26/11/2023
అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ పరిధిలోని సుండుపల్లి రోడ్డు పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద రెండు లక్షల 50 వేల లీటర్ల ట్యాంకు కాల పరిమితి అయిపోవడం వల్ల ఆ ట్యాంక్ పూర్తి నేలమట్టం చేసి దాని స్థానంలో మూడు కోట్ల 50 లక్షల రూపాయలు వ్యాహo తో 15 లక్షల లీటర్ల కొత్త ట్యాంక నిర్మాణం కోసం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు గౌరవ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాయచోటి మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ భాష ట్యాంక్ నిర్మాణం కోసం భూమి పూజ చేయడమైనది. ఈ ట్యాంక్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత కొత్తపల్లి, బెత్తల్ కాలనీ, అలీమాబాద్, ట్రంక్ రోడ్, మహబూబ్ నగర్ ఈ ఏరియాలో ఎటువంటి నీటి కొరత లేకుండా సరఫరా చేయొచ్చు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహ్మాన్ కౌన్సిలర్లు గౌస్ ఖాన్, కొలిమి చాన్, కొలిమి హరూన్, రౌనాక్ హుస్సేన్ వైఎస్ఆర్ సీపీ నాయకులు సయ్యద్ షబ్బీర్, ఫయాజ్ అహ్మద్, ఎస్పీఎస్ రిజ్వాన్, ఇర్ఫాన్, సుగవాసి శ్యాం, జానం రవీంద్ర యాదవ్, పట్టణ అధ్యక్షుడు రియాజుర్ రెహమాన్, JCS ఇన్చార్జి నిసార్ అహ్మద్, పబ్లిక్ హెల్త్ సతీష్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఏ ఈ సుబ్బరాయుడు, మున్సిపల్ డి ఈ సుధాకర నాయక్, మున్సిపల్ ఏ. ఈ.కృష్ణారెడ్డి మరియు ప్రాజెక్టు మేనేజర్ శ్యామ్ పాల్గొన్నారు