధికార పార్టీలోకి సునాయాసంగా జంప్ చేస్తున్న దొంగ నాయకుల కంటే అధికారం లేకున్నా ...
29/03/2024

పదేండ్లు అధికారం అనుభవించి అధికారం పోగానే అధికార పార్టీలోకి సునాయాసంగా జంప్ చేస్తున్న దొంగ నాయకుల కంటే అధికారం లేకున్నా తాను అనుకున్న లక్ష్యం కోసం ప్రధాన ప్రతిపక్షంలో చేరి ప్రజల పక్షాన గొంతెత్తి ప్రశ్నించటానికి బిఅరెస్ లో చేరిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారే నా దృష్టిలో చాలా చాలా గొప్ప వారు. మనం ఆయనతో నడవాలి ఆయనతో నిలవాలి ఎందుకంటే కొన్నిసార్లు తాత్కాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలే ముఖ్యం.

KTRBRS
RS Praveen Kumar RSP4Telangana BRS Party

29/03/2024

ఆందోళన వద్దు.. అనాలోచిత విమర్శలు అసలే వద్దు.!

ఏదో ఒక బలమైన కారణం, అంతకుమించిన తిరుగులేని వ్యూహం ఒకటి ఉండే ఉంటుంది.!

ఇది అంధభక్తి అనుకుంటారేమో.. కాదు

సమాజ శ్రేయస్సు కోసం.. భావితరాల బంగారు భవిష్యత్తు కోసం.. రాజ్యాంగ బద్ధమైన హక్కుల సాధన కోసం.. అధికారంలో బహుజన వర్గాల వాటా కోసం.. నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందించడం కోసం అత్యున్నతమైన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి వచ్చిన నిస్వార్థమైన వ్యక్తిత్వం మీద, ఆటంకాలకు, అపజయాలకు కృంగిపోని ఆత్మవిశ్వాసం మీద, పట్టువదలని విక్రమార్కుడిలా లక్ష్యం దిశగా పయనిస్తున్న గుండె ధైర్యం మీద ఉన్న నమ్మకం.!

మీరలాగే చూస్తూ ఉండండి.. విమర్శకులే కాదు ప్రత్యర్థులు సైతం డాక్టర్. R.S. Praveen Kumar Swaero గారిని వేనోళ్ళ పొగిడే సమయం రానే వస్తుంది.!!

✍️ రవీంధర్ పొన్నాల.

RS Praveen Kumar

29/03/2024

నేడు కడియం, కేకే గార్లు అకస్మాత్తుగా BRS Party ను వీడటంతో నాకు కొంత మంది కాల్ చేసి వారి బాటలోనే నడచి ‘మంచి’ దారి వెతుక్కోమన్నరు.
మరి కొంత మంది బీఆరెస్ కార్యకర్తలు పార్టీని వీడొద్దు, ఈ పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలబడాలని కోరిండ్రు.

ప్రియమైన మిత్రులారా,
దయచేసి ఎవరూ టెన్షన్ పడకండి.
నేను గొర్రెను కాను. కాలేను.
ఇంకెక్కడికో పోవాలన్న ఆలోచన కూడా లేదు.
ఎన్ని ప్రలోభాలు పెట్టినా
పార్టీని వీడను.👊

నేను గతంలో చేసిన బీయస్పీ-బీఆరెస్ కూటమి ప్రయత్నం కానీ, తర్వాత బీఆరెస్ లో చేరాలన్న నిర్ణయం కానీ చాలా ఆలోచించి తీసుకున్నవి. These were very conscious decisions.

మళ్లీ చెబుతున్న, నేను రాజకీయాల్లోకి వచ్చింది నా స్వంత పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసమో, అక్రమ ఆస్తుల కోసమో, పోలీసు కేసులకు భయపడో, హంగులు, ఆర్భాటాలున్న జీవితం కోసమో, ప్రోటోకాల్ కోసమో కాదు.

నేను పుట్టి పెరిగిన సమాజం చాలా వేదనతో వెనకబడి ఉన్నది, వాళ్ల కోసం చట్ట సభల్లో ఒక గొంతుకగా బతికి, వాళ్ల జీవితాలను నా శక్తి మేరకు ‘సమూలంగా’ మార్చాలని నేను ప్రజా జీవితంలోకి వచ్చా.

ఇందులో భాగంగానే బహుజన వాదం, తెలంగాణ వాదం రెండూ కలవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని నేను నమ్మిన. తెలంగాణ ఫలాలు అందరికి అందాల్సిన అవసరం ఇంకా ఉందని నమ్మి, భారత రాజ్యాంగానికి ఫాసిస్టు శక్తుల వల్ల పొంచిఉన్న ప్రమాదాన్ని పసిగట్టి, అవిశ్రాంత,రాజీలేని పోరాటం నడిపి ప్రత్యేక రాష్ట్రం సాధించి, కొత్త తెలంగాణకు బలమైన పునాది వేసిన గారి నాయకత్వంలో నడుస్తున్న బలమైన BRS Party ని నేను వేదికగా ఎంచుకున్నా. ఇందులో నాకు గాని, నన్ను నమ్ముకున్న వర్గాలకు గాని ఎలాంటి సంశయం లేదు.

గెలుపుతో వచ్చే అధికార ఫలాలను అనుభవించినప్పుడు, ఓటమితో వచ్చే కష్టాలను కూడా భరించగలిగే వాడే నిజమైన పార్టీ నాయకుడు. ప్రతి దానికి భయపడే పిరికిపందలకు బీఆరెస్ లాంటి ఉద్యమ పార్టీల్లో స్థానం ఉండకూడదు.

దేశంలోను , రాష్ట్రంలోనూ అధికార పార్టీలు పోలీసు కేసులను, కట్టు కథలను, ఆయుధాలుగా వాడి రాజకీయ ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేయడం నేడు మన తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు. దీన్ని ధైర్యంగా మనం సర్వశక్తులొడ్డి అధిగమించిన నాడే దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది.

అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా క్షమించరాని నేరానికి పాల్పడితే వారి మీద తప్పకుండా చట్ట ప్రకారం చర్యతీసుకోవలసిందే. ఆ విషయంలో పోలీసు ల డ్యూటీని ఎవరూ కాదనరు.

కానీ పోలీసు కేసులనే గోరంతలు కొండంతలుగా చూపించి, వాస్తవాలను వక్రీకరించి, సోషల్ మీడియా వేదికగా, అసభ్యకరమైన శీర్షికలతో (Thumbnails) రాజకీయ ప్రత్యర్థుల మీద జరుగుతున్న కుట్రపూరిత దాడులను మనం అందరం తిప్పికొట్టాల్సిందే.

సైనికులకు ఒక విజ్ఞప్తి:
ఈ వెన్నుపోట్లు, ద్రోహాలు, కుట్రలు, దాడులు పార్టీకి కొత్తేం కాదు. ప్రజల గుండెల్లో మనకు స్థానం పదిలంగా ఉన్నంత వరకు ఏ శక్తీ మన ప్రస్తానాన్ని ఆపలేదు. అందుకే విలువైన సమయాన్ని వృదా చేయకుండా, ఎంతటి త్యాగానికైనా వెనుకాడకుండా, మనను నమ్ముకున్న ఆ ప్రజల వద్దకే వెళ్లి, వాళ్లకు వాస్తవాలను వివరించి, రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ తెలంగాణ ద్రోహుల చెంప ఛెల్లుమనేలా విజయభేరి మోగిద్దాం👊

పదండి ముందుకు..
పదండి తోసుకు..
పోదాం పోదాం పైపైకి…
కదం తొక్కుతూ, పదం పాడుతూ
హృదయాంతరాళం గర్జిస్తూ
పదండి పోదాం పైపైకి..✊

జై భీం…జై తెలంగాణ🙏

Kalvakuntla Taraka Rama Rao - KTR

29/03/2024

https://x.com/RSPraveenSwaero/status/1773742058425262189?t=faZW4mJKUefvKq2ExsaIPw&s=08

నేడు కడియం, కేకే గార్లు అకస్మాత్తుగా ను వీడటంతో నాకు కొంత మంది కాల్ చేసి వారి బాటలోనే నడచి ‘మంచి’ దారి వెతుక్కోమన్నరు.
మరి కొంత మంది బీఆరెస్ కార్యకర్తలు పార్టీని వీడొద్దు, ఈ పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలబడాలని కోరిండ్రు.

ప్రియమైన మిత్రులారా,
దయచేసి ఎవరూ టెన్షన్ పడకండి.
నేను గొర్రెను కాను. కాలేను.
ఇంకెక్కడికో పోవాలన్న ఆలోచన కూడా లేదు.
ఎన్ని ప్రలోభాలు పెట్టినా
పార్టీని వీడను.👊

నేను గతంలో చేసిన బీయస్పీ-బీఆరెస్ కూటమి ప్రయత్నం కానీ, తర్వాత బీఆరెస్ లో చేరాలన్న నిర్ణయం కానీ చాలా ఆలోచించి తీసుకున్నవి. These were very conscious decisions.

మళ్లీ చెబుతున్న, నేను రాజకీయాల్లోకి వచ్చింది నా స్వంత పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసమో, అక్రమ ఆస్తుల కోసమో, పోలీసు కేసులకు భయపడో, హంగులు, ఆర్భాటాలున్న జీవితం కోసమో, ప్రోటోకాల్ కోసమో కాదు.

నేను పుట్టి పెరిగిన సమాజం చాలా వేదనతో వెనకబడి ఉన్నది, వాళ్ల కోసం చట్ట సభల్లో ఒక గొంతుకగా బతికి, వాళ్ల జీవితాలను నా శక్తి మేరకు ‘సమూలంగా’ మార్చాలని నేను ప్రజా జీవితంలోకి వచ్చా.

ఇందులో భాగంగానే బహుజన వాదం, తెలంగాణ వాదం రెండూ కలవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని నేను నమ్మిన. తెలంగాణ ఫలాలు అందరికి అందాల్సిన అవసరం ఇంకా ఉందని నమ్మి, భారత రాజ్యాంగానికి ఫాసిస్టు శక్తుల వల్ల పొంచిఉన్న ప్రమాదాన్ని పసిగట్టి, అవిశ్రాంత,రాజీలేని పోరాటం నడిపి ప్రత్యేక రాష్ట్రం సాధించి, కొత్త తెలంగాణకు బలమైన పునాది వేసిన గారి నాయకత్వంలో నడుస్తున్న బలమైన ని నేను వేదికగా ఎంచుకున్నా. ఇందులో నాకు గాని, నన్ను నమ్ముకున్న వర్గాలకు గాని ఎలాంటి సంశయం లేదు.

గెలుపుతో వచ్చే అధికార ఫలాలను అనుభవించినప్పుడు, ఓటమితో వచ్చే కష్టాలను కూడా భరించగలిగే వాడే నిజమైన పార్టీ నాయకుడు. ప్రతి దానికి భయపడే పిరికిపందలకు బీఆరెస్ లాంటి ఉద్యమ పార్టీల్లో స్థానం ఉండకూడదు.

దేశంలోను , రాష్ట్రంలోనూ అధికార పార్టీలు పోలీసు కేసులను, కట్టు కథలను, ఆయుధాలుగా వాడి రాజకీయ ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేయడం నేడు మన తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు. దీన్ని ధైర్యంగా మనం సర్వశక్తులొడ్డి అధిగమించిన నాడే దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది.

అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా క్షమించరాని నేరానికి పాల్పడితే వారి మీద తప్పకుండా చట్ట ప్రకారం చర్యతీసుకోవలసిందే. ఆ విషయంలో పోలీసు ల డ్యూటీని ఎవరూ కాదనరు.

కానీ పోలీసు కేసులనే గోరంతలు కొండంతలుగా చూపించి, వాస్తవాలను వక్రీకరించి, సోషల్ మీడియా వేదికగా, అసభ్యకరమైన శీర్షికలతో (Thumbnails) రాజకీయ ప్రత్యర్థుల మీద జరుగుతున్న కుట్రపూరిత దాడులను మనం అందరం తిప్పికొట్టాల్సిందే.

సైనికులకు ఒక విజ్ఞప్తి:
ఈ వెన్నుపోట్లు, ద్రోహాలు, కుట్రలు, దాడులు పార్టీకి కొత్తేం కాదు. ప్రజల గుండెల్లో మనకు స్థానం పదిలంగా ఉన్నంత వరకు ఏ శక్తీ మన ప్రస్తానాన్ని ఆపలేదు. అందుకే విలువైన సమయాన్ని వృదా చేయకుండా, ఎంతటి త్యాగానికైనా వెనుకాడకుండా, మనను నమ్ముకున్న ఆ ప్రజల వద్దకే వెళ్లి, వాళ్లకు వాస్తవాలను వివరించి, రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ తెలంగాణ ద్రోహుల చెంప ఛెల్లుమనేలా విజయభేరి మోగిద్దాం👊

పదండి ముందుకు..
పదండి తోసుకు..
పోదాం పోదాం పైపైకి…
కదం తొక్కుతూ, పదం పాడుతూ
హృదయాంతరాళం గర్జిస్తూ
పదండి పోదాం పైపైకి..✊

జై భీం…జై తెలంగాణ🙏

https://twitter.com/RSPraveenSwaero/status/1773742899995566415?t=rdqOstqxiVF9CQLQNVdAgw&s=19

Address

RAJENDRANAGAR CONSTITUENCY
Shamshabad
509328

Website

Alerts

Be the first to know and let us send you an email when జయసింహ రాచమల్ల -JSR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to జయసింహ రాచమల్ల -JSR:

Share