Telugu Desam Party: Razole

Call Directions Website Contact the organization

Telugu Desam Party: Razole Official Page of TDP Razole

01/10/2026

ఒక వ్యవస్థను ప్రశ్నించే వారికి కొంత బాధ్యత ఉండాలి. ప్రస్తుతం చాలా పార్టీలు S.I.R. గురించి ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ కూడా ఒక రాజకీయ పార్టీగా S.I.R.కు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు వివరణలు కోరింది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణ సక్రమంగానే ఉందని మేము భావిస్తున్నాం. ఇక ముందు కూడా ఈ ప్రక్రియను మరింత మెరుగుపరచడానికి మావంతు సలహాలు, సూచనలు ఇస్తాం.


01/10/2026

బీసీలకు 34% రిజర్వేషన్లపై గొడ్డలి పార్టీ వెన్నుపోటు..

"బీసీలకు స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు దక్కకూడదనే ఉద్దేశంతోనే వైసీపీ నేతలు ఎన్నికలను అడ్డుకునేలా పిటిషన్లు వేయించారు.

బీసీలకు రిజర్వేషన్లు పెంచితే సంతోషించాల్సింది పోయి, వాటిని అడ్డుకునేందుకు కోర్టులను ఆశ్రయించడం బీసీలకు వెన్నుపోటు కాదా?

బీసీల హక్కులను కాపాడేందుకు టీడీపీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది."

— రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్


01/10/2026

రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మార్చనుంది కూటమి ప్రభుత్వం. దీని కోసం లక్ష కోట్ల పెట్టుబడులు (ప్రభుత్వ, ప్రైవేట్) పెట్టనుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మదనపల్లెలో ఈ ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి కడపలోని 'ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్'లో డ్రోన్ సహాయంతో పెద్ద ఎల్‌ఈడీ/డిజిటల్ బ్యానర్‌ను ప్రదర్శించారు. రాత్రి వేళ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించారు.




01/10/2026

కలలో కూడా మాకు ఇంటి పట్టా వస్తుందనుకోలేదు. సీఎం చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఇది మా పిల్లలకు చంద్రబాబు గారు ఇచ్చిన వరం. ఆయన జీవితాంతం చల్లగా ఉండాలి.




01/10/2026

రాబోయే గోదావరి పుష్కరాల నాటికి జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా ప్రణాళికలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. జాతీయ రహదారుల విభాగం పి.డి కృష్ణమూర్తితో కలిసి మోరంపూడి నుంచి పొట్టిలంక వరకు జాతీయ రహదారిపై ఉన్న పలు ప్రాంతాలను పరిశీలించారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. డ్రైన్లు పొడిగించాలని, పలు చోట్ల ఆక్రమణలు తొలగించి, సర్వీస్ రోడ్డు వెడల్పు చేయాలని ఎన్ హెచ్ఏఐ అధికారులను కోరారు.

01/10/2026
01/10/2026

ప్రభుత్వం చేసిన మంచి గురించి ప్రజలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలి. లబ్ధి పొందిన వారంతా అనుభవాలు పంచుకుంటే సోషల్ మీడియా బద్దలవుతుంది.




01/10/2026

నేనెప్పుడూ ఉన్నత పదవులు ఆశించలేదు. ప్రజల హృదయాలను గెలుచుకోవాలన్నదే నా లక్ష్యం. ఇప్పుడు సీఎం పదవి నా ప్రాధాన్యత కాదు. విద్యా వ్యవస్థను త్వరగా మార్చడమే నా ప్రాధాన్యం. ఎందుకంటే అది పిల్లల భవిష్యత్తు. అందుకే నేను ప్రతిరోజూ దానిపైనే దృష్టి పెడతాను.


•సీఎం చంద్రబాబు నేడు రేపల్లెలో పర్యటించి, "పేదల సేవలో" కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన...
01/10/2026

•సీఎం చంద్రబాబు నేడు రేపల్లెలో పర్యటించి, "పేదల సేవలో" కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు
•విజయవాడలో 26,401 కుటుంబాలకు పట్టాలు అందించామని, ఇప్పటివరకు 60 వేల మంది పేదలకు రూ.52 వేల కోట్ల విలువైన భూములపై హక్కులు కల్పించామని సీఎం చంద్రబాబు తెలిపారు
•పేద కుటుంబాలకు అందుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ సమన్వయం చేసి, వారికి గరిష్ఠ ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
•యువత ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు
•అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన వాహన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హవల్దార్ కువ్వరపు కిషన్ మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/QPTzy

30/09/2026

"థ్యాంక్యూ సీఎం సార్, థ్యాంక్యూ సీఎం సార్" ఎవ్వరి వద్ద చూసినా ఈ ప్లకార్డులే. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. సభా వేదిక వద్ద ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తుండగా.. "థ్యాంక్యూ సీఎం సార్" అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు సభికులు.




Address

Razole

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Razole posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Razole:

Shortcuts

Share