చెన్నమనేని సైన్యం

చెన్నమనేని  సైన్యం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from చెన్నమనేని సైన్యం, Political Party, Secunderabad.

తెలంగాణ రైతాంగ పోరాటాల తరువాత ప్రతిపక్ష నేతగా కౌలుదారి చట్టాన్ని సాధించి 25 లక్షల మంది కౌలుదార్లకు పట్టాలిప్పించడంలో ప్ర...
05/09/2023

తెలంగాణ రైతాంగ పోరాటాల తరువాత ప్రతిపక్ష నేతగా కౌలుదారి చట్టాన్ని సాధించి 25 లక్షల మంది కౌలుదార్లకు పట్టాలిప్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వర రావు గారు 🙏🙏🙏✊✊✊

Dr. Ramesh Chennamaneni
BRS party Vemulawada
Telangana CMO
BRS Party Vemulawada

30/08/2023

*ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్ రావు శత జయంతి సందర్భంగా (ఆగస్టు 31), వారు చేసిన సామాజిక సేవను గుర్తిస్తూ... సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల పరిథిలో సాగునీరు ను తాగునీరును అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 9 (మల్కపేట రిజర్వాయర్ తో పాటు దాని పరిథిలోని కాల్వలకు మిడ్ మానేర్ నుంచి అప్పర్ మానేర్ దాకా ) కు...‘‘ చెన్నమనేని రాజేశ్వర్ రావు’’ పేరు పెడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.*
*ఈ సందర్భంగా వారి సామాజిక సేవలను సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు.* *ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ... ‘‘స్వాతంత్ర్య సమరయోధుడుగా, తెలంగాణ మొదటి తరం రాజకీయ వేత్తగా, నిరంతరం ప్రజలకోసం పోరాడిన గొప్పనేత చెన్నమనేని రాజేశ్వర్ రావు. తెలంగాణ రైతాంగం కోసం ఆనాటి కాలంలోనే వరద కాల్వ కోసం ఎత్తిపోతల పథకాల కోసం పోరాడిన చరిత్ర ఆయనది. సిరిసిల్ల వేముల వాడ ప్రాంతాల నుంచి అత్యంత ప్రజాదరణ కలిగిన నేత. పలు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి ఆ ప్రాంత ప్రజల సాగునీరు తాగునీరు కష్టాలను తీర్చడానికి ఎత్తి పోతల పథకం కోసం చెన్నమనేని రాజేశ్వర్ రావు ఎన్నో పోరాటాలు చేశారు. నాటి వారి ఆకాంక్షలను ప్రతిఫలించే విధంగా స్వరాష్ట్రంలో సాగునీరు ప్రాజెక్టులను ఎత్తిపోతల పథకాలను నిర్మించుకున్నాం. తెలంగాణ రైతాంగం నేడు దేశం గర్వించే స్థాయిలో పంటలు పండిస్తున్నారు. వారు ప్రజాప్రతినిధిగా పనిచేసిన ప్రాంత ప్రజలకు కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మించిన ప్యాకేజీ 9 ద్వారా సాగునీరు అందుతున్నది. మిడ్ మానేర్ (ఎస్ ఆర్ ఆర్) నుంచి ఎత్తిపోతల ద్వారా అప్పర్ మానేర్ దాకా నీటి సరఫరా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో... నాటి వారి కృషిని గుర్తిస్తూ, వారిని గౌరవిస్తూ, మల్కపేట రిజర్వాయర్ కు దాని పరథిలోని ఎత్తిపోతల పథకానికి మొత్తంగా ప్యాకేజీ 9 కు ‘‘ చెన్నమనేని రాజేశ్వర్ రావు’’ పెట్టడం జరిగింది.’’ అని సిఎం తెలిపారు.*

*సిఎం కేసీఆర్ గారి నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది.*
Dr. Ramesh Chennamaneni
BRS party Vemulawada
Telangana CMO

ఫొటొ పాతబడొచ్చు...కాని రైతన్నల కోసం జరిగిన భూపోరాటాలు, సాధించిన కౌలుదారి చట్టాల ద్వార మన ఉమ్మడి రాష్ట్రం లొ 25 లక్షల పేద...
30/08/2023

ఫొటొ పాతబడొచ్చు...కాని రైతన్నల కోసం జరిగిన భూపోరాటాలు, సాధించిన కౌలుదారి చట్టాల ద్వార మన ఉమ్మడి రాష్ట్రం లొ 25 లక్షల పేదలకు భూమి దక్కి వారి జీవితాలను మెరుగు పరిచిన విషయాన్ని ఈ నాటి జాతీయ రైతు దినోత్సవం సంధర్భంగా మరోసారి జ్ఞాపకం చేసుకుందాం!

Dr. Ramesh Chennamaneni
BRS party Vemulawada
BRS Party Vemulawada

*రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ* *సలహాదారు’ గా* ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఫ్రొఫెసర్, *వేములవాడ ఎమ్మెల్యే డా. ...
26/08/2023

*రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ* *సలహాదారు’ గా* ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఫ్రొఫెసర్, *వేములవాడ ఎమ్మెల్యే డా. చెన్నమనేని రమేశ్ బాబును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు.* కేబినెట్ హోదా కలిగివున్న ఈ పదవిలో వీరు 5 ఏండ్ల కాలం పాటు కొనసాగనున్నారు. సిఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేయనున్నది. కాగా...విద్యాధికుడైన డా. చెన్నమనేని రమేశ్ బాబు, జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక ‘హంబోల్ట్ యూనివర్శిటీ’ నుంచి (Humboldt University Of Berlin) ‘అగ్రికల్చర్ ఎకనామిక్స్’ లో పరిశోధనలు చేసి పీహెచ్డీ పట్టాను పొందారు. రాష్ట్ర వ్యవసాయ రంగం దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న నేపథ్యంలో...పరిశోధనా విద్యార్థిగా, ప్రొఫెసర్ గా, వీరికి అగ్రికల్చర్ ఎకానమి’ అంశం పట్ల వున్న అపారమైన అనుభవం, విస్తృత జ్జానాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయాభివృద్ధికోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వారు ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి సలహాదారుగా వ్యవహరించనున్నారు.
Dr. Ramesh Chennamaneni
BRS party Vemulawada
BRS Party Vemulawada
Telangana CMO

31.8.2023 నాడు చెన్నమనేని రాజేశ్వర రావు గారి శతజయంతి రోజు! (31.8.1923 - 31.8.2023)🙏వేములవాడ లో నిరాడంబరంగా పలు కార్యక్రమ...
24/08/2023

31.8.2023 నాడు చెన్నమనేని రాజేశ్వర రావు గారి శతజయంతి రోజు!
(31.8.1923 - 31.8.2023)🙏

వేములవాడ లో నిరాడంబరంగా పలు కార్యక్రమాలతొ వారిని స్మరించుకోవడం జరుగుతుంది.

"పార్టీ యజ్ఞం లొ నేను సమిధను
పార్టీ చీకట్లో నేను ప్రమిదను
పార్టీ పోరాటం లో నేను సైనికుడిని
పార్టీ నిర్మాణం లొ నేను కార్మికుడిని
పార్టీ పాఠ్యాంశంలో నేనొక ముఖ్యాంశాన్నవుతాను
అవును నా పాత్ర ఇంకా సశేషం
నేనొక విశేషం"

చెన్నమనేని రాజేశ్వర రావు 🙏

కష్టజీవుల కోసం కమ్మూనిస్టు గా, భూమి కోసం భుక్తి కోసం రావి నారాయన రెడ్డి గారితొ రైతాంగ సాయుధపోరాటంలొ నైజాం నవాబుకు వ్యతిరేకంగా, తన అర్ధాంగి లలితా దేవి తొ ఐదు సంవత్సరాలు అగ్న్యాతంలొ, మూడు దశాబ్దాలు శాసనసభలో ప్రజావాణిగా గోదావరి జలాల ఎత్తిపోతల కోసం, స్వరాష్ట్రం కోసం గట్టి అండనిచ్చిన, మచ్చ లేని చరిత్రగలిగిన మహనీయుడా ఇవే నీకు మా జోహార్లు!...వారి జీవితం, సహచరులు, పోరాటం, రచనలు, వారి పేరిట స్థాపించబడిన ఫౌండషన్ ద్వారా చేపట్టదలచుకున్న కార్యక్రమాల గురించి తెలుసుకోండి: www.chennamanenifoundation.org

సిరిసిల్ల, వేములవాడ ఇది ఒక నాటి కరువు మెట్ట ప్రాంతం..దివంగత నేత, వామపక్ష దిగ్గజం ఈ ప్రాంతానికి 30 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి వేలాది రైతులకు కౌలుదారి చట్టం ద్వారా, భూసంస్కరణల ద్వారా వారి హక్కులకు భరోసానిచ్చి, సిరిసిల్ల లొ రాయిని చెరువులొ 600 ఎకరాలు (ప్రస్తుత బద్దం ఎల్లరెడ్డి నగర్) పదివేల మంది నేత కార్మికులకు కొట్లాడి ఇండ్ల పట్టాలిప్పిచ్చి..1964 నుంచి 1971 కాలం లొ అమెరికా ఫోర్డు ఫౌండేషన్ ను ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి ని ఒప్పించి భారత దేశం లోనే 100 శాతం సిరిసిల్ల పాత తాలూకాలొ అన్ని గ్రామాలకు సహకారసంఘం సెస్సు ద్వారా కరెంటు తెచ్చి వ్యవసాయానికి, పవర్లూం మగ్గాలకు ఊపిరి పోసి...శాశ్వత పరిష్కారం ఎత్తి పోతలే అని 1957 లోనే శాసనసభలొ తేల్చి చెప్పిన చెన్నమనేని రాజేశ్వర రావు గారి కలలు సాకారమవుతున్నవి. ఈ రోజు వేములవాడ నియోజకవర్గం లొ యెల్లంపల్లి, వరద కాలువల ద్వారా ముఖ్యమంత్రి కె సి ఆర్ గారి ప్రణాలికలకు అనుగుణంగా 55 000 ఎకరాలకు గోదావరి సాగు నీరు అందుతున్నది..మరో 40 000 ఎకరాలకోసం ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నవి!

2021 జనవరి నుంచి 30 వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సేవ్సు స్వచ్చంద సంస్థ..సిరిసిల్ల, వేములవాడ అంటే పాత సిరిసిల్ల తాలూక, ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా లొ చెన్నమనేని రాజేశ్వర రావు, చెన్నమనేని రమేష్ గార్ల నాయకత్వంలొ 200 కోట్ల అభివ్రుధ్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన భారత జర్మని సహకారం! త్రాగు నీటి కోసం 132 ట్యాంకులు, లక్షలాది కిలోమీటర్ల పైపు లైన్లు, వెయ్యి బోర్లు, ఐదు జూనియర్ కలాశాలలతొ పాటు 308 పాటశాల భవనాలు, అన్ని స్కూల్లకు సైన్సు పరికరాలు, 6 ఎత్తిపోతల పధకాలు, 9 కీలక చెరువుల పునరుధ్ధరణ, చేతివ్రుత్తుల వారికి సహకారం తదితర కార్యక్రమాలు నేటికి ప్రజలముందున్నవి.
వారి జీవితానుభావాలను సత్యశొధన లొ చదవండి!
www.chennamanenifoundation.org
BRS party Vemulawada
Dr. Ramesh Chennamaneni

మా సంపూర్ణ మద్దతు, సంఘీభావం శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికే!ముక్త కంఠంతో తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చిన నియోజకవర్...
20/08/2023

మా సంపూర్ణ మద్దతు, సంఘీభావం శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికే!

ముక్త కంఠంతో తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చిన నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు!

అన్ని సర్వేలు, ప్రజాభిప్రాయంలో శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారు గెలుపు వరుసలో ముందు ఉన్నారు!

సిట్టింగ్లకే సీట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన హామీ ప్రకారం రమేష్ బాబు గారికి సీటు కేటాయించాలని ముక్తకంఠంతో విన్నవిస్తున్నాం!

నీతి, నిజాయితీకి మారు పేరైన శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి సీటు కేటాయించాలని ముక్తకంఠంతో మండల పార్టీ అధ్యక్షులు సత్తిరెడ్డి, పుల్కం రాజు, గోస్కుల రవి, మల్యాల దేవయ్య, మేకల ఎల్లయ్య, దయాల కమలాకర్, మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవి రాజు, జడ్పిటిసిలు జగిత్యాల జిల్లా జెడ్.పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, నాగం భూమయ్య, గట్ల మీనయ్య, మేకల రవి, యాస వాణి, ఎంపీపీలు జవ్వాజి రేవతి, గంగం స్వరూప మహేష్, బూర వజ్రావ్వ, ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, బైరగొని లావణ్య రమేష్, కౌన్సిలర్లు జయ సలీం, జోగిని శంకర్, జెడల లక్ష్మి శ్రీనివాస్, కంకనాల శ్రీలత క్రాంతి, మారం కుమార్, కొండ కనకయ్య, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సెస్ డైరెక్టర్లు ఆకుల గంగారం, పొన్నాల శ్రీనివాస్, ఆకుల దేవరాజం, నామాల ఉమా లక్ష్మీ రాజం, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉద్గిరీ రమ్య ఆది రెడ్డి, గుందారపు సౌజన్య గంగాధర్, ఏనుగుల శ్రీనివాస్, వైస్ చైర్మన్లు కొప్పెర లింగారెడ్డి, వెల్మ బాల్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు గడ్డం హనుమాన్డ్లు, డప్పులఅశోక్, వర్ధినేని నాగేశ్వరరావు, మండల వైస్ ఎంపీపీలు డి. శ్రీనివాస్, వి.సుమలత, జీ.కిరణ్ రావు, ప్యాక్స్ చైర్మన్లు రమేష్ రెడ్డి, తిప్పని శ్రీనివాస్, రేగులపాటి కృష్ణ దేవ రావు, సల్మాన్ రెడ్డి, కథలాపూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఎం.జీ రెడ్డి, చందుర్తి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఏ. కమలాకర్ రావు, కోనరావుపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గోపు పరశురాములు, కొనరావుపేట మండలం రైతు బంధు సమితి కన్వీనర్ ప్రతాపరెడ్డి, వేములవాడ రూరల్ మండలం రైతు బంధు సమితి కన్వీనర్ కటకం మల్లేశం, మేడిపల్లి మండల సర్పంచులు వి నవీన్ రెడ్డి, సంపత్, వెంకట రమణా రావు, ఎంపిటిసిలు అజిత్ రావు ఎం తిరుపతి మకిలిదాస్, చీర్లవంచ ఎం.పీ.టీ.సీ దేవరాజం, గోవిందారం ఎం.పీ.టీ.సీ పూర్ణిమ ప్రభాకర్, కోఆప్షన్ సభ్యులు అహ్మద్, జమిలా, బబూన్, ఏ ఎం.సీ డైరెక్టర్లు దేవరాజం, పెండ్యాల శంకర్, బండారి శ్రీనివాస్,గెంటే ప్రశాంత్,పశుల అంజి, పార్టీ నాయకులు పిట్టల వెంకటేష్, రవీందర్ రెడ్డి, రెడ్డవేని పరుశురాం, యితర నాయకులు వేడుకున్నారు.

Kalvakuntla Taraka Rama Rao - KTR Ramesh Chennamaneni
BRS party Vemulawada
BRS party Vemulawada
Vinod Kumar Boianapalli
Telangana CMO
CRB Vemulawda MLA
Vijay Nimmashetti
Edapelli Mahesh
Trs Party Chandurthi Mandal

Address

Secunderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when చెన్నమనేని సైన్యం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share