05/06/2026
రేపల్లె టౌన్.. #ఆర్టిసి #హైర్ #బస్ మరియు #ఆన్ #కాల్ #డ్రైవర్ల #సమస్యలు #పరిష్కరించాలి...KMPL పేరుతో డ్యూటీల ఆపరాదు,కండిషన్ లేని బస్ లా డామేజ్ కు డ్రైవర్లను బాధ్యులు చేయరాదు,ఆన్ కాల్ డ్రైవర్లుకు డ్యూటీకి 1600 నుండి 2000కి పెంచి అమలుచేయాలి... మదర్ థెరిసా హెయిర్ బస్ డ్రైవర్స్ యూనియన్ (సిఐటియు) రేపల్లె డిపో గౌరవాధ్యక్షులు సిహెచ్.మణిలాల్... సిఐటియు రేపల్లె కార్యాలయంలో రేపల్లె డిపో హైర్ బస్ ఆన్ కాల్ డ్రైవర్ల యూనియన్ సమావేశం యూనియన్ అధ్యక్షులు జి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి యూనియన్ గౌరవాధ్యక్షులు సిహెచ్. మణిలాల్ మాట్లాడుతూ రేపల్లె డిపో పరిధిలో ఆన్ కాల్ డ్రైవర్లకు డ్యూటీలు చేస్తున్నా డ్రైవర్లను కెఎంపిఎల్ పేరుతో డ్యూటీలు ఆపటం,కండిషన్ లేని బస్సులు సరైన రోడ్డు సదుపాయాలు లేని చోట డ్యామేజ్ అవుతుంటే డ్రైవర్లతో డబ్బులు కట్టించడం మానుకోకపోతే ఆందోళన నిర్వహిస్తామని అన్నారు,రాష్ట్ర వ్యాప్తంగా చాలా డిపోలో ఆన్ కాల్ డ్రైవర్లకు డ్యూటీకి 1600 నుండి 2000 రూపాయలు పెంచి అమలు చేస్తుంటే రేపల్లె డిపోలో పెంచకపోవడం దారుణమన్నారు అదేవిధంగా బ్రేక్ డౌన్ రిపేర్ అప్పుడు పూర్తి డ్యూటీ డబ్బులు ఇవ్వాలని అన్నారు,అనేక సంవత్సరాల నుండి డిమాండ్ చేస్తున్న హెయిర్ బస్ డ్రైవర్లుకి ఆర్టీసీ ఎండిగా అంగీకరించినటువంటి సర్కులర్ ప్రకారం పిఎఫ్,ఎస్ఐ అమలుచేయాలని అన్నారు,ఈ సమావేశాల్లో మదర్ తెరిసా హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్ రేపల్లె డిపో కన్వీనర్ కేశన.గోపి, ఉపాధ్యక్షులు భాను,నాగరాజు, ఇమ్రాన్,తదితరులు పాల్గొన్నారు