AVS Manyam

AVS Manyam CONSUMER AND PHARMA PRODUCT PACKAGING DESIGNER, CARTOONIST,STORY ILLUSTRATOR, STORY SCREEN PLAY WRITER AND DOCCUMENTARY FILM MAKER.

Days of 1970's....  నల్ల కోడి పెట్ట..  ఆంధ్ర పత్రిక వీక్లీ రెగ్యులర్  గా కరణం గారి ఇంట్లో తెప్పించే వారు. కరణం గారు ఊరిల...
16/06/2025

Days of 1970's.... నల్ల కోడి పెట్ట..

ఆంధ్ర పత్రిక వీక్లీ రెగ్యులర్ గా కరణం గారి ఇంట్లో తెప్పించే వారు. కరణం గారు ఊరిలో అందరికి కిష్టప్ప గారు.. మా వీధిలో పిల్లలు అందరికి కిష్టప్ప బాబాయ్. ఒక్క మా అంజి గాడికి మటుకు మావయ్య. తను కాళీ సమయాల్లో పిల్లలు తో ఎక్కువగా కాలక్షేపం చేసేవాడు. నేను అంటే చాలా ఇష్టం. నాతో ఏవో ఒక బొమ్మలు గీ ఇంచే వాడు తానే బ్రష్ లు కొని పేపర్ మీద. మొదటి సారి టేప్ రికార్డర్ వాళ్ళింట్లోనే చూసాను.వాళ్ళింట్లో రేడియో గ్రామ్ ఉండేది. రికార్డు ప్లేయర్లో ఐతే నాకు ఇస్ట మైన పాటలు ఎన్ని సార్లు ప్లే చేసుకున్నా ఏమీ అనే వాడు కాదు. అంత మంచోడు. తను ప్రతీ నెలా మద్రాస్ వెళ్లే వాడు. తిరిగి వచ్చేటప్పుడు బోలెడన్ని గిఫ్ట్స్.. మద్రాస్ బొంగరాలు, పెన్నులు అన్నీ.. ఐదు పైసలు కే.. తను మద్రాస్ నుండి బస్సు దిగుతుండ గానే పిల్లలు అందరం పొలో మంటూ వెనకాల పడేవాళ్ళం. అంత చవక గా ఎలా వచ్చేవో నాకు అర్ధం కాదు.మూర్ మార్కెట్లో కొంటాడు అనేవారు. ఆ పెన్నులు తరువాత చొక్కా అంతా కక్కేసేవి. బొంగరాలు ఓకే. ఇంకా రేడియోలు, గోడ గడియారం రిపేర్ చేసేవాళ్ళు, పొలంలో పంప్ సెట్ల మెకానిక్ లు తాడేపల్లిగూడెం నుంచి వస్తే వాళ్ల ఇంట్లోనే మకాం. ఊరిలో టముకు వేసే వారు. అంతే ఊరిలో జనం అంతా నెత్తి మీద పెద్ద పెద్ద వోల్వు రేడియో సెట్స్ పెట్టుకుని కిష్టప్ప బాబాయి ఇంటికి వచ్చే వారు. మా రాము గాడు ఐతే ఒకసారి షార్ట్ వేవ్ రాలేదని అదని ఇదనీ నెత్తి మీద ఫిలిప్స్ పెట్టుకుని పది సార్లు తిరిగే వాడు. మా అబ్బులు అన్నయ్య విసు గేసి.. వెదవ రేడియో కొన్నప్పటి నుంచీ గరగరలే రెండు స్టేషన్లు ఒకేసారి వచ్చి చస్తాయి. రేడియో ని పెంట మీద పడేయ మనే వాడు. ఇంకో పక్క కిష్టుడు అన్నయ్య కిటికీ లోంచి నన్ను దగ్గరికి పిలిచి ఒరేయ్ బాబ్జీ చూడరా చూడు.. రామం గాడు మళ్ళా మోసుకు పోతున్నాడు. ఇప్పుడే పట్టుకెళ్ళాడు అప్పుడే తగలడింది.ఏం రేడియోనో ఏమో కొన్న ప్పటి నుంచీ అది అంతే .. అనే వాడు సరదాగా..
ఇప్పుడు ఇద్దరూ జీవించి లేరు అంతా గతం.
*** ****
పేపర్ నాగేశ్వర రావు సైకిల్ మీద కన పడ గానే ఆంధ్ర పత్రిక వీక్లీ వచ్చిందా అని అడిగే వాడిని.. ఏదో నేనే కొంటున్నట్టు.. కలెక్ట్ చేసుకొని నాకు నచ్చిన వన్ని చదివేసి.... కరణం గారి అరుగు మీదే..అది కూడా.. అప్పుడు ఇంట్లో ఇచ్చే వాడిని. అలా ఒక సారి అందులో నల్ల కోడి పెట్ట అనే కథ చదివాను. అది నాకు బలే నచ్చే సింది. అందులో హీరోయిన్ ఒక పంచాయతీ సమితి స్కూల్ లో పంతులమ్మ. ఆవిడకి మొగుడు లేడు. అయితే ఆవిడ మరో ఊరు ట్రాన్స్ఫర్ కొరకు పట్నం లో బి.డి.వో. ఆఫీస్ చుట్టూ తిరుగు తుంది. దానితో .. ఆ బీడీ వో.. ఈవిడ మీద కన్నేసాడు. మొత్తానికి ఎలాగైతే నే ఆ పంతులమ్మ ట్రాన్సఫర్ కోసం ఓ రోజున చడి చప్పుడు కాకుండా నులక మంచం మీద అయన కోరిక తీరు స్తుంది. ఈవిడ ట్రాన్స్ఫర్ పని అయిపోతుంది.
**** ***** *****
తరువాత ఏ మవుతుందండి.. మొగుడు లేని పంతులమ్మ చాలా తెలివైనది. ఒక మగ తోడు కావాలి. ఆ బి డి ఓ గారు పంతులమ్మ కి పట్నంలో ఆమె పేరు మీద ఒక ఇల్లు కొనిస్తాడు. ఊరిలో 5 ఎకరాలు పొలం కొనిస్తాడు. అసలు పెళ్ళాం పిల్లలని రోడ్ మీద పడేస్తాడు.అదీ కథ. అయితే ఆ కథకు వేసిన బొమ్మ, రాసిన విధానం బాగా నచ్చి.. మళ్ళీ చదవాలని కోరిక పుట్టినప్పుడల్లా కరణం గారి ఇంటికి వెళ్లి తలుపు బాధడం. పత్రిక అడగడం. ఇలా ఒక్క రోజే పది సార్లు తలుపు బాధే సరికి..నా బాధ పడలేక మా కిష్టప్ప బాబాయి పత్రిక లోంచి ఆ కథ తాలూకు పేజెస్ చించేసి నా చేతిలో పెట్టాడు.
**** **** *****
ఒక వారం తరువాత మా మేనత్త గారి ఊరు గోపారం వెళ్లాను. అక్కడ ఇంటికి దగ్గర లోనే కోమటి సత్యం కిరాణా కొట్టు ఉంది. ఇంట్లో ఏమైనా సరుకులు కావాలంటే.. అక్కడే కొని తెచ్చే వాడిని. అయితే ఒకసారి ఏ పొట్లం విప్పినా.. నాకు ఆంధ్ర పత్రిక లోని నల్ల కోడి పెట్ట కథ తాలూకు పేపర్స్. అన్నిటి మీద నులక మంచం, పంతులమ్మ
బొమ్మలు. ఇదెక్కడి బాధరా బాబూ.. ఈ నల్ల కోడి పెట్ట నన్ను వదలదా అనుకుని కిరాణ కొట్టు సత్యాన్ని అడిగితే నిడదవోలు లో రద్దీ పేపర్స్ అమ్మే షాపు లో వీళ్ళకి పొట్లాలు కట్టడానికి సప్లై చేసే వాడు విజయవాడ నుంచి కాంట్రాక్టర్ ద్వారా పత్రిక ఆఫీస్ ల్లో వేస్ట్ పేపర్స్ బండిల్స్ లారీల్లో తెప్పిస్తాడుట. ***

ఫేస్ ఎక్కడా కొంచెం కూడా షేక్ అవకుండా...చేతులు అసలు మూవ్ అవకుండా..కొద్దిగా పెదాలు కదిలిస్తూ... ఓన్లీ కళ్ళతో మాత్రమే ఫీలిం...
05/04/2025

ఫేస్ ఎక్కడా కొంచెం కూడా షేక్ అవకుండా...చేతులు అసలు మూవ్ అవకుండా..కొద్దిగా పెదాలు కదిలిస్తూ... ఓన్లీ కళ్ళతో మాత్రమే ఫీలింగ్స్ చూపెడుతూ..లో మోడులాషన్ లో డైలాగ్స్ చెపుతూ కెమెరా ముందు నటించడం అందరికి సాధ్యం కాదు..ఎక్కడో ఒక మీనాకుమారి..ఇంకా మరికొందరు అతి తక్కువ మంది నటీ మణులు మాత్రమే ఉన్నారు..
వారిలో 1970స్ లో హఠాత్ గా పెద్ద మెరుపులా వచ్చిన నటి శ్రీమతి తాళ్లూరి రామేశ్వరి గారు.
ఆవిడ నేటివ్ ప్లేస్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర లోని ఒక గ్రామం.
నటన మీద ఇంట్రెస్ట్ తో పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సీట్ సంపాదించి కోర్స్ కంప్లీట్ చేసి హిందీ సినీ ఫీల్డ్ లో ఎంటర్ అయిన నటి.
ఆరోజుల్లో ముఖ్యంగా తెలుగు సినీ ఫీల్డ్ లో పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోర్స్ చేసి కె.విశ్వనాద్ సీతామాలక్ష్మి
సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టేసిన నటి.
తరువాత కొంచెం గాప్ ఇచ్చి సింగీతం శ్రీనివాస రావు గారి డైరెక్షన్ లో మంగళ తోరణాలు అనే సినిమాలో నటించారు.అదీ మంచి హిట్.ఈరెండూ you ట్యూబ్ లో ఉన్నాయి.

ఆవిడే నటించిన మొదటి హిందీ సినిమా దుల్హన్ వహిజో పియా మాన్ బాయి....హైదరాబాద్ లోనే వన్ ఇయర్ ఆడింది.

అయితే ఈరోజు ఆవిడ హిందీ లో 1980 లో వచ్చిన హీరో రాజ్ కిరణ్ తో నటించిన....రాజశ్రీ ఫిలిమ్స్ తీసిన...
మాన్ అభిమాన్.. అనే మూవీ చూసాను.అద్భుతం గా ఉంది.ఈ సినిమాలో ఆవిడ నటన..గ్లామర్ అద్బుతమ్.
తప్పక చూడ వలసిన మూవీ..
You tube లో ఉంది..పెర్ఫెక్ట్ యాక్టింగ్.. ఎక్కడా ఓవర్ ఏక్షన్ లేకుండా..ఈవిడ నటన చూస్తుంటే..వెన్నెల్లో విహరించి నట్టు ఉంది.డోంట్ మిస్******

అమ్మమ్మ గారి ఇల్లు2ఈ తరానికి అమ్మమ్మ గారి ఇల్లు అంటే ఎక్కడో సిటీస్ లో ఒక అపార్ట్మెంట్. అసలు చాలా మంది పిల్లలు అమ్మమ్మ గా...
04/03/2025

అమ్మమ్మ గారి ఇల్లు2

ఈ తరానికి అమ్మమ్మ గారి ఇల్లు అంటే ఎక్కడో సిటీస్ లో ఒక అపార్ట్మెంట్. అసలు చాలా మంది పిల్లలు అమ్మమ్మ గారి ఇల్లు అంటే ఎలా ఉంటుందో తెలీకుండానే పెరిగి పెద్ద వాళ్ళు అయిపోయారు.
మా తరానికి మటుకు అమ్మమ్మ గారి ఇల్లు అంటే తుని లాంటి పెద్ద పట్టణంలో తోటలు ..పొలాలు పెద్ద వ్యవసాయం కాలేజీకి ఎదురుగా... తాలూకా ఆఫీస్ ఉండే రోడ్ లో..అర ఎకరం స్థలంలో పెద్ద మేడ.వరండాలో గోడకి రామ కృష్ణ పరమ హంస..వివేకానంద ఫోటోలు..ఒక పెద్ద బల్ల దానిమీద నోట్ ప్యాడ్ ..ఒక ఇంకు బాటిల్..వాటిలో కలం.. ఒక రివాల్వింగ్ కుర్చీ..ఆయన పెరట్లో తిరుగుతున్నప్పుడు తాతగారు వస్తే చెప్పడానికి మేము ఒకడిని కాపలా పెట్టి అందులో కూర్చుని గిరగిరా తిరిగే వాళ్లం. ఇంటి ముందు గేట్..గేటు పక్కనే పెద్ద రేకుల షెడ్డు..అందులో కొన్ని బల్లలు...కుర్చీలు (బయటి వాళ్ళు.. పిల్లల స్కూల్ ఫ్రెండ్స్ వస్తే కూర్చోవడానికి ..పుస్తకాలు ..స్కూల్ నోట్స్ రాసుకునే బల్ల ఉండేవి) ఆఇంటి ఎత్తైన కాంపౌండ్ గోడకు ఆనుకొని నక్షత్రం మార్క్ ఎరువులు అమ్మబడును అనే బోర్డ్.(అది మా మావయ్య ఎరువులు వ్యాపారం తాలూకు బోర్డ్)
ఇక ఇంటి వెనక పెరట్లో పెద్ద బంగాళా పెంకుల ఇల్లు..పారిజాతం చెట్టు.ఆఇంటి అల్లుళ్లు వచ్చినప్పుడు విడిది చేయటానికి. దాని పక్కనే పెద్ద బాదం చెట్టు. ఇంటి ముందు ద్రాక్ష తీగ..బత్తాయి నారింజ చెట్లు..నూతికి దగ్గరే ఎర్ర చక్కెర కేళి అరటి చెట్టు..ఒక మూలగా ఈశాన్యం సైడ్ పెద్ద గిలక బావి..అందులో నీళ్లు తొడుకోడానికి తాటాకు చేదా....బావి పక్కనే పెద్ద బంగాళా పెంకులు వేసిన స్నానాల గది.. అందులో పెద్ద కట్టెల పొయ్యి..దాని మీద రాగి కాగు.
ఆ స్నానాల గది పక్క సింహాచలం సంపంగి చెట్టు.

ఇక ఇంటి వెనుక దానిమ్మ చెట్టు..ఒక ఎర్ర చెరుకు గెడ మొక్క...దొండ బీర చిక్కుడు పోట్ల పాదులు... ఆపక్కగా పెద్ద పశువుల పాక.. పక్కనే నేల విసిరి. దాని పక్కనే పాలేర్లు..పొలం తాలూకు పని వాళ్ళు వాడుకునేందుకు మరో బావి. ఆపక్క పెద్ద గడ్డి మేటు..పక్కనే ఎడ్ల బండి. దాని కానుకుని బూరుగు దూది చెట్టు.
తాత గారు వరండాలో కూర్చుని ఏ ఆధ్యాత్మిక పుస్తకమో చదువుతున్న సమయంలో ఎవరో ఒక రైతు
అప్పుడప్పుడు పొలంలో కాచిందని ఏ పనస పండో మరోటో తీసుకు రావడం.
మామిడి పండ్ల సీజన్ లోను అంతే...
తాత గారికి రేడియోలో పాటలు కూడా వినే వారు కాదు.ఆయనకి పాటలు వినాలి అనిపిస్తే...వీధిలో తిరుగుతున్న ఏ సాదువో..ముష్టి వాడో తంబురా వాయించు కుంటూ అడుక్కోవడానికి గుమ్మం లోకి వస్తే వాడితో ఓ రెండు భక్తి పాటలు పాడించుకుని ఒక ఐదు పైసలు బిక్షం వేసి పంపించే వారు.
ఆయన జీవితంలో సినిమా చూడగా నేను ఎప్పుడూ చూడలేదు.
ఆయనకి మొత్తం సుమారుగా ఒక నలభై మంది మనుమలు మనుమరాండ్రు.
ఆయన సంతానం సినిమాకి వెళ్ళాలి అంటే ఇంటి వెనుక పెరట్లో ఎడ్ల బండి రావడానికి వీలుగా కట్టిన పెద్ద గేట్ లోంచి చప్పుడు చేయకుండా ...వీర్రాజు టాకీస్ కి వెళ్లి చూసొచ్చే వారు.
అమ్మమ్మ ఆయనతో పేరంటానికి వెళ్లారని అబద్ధం ఆడేది.
ఆయన తెలిసినా కూడా తెలీనట్టు నటించే వారు.
అలాగే తాత గారికి తెలీకుండా మేము అత్తయ్య దగ్గర డబ్బులు తీసుకుని . ...కావేరమ్మ హోటల్ నుండి ఇడ్లీలు..ఒక స్టీల్ ఆప్కారా నిండా పచ్చి మిరపకాయల నీళ్ల చెట్నీ తెచ్చుకుని మేడ మీద సీక్రెట్ గా
తినేసి కారానికి వగుర్చు కుంటూ నీళ్ల బిందె దగ్గరికి పరిగెడు తుంటే ఆయనకి అర్థం అయ్యేది మేము చేసిన పని.

ఇక నేనో సారి పసితనం లో సెలవులకు కొత్తపేట ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఎవరి ఇంటికో పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు పిల్లలు పేక మేడ కట్టడం చూసి ఇంటికి వచ్చాక నాకు పేక ముక్కలు కావాలి అని ఏడుపు మొదలెట్టా...
తాత గారికి తెలిస్తే ఊరుకోరు..
ఆ టైంలో అక్కడే లంక పుగాకు చుట్ట కాలుస్తున్న తాత గారితో మాట్లాడుతున్న ఒక షావుకారు ఈవెనింగ్ వాకింగ్ లో మమ్మల్ని తనింటికి తీసుకెళ్లి నిచ్చెన వేసుకుని అటక మీంచి పేక సెట్ ఒకటి నా చేతిలో పెట్టాడు.
కట్ చేస్తే తాత గారు అక్కడి నుంచి నన్ను తాలూకా ఆఫీస్ జైలు కి తీసు కెళ్లారు..అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు బండ రాళ్ళతో కట్టిన జైలు.ఆయన ఒక్కో గది దగ్గర ఆగి కటకటాల్లోంచి దొంగలను చూపించి పేక ఆడితే నిన్నుకూడా ఇలాగే లోపల వేసేస్తారు అని చెప్పి...ఓన్లీ పేక మేడ మాత్రమే కట్టుకుని ఆడుకోవాలి అని ఇంటికి తీసుకెళ్లారు.
ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఏ వస్తువు బయట కొనే పని ఉండేది కాదు. అన్ని పొలం లోంచో..తోట ల్లోంచో వచ్చెవే.
ఆఖరికి కాఫీ గింజలు కూడా మేమే కొట్టు గదిలోంచి తీసుకుని మర పట్టించి పొడి ఇంటికి తెచ్చే వాళ్ళం.
అప్పుడప్పుడు మా మావయ్య కొండ కింద పొలంలో ఇటిక బట్టీలు పెట్టించే వాడు.
అక్కడికి మేము ఎడ్లబండి మీద మావయ్యకు భోజనం కెరేజ్ తీసుకు వెళ్లే వాళ్ళం.
మనుమ లందరికి ఆ ఇంట్లో అమ్మమ్మ కంటే కూడా మా అత్తయ్యతో అటాచ్ మెంట్ ఎక్కువ.
కారణం పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా మాకు అన్నీ చేసి కడుపునిండా తిండి ..వండి పెట్టేది ఆవిడే...
నేను అక్కడ చదువుకునే రోజుల్లో అయితే సెలవుల్లో మాఊరు వెళితే...పండుగలకు చేసిన పిండి వంటలు ఒక డబ్బాలో పోసి అలమారులో దాచి ఉంచేది నాకోసం.
ఇక ఆఇంట్లో రేడియోలో సినిమా పాటలు వినేది ఆవిడా నేనే. ఫిలిప్స్ వోల్వ్ రేడియో మా మావయ్య గదిలో ఉండేది.సినిమా పాటలు వచ్చే టైం చూసుకుని తాత గారికి వినిపించ కుండా లో వాల్యూం లో వినే వాళ్ళం.

అమ్మమ్మ గారి ఇంట్లో సెలవులకు వచ్చిన కూతుర్ల పిల్లల ఆలనా పాలన చూసిన తాత గారు అమ్మమ్మా...మావయ్యా ఎప్పుడో వెళ్లి పోయారు.
మొన్నటి దాకా ఆఖరి గుర్తుగా మిగిలిన మా అత్తయ్య కూడా 80 ఏండ్లు పైబడ్డాక మొన్ననే వెళ్లి పోయింది.
ఆవిడకి శ్రద్ధాంజలి గా ఈ స్టోరీ .

పాత జ్ఞాపకాలు ఆవిడ గుర్తుగా....

అమ్మమ్మ గారి ఇంట్లో పొద్దున్నే ఆరింటికి లేవడం పెరట్లో వసారాకి వేలాడుతూ ఒక బకెట్ లో కచిక మరో బకెట్ లో తాటాకు ముక్కలు ఇంకో బకెట్ లో వేప పుల్లలు నిండా ఉండేవి.అవి పెట్టి మొహాలు కడుక్కుని కంచు గ్లాస్ నిండా పెరట్లో గేదె పాలు
బొగ్గుల కుంపటి మీద కాచి నర్సీపట్నం చెక్క కాఫీ గింజలు ఆడించిన ఫిల్టర్ కాఫీ తాగేసక మా మావయ్య ఈనాడు పేపర్ తను చదివాక మాకు అలవాటు చేసాడు చదవటం. ఆ తరువాత నూతి దగ్గర స్నానాల గదిలో పెద్ద కట్టెల పొయ్యిమీద రాగి కాగులో నీళ్లు కాగుతుండేవి.కావలసినన్ని వేడి నీళ్లు పోసుకుని కుంకుడు కాయలతో శీకాయ పొడితో వళ్ళు రుద్దుకుని స్నానం ముగిస్తే ఆనీళ్లు అరటి నారింజ బత్తాయి చెట్ల లోకి పోయేవి.ఆ తరువాత సూరారం చాకలి తెచ్చిన ఇస్త్రీ బట్టలు వేసుకుని ..భోజనాల గదిలో ఒక మూల తర వాణి జాడి, పక్కనే ఇంకో జాడి నిండా పచ్చ కారంతో చేసిన కాయ ఆవకాయ
వెండి కంచంలో వేసుకుని తింటుంటే ఆ మజాఏ వేరు.తరవాణీ తో బాటు దబ్బాకులు కూడా కంచం లో పడేవి.
కాయ ఆవకాయ తినాలి అంటే దాన్ని విడగొట్టడానికి మా బావ నేను చెరో పక్క పట్టుకుని గట్టిగా పీకే వాళ్ళం. తరవాణి అన్నం పీకల దాకా తిని..ట్యూషన్ కి బయలు దేరే వాళ్ళం.దారిలో టైప్ ఇన్స్టిట్యూట్ సందులో గోడ మీద మారిన కొత్త సినిమా పోస్టర్స్ చూసుకుని మార్కండేయ రాజు పేట లో పోస్ట్ మాస్టర్ దగ్గర ఇంగ్లీష్ గ్రామర్ .ట్యూషన్. అప్పటికే తిన్న తరవాణి తాలూకు మత్హుకు కళ్ళు మూతలు పడుతుంటే ఆయనతో ఒక చెవి మెలి పెట్టించుకొని అక్కడి నుండి కొత్త పేట దుర్గ దాసు గారి ఆసుపత్రి పక్క కెమిస్ట్రీ మాస్టర్ తో రెండో చెవి మెలిపెట్టించుకొని.తరవాణి మత్తుకి నెప్పి తెలిసేది కాదు.(ఈ మహాను బావునికి 50 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు మా మావయ్య.ట్యూషన్ ఫీజు 100 రూపాయలు.మిగతా 50 కోసం రోజు రెండో చెవి పీకేవాడు.నువ్వు పాస్ అవుతే బాలన్స్ ఇద్దామంటాడు మావయ్య. మాస్టర్కి నమ్మకం లేదు నేను పాస్ అవుతానని.ముందే లాగేద్దామని ప్లాను.కొన్నాళ్ళకి హైద్రాబాద్ లో బ్యాన్క్ స్ట్రీట్ లో ఎదురయ్యాడు.వాల్యుయేషన్ కి వచ్చాడుట.సాగర్ టాకీస్ పైన సాగర్ లాడ్జి లో ఉంటున్నాట్ట. రమ్మన్నాడు. అదో బూత్ బంగ్లాల ఉంది.తరువాత కాలంలో కూల గొట్టేశారు.నేను వెళ్ల లేదు ట్యూషన్ తాలూకు బాకీ ఎక్కడ అడుగుతాడో అని.) ట్యూషన్ నుండి ఇంటికి వచ్చేసరికి తలలో పెద్ద కొప్పు చుట్టూ కనకాంబరం పూలు...చిలక ఆకు పచ్చ చీర కట్టుతో వంగుని ...కొండ చీపురుతో వరండా తుడుస్తూ అప్పాయమ్మ కనబడేది. అవడానికి పని మనిషే కానీ...హంపి గుడి మండపం లో స్తంభానికి అనుకున్న శిల్పంలా ఉండేది.
ఆ తరువాత మేడెక్కి 11 గంటలు దాకా నిద్రొయి తిరిగి భోజనం చేసి....పుస్తకాలు తీసుకుని మేడ మీద గదిలో నా రీడింగ్ టేబుల్ కి ఎదురుగా గోడమీద అంటించిన ఆంధ్ర పత్రిక కవర్ పేజీలు అప్పటి గ్లామర్ సినీ స్టార్స్ బొమ్మలు వాణిశ్రీ..లక్ద్మీ..మంజుల బొమ్మలకి టాటా చెప్పి కాలేజీకి బయలు దేరడం... సాయంత్రం అవగానే ఇంటికొచ్చి అత్తయ్య చేసిన టిఫిన్ తిని .టిఫిన్ అంటే మొక్క జొన్న పొత్తులు పాలోసి మసాలతో ఉడక పెట్టడం..లాంటివి.తాత గారికి సోమరాజు టాకీస్ పక్క కాటామయ్య హోటల్ లో ఇడ్లి అంటే ఇష్టం. ఇడ్లి కోసం అమ్మమ్మ డబ్బులిచ్చేది.అందులో 5 పైసలు మిగుల్చుకొని (అప్పట్లో పాకెట్ మనీ లేదు)తరువాత బాట్ తీసుకొని రైల్వే కోర్ట్ లో బ్యాడ్మింటన్ ఆట ప్రసాద రావు గారి బ్యాచ్ తో.ప్రసాద్ రావు గారు అప్పట్లో తుని రైల్వే స్ లో కేబిన్ స్విచ్ మాన్...తరువాత స్టేషన్ సూపరెంట్ గా రిటైర్ అయ్యారు. అక్కడ ఆటలో 5 పైసలు బెట్టింగ్లో ఒక 15 పైసలు పొగడితే... బజార్ లొ పాటల పుస్తకం కొనడం గాని పిడత కిందపప్పు గాని తినడం.పార్కులో సైరన్ మోగ గానే ఆట స్టాప్.ఆట అవ గానే
స్టేషన్ రోడ్ లో తాజ్ మహల్ హోటల్ లో అందరూ ఇరానీ టీ తాగే వాళ్ళం ప్రసాద రావు గారి డబ్బులతో.అప్పుడప్పుడు మా బ్యాచ్ ఆయనతో సినిమాలు కూడాను..అలా దిబ్బల పాలెం శ్రీనివాసలో జంగల్ మే మంగల్, బాబీ ,జమీర్ లాంటి సినిమాలు చూసే వాళ్ళము.బ్యాడ్మింటన్ అయిపోగానే తాలూకా ఆఫీస్ కాంపౌండ్ లో పెద్ద చెక్క గేట్ మీద బ్యాచ్ అంతా బ్యాట్స్ చేత్తో పట్టుకు కూర్చోని అటుగా పోయే వాళ్ళమీద కామెంట్స్ చేసుకొని ఇళ్ళకి చేరే వాళ్ళం.
గేట్ తీసుకొని ఇంటికి వెళ్లేసరికి... మెట్ల దగ్గర నైట్ లైట్ వెలుగుతూ ఉండేది.ఎప్పుడేనా మా బావ నేను కలసి సినిమాకి వెళితే ముందు గేట్ లోంచి నేను వెనుక పెరటి పెద్ద గేట్ లోంచి వాడు(పెద్ద గేట్ ఎడ్ల బండి లోపలికి రావడానికి వీలుగా పెట్టారు) 5 నిముషాలు తేడాతో ఇంటికి చేరే వాళ్ళము అనుమానం రాకుండా...ఇద్దరు మేడ మీదకు చేరి ఆ రోజు కాలేజీ కి అమ్మాయిలు ఏ డ్రెస్ లో ఎలా మెరిసారు అంటే లంగా ఓణీలే...అలాగే మా జూఅలజి మేడమ్ . ఆవిడకి ఫిల్మ్ స్టార్ హేమ మాలిని కి దగ్గర పోలికలు ఉండేవి .....ఏ రోజైన ఆవిడ లాబ్ ఉందంటే...స్టూడెంట్స్ జ్వరంలో కూడా కాలేజ్ మానే వారు కాదు.మున్సిపల్ లైబ్రరీ లో అన్ని పుస్తకాలు దొరికేవి.ఒక సారి eves వీక్లీ లో సెంటర్ స్ప్రెడ్ హేమ మాలిని ఫోటో వేసాడు.దాన్ని ఎలాగైనా కట్ చేసి బుక్స్ మధ్యలో పెట్టేయాలి లైబ్రేరియన్ చూడ కుండా.మనం తీయక పోతే మరొకడు కొట్టేస్తాడు. మరునాడు వేరే కుర్రాళ్ళు బుక్లో హేమ మాలిని బొమ్మ కనబడక పోయేసరికి పిచ్చెక్కి పోయారు..పైసా జేబులో లేక పోయినా డబ్బుతో సంబంధం లేకుండా ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయవచ్చో అది మాతోనే అయి పోయింది .ఎప్పుడైనా మధ్యాన్నం హోరా మెయిల్ వచ్చే సమయానికి ప్లాట్ఫారం మీదకు వెళ్లే వాళ్ళం
ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంట్స్ వెతికే వాళ్ళం.. ఎవరైనా సినిమా యాక్టర్స్ కనబడతారేమో అని.ఎక్కువగా బెంగాలీ అమ్మాయిలు ఉండేవారు.వాళ్ళు వీళ్ల కంటే
బ్యూటీస్.3 నిముషాల్లో ట్రైన్ వెళ్లి పోయేది.ఇక ప్లాట్ఫారం మీద మిగిలింది మేము అమ్మకం తాలూకు డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఇడ్లి. వడ సమోసా గాళ్ళు. అప్పట్లో ప్లాట్ఫారం మీద చిన్న కప్పులో ఐస్ క్రీమ్ అమ్మేవారు.. ఖరీదు ఒక రూపాయి.అదో పెద్ద లగ్జరీ.ఎప్పుడు తినలేదు.మా లెక్క ఒక్క రూపాయి ఉంటే రామకృష్ణ చిత్రమందిర్ లో హిందీ సినిమా మార్నింగ్ షో చూసేయొచ్చు.ప్లాట్ఫారం మీద నామాల శేషయ్య గారి బుక్ స్టాల్ ఉండేది.అక్కడ ఫ్రీగా చందమామ చదివేసే వాళ్ళం.తరువాత రోజుల్లో ఎప్పుడైనా ట్రైన్ లో ఆ రూట్ లో వెళుతుంటే దిగి విష్ చేసి వెంటనే ఎక్కేసే వాడిని. కోరమండల్ ఎక్స్ప్రెస్ వేసిన కొత్త లో వెళ్తున్నప్పుడు దాని స్పీడ్ చూట్టానికి ఫ్రెండ్స్ తో పట్టాల దగ్గర నుంచుంటే ప్రసాద రావు గారు మమ్మల్ని దూరంగా లాగేసే వారు. ట్రైన్ స్పీడ్ కి నేల ఆదిరి పోతుంటే మేము ఊగిపోయే వాళ్ళం.5 సెకన్స్ లో మమ్మల్ని దాటి పోయేది. అప్పుడప్పుడు ఇంటికి పిన్నులు పెద్దమ్మలు వచ్చినప్పుడు డబ్బులిస్తే వాటితో కాలేజ్ పక్కని రామారావు హోటల్ లో ఇడ్లి తినడం బలే ఉండేది.పది పైసలికి మూడే...ఎన్ని తిన్న నోట్లో కరగి పోయేవి.
పార్కు లో సైరన్ కూయ గానే వసారాలో భోజనాలు.ఇక సాయంత్రం భోజనాలు చేసేసి మేడ ఏక్కే వాళ్ళం. చదవడం మొదలెట్ట గానే వీర్రాజు టాకీస్ లోంచి ..బంగారు కలలు సినిమా తాలూకు చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మ.. అని పాట వినబడేది.చదువు కొండెక్కేది. తరువాత రాత్రి వీధులన్నీ ప్రశాంతంగా ఉండడంతో పిచ్చి కొండమ్మ కేకలు, మాదా కబళం అంటూ ముష్టి వాళ్ళు ,తులసి హోటల్ లోంచి.. హల్లో సారు ఓ దొరగారు తగండి మీరు అని డ్యుయేట్స్ .అప్పట్లో గ్రాంఫోన్ రికార్డ్స్ కాబట్టి వాడి దగ్గర అదొక్కటే పాట తిప్పి తిప్పి ఏడాదంతా అదే పాట వేసే వాడు. అది నైట్ హోటల్..ట్రంక్ రోడ్ మీద లారీస్ ఆపుకొని టిఫిన్ కొచ్చేవాళ్ళు.మధ్య మధ్యలో అమ్ముసెమెంట్ పార్క్ లోంచి బ్రాకెట్ ఆట తాలూకు అన్నొన్సుమెంట్స్..సున్నా సున్నా,మూడు ఒకటి ఇలా ఉండేవి. మొదట అర్థం కాలేదు.ఎవరో చెప్పారు.ఇది ఇలా ఉంటే ఉండి ఉండి పెద్ద పెద్ద సౌండ్స్ తో దడ్ డడ్ డడ్ డడ్ మని రైల్వే స్టేషన్ లోంచి గూడ్స్ షన్టింగ్స్ వినబడేవి.. ఆ రోజుల్లో కుర్రాళ్ళు రాత్రిళ్ళు సెకండ్ షో నో పర్మిట్.ఒకసారి మా చిన్నాన్న గారితో రైలు మిస్ అయి ధర్మదాత సినిమా చూసి ఆయన్ను రాజమండ్రి లారీ ఎక్కించి ఇంటికి వస్తుంటే...ప్లీడర్ రోడ్ పక్కన అదంతా పారిస్ ల ఉంది.నైలాన్ సారీస్ కట్టిన అమ్మాయిలతో .మాకు అర్థం కాక వెనక్కి పరిగెత్తం.. అప్పుడో తెలిసున్న పెద్ద మనిషి కనబడి ఈ టైం లో అటెల్ల కండి అంటే మేము మెయిన్ రోడ్ ఎక్కి పిఠాపురం డాక్టర్ గారి సందు లోంచి ఇంటికి చేరాం.అయితే రాత్రి చూసిన పెద్దాయన పొద్దున్నే మా వీధిలోనే ఉన్న గౌర్నమెంట్ ఆస్పత్రి దగ్గర క్యూ లో కనబడ్డాడు.
నేను చెప్పిన తుని 40 ఏండ్ల క్రితం.ఇవాళ అక్కడికి వెళితే.అప్పటి మనుషులు లేరు.కాల గర్భంలో కలిసిపోయారు.ఒకాయన చెప్పాడు.ఏ ఊరైన మనకు తెలిసున్న మనుషులు వలనే అందంగా కనబబడుతుందిట.వాళ్లే లేనప్పుడు అది తుని అయినా ఒకటే కలకత్తా అయిన ఒకటే.నాకు బాగా ఇష్టం రైల్వే స్టేషన్ వెనుక దూరంగా ఉన్న ఆ కొండలు ఏనుగు పడుకున్న ఆకారంలో ఉంటాయి.ఆ కొండలు ఒక పక్క పెంట కోట సముద్రం వలన తునిలో చలి కాలం అద్బుతం గా ఉండేది. ముఖ్యంగా మనతో జ్ఞాపకాలు షేర్ చేసుకోడానికి ఆ ఊరిలో ఒక్కడు కనబడడు. ఎదో ఈ ఫేస్ బుక్ పుణ్యమా అని పబ్లిక్ షేరింగ్ తప్ప.ఊరిలోకి వెళితే మనకి తెలిసున్న బంధువులు మిత్రులు అదే రోడ్లు మీద నడ చిన దృశ్యాలు గుర్తొస్తే బాదే.విపరీతం అయిన జనాభా ఫ్లోటింగ్ ట్రాఫిక్ వల్ల ధ్వని కాలుష్యం.ఇప్పుడు రాత్రి అయితే ఆ వీర్రాజు టాకీస్ లో పాటలు వినబడవు పిచ్చి కొండమ్మ కేకలు లేవు తులసి హోటల్ లో హల్లో సారూ పాట వినబడదు.నామాల శేషయ్యగారు ఇప్పుడు లేరు.నెట్ వచ్చాక కొనే వాళ్ళు లేక కొడుకులు రైల్వే స్టేషన్ లో బుక్ షాప్ క్లోజ్ చేసేసారు.రైల్వే గూడ్స్ షెడ్ దగ్గర షన్టింగ్ సౌండ్స్ వినబడవు.*****

ఒక డైరెక్టర్ చెప్పారు.శుక్రమహార్దశ అనేది ఉంటే ఒక ప్రొడ్యూసర్..డైరెక్టర్..ఎంత చెత్త సినిమా తీసినా సూపర్ హిట్ అవుతాయిట. ఆద...
02/02/2025

ఒక డైరెక్టర్ చెప్పారు.శుక్రమహార్దశ అనేది ఉంటే ఒక ప్రొడ్యూసర్..డైరెక్టర్..ఎంత చెత్త సినిమా తీసినా సూపర్ హిట్ అవుతాయిట. ఆదశ అనేది లేక పోతే ఇంతే సంగతులు ఎక్కడో చిన్న తేడా కొట్టి ఉష్ కాకి ..అది ఎక్కువగా రాంగ్ కాస్టింగ్ లో..ఎడిటింగ్..బాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో క్లైమాక్స్ తీయడం లో ఏదైనా కావొచ్చు కారణం దెబ్బ తినడానికి.ఒక్క కథ స్క్రీన్ప్లే మాత్రమే బాగుంటే చాలదు.
ఈ ప్రియ అనే సినిమా చాలా బాగా తీశారు.
కె. భాగ్యరాజ్ స్టోరీ.
సినిమా తీసి 45 ఇయర్స్ అవుతున్నా స్క్రీన్ ప్లే
ఈ కాలానికి తగ్గట్టు ఉంది.
చంద్ర మోహన్..చిరంజీవి..రాధిక..స్వప్న. నటించారు.లొకేషన్ కెమెరా..పాటలు అద్బుతమ్.

కానీ ఎందుకో పెద్ద హిట్ అవ్వ లేదు.అప్పట్లో థియేటర్ లో మిస్ అయ్యాను.ఇప్పుడు యు ట్యూబ్ లో చూశాక అనిపించింది.
క్లైమాక్స్ అలా తీయ కుండా వేరే విధంగా తీసి ఉంటే ఆడియన్స్ కి నచ్చేది. రాధ కల్యాణం కూడా 2 రకాల క్లైమాక్స్ తీశారని నిర్మాత శశి భూషణ్ గారు అప్పట్లో చెప్పారు.

దీని తరువాత ఇదే థీమ్ తో వచ్చిన సప్త పది..స్వయం వరం.. భాగ్యరాజ్ రాధా కల్యాణం...మహేంద్రన్ మౌన గీతం..మణి రత్నం..మౌన రాగం..సూపర్ హిట్ అయ్యాయి.
వాటి కన్నా ముందే ఎంతో బాగా తీసిన ఈ మూవీ average గా ఆడటం ఆశ్చర్యం.టైం అంతే.
ఇదే ప్రొడ్యూసర్ ప్రేమ తరంగాలు...ఇంకా హిమ మూవీస్ బ్యానర్ పై M L A.. ఏడుకొండలు తీశారు. ఆసినిమా హిట్ అయినా..ప్రొడ్యూసర్ చేతికి ప్రాఫిట్స్ రాలేదని అప్పట్లో సినీ వర్గం చెప్పుకొన్నారు.
అందుకే ఒక హీరో స్టేట్మెంట్ చదివా.సినిమా హిట్ అవుతే చుట్టూ ఉన్న జనం లాభాలు పంచు కుంటారు.డైరెక్టర్ పెద్ద ముదురు అయితే మూడొంతులు వాడే కొట్టేస్తాడుట రైట్స్ పేరుతో(అందరూ కాదు కొందరు).Producer కాట్రగడ్డ మురారి గారు కూడా అదే రాసారు నవ్విపోదురు గాక బుక్ లో)
అదే నష్టం వస్తే మొత్తం నష్టాన్ని నిర్మాత నెతి మీద పడేస్తారు ట.

ఈ ప్రియ తీసిన ప్రొడ్యూసర్ MVH రాయప రాజు గారు..వారి కుటుంబం...మా తాత గారు బతికి ఉన్న రోజుల్లో మంచి ఫామిలీ ఫ్రెండ్స్.
ఆయన మాఊరు దగ్గర వందల ఎకరాల భూస్వామి.ఆయన తల్లి గారు రాజేశ్వరమ్మ గారికి నేను అంటే చాలా ఇష్టం..అవిడన్న నాకు చాలా అభిమానం.
నేను 10th చదివే రోజుల్లో రాయప రాజు గారు మద్రాస్ షిఫ్ట్ అయ్యారు.
సినిమాలు తీసి చాలా నష్ట పోయారు.
నాకు కూడా సినిమాలు అంటే విపరీతమైన ఇష్టం.
హైదరాబాద్ లో advt స్టూడియోలో ఆర్టిస్ట్ గా చేస్తున్న రోజుల్లో సినిమా పబ్లిసిటీ ఆర్టిస్ట్ గా మద్రాస్ వచ్చేస్తాను అని ఆయనకి ఉత్తరం రాశాను 18ఇయర్స్ ఏజ్ లో.
వెంటనే ఆయన కంగారు పడి మా పేరెంట్స్ కి కబురు పంపించారు. బాబు ని అక్కడికి రావద్దు అని. హైదరాబాద్ లో జాబ్ వదలొద్దు అని.
అది ఎండమావి.అక్కడ పరిస్థితులు బాలేవు
తట్టుకోలేడు అని.దానికి కారణం ఆయన చాలా నష్ట పోయారు అప్పటికే.
అయితే సారధి స్టూడియోస్ వాళ్ళకి మద్రాస్ లో వర్క్ చేసినప్పుడు.ఆయన ఇంటికి వెళ్లి కలిస్తే టీ ఇచ్చి అక్కడ ఉండే పాలిటిక్స్ వివరించారు.
వచ్చిన పని అవగానే హైదరాబాద్ వెళ్లిపో..జాబ్ పోతే కష్టం. ఈ ఫీల్డ్ పైన పటారం లోన లోటారం..
ఎవరూ సరిగా డబ్బులు ఇవ్వరు..
క్రేజీ ఫీల్డ్ అంతే. ఏమీ సుఖం ఉండదు.
ఒక్క సారి ఇరుక్కుంటే పెద్ద ఊబి.ఇక దేనికి పనికి రాము అని.
ఎందుకో తెలీదు అందులో ఉన్న సినీ పెద్దలు ఎవరైనా సరే మనకి ఇచ్చే advise అదే.******

29/01/2025

లైఫ్ ఇన్ హైద్రాబాద్..1970స్
చక్రాల్లో గాలి పోయింది....

కొద్దిగా నిలదొక్కు కుని హ్యాపీగా రెండు రోజులకో సెకండ్ షో ఆదివారాలు మార్నింగ్ షోస్ చూస్తున్న టైంలో ఒక రోజు రాత్రి తొమ్మిది గంటలకి తలుపు టక టక చప్పుడయ్యింది ఒరేయ్ బాబ్జీ అంటూ.రేడియోలో పాటలు వింటూ వర్క్ చేసుకుంటున్న నేను ఈ పేరుతో పిలిచే వారు ఎవరై ఉంటారు.ఇది మా ఇంట్లోను నాతో ఆడుకున్న చిన్నప్పటి ఫ్రెండ్స్ పిలిచే పేరు. డ్రాయింగ్ బోర్డ్ పక్కని పెట్టి లేచి తలుపు తీస్తే ఎదురుగా మాసిన గడ్డం కుళ్ళి పోయిన బట్టలు నెత్తిమీద గోనె సంచి.చీకట్లో గుర్తు పట్టలేదు.ఎవరయ్యా అని అడిగితే..నేనురా సుబ్బారావుని అన్నాడు.గొంతు విని గుర్తు పట్టి లోపలికి రమ్మన్నాను.
ఈ అవతారం ఏంట్రా ఎక్కడో రంగూన్ నుంచి పారిపోయి వచ్చి నట్లు అన్నా.వాడెక్కడో జనగం దగ్గర బస్ డిపో కాంటీన్ లో స్వీపర్ గా పని చేస్తున్నాట్ట.కాంటిన్ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ అయిపోయిందట.వీడి ఉద్యోగం పోయింది.మరి ఆ నెత్తి మీద గొనె సంచి ఏంటన్న.ఏవో బొగ్గుల కుంపటి, మూకుడు అల్యూమినియం బొచ్చెలూట.జీతం బదులు ఇవి ఇచ్చాడట వాడి ఓనర్.
వాడిని చూసి చాలా ఏండ్లు అయ్యింది.మాకంటే చాలా ఏండ్లు ముందే మాధవరం వదిలేసాడు.ఏదో అంబాజి పేట సబ్బుల వ్యాపారం అని వాళ్ళ నాన్నతో మొత్తం పొలం అమ్మించి వ్యాపారం దిబ్బ అయ్యిన తరువాత అందరిని రోడ్ మీద పడేసాడు.స్కూల్ లైఫ్ లో నన్ను వదిలే వాడు కాదు.
నా అడ్రస్ ఎవరు ఇచ్చారు ...ఉత్తరం రాయకుండా ఎలా వచ్చావు అని అడిగా..
స్నానం చేసి ఎన్నాళ్ళు అయ్యింది ముందు స్నానం చేయి అంటూంటే వాడి చొక్కా లోంచి బీడీ కట్ట కింద పడింది. అలవాట్లకి లోటు లేదు అని అర్థం అయ్యింది. ఇంటి వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడిని ఉంచు కోవడానికి వీలు లేదు. వీడు వచ్చిన మరునాడే మాఊరు మా బాబాయిల నుంచి ఉత్తరం వచ్చింది. పలానా వారి అబ్బాయి వీడు వస్తే రూమ్ లో పెట్టుకోవద్దు అన్ని దురలవాట్లతో కుటుంబాన్ని రోడ్ మీద పడేసాడు.నిన్ను కూడా తగలేస్తాడు అని. నేను వాడికి చెప్పాను.ఇంట్లో బీడీ వాసన రాకూడదు అని.ఇంటి అద్దె భోజనానికి నువ్వు ఇవ్వక్కర లేదు.నీకు జాబ్
దొరికే దాకా ఉండు...ఇంటి వాళ్ళు ఇద్దరిని ఒప్పు కోరు అని చెప్పా.ఇదివరకు ఏమో కాని నాదగ్గరకు
వచ్చేక పద్ధతి గానే ఉన్నాడు.ఎటొచ్చి మళ్ళీ నా సరదాలు తగ్గించు కోవాల్సి వచ్చింది.
జాబ్ చూస్తే ఇప్పట్లో పెర్మనెంట్ అయ్యేలా లేదు.నా ఫ్రెండ్ రెహ్మాన్ ఇక్కడ టెంపరరీ జాబ్ వదిలేసి ఆదిలాబాద్ వెళ్లి పోవడంతో నాకూ ఆఫీసులో కొంచెం డల్ అయిపోయింది.
ఈలోపు ఒక తెలిసున్న వాడు వాడి బ్రదర్ ని ఒక నెల రోజుల కోసమని నా రూంలో పడేసాడు.మొహమాట పడి తప్పు చేశాను.వాడు చేరగానే నాతో సుబ్బా రావు గాడిని బయటకు గెంటేయ మంటాడు.నాకు అనిపించింది వీడు కావాలంటే ఇంకో చోట ఉంటాడు.
సుబ్బారావు గాడికి నేను తప్ప మరో గతి లేదు కాబట్టి కుదరదు అన్నా.
ఒక రోజు మా వాడు కంప్లైంట్ కొత్త రూమ్ mate మీద. వాడు వీడితో బ్రెడ్ బట్టర్ జాం బయటి నుంచి తెప్పించు కొని వీడి కడుపు మాడి పోతుంటే ఎవడో ఫ్రెండ్ తో వీడికి పెట్టకుండా లాగించేసేడట.ఎదురు
నీలాంటోడికి ఇటువంటి ఫుడ్ తినే అర్హత లేదోయ్ అన్నాడట....
***
కొత్త సైకిల్ కొన్న తరువాత ఫ్రెండ్స్ ఇద్దరు అమ్మాయిల్లో ఒకమ్మాయి టిఫిన్ బాక్స్ చేత్తో పట్టుకుని కనకాంబరం రంగు కాటన్ చీర కట్టుకొని ఆఫీస్ కి నడుచు కుంటు వెళ్తూ బడేచౌడి లో కనబడింది.
సైకిల్ మీద లిఫ్ట్ ఇస్తే ఏదో తాపి మేస్త్రి కూలి పిల్లని ముందు కూర్చో పెట్టుకుని తొక్కుతున్నట్లు ఉంటుందని నేను పక్కనే నడుచు కుంటు వెళ్తుంటే
మాటల్లో తన పెళ్లి సెటిల్ అయ్యిందని చెప్పి కార్డ్ ఇచ్చింది.శుభం ఒకళ్ళు అయిపోయారు.
ఇంకో రోజు పొద్దున్నే గుడికి వెళ్ళి దేవుడ్ని ప్రాద్ధిద్దాం
కనీసం రెండో అమ్మాయేన దొరకాలి అనుకొని వెళ్తే అక్కడే గుడిలోనే కనబడింది.ఎవరో ఇద్దరు పెద్ద వాళ్ళని పరిచయం చేసింది మామ గారు అత్త గారు అని.నేను మీ మేనత్త గారా అన్నా ఆశ చావక. కాదు నిజం మామగారు అత్తగారే అంది.
మరి మీ ఆయనేడీ అన్నా. ప్రసాదం పొట్లాల కోసం
క్యూ లో ఉన్నారు.పరిచయం చేస్తా ఉండు అంది.
ఉసూరు మనిపించి ఇంకో రోజు చేద్దువు గాని అని నీరసం గా సైకిల్ ఎక్కాను. ఒకేసారి రెండు టైర్స్ లో గాలి పోయింది.జరిగింది గురువు లాంటి మిత్రుడికి చెబితే మొహం ఎలిమెంట్రీ స్కూల్ పిల్లాడిలా పెట్టుకుని వెళితే నిన్ను ఎవడు పెళ్లి చేసు కుంటారురా అన్నాడు...****
ఇంకా ఉంది..

సుశీల అద్భుతంగా పాడిన పాట
25/12/2024

సుశీల అద్భుతంగా పాడిన పాట

Telugu Christian song

నీలం రంగు రేకు పెట్టి.డేస్ ఆఫ్ 1970స్ పార్ట్ 2ఆచంట వి సుబ్రహ్మణ్యంచెరువు గట్టు మీంచి బస్సు అప్పారావు పేట వెళ్లిన సౌండ్ వ...
21/08/2024

నీలం రంగు రేకు పెట్టి.
డేస్ ఆఫ్ 1970స్ పార్ట్ 2
ఆచంట వి సుబ్రహ్మణ్యం

చెరువు గట్టు మీంచి బస్సు అప్పారావు పేట వెళ్లిన సౌండ్ విన బడింది.వెంటనే నా పెద్ద రేకు పెట్టి
రెండు చేతులతో చంకలో పెట్టుకుని చాకలి సందు లోంచి స్పీడ్ గా నడుస్తూ గాంధీ బొమ్మల వద్ద బస్సు స్టాండ్ కి చేరాను.వగుర్చు కుంటూ పెట్టె అక్కడ అరుగు మీద పెట్టి తాడేపల్లిగూడెం వెళ్ళడానికి బస్సు కోసం ఎదురు చూస్తుంటే చేతిలో కర్రతో టేకు మూడి సీతారామయ్య మేష్టారు వచ్చి పక్కన నుంచున్నారు.
ఏవయ్యా సుబ్రమణ్యం ఇప్పుడేం చదువుతున్నావు అనడిగారు. ఇంటర్ సర్.ఓరి నీ ఇంటర్ తగలయ్యా ఎప్పుడు అడిగినా అదే చెపుతావు ఇక ముందుకి వెళ్ళవా ఏంటి.లేదు సర్ ఇప్పుడు సెప్టెంబర్ కి కట్టాను... ఇప్పుడు కూడా పరీక్షలు రాయడానికే తుని వెళ్తున్నా.
సరే కట్టు కట్టు ఎన్నిసార్లు ఫెయిల్ అవుతే పునాది అంత గట్టిగా ఉంటుంది.కష్టం వృధా పొదులే.ఎక్కడో ఒక చోట పనికొస్తుంది.

బస్సు వచ్చింది దుమ్ము లేపుకుంటు. ఎక్కి కిటికీ పక్క సీట్ లో కూర్చున్నా.సీతారామయ్య మాస్టారు ఎలిమెంట్రీ స్కూల్ నుంచి మేము హైస్కూల్ ఫస్ట్ ఫారమ్ లో చేరే సరికి క్లాస్ టీచర్ గా వచ్చేవారు.పంచె కట్టు లాల్చీ భుజం మీద కండువా నుదిటి తిలకం తో నిలువు బొట్టు ఆయన గెట్ అప్. మేము కూడా ఎప్పుడైనా తిలకం పెట్టుకో పోతే వరండాలో నుంచో బెట్టే వారు.ఇక హోమ్ వర్క్ పూర్తి చేయక పోయిన క్లాస్ లోంచి బయటకు పంపేసే వారు. మేము శుభ్రం గా తాటి చెట్ల కిందకి పోయి అక్కడ నోట్స్ పూర్తి చేసి వచ్చే వాళ్ళం.ఇది రెగులర్ తతంగం.
మా అదృష్టం కొద్దీ మేము సెకండ్ ఫార్మ్ లోకి వచ్చేసరికి ఆయన రిటైర్ అయ్యారు.
ఆరోజు చూడాలి ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ కన్నీళ్లు పెట్టుకుంటే....నా లాంటి లాస్ట్ బెంచ్ గాళ్ళు
స్కూల్ గ్రౌండ్ లోకి పోయి ఎగిరెగిరి గెంతులు డాన్సులు.ఈరోజుల్లో అయితే ఏడో క్లాస్ లోనే మందు పార్టీ కూడా చేసుకొనే వాళ్ళం రోజు వరండాలో నుంచునే బాధ తప్పినందుకు.
*****
తాడేపల్లిగూడెం స్టేషన్ లో హౌరా మెయిల్ 3 నిముషాలే ఆగుతుంది. ఉన్నవి రెండే జనరల్ కంపర్ట్మెంట్స్. డోర్ లోంచి లోనికి వెళ్ళడానికి సందు లేకుండా ట్రైన్ మొత్తం కిట కిట.ఇంత బరువు పెట్టితో ఎక్కటం నావల్ల కాలేదు.
ట్రైన్ కదిలి పోయింది.బిక్క మొగం వేసుకుని ప్లాట్ ఫారం మీద అలాగే నుంచుండి పోయా..
తిరిగి enquiry చేస్తే 10 గంటలకి పూరీ హైద్రాబాద్ 32 ఎక్స్ప్రెస్ ఉంది అన్నారు.
ఇంకా 4గంటలు టైం ఉంది కదా అని పెంటపాడు కాలేజీ లో చదువుతున్న మా కజిన్స్ ఉండే కరణాల సత్రంకి వెళ్ళా. ఇద్దరిది చెరో గది. సూపర్ గా ఉంది.లక్కీగా ఆరోజు కాలేజీకి సెలవు.ఇద్దరు రూమ్ లోనే ఉన్నారు.

కాసేపు కబుర్లు అయ్యాక మా కృష్ణ గాడిని తీసుకొని మళ్ళీ స్టేషన్ కి పెట్టె మోసుకుంటూ కుంటూ వెళ్ళా. మావాడు నేను రేకు పెట్టి చెరో వైపు పట్టుకుని ప్లాట్ ఫారం మీద పరిగెత్తామ్. అయినా ఆ రష్ లో ట్రైన్ లోపలికి దూరలేక పోయాము.
పెళ్లిళ్ల సీజను ట.అందుకే అంత రష్ అన్నారు.
రిక్షా కి డబ్బులు లేక తిరిగి మళ్ళీ రేకు పెట్టె మోసుకుంటూ నడచి కరణాల సత్రానికి చేరాము.

మేము వెళ్లిన కాసేపటికి మా విశ్వనాధం బాబాయి ఇంకో చుట్టం కిష్టప్ప వచ్చారు.నన్ను చూడ గానే ఇద్దరు ఒకేసారి ఏరా పరీక్షల కి తుని వెళ్తున్నా అన్నావ్ ఇంకా ఇక్కడే ఉన్నావ్ ఏంట్రా అంటే విషయం చెప్పా.
ఆ ట్రంక్ పెట్టె ఎవరిది.నాదే అన్న. బట్టలుకి అంత పెట్టె ఎందుకురా ....అందులో బట్టలు లేవు అన్న. బట్టలు వంటి మీద ఉన్నవే. దాని నిండా బుక్స్.
పెట్టె తెరిచి చూపించా.దానికి గొళ్ళెం లేదు.
ఏమిట్రా ఇది మొత్తం వెంకట్రామా అండుకో ఇందులో సర్దేశావ్ అన్నారు.
అంటే ఈపెట్టె తో హోరా మెయిల్ ఎక్కేద్దామనే.ఈ దిక్కు మాలిన ట్రంక్ పెట్టె ఎక్కడిదిరా బాగ్స్ లేవా అన్నారు.అహ. ఇది మా పెద్దమ్మ గారు ఇచ్చిన మద్రాస్ పెట్టె. సరే ఒక పని చేయి...రాత్రి బిట్రగుంట దొంగల బండి పాసెంజర్ ఉంటుంది. అది ఎక్కు .పొద్దున్నుంచి ఏం తిన్నావురా అడిగారు. ప్లేట్ ఇడ్లి తిన్న.భోజనం టైంకి తుని వెళ్లిపోవచ్చు అనుకున్న అన్నాను. అప్పుడు
మా బాబాయ్ ఒరే లక్ష్మీ పతి వీడికి రాత్రి పంతులు మెస్స్ లో బోజనమ్ పెట్టించి ఇద్దరు కలిసి రైల్ ఎక్కించండి అన్నారు.
పంతులు మెస్స్ లో వాడి గెస్ట్ టికెట్స్ తో భోజనమ్ కానిచ్చి పెద్ద బరువు పెట్టి మోసుకుంటూ స్టేషన్ కి చేరాం. ఈసారి ట్రైన్ లేట్ గా రాత్రి పదింటికి వచ్చింది.ఇద్దరు కలిసి పెట్టితో సహా రైలు ఎక్కించేశారు.అది మరునాడు పొద్దున్నకి తుని చేరింది.
*****

పరీక్షలు అయ్యాక తిరిగి తునిలో రాత్రి రైల్వే స్టేషన్ కి మా మేనామావ కొడుకు తొడొస్తే పెట్టె మోసుకుంటూ....వాడీ .......వెళ్లే దెయ్యాల పాసెంజర్ ఎక్కా.ఆరోజుల్లో సింగల్ ట్రాక్.ఏ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చిన ఈ పాసెంజర్ ని చిన్నస్టేషన్స్ లో సైడ్ కి పేట్టేసేవాడు.
పొద్దున్నే 7 గంటలికి తాడేపల్లిగూడెం చేరా.ప్లాట్ ఫారం మీద పంప్ నీటితో బ్రష్ చేసుకుని స్టేషన్
బయటకు రాగానే గోడమీద సొగ్గాడు సినిమా పోస్టర్స్ కనబడ్డాయి. ఆ రోజే రిలీజ్ 9 గంటల షో ఉంది.ఇంకేం ఉంది. ఎదురుగా అచ్చన్న ఉడిపి హోటల్ లో ఇడ్లి తిందా మనకున్న వాడినల్లా.... ఆడబ్బులతో సినిమాకి ప్లాన్ చేసా. అయితే అది ఆడేది... రామ తులసి థియేటర్ లో ఎక్కడో పెంట పాడు రోడ్డులో ఉంది థియేటర్.
రిక్షా కి డబ్బులు లేవు.సుమారు 2 కిలో మీటర్లు పైనే. పెట్టె భుజం మీద పెట్టుకుని నడక మొదలెట్టాను.మొదటి రోజు మొదటి ఆట.విపరీత మైన రష్. టికెట్ కోసం క్యూ లో నుంచున్న.చూస్తే టికెట్ దొరికినా ఈ రష్ లో పెట్టెతో సహా హాల్ లో దూరగలనా లేక హౌరా మెయిల్ ఎక్కినట్టే ఉంటుందా అనుకుని టికెట్ సంపాదించి పెట్టె నెత్తి మీద పెట్టుకుని లోపలికి వెళ్ల బోతుంటే అప్పటికే అవ్వాబువ్వ కావాలంటే అయ్యేదేనా అబ్బాయి పాట వినబడుతోంది లోన అంత చీకటి.
ఇంతలో గేట్ కీపర్ బాబూ ఈ చీకట్లో పెట్టి ఎవడి నెత్తి మీదో పడేసా వంటే బుర్ర పగిలి చస్తాడు ఇక్కడే పెట్టు అని నెత్తిమీంచి దించి గోడ వార పెట్టాడు.
******
పరీక్ష కొట్టేసింది. మార్చికి కట్టాను.ఈసారి సెంటర్ కాకినాడ ఇచ్చారు.బస్సు లో నవాబ్ పాలెం లో దిగాను.అక్కడి పాక హోటల్ లో ఇడ్లి తిని అక్కడి నుండి రైల్వే స్టేషన్ కిలోమీటర్ పైనే ఉంటుంది.మళ్ళీ పెట్టి నెత్తి మీద పెట్టుకుని తుని వెళ్లే ఏలూరు కోచ్ ఎక్కా...తుని కాలేజీ లో హాల్ టికెట్ తీసుకుని. అమ్మమ్మ గారింట్లో ట్రంక్ పెట్టి పెట్టేసి రామకృష్ణ చిత్ర మందిర్ లో హిందీ మార్నింగ్ షో జితేంద్ర జయ ప్రాణ్ నటించిన పరిచయ్.సినిమా కి వెళ్ళా.. మరునాడు పొద్దున్న కాకి నాడ బయలుదేరాను అక్కడి ఐడియల్ కాలేజీ సెంటర్లో పరీక్ష రాయడానికి.అయితే ముందు రోజు న్యూస్ పేపర్ లో శోభన్ మంజుల కృష్ణం రాజు నటించిన ఇద్దరూ ఇద్దరే సినిమా పద్మ ప్రియా టాకీస్ లో రిలీజ్ అని తెలుసు కున్నాను. పెద్దమ్మ గారి ఇల్లు సర్పవరం అవతల పోలీస్ కాంప్.ఇంటికెళ్తే పరీక్షల టైం లో సినిమా ఏమిటని తిడతారు.అందుకే బస్టాండ్ నుండి డైరెక్ట్ గా పెట్టె మోసుకుని సినిమా హాల్ లో దూరాను.
******
మళ్ళి పరీక్ష కొట్టేసింది.
******
ఈ సారి ఇలా క్కాదు మద్రాస్ వెళ్లి ఏదైన సినిమా స్టూడియోలో పబ్లిసిటీ ఆర్టిస్ట్ గా ఉద్యోగం చేసుకుంటూ ప్రైవేట్ గా పరీక్షలు రాద్దామని...మాఇంట్లో ఉండే రాముడు..ఇంకా మాణిక్యం అనే ఆవిడ దగ్గర 40 రూపాయలు తీసుకుని మళ్లీ పెద్ద పెట్టి
చంకలో పెట్టుకుని రైలు ఎక్కాను .అయితే వరదలు వచ్చి సూళ్లూరు పేట దగ్గర పట్టాలు కొట్టుకు పోయాయి.గుంటూరు విజయవాడలో 4రోజులు ఇరుక్కు పోయా...విజయవాడలో మా కజిన్ 12 రూపాయలు పెట్టి టికెట్ కొని కృష్ణ express హైదరాబాద్ ట్రైన్ ఎక్కించాడు.

ఇక ఈ పెట్టెతో మొదట సికింద్రాబాద్ ఎయిర్ ఫోర్స్ క్వార్టర్స్ లో కొన్నాళ్ళు మకాం.అక్కడి నుండి పఠాన్ చెరు లో సిమెంట్ పైప్స్ ఫేక్టరీ లో కొన్నాళ్ళు మకాం.మళ్ళీ తిరిగి ఇదే పెట్టితో రాం నగర్ గుండు, సీతాఫల్ మండి, వారాసి గూడా.నారాయణ్ గూడా లో ఇదే పెట్టి తప్ప నాకు ఆస్తి ఇంకేమి లేదు.మరో బాగ్ కానీ సూట్ కేస్ కానీ కొనుక్కునే డబ్బులేదు.
నారాయణ గూడ నుండి అశోక్ నగర్ యోగలయా కి షిఫ్ట్ అయ్యాక ...నా ఎదుగు దల commercial ఆర్ట్ వర్క్స్ చేయడం కోసం కొత్తగా కొన్న బజాజ్ టేబుల్ లైట్ తో ప్రారంభం.అలా అలా జీవితం బాగుపడింది.అయితే ఎన్నో బ్యాగులు అల్మైరాస్ etc.... పాడైనవి బయట పడేశాను.కానీ ఈ నీలం రంగు రేకు పెట్టె మాత్రం తుప్పు పట్టకుండా....ఈరోజుకి నాదగ్గర పదిలం గా ఉంది.ఈ పెట్టె 50 ఏళ్లగా నాతోపాటు నాకు తోడుగా ప్రయాణిస్తూనే ఉంది.ప్రస్తుతానికి ఈ పెట్టెలో మా పిల్లల బుక్స్ వస్తువులు ఉన్నాయి.వాళ్ళకి కూడా ఆపెట్టి అంటే చాలా సెంటిమెంట్.*******

Address

Av. Subramanyam
Secunderabad
500014

Telephone

91+9440311399

Website

Alerts

Be the first to know and let us send you an email when AVS Manyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category