YSRCP Kothapeta

YSRCP Kothapeta ఫ్యాన్ గుర్తుకే మన ఓటు వేద్దాం .

22/10/2025

📉 ఏపీ స్థితి ఆందోళనకరం!

- రెవెన్యూ లోటు ₹48,000 కోట్లు – దేశంలోనే అత్యధికం
- నిరుద్యోగం 21% – దేశంలోనే అత్యధికం
- అక్షరాస్యత 72.6% – దేశంలోనే అత్యల్పం
- జీఎస్టీ వృద్ధి రేటు 5% (2024-25) – దేశంలోనే అత్యల్పం
- విద్య, వైద్యం, ప్రభుత్వ సంస్థల అభివృద్ధికి ఖర్చు – దక్షిణాదిలో అత్యల్పం

నష్టపోతున్నది ఎవరు? **ఆంధ్రప్రదేశ్ ప్రజలే.**
ప్రభుత్వాలు జవాబుదారీగా లేవు.
మన యువత ప్రశ్నించడం మర్చిపోయి సినిమా, కులం, ఇప్పుడు మతం మత్తులో మునిగిపోయింది.

విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని **కేంద్రం గాలికొదిలేసింది**.
కేంద్రాన్ని అడిగే మగాడు లేడు.

ఇప్పుడా విశాఖలో ఏర్పడబోతున్న గూగుల్ డేటా సెంటర్—200 ఉద్యోగాల కోసం ఏపీ 22 వేల కోట్లు రాయితీలు ఇస్తోంది.
విద్యుత్ రాయితీలు, మౌలిక సదుపాయాలు

ఇది ఎడారిలో ఒయాసిస్ అనిపించవచ్చు కానీ, ఈ 22 వేల కోట్లు

పోర్టులు, విద్య, వైద్య రంగాల్లో పెట్టి ఉంటే లక్షలాది మందికి ఉపాధి, కోట్లాదిమందికి ఆరోగ్య రక్షణ లభించేది.

ఐటీ అభివృద్ధికి రాయితీలే ఒక్క మార్గం కాదు!
గత ప్రభుత్వం **ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్**ను ఎలాంటి రాయితీలూ ఇవ్వకుండానే తీసుకొచ్చింది —

1500 ఉద్యోగాలు, అలాగే ఐటీ ఎకోసిస్టం 2024 నాటికి ఏర్పడింది.

జాతీయ మీడియా దేశ సమస్యలను కప్పిపుచ్చుతుంటే,

**ఎల్లో మీడియా రాష్ట్ర దయనీయ పరిస్థితులను దాచేస్తోంది.**

గుజరాత్ లో లులు మాల్ ప్రభుత్వం నుండి  భూమి కొనుక్కుంటుంది.ఆంధ్రప్రదేశ్ లో లులు మాల్ కి భూమి ప్రభుత్వం ఉచితంగా లేదా నామ మ...
20/10/2025

గుజరాత్ లో లులు మాల్ ప్రభుత్వం నుండి భూమి కొనుక్కుంటుంది.

ఆంధ్రప్రదేశ్ లో లులు మాల్ కి భూమి ప్రభుత్వం ఉచితంగా లేదా నామ మాత్రపు ధరకు ఇస్తుంది.

ఎందుకు ఈ తేడా???

లోగుట్టు పెరుమాళ్ళకెరుక????

16/10/2025
నెల రోజుల వ్యవధిలోనే 4 మొట్టికాయలు అంట అయ్యా
16/10/2025

నెల రోజుల వ్యవధిలోనే 4 మొట్టికాయలు అంట అయ్యా

16/10/2025
పిల్లలూ జాగ్రత్తముక్యంగా  YCP వాళ్ళుటీడీపీ జనసేన వాళ్ళు ఏమి  మాట్లాడినా కేసులు ఉండవుకాబట్టి మీరే జాగ్రత్తగా ఉండండిడేగ కళ...
16/10/2025

పిల్లలూ జాగ్రత్త
ముక్యంగా YCP వాళ్ళు

టీడీపీ జనసేన వాళ్ళు
ఏమి మాట్లాడినా కేసులు ఉండవు
కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండండి

డేగ కళ్ళతో చూస్తున్నారు
జాగ్రత్తగా కంటెంట్ తో సమాధానం ఇవ్వండి
అవతలివాళ్ళు రెచ్చకొట్టినా రెచ్చిపోవద్దు
అదొక ట్రాప్ కావచ్చు

సమాధానాలు చెప్పలేక
ఎండకడుతున్న వైసీపీ వాళ్ళను
ఒకవైపు బూతులతో దాడి చేస్తూ
ఇంకోవైపు పోలీస్ కేసులు పెడుతున్నారు

Note:మా ప్రభుత్వం వచ్చాక
సోషల్ మీడియా పోస్టులపై
1,122 కేసులు నమోదు చేశాం
-హోంమంత్రి అనిత Sep 26

15/10/2025

పోలీసుల రూల్ బుక్ ఫాలో కావాల్సిందే ; హైకోర్టు



🚨  G.O.RT.NO 107 పై Telugu Desam Party (TDP)  ఫేక్ ప్రచారం 1.అబద్ధాన్ని నిజం చేయడానికి చంద్రబాబు నాయుడుగారి ఆధ్వర్యంలోని...
10/10/2025

🚨

G.O.RT.NO 107 పై Telugu Desam Party (TDP) ఫేక్ ప్రచారం

1.అబద్ధాన్ని నిజం చేయడానికి చంద్రబాబు నాయుడుగారి ఆధ్వర్యంలోని టీడీపీ ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి.

2. రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించేదిశగా చేస్తున్న ప్రయత్నాలపై, తన ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీల ద్వారా తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించాయి.

3. అసలు ఆపార్టీలో ఉన్నవాళ్లకు కనీస అవగాహన లేకుండా ప్రచారం చేస్తున్నారు. భాష రాకపోతే ఎవరిచేతనైనా చదివించుకుని అర్థం తెలుసుకుంటే మంచిది. అలా చేయకుండా అబద్ధాలు పట్టుకుని ప్రచారం చేయడంవల్ల ఉపయోగం ఉండదు. నిజాల ముందు ఇలాంటి తప్పుడు ప్రచారాలు పనిచేయవు.

4. ఫిబ్రవరి 6, 2020న వైయస్సార్‌సీపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను టీడీపీ ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలు, ఆపార్టీకి చెందిన వారు వక్రీకరిస్తున్నారు.

5. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య రంగంలో విప్లవాత్మక చర్యగా ఉన్న ఆస్పత్రులను, ఇప్పటికే ఉన్న గవర్నమెంటు మెడికల్‌ కాలేజీల్లో నాడు-నేడు పనులు చేపట్టాలని, అలాగే కొత్తగా మెడికల్ కాలేజీలు, వాటితోపాటు బోధనాసుపత్రులను నిర్మించాలని తలపెట్టింది.

6. అనేక దఫాలుగా దీనిపై చర్చలు జరిగిన యాన్యునిటీ విధానంలో ఈపనులు చేపట్టాలని మొదటి నిర్ణయించింది. ఈమేరకు జీవో జారీచేసింది.

7. యాన్యునిటీ మోడల్‌ అంటే, ప్రభుత్వం కోరుకున్న పనిని కాంట్రాక్టర్‌ కడతారు, కట్టిన వెంటనే కొంతమొత్తాన్ని చెల్లిస్తుంది, మిగిలిన మొత్తాన్ని సంవత్సరాల వారీగా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే వాయిదాల పద్దతిలో చెల్లింపు లాంటిది. కాంట్రాక్టర్‌కు ఎలాంటి హక్కులు ఉండవు. యాజమాన్యం, ఆస్తులన్నీ ప్రభుత్వానికే చెందుతాయి.

8. ఫిబ్రవరి 6, 2020న G.O.RT.NO 107లోని నాలుగో పేరాలో ఈ విషయాలు స్పష్టంగా ఉన్నాయి.
4. The Government after examination of the matter, hereby accord permission
to the MD, APMSIDC, Mangalagiri for the following:
1. In Principle to go ahead with suitable annuity model for Phase-
III to take up construction of District Hospitals and Teaching Hospitals.
2. To call for International Expression of Interest (IEoI) on
20.02.2020 as few International agencies are expressing interest in this
model.
3. In order to assist in structuring the international EOI, appropriate domain
experts be contracted as transaction advisors.

9. కాని, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతి అలా కాదు. మొత్తం ఆస్తి, యాజమాన్యం అంతా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లిపోతుంది. ఆ ప్రైవేటు వ్యక్తి ఎంబీబీఎస్ సీట్లను అమ్ముకుంటాడు. టీచింగ్‌ ఆస్పత్రికి వచ్చే రోగులనుంచి ఫీజులు పిండి వసూలు చేస్తాడు. తన లాభార్జనే ధ్యేయంగా ముందుకెళ్తాడు.

10. ఈ యాన్యుటీ మోడల్‌లో వైద్యరంగంలో ఈ నిర్మాణాలకోసం వైయస్సార్‌సీపీ ప్రభుత్వం మొదట EOAను ఆహ్వానించింది. కాకపోతే… తదుపరికాలంలో యాన్యునిటీ స్థానంలో, సొంతంగానే నబార్డు సహా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా నిర్మాణాన్ని చేపట్టింది.

11. అసలు అమలుచేయని, PPPకి సంబంధం లేని ఈ జీవోను పట్టుకుని, అడ్డంగా గవర్నమెంటు మెడికల్‌ కాలేజీలు అమ్మేస్తూ ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహాన్ని తప్పించుకోవడానికి ఫేక్‌ ప్రచారానికి టీడీపీ దిగింది.

12. టీడీపీ ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలు చెప్తున్నట్టుగా వైయస్సార్సీపీ ప్రభుత్వమే PPP మోడల్‌లోనే మెడికల్‌ కాలేజీలు నిర్మాణం అయితే, చంద్రబాబుగారి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఆ పనులు ఎందుకు ఆపినట్టు, కొత్తగా మళ్లీ పీపీపీ మోడల్‌లో టెండర్లు ఎందుకు పిలిచినట్టు?

30/09/2025

షాక్ లకు చెక్
విద్యుత్ వినియోగదారులకు 923 కోట్లు వాపస్
-చంద్ర జ్యోతి Sep 30 2025

కరెంట్ భారం 2,787 కోట్లు పెంచి ..
విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)
మొట్టికాయలు వేస్తె 923 కోట్లు తగ్గించడం(33 %)
కూడా మీ ఘనతగా ప్రచారం చేసుకోవడం
నభూతో న భవిష్యతి

వాస్తవాలు:

చంద్రబాబు ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదికి
అంటే 2024–25 ఆర్ధిక సంవత్సరానికి
రూ.2,787 కోట్లు ఇప్పటికే ప్రజల నుంచి
ముక్కుపిండి వసూలు చేయగా
అందులో రూ.923 కోట్లను వినియోగదారులకు
వెనక్కి చెల్లించాలని ఏపీఈఆర్‌సీ తాజాగా ఆదేశించింది

(టెక్నాలజీ కరెంటు ద్వారా చార్జీలు తగ్గిస్తా
అని టముకు వేసుకొని పవర్ లోకి వచ్చి
పవర్ చార్జీల భారం వేశారు )

ప్రజలపై ఇప్పటి వరకూ రూ.17,348 కోట్లు
విద్యుత్‌ చార్జీల భారం వేసిన కూటమి ప్రభుత్వం

సర్కార్ కు విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) షాక్‌వెయ్యి కోట్ల అడ్డగోలు వసూళ్లపై గట్టిగా మొట్టికాయలువిద్యుత్తు వినియ...
29/09/2025

సర్కార్ కు
విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) షాక్‌

వెయ్యి కోట్ల
అడ్డగోలు వసూళ్లపై గట్టిగా మొట్టికాయలు

విద్యుత్తు వినియోగదారుల నుంచి
ఇప్పటికే అదనంగా వసూలు చేసిన
రూ.923 కోట్లు వెనక్కివ్వాలంటూ ఆదేశం

నవంబర్‌ బిల్లు నుంచి
12 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సిందే..

చంద్రబాబే దయతలచి ట్రూ డౌన్‌ చేసినట్లు
ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా ప్రచారం

అధికారంలోకి రాగానే
తగ్గించకపోగా చార్జీల మోతతో బాదేసిన బాబు

దాదాపు రూ.19 వేల కోట్ల
విద్యుత్తు చార్జీల బాదుడుతో ప్రజలకు షాక్‌లు..

2024–25లో వసూలు
చేసిందంతా వెనక్కి ఇవ్వాలని వినియోగదారుల డిమాండ్‌

చంద్రబాబు ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదికి
అంటే 2024–25 ఆర్ధిక సంవత్సరానికి
రూ.2,787 కోట్లు ఇప్పటికే ప్రజల నుంచి
ముక్కుపిండి వసూలు చేయగా
అందులో రూ.923 కోట్లను వినియోగదారులకు
వెనక్కి చెల్లించాలని ఏపీఈఆర్‌సీ తాజాగా ఆదేశించింది

ప్రజలపై ఇప్పటి వరకూ రూ.17,348 కోట్లు
విద్యుత్‌ చార్జీల భారం వేసిన కూటమి ప్రభుత్వాన్ని
భుజానకెత్తుకుని కీర్తించడంపై ఇంధన రంగ నిపుణులు,
వినియోగదారులు విస్తుపోతున్నారు.

బాబు బాదుడే బాదుడు..
టీడీపీ కూటమి ప్రభుత్వం
అధికారంలోకి రావడమే ఆలస్యం..
తొలి ఏడాదిలోనే ఏకంగా రూ.15,485 కోట్ల
చార్జీల భారాన్ని వేసి బాదుడుకు శ్రీకారం చుట్టింది.

అయితే అదనంగా వసూలు చేసిన
రూ.2,787 కోట్లలో తాజాగా రూ.1,863 కోట్లకు మాత్రమే
ఈఆర్‌సీ నుంచి అనుమతి లభించింది.

అదే రూ.923 కోట్లను ప్రజలకు తిరిగి చెల్లించాలని
ఏపీఈఆర్‌సీ ఆదేశించకుంటే ప్రజలపై
దాదాపు రూ.19 వేల కోట్ల భారం మోపినట్లయ్యేది!

అంతేకాదు..
మరో పిడుగు కూడా సిద్ధంగా ఉంది.

విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు
4వ నియంత్రణ కాలానికి వాస్తవ
ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని
రూ.12,772 కోట్లుగా లెక్కించాయి.

ఈ మొత్తాన్ని విద్యుత్‌ బిల్లుల్లో కలిపి
వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతినివ్వాల్సిందిగా ఇటీవల కమిషన్‌ను కోరాయి.
దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించకపోతే
ఆ భారమంతా ప్రజలపైనే పడుతుంది.

[జగన్‌ ప్రభుత్వంలో..జనంపై భారం పడకుండా

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు,
చౌకగా కొనుగోళ్లు, ఇంధన పొదుపు లాంటి విప్లవాత్మక
నిర్ణయాల వల్ల 2019–24 మధ్య విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి.

దీంతో ఆ ఐదేళ్లలో మొత్తం రూ.4,434 కోట్లను మిగిల్చినట్లు
ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)
అధికారికంగానే వెల్లడించింది.

డిస్కంలు ఖర్చులు తగ్గించుకుని
మిగిల్చిన డబ్బులను ట్రూ డౌన్‌ చేశాయి.]

Address

Ravulapalem
533238

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Kothapeta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share