Sangareddy District Police

Sangareddy District Police Please Follow/Like "Sangareddy District Police" Page to Know What We are Doing for your Protection. official page of sangareddy district police

జిల్లా పోలీసు కార్యాలయం        సంగారెడ్డి జిల్లా.పత్రిక ప్రకటన, తేది: 02-09-2026*• సైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగం...
02/09/2026

జిల్లా పోలీసు కార్యాలయం
సంగారెడ్డి జిల్లా.

పత్రిక ప్రకటన, తేది: 02-09-2026

*• సైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.*
*• డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్, పెట్టుబడి మోసాలపై అవగాహన తప్పనిసరి..*
*• సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండండి..– జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.*

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సెప్టెంబర్ నెల మొదటి మొదటి బుధవారం - సైబర్ జాగృకత దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, సదాశివపేట పట్టణంలోని హర్ష బ్యాంకేట్ హాల్ నందు సైబర్ నేరాల నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.., సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్, ఐపీఎస్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ షికా గోయల్, ఐపీఎస్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సైబర్ జాగృకత దివాస్ పేరుతో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు–డిజిటల్ భద్రత, ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు, పెట్టుబడి మోసాలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది అన్నారు.

*డిజిటల్ చెల్లింపుల్లో జాగ్రత్త* : తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, OTP, PIN, CVV, పాస్‌వర్డ్‌లు వంటి రహస్య సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దని అన్నారు. బ్యాంకు అధికారులు, పోలీసుల పేరుతో ఫోన్ చేసే వ్యక్తులను నమ్మి వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలు ఇవ్వవద్దని, డిజిటల్ చెల్లింపులు చేసే సమయంలో సరైన వ్యక్తి/ఖాతాకే నగదు వెళ్తుందో నిర్ధారించుకోవలని సూచించారు.
*ఆన్‌లైన్ షాపింగ్‌లో అప్రమత్తత* : ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్లు చూపిస్తూ నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. గుర్తుతెలియని వెబ్‌సైట్లు, వ్యక్తులకు ముందస్తుగా నగదు చెల్లించకుండా, విశ్వసనీయమైన ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.
*పెట్టుబడి మోసాలపై అప్రమత్తంగా ఉండాలి* : తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్, క్రిప్టో, షేర్ మార్కెట్ పేరుతో వచ్చే అనుమానాస్పద ఆఫర్లను నమ్మవద్దని సూచించారు. తొందరపెట్టి డబ్బులు పెట్టుబడి పెట్టించే వ్యక్తులు లేదా సంస్థల వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. తద్వారా మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

*గణేష్ మండపాల వద్ద కూడా సైబర్ అవగాహన* : గణేష్ చతుర్థి నవరాత్రి ఉత్సవాలు జరుగునున్న నేపథ్యంలో గణేష్ మండపాల వద్ద సైబర్ నేరాలపై అవగాహన పోస్టర్లను ఏర్పాటు చేసి భక్తులు, ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శాంతి కమిటీ, సమన్వయ సమావేశాలను కూడా సైబర్ అవగాహన కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు.

సైబర్ నేరాలను అరికట్టడంలో పోలీసులతో పాటు ప్రజల అప్రమత్తత కూడా ఎంతో కీలకం. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారితీయవచ్చు. ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతా నియమాలను పాటించి, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలి అని ఎస్పీ సూచించారు.

ఈ కార్యక్రమంలో డి4సి డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, సదాశివపేట ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, సైబర్ సెల్ సిబ్బంది, సదాశివపేట పట్టణానికి చెందిన సుమారు 350 మంది వ్యాపారవేత్తలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం         సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన, తేది: 01.09.2026• ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ అనేది సహజ...
01/09/2026

జిల్లా పోలీసు కార్యాలయం
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన, తేది: 01.09.2026

• ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ అనేది సహజం.
• ఎల్లయ్య హోమ్‌గార్డ్ పోలీసు శాఖకు అందించిన సేవలు అభినందనీయం.
• పదవీ విరమణ పొందుతున్న ఎల్లయ్యను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.

*సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి:* తేది 01.09.2026 నాటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందుతున్న ఎల్లయ్య హోమ్‌గార్డ్ను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ అనేది సహజమని, ఉద్యోగ కాలంలో అందించిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని అన్నారు. ఎల్లయ్య గత 35 సంవత్సరాలుగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకుఉత్తమ సేవలను అందించారని, వారి సేవలను కొనియాడారు.
పదవీ విరమణ అనంతరం కూడా పోలీసు శాఖ తరఫున ఎల్లయ్యకు, ఆయన కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబంతో సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హోమ్‌గార్డ్ కమాండెంట్ ఆర్. వెంకటేశ్వర్లు, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఆర్‌ఐ డానియెల్, పదవీ విరమణ పొందుతున్న ఎల్లయ్య కుటుంబ సభ్యులు, హోమ్‌గార్డ్ ప్రెసిడెంట్ జితేందర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం        సంగారెడ్డి జిల్లాపత్రికా ప్రకటన – తేది: 31.08.2026• ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజ...
31/08/2026

జిల్లా పోలీస్ కార్యాలయం
సంగారెడ్డి జిల్లా

పత్రికా ప్రకటన – తేది: 31.08.2026

• ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి – ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ.
• ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి - అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ వారితో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విన్నారు. సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య జాప్యానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్‌లో తమ సమస్యకు పరిష్కారం లభించని పక్షంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వారి సమస్యలకు చట్టపరమైన పరిష్కారం అందించడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ఎస్పీ తెలిపారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,                         సంగారెడ్డి జిల్లా.పత్రిక ప్రకటన, తేది: 31.08.2026.*• సంగారెడ్డి జిల్లా ...
31/08/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన, తేది: 31.08.2026.

*• సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుంది. : జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపియస్.*

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30 వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
కావున సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు.
ఇట్టి విషయంలో జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు వారికి సహకరించవలసిందిగా ఎస్పీ సూచించారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంసంగారెడ్డి జిల్లా.పత్రిక ప్రకటన, తేది: 31.08.2026• *ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజం – పదవీ విరమణ ...
31/08/2026

జిల్లా పోలీసు కార్యాలయం
సంగారెడ్డి జిల్లా.

పత్రిక ప్రకటన, తేది: 31.08.2026

• *ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజం – పదవీ విరమణ పొందుతున్న ఎస్‌ఐలు కిష్టారెడ్డి, పవన్, రఫ్ఫిక్‌లను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.*

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: పదవీ విరమణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్., అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిలు ఎస్‌ఐలు కిష్టారెడ్డి, పవన్, రఫ్ఫిక్‌ లను ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేసి వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజమని, సర్వీస్ కాలమంతా ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందడం గొప్ప విషయమని అన్నారు. ఒక ఉద్యోగి విజయవంతంగా తన విధులను నిర్వర్తించడంలో ఉద్యోగితో పాటు వారి కుటుంబ సభ్యుల సహకారం, బాధ్యత కూడా ఎంతో కీలకమని అన్నారు.
కిష్టారెడ్డి ఎస్‌ఐ 1985 సంవత్సరంలో సివిల్ పోలీస్ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో నియమితులై, ఉమ్మడి మెదక్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ధైర్యసాహసాలతో విధులు నిర్వహించి, సుదీర్ఘకాలం పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించి, తన సర్వీస్ కాలంలో ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ సబ్‌-ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదగడం ఆయన నిబద్ధతకు, క్రమశిక్షణకు నిదర్శనమని అన్నారు.
పవన్ ఎస్‌ఐ 1989 సంవత్సరంలో సివిల్ పోలీస్ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో నియమితులై, ఉమ్మడి మెదక్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలతో పాటు గ్రేహౌండ్స్ విభాగంలో ధైర్యసాహసాలతో విధులు నిర్వహించి, పోలీసు శాఖలో సుదీర్ఘకాలం విశిష్ట సేవలు అందించారని అన్నారు. ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ సబ్‌-ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదగడం ఆయన విధి నిర్వహణలోని నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు.
రఫ్ఫిక్ ఎస్‌ఐ 1989 సంవత్సరంలో సివిల్ పోలీస్ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో నియమితులలై, ఉమ్మడి మెదక్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ధైర్యసాహసాలతో విధులు నిర్వహించి, సుదీర్ఘకాలం పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించారని అన్నారు. తన సర్వీస్ కాలంలో ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ సబ్‌-ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదగడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు.
పదవీ విరమణ అనంతరం వారు ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. పోలీసు శాఖ తరఫున వారికి, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపిఎస్., అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మావతి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్‌ఐ సురేష్, పదవీ విరమణ పొందుతున్న ఎస్‌ఐల కుటుంబ సభ్యులు, పోలీసు అసోసియేషన్ అధ్యక్షులు జనార్ధన్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంసంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన, తేది: 28-08-2026· కాపర్ మెటీరియల్ దోపిడీ కేసులో ఒక నిందితుడి అర...
28/08/2026

జిల్లా పోలీసు కార్యాలయం
సంగారెడ్డి జిల్లా.

పత్రిక ప్రకటన, తేది: 28-08-2026

· కాపర్ మెటీరియల్ దోపిడీ కేసులో ఒక నిందితుడి అరెస్ట్, రూ.1.13 కోట్ల విలువైన దొంగసొత్తు స్వాధీనం.
· కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సిసిఎస్, మునిపల్లి, సదాశివపేట పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.

కేసు వివరాల్లోకి వెళితే:
తేది 18/19-08-2026 అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్‌లోని బోలక్‌పూర్, ముషీరాబాద్ ప్రాంతంలోని సన్‌లైట్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ముంబై/అమర్‌నాథ్‌కు 171 ప్లాస్టిక్ బ్యాగుల్లో కాపర్ ముడి పదార్థాన్ని తరలిస్తున్న MH13DQ5107 నంబర్ గల ఈచర్ వాహనాన్ని సంగారెడ్డి జిల్లా మునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని NH-65పై బుదేరా ఫ్లైఓవర్ దాటిన అనంతరం పాట్నం హైవే హోటల్ సమీపంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి అడ్డగించి, కత్తులతో బెదిరించి వాహన డ్రైవర్ సైఫూన్, తండ్రి ఇమామ్‌ను బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకుని, అనంతరం ఆరూర్ పరిధిలో వదిలివెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే మునిపల్లి పోలీసులు ఈచర్ వాహనంలోని GPS లొకేషన్‌ను ఉపయోగించి సుమారు 04:30 గంటలకు ఆరూర్ పరిధిలో వాహనాన్ని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించడం జరిగింది. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 48 బ్యాగుల కాపర్ మెటీరియల్ మాత్రమే ఉండగా, 123 బ్యాగులు చోరీకి గురైనట్లు గుర్తించారు. చోరీకి గురైన కాపర్ ముడి పదార్థం విలువ సుమారు రూ.1.13 కోట్లు.
ఈ ఘటనపై ఫిర్యాదుదారు మొహమ్మద్ ఫయాజుద్దీన్, S/o మొయిజుద్దీన్, వయస్సు 36 సంవత్సరాలు, వృత్తి: వ్యాపారం, నివాసం: బోలక్‌పూర్, ముషీరాబాద్, హైదరాబాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మునిపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం.124/2026, సెక్షన్ 309(4) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. ఆదేశాల మేరకు సిసిఎస్ సంగారెడ్డి మరియు మునిపల్లి, సదాశివపేట పోలీసులతో ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేసి, సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలు, వాహనాల కదలికలు, టోల్‌గేట్ సమాచారాన్ని విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో తేది 27-08-2026న అనుమానిత DCM వాహనం TG12T9240 కంకోల్ టోల్‌గేట్ దాటి జహీరాబాద్ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసు బృందం దిగ్వాల్ గ్రామం సమీపంలో సుమారు 17:32 గంటలకు DCM వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేసి, వాహనంలో ఉన్న A-2 షేక్ సబీర్ షరీఫ్, అదుపులోకి తీసుకుని మునిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
విచారణలో A-2 తన ప్రమేయాన్ని వెల్లడించడంతో పాటు A-1 సోహెల్ మరియు మరో 10 నుంచి 11 మంది వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తెలిపాడు. చోరీ చేసిన కాపర్ మెటీరియల్‌ను తరలించేందుకు TG12T9240 నంబర్ గల DCM వాహనంతో పాటు TS08UH8812 నంబర్ గల అశోక్ లేలాండ్ DOST వాహనాన్ని ఉపయోగించినట్లు వెల్లడించాడు.
A-2 ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టి, చోరీకి గురైన కాపర్ మెటీరియల్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు:
1. 123 ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉన్న చోరీకి గురైన కాపర్ ముడి పదార్థం.
2. నల్లటి రంగు టార్పాలిన్ కవర్.
3. DCM వాహనం నం. TG12T9240.
4. అశోక్ లేలాండ్ DOST (BSVI) వాహనం నం. TS08UH8812.
5. చోరీకి గురైన ఈచర్ వాహనం నం. MH13DQ5107, అందులో మిగిలిన 48 బ్యాగుల కాపర్ మెటీరియల్‌తో సహా.
చోరీకి గురైన కాపర్ ముడి పదార్థం మొత్తం విలువ సుమారు రూ.1.13 కోట్లు.
నిందితుడి వివరాలు: A-2 షేక్ సబీర్ షరీఫ్ తండ్రి: జహంగీర్ షరీఫ్, వయస్సు: 26 సంవత్సరాలు, వృత్తి: డ్రైవర్, నివాసం: వార్సిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్.
దర్యాప్తులో పోలీసుల ప్రతిభ: మునిపల్లి పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే స్పందించి GPS ఆధారంగా చోరీకి గురైన ఈచర్ వాహనాన్ని గుర్తించడం, సాంకేతిక మరియు శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించడం, వాహనాల కదలికలు పరిశీలించడం, విశ్వసనీయ సమాచారం తో దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. ఎఎ కేసు చేధనలో ప్రత్యేక క్రైమ్ బృందాల సమన్వయంతో చేపట్టిన దర్యాప్తు ఫలితంగా A-2ను అరెస్ట్ చేసి, రూ.1.13 కోట్ల విలువైన 123 బ్యాగుల కాపర్ ముడి పదార్థాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, నేరానికి ఉపయోగించిన వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది.
ఈ కేసును త్వరితగతిన ఛేదించి, భారీ మొత్తంలో దొంగసొత్తును స్వాధీనం చేసుకోవడంలో సిసిఎస్ టీం, మునిపల్లి మరియు సదాశివపేట పోలీసుల సమన్వయ కృషిని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. అభినందించారు.

జిల్లా పోలీసు కార్యాలయం         సంగారెడ్డి జిల్లా.పత్రిక ప్రకటన, తేది: 27-08-2026*• అన్నా నీకు రక్షణ… హెల్మెట్‌ అన్నకు ర...
27/08/2026

జిల్లా పోలీసు కార్యాలయం
సంగారెడ్డి జిల్లా.

పత్రిక ప్రకటన, తేది: 27-08-2026

*• అన్నా నీకు రక్షణ… హెల్మెట్‌ అన్నకు రక్షణ… రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్‌ ధరించు.. ట్రాఫిక్ నిబంధనలు పాటించి, సురక్షిత ప్రయాణం చేయండి..*
*• రాఖీ పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.*

సంగారెడ్డి జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. హృదయపూర్వక రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందని ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లాలో మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ అన్నారు. రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, బస్టాండ్లు, మహిళలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో షీ టీమ్స్‌ నిరంతరం నిఘా కొనసాగిస్తాయని అన్నారు. మహిళలు, బాలికలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా లేదా అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలు కనిపించినా వెంటనే జిల్లా షీ టీమ్‌ నంబర్ 8712656772కు సమాచారం అందించాలని సూచించారు.

ప్రజలు రాఖీ పౌర్ణమి పండుగను ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, కార్లు నడిపే వారు సీట్‌ బెల్ట్‌ ధరించాలని అన్నారు.

చెల్లి కట్టే రాఖీ నీకు రక్షణ బంధం… నువ్వు ధరించే హెల్మెట్‌ నీ ప్రాణానికి రక్షణ కవచం. రాఖీ కట్టే చెల్లి కోసం మాత్రమే కాదు.. నీ కుటుంబం కోసం కూడా హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించు - జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ కార్యాలయంసంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన, తేది: 26.08.2026*• ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా ...
26/08/2026

జిల్లా పోలీస్ కార్యాలయం
సంగారెడ్డి జిల్లా.

పత్రిక ప్రకటన, తేది: 26.08.2026

*• ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.*
*• సీసీ కెమెరాల ద్వారా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ.*
*• జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలు – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.*

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని, జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్ నుండి సీసీ కెమెరాల ద్వారా బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. పర్యవేక్షిస్తూ, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. ర్యాలీల సందర్భంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని అన్నారు. ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన ముస్లిం మత పెద్దలు, ర్యాలీ నిర్వాహకులు, జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

జిల్లా పోలీస్ కార్యాలయంసంగారెడ్డి జిల్లా।పత్రిక ప్రకటన – తేది: 26.08.2026• ఈద్ మిలాద్-ఉన్-నబీ సందేశంతో యువతలో మానవత్వం ప...
26/08/2026

జిల్లా పోలీస్ కార్యాలయం
సంగారెడ్డి జిల్లా।

పత్రిక ప్రకటన – తేది: 26.08.2026

• ఈద్ మిలాద్-ఉన్-నబీ సందేశంతో యువతలో మానవత్వం పెంపొందాలి – జిల్లా ఎస్పీ
• ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రవక్త మహమ్మద్ (స) ప్రపంచానికి అందించిన ప్రేమ, కరుణ, దయ, సహనం, సోదరభావం వంటి గొప్ప సందేశాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రవక్త మహమ్మద్ (స) జీవితం యావత్ మానవాళికి మార్గదర్శకమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలంతా ఒకరి మత విశ్వాసాలు, ఆచార సంప్రదాయాలను మరొకరు గౌరవించుకుంటూ, పరస్పరం సహకరించుకుంటూ ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ముఖ్యంగా యువత మంచి ఆలోచనలతో ముందుకు సాగుతూ, సమాజంలో శాంతి, మతసామరస్యం, సోదరభావం, మానవత్వం పెంపొందించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటా ఆనందం, శాంతి, సుఖసంతోషాలు నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.

జిల్లా పోలీస్ కార్యాలయంసంగారెడ్డి జిల్లా. తేది: 24.08.2026• మాదక ద్రవ్యాల నిర్మూలన, ఎన్‌డీపీఎస్ కేసుల దర్యాప్తులో పురోగత...
24/08/2026

జిల్లా పోలీస్ కార్యాలయం
సంగారెడ్డి జిల్లా.
తేది: 24.08.2026

• మాదక ద్రవ్యాల నిర్మూలన, ఎన్‌డీపీఎస్ కేసుల దర్యాప్తులో పురోగతి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై సమీక్ష సమావేశం.
• గంజాయి సాగు, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమన్వయంతో కృషి చేయాలి – ఈగల్ ఫోర్స్ ఎస్పీ రఘువీర్.
• విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు, ప్రహరీ క్లబ్‌ల ద్వారా విద్యార్థుల్లో విస్తృత అవగాహన కల్పించాలి.
• డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఎలాంటి పెండింగ్ లేకుండా మాదక ద్రవ్యాల డిస్పోజల్ పూర్తి చేసినందుకు సంగారెడ్డి జిల్లా పోలీసులకు అభినందనలు.

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: సంగారెడ్డి జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన ఎన్‌డీపీఎస్ కేసుల దర్యాప్తులో పురోగతి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఈగల్ ఫోర్స్ ఎస్పీ రఘువీర్ సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్., అద్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈగల్ ఫోర్స్ ఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి సాగు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి, డ్రగ్స్‌ నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు, ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేసి, విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులు డ్రగ్స్‌కు బానిస కాకుండా ముందస్తు చర్యలు చేపట్టి, విద్యాసంస్థలను డ్రగ్స్‌ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అన్నారు.
వాణిజ్య పరిమాణానికి మించిన మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితుల ఆస్తుల జప్తుకు చట్టపరమైన నిబంధనల ప్రకారం సిఫారసు చేయాలని అధికారులకు సూచించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న, అలవాటుపడిన నేరస్తులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు హిస్టరీ షీట్లు ఓపెన్ చేయాలని ఆదేశించారు.
పోలీస్ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించడంతో పాటు, తెలంగాణ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చిన వివిధ సాంకేతిక అప్లికేషన్లు, వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకుని మాదక ద్రవ్యాల కేసులను ఛేదించాలని సూచించారు. కేసుల దర్యాప్తులో సాంకేతిక ఆధారాలను సమర్థవంతంగా సేకరించి, నిందితులకు శిక్ష పడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని అన్నారు.
అనంతరం జిల్లాలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఎలాంటి పెండింగ్ లేకుండా 1485 కిలో గంజాయి, 5 కేజీల ఆల్ప్రాజోలం డిస్పోజల్ ప్రక్రియను పూర్తి చేసినందుకు సంగారెడ్డి జిల్లా పోలీసు అధికారులను ఎస్పీ రఘువీర్ అభినందనలు తెలియజేశారు. ఇదే విధమైన సమర్థవంతమైన చర్యలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తూ సంగారెడ్డి జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్., ఈగల్ ఫోర్స్ డీఎస్పీ పుష్పన్ కుమార్, ఇన్‌స్పెక్టర్ రామ్ నాయక్, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, సైదా నాయక్, వెంకట్ రెడ్డి, ప్రభాకర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టవ రమేష్, ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Address

Sangareddy
Sangareddy
502001

Alerts

Be the first to know and let us send you an email when Sangareddy District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sangareddy District Police:

Shortcuts

Share