10/03/2024
పేదలకు, క్లాస్ కి మధ్య వార్ అని జగన్ చెప్తున్నాడు. మరి క్లాసగా దోచుకున్న బడా కాంట్రాక్టర్స్ ఎందుకు జగన్ తో ఉన్నారు?
పేదలు, పెడలుగానే మిగుల్తున్నారు. ఎదగాలి అంటే అకౌంట్ లో డబ్బులు కాదు. అవకాశాలు ఇవ్వాలి. బ్రతకడం నేర్పాలి.
మన సత్తెనపల్లి లో గత 5 సంవత్సరంలో ఎం అభివృద్ధి జరిగిందో ప్రజలు గుర్తించాలి.
ఎటు చూసినా ట్రాఫిక్ సమస్య. రైల్వే స్టేషన్ రోడ్ లో వైన్స్ పెట్టి ట్రాఫిక్ పెంచారు.
గత ప్రభుత్వ హయాంలో, ఎన్టీఆర్ సాగర్ నిర్మించి, దానికి ఎదురుగా ఇండోర్ స్టేడియం నిర్మించారు.
కనీసం దానిని ఓపెన్ కూడా చేయలేదు ఈ 5 సంవత్సరంలో. ఇప్పుడు వచ్చి ఆడుదాం ఆంధ్ర అని షో ఎందుకు?
స్విమ్మింగ్ పూల్ ఉంది అని ఎవరికైనా తెల్సా?
ఇప్పుడు పల్లెటూరు లో ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు.
గత ప్రభుత్వంలో ఇంటి ఇంటికి చెత్త బండి వచ్చేది.
ఇక్కడ రోడ్ ఉంటే అక్కడ సీసీ రోడ్ వేశారు, మరుగు దొడ్లు కట్టించారు, స్మశాన వాటికలు కట్టారు.
మద్యపాన నిషేదం అని చెప్పి, రేట్లు పెంచి, క్వాలిటీ తగ్గించి, ఆరోగ్యం పాడు చేస్తున్నారు.
ఎంత మంది రేట్లు పెరిగాయని మానేశారు? బహుశా 1% కూడా లేరు.
వాలంటీర్ వ్యవస్థ బానే ఉంది. కానీ 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఎందుకు? 150 ఇళ్ళకి ఒకర్ని పెట్టి 12000 జీతం ఇస్తే ఒక కుటుంబం కి ఉద్యోగం ఇచిన్నట్టే కదా. ఫుల్ టైం ఎంప్లాయీస్ లాగా చేయొచ్చు కదా.
గత ప్రభుత్వం కట్టించిన ఇల్లు ఎలా ఉన్నాయి? ఇపుడు ఎలా ఉన్నాయి?
తోండలు కూడా గుడ్డు పెట్టని ఏరియా లో ఇచ్చారు. వర్షం వస్తే ఉంటాయో మునుగుతయి తెలీదు.
రోడ్లు బువ్వ పెడ్తయా అంటాడు ఒకడు.
ఇంకా బువ్వ కోసం ఎదురు చూసే జనరేషన్ లో ఉన్నామా?
అన్నా క్యాంటీన్ తీసేసి ఎందుకు బువ్వ దూరం చేశారు?
కనీసం వైఎస్సార్ క్యాంటీన్ అని అయిన పెట్టొచ్చు కదా.
నీది కానీ భూమి మీద, ని సర్వే రాళ్ళు ఎంటి? ఏపీ govt అని ఉండాలి గానీ.
ఎంతమందికి భూమి సమస్యలు తిర్చావ్?
నో న్యూ ఎయిర్పోర్ట్స్, నో న్యూ స్టీల్ ప్లాంట్, నో డీఎస్సీ. నో cps రద్దు.
చెప్పుకుంటే ఇలా ఎన్నో...
---- విజయ్ పాపినేని